నిరుద్యోగులకు శుభవార్త..మరో 10వేల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కారు అనుమతి
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. మరో 10 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది. 10,105 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గురుకులాలకు సంబంధించిన 9,096 పోస్టులున్నాయి. మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థలో 1,445, బీసీ గురుకుల విద్యాలయాల సంస్థలో 3,870 ఉద్యోగాలున్నాయి. గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థలో 1,514, ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో 2,267 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టులన్నింటినీ గురుకుల విద్యాలయాల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు.
ఎస్సీ అభివృద్ధి శాఖలో 316, మహిళా-శిశు సంక్షేమ శాఖలో 251, బీసీ సంక్షేమ శాఖలో 157, గిరిజన సంక్షేమ శాఖలో 78, దివ్యాంగ శాఖలో 71, జువైనల్ వెల్ఫేర్లో 66 సహా ఇతర 9,95 ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. మహిళా-శిశు సంక్షేమ శాఖలో జిల్లా ఎంపిక కమిటీ ద్వారా మరో 14 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. తాజా అనుమతితో రాష్ట్రంలో ఇప్పటి వరకు 45,325 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చినట్లైంది.
ఉద్యోగాల భర్తీ అంశాన్ని ట్విటర్ ద్వారా ఆర్థిక మంత్రి హరీశ్రావు వెల్లడించారు. కొందరు చేసే ఉద్యోగాల ప్రకటనలు జుమ్లా మాత్రమేనన్న హరీశ్రావు.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇప్పటికే 45,325 ఉద్యోగాల భర్తీకి అనుమతిచ్చినట్లు వెల్లడించారు. త్వరలోనే మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని హరీశ్ రావు పేర్కొన్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?