ప్రపంచాన్ని ఏడు ద్వీపాలుగా విభజించిన వారు ఎవరు?
పటాల అధ్యయనం – తయారీ, విశ్లేషణ
- భూమిపై వాస్తవ దూరాలను సాధారణ చిత్రాల్లో చూపేటప్పుడు స్కేల్ ఉపయోగించి తగ్గించి చూస్తారు.
- పటాల్లో ఉత్తర దిక్కును బాణం గుర్తుతో పైకి ఉండే విధంగా చూపుతారు.
- వీటి తయారీలో ఉపయోగించే చిహ్నాలను సంప్రదాయ చిహ్నాలు అంటారు.
- పటంలోని దూరాన్ని కొలిచి భూమిపై వాస్తవ దూరాలను ‘స్కేల్’ ద్వారా గుర్తిస్తారు.
శిక్షణ
1. పటాల్లో సాధారణంగా ఏ దిక్కు పైకి ఉండే విధంగా రూపొందిస్తారు? (1)
1) ఉత్తర దిక్కు
2) పడమర దిక్కు
3) దక్షిణ దిక్కు
4) తూర్పు దిక్కు
- స్వరూపాలను (జీర భూములు, మైదానాలు, పర్వతాలు) తెలిపే పటాలను భౌతిక పటాలు అంటారు.
- భూమిపై సముద్ర మట్టం అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉంటుంది. అందుకే భూమిపై ఎత్తులను సముద్ర మట్టం నుంచి కొలుస్తారు.
- సమానమైన ఎత్తు ఉన్న ప్రాంతాలను కలిపే రేఖలను కాంటూరు/ సమతల రేఖలు అంటారు.
- శాస్త్రవేత్తలు సముద్ర మట్టాన్ని కొలవడానికి అలల ఎత్తును వివిధ సమయాల్లో అనేక సంవత్సరాలు పరిశీలించి, లెక్కించి, సగటు సముద్ర మట్టాన్ని (MEAN SEA LEVEL) నిర్ధారిస్తారు.
2. పటాల్లో ఉపయోగించే చిహ్నాలు – పేర్లను జతపరచండి? (2)
చిహ్నాలు పేరు
1. చెరువు
2. మట్టిరోడ్డు
3. తారు రోడ్డు
4. బ్రాడ్ గేజ్ రైలు మార్గం
5. నది
1) A-2, B-1, C-4, D-4
2) A-2, B-4, C-3, D-1
3) A-4, B-2, C-3, D-1
4) A-1, B-2, C-3, D-5
3. మీ ప్రాంతానికి / రాష్ర్టానికి సంబంధించిన జిల్లాలు, మండలాలను, గ్రామ పంచాయతీలను ఏ పటాల్లో చూపుతారు? (1)
1) రాజకీయ పటాలు
2) భౌతిక పటాలు
3) చారిత్రక పటాలు
4) ఉష్ణోగ్రత పటాలు
4. గుర్తు దేనికి సంకేతం (2)
1) నది
2) మీటర్ గేజ్ రైలు మార్గం
3) బ్రాడ్ గేజ్ రైలు మార్గం
4) మట్టి రోడ్డు
5. కాంటూరు లేదా సమతల రేఖలకు సంబంధించి కింది వాటిని పరిగణించండి? (4)
A. కాంటూరు రేఖల మధ్య దూరం ఆ భూ స్వరూపంపై ఆధారపడి ఉంటాయి
B. కాంటూరు రేఖలు వంకరటింకరగా ఉండవచ్చు
C. భూమి ఎత్తు పల్లాలుగా ఉంటే కాంటూరు రేఖలు ఒకదానికొకటి దూరంగా ఉంటాయి
D. కాంటూరు రేఖలు ఒకదానికొకటి ఖండించుకోవు
1) A, B, C 2) B, D
3) A, C, D 4) A, B, D
6. భూమిపై ఎత్తులను దేని ఆధారంగా చూపిస్తారు (3)
1) పీఠభూముల మట్టం
2) మైదానాల మట్టం
3) సముద్ర మట్టం
4) పర్వతాల మట్టం
- అతి పురాతన పటాలను సుమేరియన్ (ఇరాక్) నాలుగువేల సంవత్సరాల క్రితం మట్టి పలకల మీద తయారు చేశారు.
- బాబిలోనియన్లు (ఇరాక్) ప్రపంచం గుండ్రటి పళ్లెం వలె ఉందని ఊహించారు.
- గ్రీకు భౌగోళిక శాస్త్రవేత్తలు తాము చూసిన, విన్న ప్రదేశాలు, మాటల వివరాల ఆధారంగా భూమి గుండ్రంగా ఉందని పటాలు రూపొందించారు.
- మొదటగా రోమన్ వ్యాపారులు ఓడల మీద భారత దేశాన్ని చేరుకొని వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేశారు.
- టాలమీ గ్రీకులు చిత్రించిన అక్షాంశాలను, రేఖాంశాలను ఉపయోగించి సవివరమైన పటాలను రూపొందించారు.
- అరబ్ పండితుడు ‘అల్ ఇద్రిసి’ తన రాజు కోసం సా.శ. (సాధారణ శకం) 1154 టాలమీ పుస్తకాల ఆధారంతో ప్రపంచ పటం తయారు చేశాడు.
- అల్ ఇద్రిసి తన పటం పైభాగంలో దక్షిణాన్ని, కింది భాగంలో ఉత్తరాన్ని మధ్యలో అరేబియాను చూపించాడు.
- వైదిక సాహిత్యంలో ఖగోళ సత్యాలు, పటాల తయారీకి పునాదులు వేశారు.
- ఆర్యభట్ట, వరాహమిహిరుడు, భాస్కరాచార్యుడు తమ గ్రంథాల్లో ఖగోళ సిద్ధాంతాలు, సూత్రాలుగా క్రోడీకరించారు.
- మధ్యయుగ కాలంలో తోడర్మల్, షేర్షాసూరి పటాల తయారీలో సాంకేతికంగా పరిణతి సాధించారు.
- బైబిల్లో ప్రపంచ వర్ణన సముద్రాలతో ఆవరించి, ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాలతో పటాన్ని చూపించింది.
- డచ్ దేశ మొట్టమొదటి పటాలను సర్వేయర్ జనరల్ జేమ్స్ రెన్నెల్ భారత దేశ సర్వేక్షణ ద్వారా రూపొందించారు.
- భారత దేశ భౌగోళిక సర్వేక్షణను 1802లో విలియం దక్షిణాన చెన్నై నుంచి ఆరంభించి హిమాలయాల వరకు రేఖాంశాల పొడవును, వివిధ ప్రదేశాల ఎత్తులను నిర్ధారించారు.
- సర్ జార్జ్ ఎవరెస్ట్ సర్వేక్షణ శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి హిమాలయాల్లో ఎత్తయిన పర్వత శిఖరాలను గుర్తించినందున పర్వత శిఖరాలకు ఎవరెస్ట్ పర్వతంగా పిలుస్తున్నారు.
- పటాల్లో ఎత్తు పల్లాలను గుర్తించేందుకు ఉపయోగించే ప్రత్యేక పద్ధతులను కాంటూరు రేఖలు అంటారు.
పటాల సంకలాన్ని అట్లాస్ అంటారు. - కాంటూరు రేఖలను ఐసోలైన్స్ అని కూడా అంటారు.
7. సుమేరియన్ పటాలకు సంబంధించి కింది వాటిని పరిగణించండి? (4)
A. మట్టిపలకలపై తయారు చేశారు
B. దేవాలయ భూముల నుంచి వచ్చే ఆదాయ లెక్కల కోసం
C. రాజ్య భాగాలు, సరిహద్దుల నిర్ధారణ కోసం
D. వీరి పటాలు అతి పురాతనమైనవి
1) A, B 2) A, B, C
3) A, C, D 4) A, B, D
8. ఎవరి పటాల్లో ఏడు దీవులు చేదు నది లేదా ఉప్పునీటి సముద్రం చూపారు? (1)
1) బాబిలోనియన్లు 2) సుమేరియన్లు
3) గ్రీకులు 4) రోమన్లు
9. పటాల తయారీలో పితామహుడిగా పేరుగాంచింది ఎవరు? (3)
1) టాలమీ 2) అల్ ఇద్రిసి
3) గెరార్డస్ మెర్కేటర్ 4) అనాక్సిమాండర్
10. ప్రపంచాన్ని ఏడు ద్వీపాలుగా విభజించిన వారు ఎవరు? (3)
1) గ్రీకు పండితులు
2) అరబ్బు పండితులు
3) భారతీయ పండితులు
4) రోమన్ పండితులు
11. క్రింది వాటిని జతపరచండి (4)
A. బాబిలోనియన్లు 1. యూరేషియా ఖండాలను చూపించారు
B. గ్రీకులు 2. ప్రపంచమంతా నీటితో ఆవరించి ఉంది.
C. అరబ్బులు 3. పటాలను మట్టి పలకలపై రూపొందించారు.
D. సుమేరియన్లు 4. ప్రపంచం గుండ్రటి పళ్లెంగా ఉంది.
5. ప్రపంచాన్ని యూరప్, లిబియా, ఆసియా ఖండాలుగా విభజించారు.
1) A-4, B-1, C-3, D-5 2) A-3, B-2, C-1, D-4
3) A-1, B-2, C-3, D-4 4) A-4, B-5, C-1,D-3
12. పటాలు తయారు చేసిన వారిని క్రమానుగత శ్రేణిలో అమర్చండి? (1)
A. అరబ్బులు B. డచ్ వారు
C. సుమేరియన్లు D. రోమన్లు
1) C, D, A, B 2) A, B, C, D
3) D, B, A, C 4) A, D, C, B
13. ‘మెర్కేటర్ ప్రక్షేపణం’ సంబంధించి సరైనది? (2)
1) ఈ పద్ధతిని మెర్కేటర్ రూపొందించాడు
2) అన్ని ఖండాలు తప్పు దిశలో చూపించడం
3) ఖండాలను, పరిమాణం, ఆకారం, దిశలు సరిగా చూపించడం
4) నేటికీ ఈ విధానాన్ని ప్రపంచంలో పటాల తయారీకి ఉపయోగించడం
14. మధ్యధరా సముద్రం మీదుగా భారతదేశానికి వ్యాపార మార్గాన్ని మూసిన వారు? (1)
1) అరబ్బులు 2) డచ్ వారు
3) ఫ్రెంచ్ వారు 4) బ్రిటిష్ వారు
15. సర్వే ఆధారంగా భారతదేశపు మొట్టమొదటి పటాలను తయారు చేసింది? (1)
1) జేమ్స్ రెన్నెల్
2) సర్జార్జ్ ఎవరెస్ట్
3) మెర్కేటర్
4) జాన్ మార్షల్
16. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా కచ్చితమైన పటాల కోపం ప్రయత్నించినవారు? (2)
1. రోమన్లు 2. గ్రీకులు
3. సుమేరియన్లు 4. బాబిలోనియన్లు
17. ఏ భారతీయ ఇతిహాస గ్రంథంలో ప్రపంచం నీటితో ఆవరించి ఉన్నదని తెలిపింది? (3)
1) రామాయణం 2) సూర్యసిద్ధాంతం
3) మహాభారతం 4) బృహత్ సంహిత
18. భూ వినియోగాన్ని తెలిపే రంగులను జతపరచండి? (3)
భూ వినియోగం రంగులు
A. పర్వతాలు 1. గోధుమ
B. గడ్డి భూములు 2. ముదురు నీలం
C. మహా సముద్రాలు 3. లేత ఆకుపచ్చ
D. వ్యవసాయ భుములు 4. ముదురు ఆకుపచ్చ
5. ముదురు ఊదా
1) A-1, B-2, C-3, D-4 2) A-5, B-3, C-2, D-1
3) A-5, B-3, C-2, D-1 4) A-3, B-2, C-1, D-5
19. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న కారణం? (4)
1) నూతన ప్రదేశాల అన్వేషణ
2) సముద్ర ప్రయాణంపై ఆసక్తి
3) పటాలు తయారు చేయడం
4) అరబ్బులు వ్యాపార మార్గాన్ని మూసివేయడం
20. బైబిల్ ప్రకారం ప్రపంచ పటానికి సంబంధించి కింది అంశాలను పరిగణించండి? (2)
A. సముద్రాలతో ఆవరించి ఉంది
B. ఆసియా యూరప్, ఆఫ్రికా ఖండాలుగా విభజించబడింది
C. క్రీస్తు జన్మ స్థలమైన జెరూసలేం ఆఫ్రికా ఖండంలో ఉంది
D. ఆసియా ఖండం పెద్దదని, ముఖ్యమైనదని చూపించడం
1) A, B 2) A, B, D
3) B, C, D 4) C
21. అల్ ఇద్రిసి తన రాజు కోసం ప్రపంచ పటం తయారు చేసిన సంవత్సరం? (1)
1) 1154 2) 1480
3) 1614 4) 1254
22. వాస్కోడిగామా తన అన్వేషణలో ఆఫ్రికాను చుట్టుముట్టి చేరుకున్న దేశం? (2)
1) అమెరికా 2) భారతదేశం
3) ఇండోనేషియా 4) శ్రీలంక
23. అరేబియాను పటం మధ్యలో చూపించిన వారు? (1)
1) అరబ్బులు 2) గ్రీకులు
3) రోమన్లు 4) పర్షియన్లు
24. మొదటిసారిగా శా్రస్త్రీయ పద్ధతులతో ఎవరెస్ట్ ఎత్తును కనుగొన్నది ఎవరు? (3)
1) లాంబన్ 2) జేమ్స్ రెన్నెల్
3) జార్జ్ ఎవరెస్ట్ 4) గెరార్డస్
25. సముద్ర మట్టం నుంచి 150 మీటర్ల ఎత్తు ప్రదేశంలో లేని జిల్లా ఏది? (4)
1) భద్రాద్రి కొత్తగూడెం
2) ములుగు
3) జయశంకర్ భూపాల పల్లి
4) మహబూబ్ నగర్
26. అన్వేషకులు సముద్రమార్గంతో కనుగొన్న నూతన ప్రదేశాలతో జతపరచండి? (3)
అన్వేషకులు ప్రదేశాలు
A. కొలంబస్ 1. ఇండియా
B. వాస్కోడిగామా 2. అంటార్కిటికా
C. జేమ్స్ కుక్ 3. ఆస్ట్రేలియా
D. జాన్స్ జూన్ 4. దక్షిణాఫ్రికా
5. వెస్టిండీస్
1) A-1, B-3, C-4, D-2
2) A-5, B-1, C-3, D-2
3) A-5, B-1, C-2, D-3
4) A-5, B-2, C-4, D-1
పటాలు: అదనపు సమాచారం
- నిర్దిష్టమైన కొలతలతో పటాలు రచించడానికి ఉపయోగపడే శాస్ర్తాన్ని ‘మాన చిత్రలేఖన శాస్త్రం’ (కార్ట్టోగ్రఫీ) అంటారు.
- తయారు చేయడానికి స్కేల్ (scale), ప్రక్షేపం (projection), పటాలను సాధారణీకరించడం (Map Generali sation), పట రూపకల్పన (Map Design), పట నిర్మాణం, ఉత్పత్తి విధానాలు పాటిస్తారు.
- అతి పురాతన పటం క్రీ.పూ. 2500 సంవత్సరాలకు క్రితం మెసపటోమియా వద్ద కనుగొన్నారు.
- భారతదేశంలో వైమానిక సర్వే కార్యకలాపాలకు 1924 నుంచి 1928 చిట్టగాంగ్ జిల్లా పటం తయారు చేశారు.
- పట్టణాలు, గ్రామాలు, భూముల వివరాల రేఖ పటాలను కెడస్ట్రల్ పటాలు అంటారు. వీటిని పెద్ద స్కేల్‌పై గీస్తారు.
- భారతీయ సర్వేక్షణ సంస్థ (Survey Of India) 1767లో నెలకొల్పబడింది.
- (Map) మ్యాప్ అనే పదం ‘మప్ప’ అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది.
- మొదట మ్యాప్ పుస్తకం 16వ శతాబ్దంలో మెర్కేటర్ ప్రచురించారు.
- ప్రపంచంలో మొదటి పటం క్రీ.పూ. 4300లో మట్టి పలకలపై చిత్రించి కాల్చి తయారు చేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు