శూన్యంలో విద్యుదయస్కాంత తరంగాల వేగం?
భౌతికశాస్త్రం
అయస్కాంతత్వం
1. కిందివాటిలో సరైనవి ఏవి?
ఎ. బాహ్య అయస్కాంత క్షేత్రానికి బలహీనమైన ఆకర్షణ ప్రదర్శించేవి పారా అయస్కాంత పదార్థాలు
బి. బాహ్య అయస్కాంత క్షేత్రం నుంచి వికర్షించబడేవి ఫెర్రో అయస్కాంత
పదార్థాలు
సి. బాహ్య అయస్కాంత క్షేత్రం చేత బలమైన ఆకర్షణ బలాన్ని కలిగి ఉండేవి
డయా అయస్కాంత పదార్థాలు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ 4) ఎ, బి, సి
2. నౌకలలో కంటెయినర్లను ఎక్కించడానికి, దించడానికి క్రేన్లలో ఉపయోగించే అయస్కాంతాలు?
1) శాశ్వత అయస్కాంతాలు
2) సహజ అయస్కాంతాలు
3) ఆల్నికో 4) ఇనుము
3. కింది వాటిలో అయస్కాంత ఆవరణం (మాగ్నెట్ స్పియర్) ఉన్న గ్రహాలు ఏవి?
ఎ. భూమి బి. బృహస్పతి
సి. బుధుడు డి. శని
1) ఎ 2) ఎ, సి
3) ఎ, డి 4) ఎ, బి, సి, డి
4. శూన్యంలో విద్యుదయస్కాంత తరంగాల వేగం?
1) 3×108 సెం.మీ./సె.
2) 3×108 మీ./సె.
3) 3×108 కి.మీ./సె.
4) 331 కి.మీ./సె
5. సరైన వివరణలు గుర్తించండి.
ఎ. అయస్కాంత బలం పనిచేయదు
బి. స్థిర విద్యుదావేశాల వల్ల అయస్కాంత క్షేత్రం ఉత్పత్తి అవుతుంది
సి. అయస్కాంత బల రేఖలు సమాంతరమైన అయస్కాంత క్షేత్రం ఏకరీతిలో ఉంటుంది
డి. ఏకరీతి అయస్కాంత క్షేత్రం
నిత్యత్వమైనది
1) ఎ, సి 2) ఎ, సి, డి
3) ఎ, బి, సి 4) బి, సి
6. ఒక అనయస్కాంతాన్ని అయస్కాంత పదార్థంగా మార్చడానికి తోడ్పడే అయస్కాంతీకరణ పద్ధతి?
ఎ. ఏకస్పర్శా పద్ధతి
బి. ద్విస్పర్శా పద్ధతి
సి. అయస్కాంత ప్రేరణ
డి. విద్యుదీకరణ పద్ధతి
1) ఎ, బి 2) ఎ, డి
3) ఎ, బి, డి 4) ఎ, బి, సి, డి
7. కింది వాటిని జతపరచండి.
అయస్కాంత పదార్థం ఉదాహరణలు
ఎ. పారా 1. వెండి, బంగారం
బి. ఫెర్రో 2. ఇనుము, ఉక్కు
సి. డయా 3. అల్యూమినియం,
ఆక్సిజన్
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-2, బి-1, సి-3
3) ఎ-3, బి-2, సి-1
4) ఎ-2, బి-3, సి-1
8. కింది వాటిలో డయామాగ్నటిక్ పదార్థం కానిది?
1) ఇనుము 2) గాలి
3) నీరు 4) బిస్మత్
9. కింది వాటిలో భూ అయస్కాంతత్వానికి సంబంధించి సరికాని వ్యాఖ్య?
1) అయస్కాంత ఉత్తర ధ్రువం భౌగోళిక
దక్షిణాన్ని సూచిస్తుంది
2) దక్షిణ ధ్రువం కంటే ఉత్తర ధ్రువం బలమైంది
3) అయస్కాంత ధ్రువాలు స్థిరంగా తమ స్థానాలను మార్చుకుంటాయి
4) పైవేవీ కావు
10. దండాయస్కాంతం వల్ల ఎన్ని తటస్థబిందువులు ఏర్పడతాయి?
1) 1 2) 2 3) 3 4) 4
11. జతపరచండి.
ఎ. ఫెర్రో అయస్కాంత పదార్థాలు
1. నికెల్, కోబాల్ట్
బి. డయా అయస్కాంత పదార్థాలు
2. పాదరసం, నీరు
సి. పారా అయస్కాంత పదార్థాలు
3. అల్యూమినియం, ఆక్సిజన్
1) ఎ-2, బి-1, సి-3
2) ఎ-3, బి-2, సి-1
3) ఎ-1, బి-2, సి-3
4) ఎ-2, బి-3, సి-1
12. ప్రకృతిలో సహజంగా దొరికే అయస్కాంత ఖనిజం ఏది?
1) బాక్సైట్ 2) ఇల్మనైట్
3) క్వార్ట్ 4) మాగ్నటైట్
13. ఇనుము క్యూరీ ఉష్ణోగ్రత?
1) 5500C 2) 6600C
3) 7700C 4) 8800C
14. అయస్కాంత లక్షణాలు?
1) ఆకర్షణ 2) దిశాత్మక గుణం
3) ధ్రువాల ఆకర్షణ, వికర్షణ
4) పైవన్నీ
15. ఒక అయస్కాంతం తన అయస్కాంతత్వ ధర్మాన్ని కోల్పోయే ఉష్ణోగ్రతను ఏమంటారు?
1) క్యూరీ 2) పియరీ
3) తటస్థ 4) విభజన
16. ఒక డయా అయస్కాంత పదార్థాన్ని అయస్కాంత ఉత్తర (లేదా) దక్షిణ ధ్రువం వద్దకు తీసుకువస్తే.. అది?
1) ధ్రువాలతో ఆకర్షితమవుతుంది
2) ధ్రువాలతో వికర్షితమవుతుంది
3) ఉత్తర ధ్రువంతో ఆకర్షితమై, దక్షిణ ధ్రువంతో వికర్షితమవుతుంది
4) ఉత్తర ధ్రువంతో వికర్షితమై, దక్షిణ ధ్రువంతో ఆకర్షితమవుతుంది
17. కింది వాటిలో దేన్ని 2లోడ్‌స్టోన్’ అని కూడా పిలుస్తారు?
1) సహజ అయస్కాంతం
2) కృత్రిమ అయస్కాంతం
3) విద్యుత్ అయస్కాంతం
4) పైవన్నీ
18. సూర్యుడి ఉపరితలంపై అయస్కాంత క్షేత్రం వల్ల ఏర్పడే మచ్చలను ఏమంటారు?
1) సన్ మార్క్ 2) సన్ డార్క్
3) సన్ స్పాట్స్ 4) సన్ స్పియర్
19. కింది వాటిలో విద్యుదయస్కాంత
తరంగాలు ఏవి?
1) ఎక్స్ రేలు 2) బీటా రేలు
3) ఆల్ఫా రేలు 4) ఆడిబుల్ రేలు
20. ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్జియోమాగ్నెటిజం సంస్థ’ ఎక్కడ ఉంది?
1) చెన్నై 2) బెంగళూరు
3) ముంబయి 4) ఢిల్లీ
21. ఫెర్రైట్స్ అనేవి?
1) పారా అయస్కాంత పదార్థాలు
2) ఫెర్రో అయస్కాంత పదార్థాలు
3) డయా అయస్కాంత పదార్థాలు
4) ఎ, సి
22. అయస్కాంతీకరణ చేసిన ఉక్కు కడ్డీ పొడవు?
1) పెరుగుతుంది 2) తగ్గుతుంది
3) అలానే ఉంటుంది 4) ఏదీ కాదు
23. కింది వాటిలో సరైంది.
ఎ.అయస్కాంత ఉత్తర ధ్రువాన్ని జాన్రాస్ అనే శాస్త్రవేత్త బూతియా ఫెలిక్స్ ప్రదేశంలో కనుగొన్నాడు
బి. అయస్కాంత దక్షిణ ధ్రువాన్ని శెకల్టన్ అనే శాస్త్రవేత్త సౌత్ విక్టోరియా ప్రదేశంలో కనుగొన్నాడు
1) ఎ సరైంది, బి తప్పు
2) ఎ తప్పు, బి సరైంది
3) రెండూ సరైనవే 4) రెండూ తప్పు
24. ఏ రకమైన అయస్కాంత పదార్థాలు ఘన స్థితిలో లభిస్తాయి?
1) పారా 2) ఫెర్రో
3) డయా 4) యాంటీ-ఫెర్రో
25. అయస్కాంత పదార్థాలను ఉపయోగించి చికిత్స చేయడాన్ని ఏమంటారు?
1) డయోథెరపీ 2) రేడియోథెరపీ
3) మాగ్నటోథెరపీ 4) ఫిజియోథెరపీ
26. దిక్సూచి ఎల్లప్పుడూ ఉత్తర, దక్షిణాలను సూచించడానికి కారణం?
1) భూమిపై ఉండే వాతావరణం
2) భూమి ఒక అయస్కాంతంలా పని చేయడం
3) భూమి సూర్యుని చుట్టూ తిరగటం
4) భూభ్రమణం చెందడం
27. ఇండియాలో అయస్కాంత భూమధ్యరేఖ దేనికి దగ్గరగా వెళ్తున్నది?
1) తిరువనంతపురం
2) శ్రీహరికోట
3) అలహాబాద్ 4) శ్రీనగర్
28. కింది వాటిలో డయా అయస్కాంత పదార్థం కానిది?
1) బంగారం 2) రాగి
3) నీరు 4) క్రోమియం
29. కింది వాటిలో ఫెర్రో అయస్కాంత పదార్థం ఏది?
1) బంగారం 2) రాగి
3) నీరు 4) కోబాల్ట్
30. కింది వాటిలో సరికానిది ఏది?
1) భూమిపై తక్కువ అయస్కాంత తీవ్రత గల ఖండం-దక్షిణ అమెరికా
2) భూ అయస్కాంత క్షేత్ర తీవ్రత భూమధ్యరేఖ దగ్గర ఎక్కువగా ఉంటుంది
3) భూ అయస్కాంత క్షేత్ర తీవ్రత ధ్రువాల దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది
4) పరమ శూన్య ఉష్ణోగ్రతను కొలవడానికి అయస్కాంత ఉష్ణమాపకాలను
ఉపయోగిస్తారు
31. భూ అయస్కాంత క్షేత్రం భూమి ఉపరితలం నుంచి ఎంత ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది?
1) 8,25,000 కి.మీ.
2) 2,58,000 కి.మీ.
3) 5,28,000 కి.మీ
4) 2,85,000 కి.మీ.
32. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. ఒక అయస్కాంత ధ్రువసత్వం
ప్రమాణాలు ఆంపియర్- మీటర్
బి. అయస్కాంత భ్రామకం ప్రమాణాలు ఆంపియర్-మీటర్..2
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏవీ కావు
33. అయస్కాంతాలకు సంబంధించి కింది వాటిలో సరైనది?
1) సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి
2) అయస్కాంతంలో ఎప్పుడూ రెండు ధ్రువాలుంటాయి
3) స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతం ఎప్పుడూ ఉత్తర-దక్షిణ దిశలను చూపిస్తుంది
4) పైవన్నీ
34. పారామాగ్నటిక్ పదార్థానికి ఉదాహరణ?
1) అల్యూమినియం 2) సోడియం
3) పొటాషియం 4) కాల్షియం
35. అయస్కాంత ధ్రువాల్లాంటి రెండు వస్తువుల మధ్యగల వికర్షణ శక్తి?
1) వాటి మధ్య ఉన్న దూరానికి ప్రత్యక్ష అనులోమానుపాతంలో ఉంటుంది
2) ఆ రెండింటి మధ్య ఉన్న దూరం వర్గానికి ప్రత్యక్ష అనులోమానుపాతంలో ఉంటుంది
3) ఆ రెండింటి మధ్య ఉన్న దూరం వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది
4) పైవేవీకావు
36. అయస్కాంత ఉష్ణోగ్రత మాపకాన్ని ఉపయోగించి ఎంత కనిష్ఠ ఉష్ణోగ్రతను కొలవవచ్చు?
1) -273 K 2) -2730 C
3) – 273 F 4) 00 C
37. అయస్కాంత ప్రేరణ క్షేత్ర తీవ్రతను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది?
1) టెస్లా 2) ఆయర్స్టెడ్
3) గౌస్ 4) పెవన్నీ
38. భౌమ్య అయస్కాంత తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలు ఏవి?
ఎ. ఉత్తర కెనడా బి. సైబీరియా
సి. దక్షిణ ఆస్ట్రేలియా
డి. అంటార్కిటికా తీరం
1) ఎ 2) సి
3) ఎ, సి 4) ఎ, బి, సి, డి
39. కింది వాటిలో అయస్కాంత పదార్థాలను కలిగి ఉండని పరికరం ఏది?
1) సైకిల్ డైనమో 2) ట్రాన్స్ఫార్మర్
3) ట్యూబ్‌లైట్ 4) రేడియో
40. టేప్ రికార్డర్లోని ప్లాస్టిక్ టేప్‌పై ఏ అయస్కాంత పదార్థంతో పూత పూస్తారు?
1) డయా మాగ్నైట్ 2) ఫెర్రిక్ ఆక్సైడ్
3) క్యూప్రిక్ క్లోరైడ్ 4) ఆల్నికో
41. బలమైన అయస్కాంత పదార్థాలున్నట్లు భావిస్తున్న ‘బెర్ముడా ట్రయాంగిల్’ ఎక్కడ ఉంది?
1) హిందూ మహాసముద్రం
2) అరేబియా సముద్రం
3) భూమి దక్షిణ ధ్రువం
4) దక్షిణ అట్లాంటిక్ సముద్రం
42. కింది వాటిలో అయస్కాంత కవచంగా ఉపయోగించే పదార్థం ఏది?
1) ఆల్నికో 2) ఉక్కు
3) నికెల్ 4) మృదు ఇనుము
43. ఏ పదార్థం వల్ల భౌమ్య అయస్కాంతత్వం కలుగుతుంది?
1) మరుగుతున్న నికెల్-ఇనుము
2) మరుగుతున్న ఇనుము-సిలికాన్
3) ఘనస్థితిలోని ఇనుము
4) ఘనస్థితిలోని అల్యూమినియం-నికెల్
44. ‘భూమి పెద్ద అయస్కాంత గోళం’ అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
1) కూలుంబ్ 2) మైకెల్ ఫారడే
3) విలియం గిల్బర్డ్ 4) మేడం క్యూరి
45. భూ అయస్కాంత క్షేత్రంలో అత్యధిక ఒడుదొడుకులను ఏ నెలలో పరిశీలించవచ్చు?
1) జూన్ 2) జూలై
3) ఆగస్టు 4) సెప్టెంబర్
46. అయస్కాంతత్వానికి సరైన పరీక్ష ఏది?
1) ఆకర్షణ 2) వికర్షణ
3) పై రెండూ 4) ఏదీ కాదు
47. భౌమ్య అయస్కాంత క్షేత్రం వల్ల అర్ధరాత్రి సమయంలో భూమి ఉత్తర ధ్రువం వద్ద కనిపించే వెలుగును ఏమంటారు?
1) అరోరా బొరియాలిస్
2) అరోరా ఆస్ట్రలిస్
3) అరోరా లైట్ 4) పోలార్ లైట్
48. భూ అయస్కాంతానికి సంబంధించి సరైన వాక్యం ఏది?
1) భూ అయస్కాంత ఉత్తర
ధ్రువం భౌగోళిక ఉత్తరం వైపు ఉంటుంది
2) భూ అయస్కాంత ఉత్తర
ధ్రువం భౌగోలిక తూర్పు వైపు ఉంటుంది
3) భూ అయస్కాంత ఉత్తర
ధ్రువం భౌగోళిక పడమర వైపు ఉంటుంది
4) భూ అయస్కాంత ఉత్తర
ధ్రువం భౌగోళిక దక్షిణం వైపు ఉంటుంది
49. ఇనుప కడ్డీని అయస్కాంతీకరించడానికి ఏ రకమైన విద్యుత్‌ను ఉపయోగిస్తారు?
1) ఏకాంతర విద్యుత్
2) ఏకముఖ విద్యుత్
3) 1, 2 4) ఏదీ కాదు
50. కింది వాటిలో అయస్కాంతీకరణ పద్ధతి కానిది ఏది?
1) ఏకస్పర్శా పద్ధతి 2) ద్విస్పర్శా పద్ధతి
3) విద్యుదీకరణ 4) విభజన
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు