Government Jobs 2023 | ఇంకా 2 రోజులే గడువు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా?
last date of application | నిరుద్యోగులకు అలర్ట్.. ఉద్యోగ ప్రకటనకు సంబంధించి పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ల గడువు ఎల్లుండితో ముగియనుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1.IRDAI Recruitment | హైదరాబాద్‌లో 45 అసిస్టెంట్ మేనేజర్లు
IRDA Assistant Manager Recruitment 2023 | హైదరాబాద్‌లో 45 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్ పరీక్ష, డిస్క్రిప్టివ్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 45
పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.
విభాగాలు: ఆక్యురియల్, ఫైనాన్స్, లా, ఐటీ, రిసెర్చ్, జనరలిస్ట్.
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 21-30 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.44500
ఎంపిక : ఆన్లైన్ పరీక్ష, డిస్క్రిప్టివ్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు ఫీజు: రూ.750.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరి తేది: మే 10
వెబ్సైట్ : @www.irdai.gov.in
2.Nirmal DHEW Recruitment | నిర్మల్ జిల్లాలో జెండర్ స్పెషలిస్ట్ పోస్టులు
Nirmal DHEW Recruitment 2023 | జిల్లా మిషన్ కోఆర్డినేటర్, జెండర్ స్పెషలిస్ట్, అకౌంట్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ తదితర పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన నిర్మల్ (NIRMAL DISTRICT)లోని జిల్లా హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్(డీహెచ్ఈడబ్ల్యూ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులలను బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌లో ఉండగా.. ఏప్రిల్ 29 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 05
పోస్టులు : జిల్లా మిషన్ కోఆర్డినేటర్, జెండర్ స్పెషలిస్ట్, అకౌంట్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్పెషలిస్ట్ (ఫైనాన్షియల్ లిటరసీ).
అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ కార్యాలయం, శరద్మహల్, నిర్మల్, నిర్మల్ జిల్లా అడ్రస్‌కు పంపించాలి.
చివరి తేదీ: మే 10
వయస్సు : 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి.
వెబ్సైట్ : https://Nirmal.telangana.gov.in/
3.ANGRAU Recruitment | ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో 46 పోస్టులు
ANGRAU Recruitment 2023 | సీఎస్ స్కీమ్‌లో భాగంగా ఫీల్డ్ సూపర్వైజర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, స్టాటిస్టిషియన్, కంప్యూటర్ స్టాఫ్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ తదితర పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ (ఆంగ్రూ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి డిగ్రీ, బీసీఏ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఈ -మెయిల్ ద్వారా ఉండగా.. మే 10 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 46
పోస్టులు : ఫీల్డ్ సూపర్వైజర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, స్టాటిస్టిషియన్, కంప్యూటర్ స్టాఫ్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ తదితరాలు.
వయస్సు : 35 నుంచి 40 ఏండ్లు మించకుడదు
అర్హతలు : పోస్టులను బట్టి డిగ్రీ, బీసీఏ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఈ-మెయిల్లో
దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్: andhrapradeshcss@gmail.com
చివరి తేదీ: మే 10
వెబ్సైట్ : https://angrau.ac.in/
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?