CRPF Recruitment 2023 | సీఆర్పీఎఫ్లో 9212 కానిస్టేబుల్ కొలువులు
CRPF Recruitment 2023 | కేవలం పదో తరగతి, ఐటీఐతో కానిస్టేబుల్ కొలువు. మంచి జీతభత్యాలు, దేశ సేవ చేసుకునే అవకాశం, ఉద్యోగ భద్రత. జీవితంలో త్వరగా స్థిరపడాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. ఇటీవల సీఆర్పీఎఫ్ విడుదల చేసిన కానిస్టేబుల్ పోస్టుల నోటిఫికేషన్ వివరాలు సంక్షిప్తంగా….
సీఆర్పీఎఫ్
- సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్).. దేశంలో అంతర్గత భద్రత కోసం ఏర్పాటుచేసిన రక్షణ దళం. దీన్ని 1939లో ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1949 పార్లమెంట్ చట్టం ప్రకారం సీఆర్పీఎఫ్ను స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేశారు. తర్వాత కాలంలో అనేక మార్పులు జరిగాయి. అవసరమైన సందర్భంలో దేశరక్షణ కోసం సరిహద్దుల్లో త్రివిధ దళాలకు సహాయం చేస్తుంది సీఆర్పీఎఫ్.
- మొత్తం ఖాళీలు: 9212
- పోస్టులు: కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్)
- వీటిలో పురుషులు-9105, మహిళలు-107 ఖాళీలు ఉన్నాయి
- పురుషుల పోస్టులు: డ్రైవర్, మోటార్ మెకానిక్ వెహికల్, కాబ్లర్, కార్పెంటర్, టైలర్, పైప్ బ్యాండ్, బ్రాస్ బ్యాండ్, గార్డెనర్, బగ్లర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్మన్, బార్బర్, సఫాయి కర్మచారి
- మహిళా పోస్టులు: బగ్లర్, వాటర్ క్యారియర్, కుక్, వాషర్ ఉమెన్, హెయిర్ డ్రెస్సర్, సఫాయి కర్మచారి, బ్రాస్ బ్యాండ్
ఎవరు అర్హులు? - గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణత. హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
- శారీరక ప్రమాణాలు: పురుషులు- ఎత్తు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎత్తు కలిగి ఉండాలి.
- ఛాతీ: పురుషులకు గాలి పీల్చకుండా 80 సెం.మీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి.
- వయస్సు: 2023, ఆగస్టు 1 నాటికి 18- 23 ఏండ్ల మధ్య ఉండాలి. డ్రైవర్ పోస్టులకు 21- 27 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం - కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా చేస్తారు
సీబీటీ - పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 100 మార్కులు ఉంటాయి.
- పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్- 25, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్-25, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్-25, ఇంగ్లిష్/హిందీ-25 ప్రశ్నలు ఇస్తారు.
- పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు
- పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోత విధిస్తారు
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు - హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ
ముఖ్య తేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఏప్రిల్ 25
సీబీటీ తేదీలు: జూలై 1 నుంచి 13 వరకు
వెబ్సైట్: https://crpf.gov.in
Previous article
TS SSC | X CLASS Mathematics MODEL PAPER
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?