మరో 175 పోస్టుల భర్తీ
#టౌన్‌ప్లానింగ్‌లో ఓవర్సీర్ జాబ్స్
# టీఎస్పీఎస్సీ మరో నోటిఫికేషన్
#20 నుంచి దరఖాస్తుల స్వీకరణ
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మరో 175 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. టౌన్‌ప్లానింగ్ విభాగంలో భర్తీచేయనున్న ఉద్యోగాలకు సంబంధించి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ విభాగంలో టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 20 నుంచి అక్టోబర్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ వెల్లడించింది. వివరాలకు అభ్యర్థులు www. tspsc.gov. in ను చూడాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ సూచించారు.
చకాచకా నోటిఫికేషన్లు..
రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలను భర్తీచేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. ఇప్పటివరకు 52,460 (65.5%) ఉద్యోగాల కు ఆర్థికశాఖ అనుమతులు మంజూరుచేసింది. గ్రూప్ -1 మొదలుకొని తాజా ప్రకటన వరకు చకచకా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ఇటీవలే మహిళా శిశు సంక్షేమశాఖలో 23 పోస్టులకు, తాజాగా 175 పోస్టుల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. గ్రూప్ -2, గ్రూప్ -3 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ అనుమతినివ్వగా, త్వరలోనే నోటిఫికేషన్లు విడుదలకానున్నాయి.
టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ అర్హతలు
-ఇవి జోనల్ పోస్టులు కాగా కాళేశ్వరం జోన్లో 22, బాసర జోన్లో 34, రాజన్న సిరిసిల్ల జోన్లో 23, యాదాద్రి జోన్లో 21, చార్మినార్ జోన్లో 27, జోగులాంబ జోన్లో 15 చొప్పున పోస్టులున్నాయి.
-అభ్యర్థులు 18– 44 ఏండ్ల వయ స్సుండాలి. ఎస్సీ, ఎస్టీ బీసీలకు ఐదేండ్లు, వికలాంగులకు పదేండ్లు, ఎన్సీ సీ 3, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మూడేండ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. పే స్కేల్ రూ. 32,810 – రూ. 96,890గా ఉంటుంది.
-అభ్యర్థులు సాంకేతిక విద్యామండలి నుంచి డిప్లొమా ఇన్ డీసీఈ/ ఎల్సీఈ/ ఎల్‌ఎల్‌ఏ పొంది ఉండాలి.
-యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఆర్క్ డిగ్రీ లేదా బీఈ / బీటెక్ (సివిల్), బీ ప్లానింగ్/ బీ టెక్ (ప్లానింగ్) డిగ్రీ పొంది ఉండాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?