CBI Notification | సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1000 మేనేజర్ స్కేల్-2 పోస్టులు
Central Bank of India Recruitment | ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఒకటైన ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ), హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (HCM) డిపార్ట్మెంట్.. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-2 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎంబీఏ, ఎంసీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు.. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్/ ఆర్ఆర్బీలో పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తుల ప్రక్రియ జూలై 01 నుంచి ప్రారంభంకాగా.. జూలై 15 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ రాత పరీక్ష (Online Written test), ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,170 నుంచి రూ.69,810 వరకు జీతం ఉంటుంది.
మొత్తం పోస్టులు : 1000
పోస్టులు : మేనేజర్ స్కేల్-2
అర్హతలు : సంబంధిత విభాగంలో ఎంబీఏ/ ఎంసీఏ/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు.. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్/ ఆర్ఆర్బీలో పని అనుభవం కలిగి ఉండాలి.
కేటగిరీ వారీగా ఖాళీలు: జనరల్- 405, ఎస్సీ- 150, ఎస్టీ- 75, ఓబీసీ- 270, ఈడబ్ల్యూఎస్- 100.
వయస్సు : మే 31 2023 నాటికి 32 ఏండ్లు మించకుడదు (ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయసు సడలింపు ఉంటుంది).
జీతం : నెలకు రూ.48,170 నుంచి రూ.69,810 వరకు
ఎంపిక : ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
రాత పరీక్ష: ఆబ్జెక్టివ్ టైప్. వంద మార్కులకు ఉంటుంది. బ్యాంకింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, , జనరల్ అవేర్నెస్, ఎకనామిక్ సినారియోలపై ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్వ్యూ కూడా 100 మార్కులకు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.850 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.175; దివ్యాంగులకు రూ.175).
దరఖాస్తు : ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 15
ఆన్లైన్ పరీక్ష తేదీ : 2023 ఆగస్టు రెండు లేదా మూడో వారంలో ఉంటుంది.
వెబ్సైట్ : www.centralbankofindia.co.in.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?