‘నిజాం రాజ్య అండమాన్’ అని ఏ జైలుని అంటారు?
1. అలంపూర్ ఏ నది ఒడ్డున ఉంది?
ఎ) తుంగభద్ర బి) కృష్ణా
సి) గోదావరి డి) పెన్నా
2. ‘చిత్తారమ్మ జాతర’ను ఏ ప్రాంతంలో జరుపుతారు?
ఎ) పటాన్చెరు, సంగారెడ్డి
2) అనంతగిరి, వికారాబాద్
సి) కోయిలకొండ, మహబూబ్‌నగర్
డి) గాజుల రామారం, హైదరాబాద్
3. ఫ్లోరింగ్ పై కప్పులకు ఉపయోగపడే భీమా గ్రూప్ సున్నపురాయి తెలంగాణలో ఎక్కడ లభిస్తుంది?
ఎ) మహబూబ్‌నగర్ జిల్లా – మక్తల్
బి) మంచిర్యాల జిల్లా – తాండూర్
సి) నల్లగొండ జిల్లా – తడకమళ్ల
డి) వికారాబాద్ జిల్లా – తాండూర్
4) కింది వాటిలో సరికానిది గుర్తించండి?
1) భూదాన్ ఉద్యమాన్ని వినోబాభావే పోచంపల్లిలో ప్రారంభించాడు
2) భూదానోద్యమం 1952లో ప్రారంభించాడు
3) జోగులాంబ దేవాలయం ‘గోదావరి’ నది ఒడ్డున ఉంది
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 3 మాత్రమే డి) ఏవీ సరికాదు
5. మన్నెంకొండ క్షేత్రం ప్రధాన దేవుడు?
ఎ) ఆంజనేయస్వామి
బి) నరసింహస్వామి
సి) వేంకటేశ్వర స్వామి
డి) మల్లన్న స్వామి
6. తెలంగాణ రాష్ట్రం ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది?
ఎ) కర్ణాటక, తమినాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిషా
బి) మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్
సి) ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్
డి) ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్
7. కిందివాటిలో సరైనది గుర్తించండి?
1) ఉస్మాన్‌సాగర్ చెరువు మూసీ నదిపై నిర్మించారు
2) తెలంగాణ రాష్ట్రంలో గ్రానైట్ నిల్వలు ఖమ్మం జిల్లాలో పుష్కలంగా ఉన్నాయి
3) సిర్నాపల్లి కొండలు నిజామాబాద్ జిల్లా లో ఉన్నాయి.
ఎ) 1 ,2 బి) 2, 3
సి) 1, 2, 3 డి) 1, 3
8. కిందివాటిని జతపరచండి.
ఎ) వేయిస్తంభాల గుడి 1) లింగమంతుల స్వామి
బి) పెద్దగట్టు జాతర 2) చేర్యాల
సి) భద్రకాళి సరస్సు 3) సిద్దేశ్వరాలయం
డి) నగిషీ చిత్రాలు 4) మానేరు డ్యాం
ఎ) 1, 2, 3, 4 బి) 3, 1, 4, 2
సి) 2, 4, 3, 1 డి) 3, 1, 2, 4
9. తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం రూపొందించిన వారు ఎవరు?
ఎ) అందెశ్రీ బి) గోరటి వెంకన్న
సి) గద్దర్ డి) ఏలె లక్ష్మణ్
10. శివరామ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కింది ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంది?
ఎ) కామారెడ్డి బి) మంచిర్యాల
సి) సిద్దిపేట డి) మంథని
11. తెలంగాణలో ధూళికట్ట అనే ప్రాంతం దేనికి ప్రసిద్ధి
ఎ) తెలంగాణలో గోదావరి నది ఇక్కడ ప్రవహిస్తుంది
బి) ఈ ప్రదేశంలో రాణి రుద్రమను సంహరించారు
సి) క్రీ.పూ. 2వ శతాబ్దానికి చెందిన ఒక బౌద్ధ స్థూపం ఇక్కడ ఉంది
డి) శాతవాహనుల కాలంలో ఒక ప్రసిద్ధ వర్తక కేంద్రం
12. కృష్ణానది ఒడ్డున జూరాల వద్ద గల చంద్రఘడ్ పర్వత కోటను ప్రధానంగా ఏ ప్రయోజనం కోసం నిర్మించారు?
ఎ) ఆయుధాలు నిల్వ చేయడానికి
బి) జిల్లాదార్ చంద్రసేన నివాసం
సి) ప్రజల నుంచి సేకరించిన ఆహార ధాన్యాలను, పన్నులను నిల్వ చేయడానికి
డి) జైలు కోసం
13. కిందివాటిలో సరికానిది గుర్తించండి?
1) తెలంగాణలో అతిపెద్ద రాష్ట్ర రహదారి – NH 18
2) తెలంగాణలో సంప్రదాయ పట్టునేత కేంద్రం -బోధన్
3) తెలంగాణలో దాదాపు 80 శాతం వర్షపాతం కురిసే రుతుపవనాలు- నైరుతి రుతుపవనాలు
ఎ)1 మాత్రమే బి) 1, 3
సి) 2 మాత్రమే డి) 1, 2
14. తెలంగాణలోని ఏ జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మించారు?
ఎ) కరీంనగర్ బి) రంగారెడ్డి
సి) ఆదిలాబాద్ డి) నిజామాబాద్
15. కింది ఏ ప్రాజెక్టు తన నదీ పరీవాహక ప్రాంతాల నుంచి నీటిని సరఫరా చేయడానికి వాడబడింది?
ఎ) పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు
బి) శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
సి) సింగూరు ప్రాజెక్టు
డి) దిండి ప్రాజెక్టు
16. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి కిందివాటిలో ఏ అంశం సరైందికాదు?
ఎ) గోదావరి నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా సాగు కోసం అందించాలని ప్రతిపాదించారు
బి) దాదాపు 45,000 ఎకరాల భూమిని సాగు చేయాలని ప్రతిపాదించారు
సి) ఇది ఒక అంతర్రాష్ట్ర ప్రాజెక్టు
డి) కన్నెపల్లి గ్రామ సమీపంలో ఈ ప్రాజెక్టు ఉంది
17. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఏ సంవత్సరంలో అధికారికంగా ప్రకటించారు?
ఎ) 1966 బి) 1996
పి) 2006 డి) 2004
18. భారతదేశపు మొట్టమొదటి ఇంధన సమర్థవంతమైన ఎ-1 కేటగిరీ రైల్వే స్టేషన్ కిందివాటిలో ఏది?
ఎ) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
బి) కాచిగూడ రైల్వేస్టేషన్
సి) బెంగళూరు రైల్వేస్టేషన్
డి) ఛత్రపతి శివాజీ టెర్మినల్
19. కింది పేర్కొన్నవాటిలో ఏ జిల్లాలు నల్లమృత్తికలతో ఆవరించి లేవు?
ఎ) నల్లగొండ, ఖమ్మం
బి) ఆదిలాబాద్, నిజామాబాద్
సి) మహబూబ్‌నగర్, నల్లగొండ
డి) మెదక్, కరీంనగర్
20. తెలంగాణలో ఎర ఇసుక లోమ్ మృత్తికలను స్థానికంగా ఎలా పిలుస్తారు?
ఎ) దుబ్బ బి) చెల్క
సి) రేగడి డి) లాటరైట్
21. కింది వాటిలో సరైనది గుర్తించండి?
1) తెలంగాణలో అత్యధిక మండలాలు కలిగిన జిల్లా – నల్లగొండ
2) తెలంగాణలో దక్షిణ భారతదేశపు బొగ్గుగని – కొత్తగూడెం
3) తెలంగాణ రాష్ట్ర అధికార క్రీడ – కబడ్డీ
4) హైదరాబాద్ నగరం మూసీనదీ తీరాన ఉంది
ఎ) 1, 2 బి) 1, 2, 4
సి) 1, 3, 4 డి) 1, 2, 3, 4
22. రహదారుల్లో ఏ రంగానికి సంబంధించినవి తెలంగాణలో అత్యధికంగా ఉన్నాయి?
ఎ) రోడ్లు, భవనాల విభాగం
బి) జాతీయ హైవే రహదారుల విభాగం
సి) పంచాయతీరాజ్ విభాగం
డి) రాష్ట్ర హైవే విభాగం
23. తెలంగాణలో లాటరైట్ నిక్షేపాలు ఏ ప్రాంతం లో ఉన్నాయి?
ఎ) సూర్యాపేట బి) నారాయణ పేట
సి) జగిత్యాల డి) వికారాబాద్
24. తెలంగాణలోని ఖనిజ ఆధారిత పరిశ్రమల్లో కిందివాటిలో ఏ రంగం ఆధిపత్యాన్ని కలిగి ఉంది?
ఎ) స్పాంజ్ ఐరన్ ప్లాంట్
బి) గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లు
సి) సిమెంట్ ప్లాంట్లు
డి) రెడిమిక్స్ కాంక్రీట్ యూనిట్లు
25. కందికల్, రాఖీ పర్వతాలు ప్రధానంగా విస్తరించి ఉన్న జిల్లా ఏది?
ఎ) ఆదిలాబాద్ బి) మహబూబ్‌నగర్
సి) కరీంనగర్ డి) రంగారెడ్డి
26. తెలంగాణప్రాంతంలో నవబ్రహ్మ దేవాలయం ఎక్కడ ఉంది?
ఎ) వర్గల్ – మెదక్ జిల్లా
బి) కీసర – రంగారెడ్డి జిల్లా
సి) అలంపూర్- మహబూబ్‌నగర్ జిల్లా
డి) వేములవాడ – కరీంనగర్ జిల్లా
27. ఫ్లోరైడ్ కాలుష్యంతో కరువుతో విలవిల్లాడుతున్న నల్లగొండ జిల్లా మహబూబ్‌నగర్ జిల్లాలోని కొన్ని భాగాల్లో 3.41 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి తెలంగాణ ప్రతిపాదించిన పథకం?
ఎ) జూరాల – పాకాల ప్రాజెక్ట్
బి) పాలెంవాగు ప్రాజెక్ట్
సి) స్వర్ణ ప్రాజెక్ట్
డి) నక్కల గండి ప్రాజెక్ట్
28. కిందివాటిలో సరికానిది గుర్తించండి?
1) తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ – దూలపల్లి
2) సిర్నపల్లి గుట్టలు విస్తరించి ఉన్న జిల్లా – నిజామాబాద్
3) భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం – భద్రాచలం, ఖమ్మం
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 3 మాత్రమే డి) 1, 2, 3
29. దక్షిణ తెలంగాణ వ్యవసాయ -వాతావరణ మండల ప్రధాన కేంద్రం?
ఎ) పాలెం బి) సూర్యాపేట
సి) షాద్‌నగర్ డి) భువనగిరి
30. ఫలక్‌నుమా ప్యాలెస్ ను నిర్మించింది ఎవరు?
ఎ) నవాబ్ వికార్ ఉల్ ఉమ్రా
బి) మహ్మద్ కులీ కుతుబ్‌షా
సి) మీర్ ఉస్మాన్ అలీఖాన్
డి) నవాబ్ అలియవార్ జంగ్
31. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి?
ఎ) కొమురవెల్లి జాతర – వరంగల్
బి) బెజ్జంకి జాతర – కరీంనగర్
సి) మన్నెంకొండ జాతర – మహబూబ్‌నగర్
డి) పెద్ద గొల్లగట్టు జాతర – ఆదిలాబాద్
32. కింది వాటిలో తెలంగాణలో లేని వన్యప్రాణుల అభయారణ్యం ఏది?
ఎ) పాకాల బి) నేలపట్టు
సి) కవ్వాల్ డి) ఏటూరు నాగారం
33. కిందివాటిని జతపరచండి?
ఎ) నేలకొండ పల్లి 1. జైన కేంద్రం
బి) కొలనుపాక 2. బౌద్ధ స్థూపం
సి) అలంపూర్ 3. హిందూ దేవాలయం
డి) కన్హేరీ 4. బౌద్ధ చైత్యం
ఎ) 2, 1, 3, 4 బి) 2, 4, 3, 1
సి) 1, 2, 4, 3 డి) 4, 2, 3, 1
34. కిందివాటిలో సరైంది?
1) మహల్లా ప్యాలెస్ (హైదరాబాద్) – లాడ్ బజార్
2) రామప్ప దేవాలయం – పాలంపేట గ్రామం
3) ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని నిర్మించింది. సూరితి అప్పయ్య
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 2, 3 డి) 1, 3
35. మా సాహెబ్ ట్యాంక్‌ను నిర్మించింది ఎవరు?
ఎ) కులీ కుతుబ్‌షా
బి) స్సేన్ షావలీ
సి) ఇబ్రహీం కులీ కుతుబ్‌షా
డి) హయత్ భక్ష్ బేగం
36. కింది వాటిని జతపరచండి?
ఎ) మెట్పల్లి 1) ఇత్తడి సామాను
బి) పెంబర్తి 2) ఖాదీ
సి) గద్వాల 3) గాజులు
డి) హైదరాబాద్ 4) చేనేత చీరలు
ఎ) 2, 1, 4, 3 బి) 4, 2, 1, 3
సి) 1, 3, 2, 4 సి) 3, 4, 2, 1
37. కింది వాటిలో సరి కానిది గుర్తించండి?
1) తెలంగాణలో ప్రధానంగా అత్యధికంగా విద్యుత్ వినియోగం జరిగే రంగం గృహరంగం
2) మూసీనది ఏ నదికి ఉపనది -కృష్ణానది
3) నెట్టెంపాడు పథకం నిర్మించిన నది – కృష్ణా
4) ప్రథమ అతి పురాతన చక్కెర కర్మాగారం ‘మంచిర్యాలలో’ ఉంది
ఎ) 1, 2 బి) 3 మాత్రమే
సి) 4 మాత్రమే డి) 2, 3
38. కింది వాటిని జతపరచండి?
ఎ) రేలా నృత్యం 1. కొండగట్టు జాతర
బి) గుస్సాడి నృత్యం 2. లింబాద్రి గుట్ట
సి) ముత్యంపేట 3. కోయలు
డి) భీంగల్ 4. గోండులు
ఎ) 1, 2, 3, 4 బి) 2, 1, 4, 3
సి) 3, 4, 1, 2 డి) 4, 3, 2, 1
39. కింది వాటిని జతపరచండి?
ఎ) రామలింగేశ్వర ఆలయం 1. డిచ్పల్లి
బి) ఎరకేశ్వర ఆలయం 2. కొండపల్లి
సి) సీతారామస్వామి ఆలయం 3. పిల్లలమరి
డి) వేణుగోపాల స్వామి ఆలయం 4. నందికంది
ఎ) 4, 2, 1, 3 బి) 3, 1, 2, 4
సి) 4, 3, 1, 2 డి) 1, 3, 2, 4
40. ‘నిజాం రాజ్య అండమాన్’ అని ఏ జైలుని అంటారు?
ఎ) కరీంనగర్ బి) చంచల్‌గూడ
సి) మన్ననూరు డి) వరంగల్
41. పొచ్చెర జలపాతం ఏ జిల్లాలో ఉంది?
ఎ) ఆదిలాబాద్ బి) కరీంనగర్
సి) ఖమ్మం డి) వరంగల్
42. తెలంగాణలో కింది జిల్లాల్లో ఎక్కడ శివరాం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది?
ఎ) ఆదిలాబాద్ – నిజామాబాద్
బి) మహబూబ్‌నగర్ -మెదక్
సి) కరీంనగర్ – వరంగల్
డి) ఆదిలాబాద్ – కరీంనగర్
43. హిమాచల్‌ప్రదేశ్‌లోని మణికరన్ దేని ఉత్పత్తికి ప్రసిద్ధి?
ఎ) సౌర విద్యుత్
బి) తరంగ విద్యుత్
సి) జియోథర్మల్ విద్యుత్
డి) పవన విద్యుత్
44. కిందివాటిలో సరైనవి గుర్తించండి?
1) మహారాష్ట్ర అన్ని రకాల విద్యుత్ ఉత్పత్తి లో ప్రథమ స్థానంలో ఉంది.
2) ఢిల్లీకి విద్యుత్‌ను నరోరా అణువిద్యుత్ కేంద్రం సరఫరా చేస్తుంది
3) దేశంలో అతి ఎక్కువ విద్యుత్ జల విద్యుత్ ద్వారా ఉత్పత్తి అవుతుంది
ఎ) 1, 3 బి) 2, 3
సి) 1, 2 డి) 1, 2, 3
45. దేశంలో అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రం ఏది?
ఎ) నరోరా బి) కాక్రపార
సి) కుడంకుళం డి) కైగా
46. తాల్చేర్ దేనికి ప్రసిద్ధి?
ఎ) థర్మల్ విద్యుత్
బి) అణువిద్యుత్
సి) భారజలం డి) జలవిద్యుత్
47. నేషనల్ ఫిజికల్ లేబరేటరీ ఎక్కడ ఉంది?
ఎ) న్యూఢిల్లీ బి) ముంబై
సి) బెంగుళూరు డి) హైదరాబాద్
48. సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంది?
ఎ) కోల్కత్తా బి) ఢిల్లీ
సి) చెన్నై డి) అలహాబాద్
జవాబులు
1-ఎ 2-డి 3-డి 4-సి 5-సి 6-డి 7-సి 8-బి 9-డి 10-డి 11-సి 12-సి 13-ఎ 14-డి 15-ఎ 16-సి 17-బి 18-బి 19-ఎ 20-బి
21-డి 22-సి 23-డి 24-బి 25-సి 26-సి 27-డి 28-సి 29-ఎ 30-ఎ 31-డి 32-బి 33-ఎ 34-సి 35-డి 36-ఎ
37-సి 38-సి 39-సి 40-సి 41-ఎ 42-డి 43-సి 44-సి 45-సి 46-ఎ 47-ఎ 48-డి
మస్తాన్ బాబు
విషయనిపుణులు
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు