పదార్థాల రవాణా.. ప్రాణవాయు ప్రసరణ
మానవ శరీరం వివిధ అవయవాలతో నిర్మితమై ఉంటుంది. ప్రతి అవయవం ఒక ప్రత్యేక విధిని నిర్వహిస్తుంది. ఈ అవయవాలన్ని కలిసి అవయవ వ్యవస్థలుగా ఏర్పడి కొన్ని ప్రత్యేకమైన విధులను నిర్వర్తిస్తుంటాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ప్రతి వ్యవస్థపై కనీస అవగాహన ఉండాలి. ప్రతి అంశం నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ నేపథ్యంలో మానవ శరీరంలోని అవయవ వ్యవస్థల సంక్షిప్త సమాచారం నిపుణ పాఠకుల కోసం..
రక్త ప్రసరణ వ్యవస్థ
- అమీబా, హైడ్రా వంటి జీవుల్లో పదార్థాలు వ్యాపనం, ద్రవాభిసరణ వంటి సరళమైన పద్ధతుల ద్వారా ప్రసరణం చెందుతాయి.
- విలియం హార్వేను రక్త ప్రసరణ వ్యవస్థ పితామహుడిగా పిలుస్తారు.
- రెని లెన్నెక్ అనే శాస్త్రవేత్త 1816లో స్టెతస్కోప్‌ను కనుగొన్నాడు.
- హృదయ స్పందనలను స్టెతస్కోప్ అనే పరికరం ద్వారా కొలుస్తారు.
- నాడీ స్పందనకు, హృదయ స్పందన రేటు సమానంగా ఉంటుంది.
- మానవుడి గుండె నిమిషానికి సుమారు 72 సార్లు కొట్టుకుంటుంది.
- గుండె బేరిపండు ఆకారంలో ఉండి త్రికోణాకారంలో ఉంటుంది.
- గుండెను ఆవరించి రెండు పొరలు ఉంటాయి. వీటిని హృదయావరణ త్వచం అంటారు.
- గుండెలో 4 గదులుంటాయి. రెండు కర్ణికలు, రెండు జఠరికలు.
- గుండెను ఆవరించి ఉండే రక్తనాళాలు 1. ధమనులు 2. సిరలు 3. రక్తకేశ నాళికలు
- గుండెలో 4 రకాల కవాటాలుంటాయి. 1. అగ్రత్రయ కవాటం 2. అగ్రద్వయ కవాటం (మిట్రల్) 3. పుపుస ధమని కవాటం 4. మహాధమని కవాటం.
- గుండె నుంచి రక్తం కేవలం ఒకేసారి ప్రయాణిస్తే ఆ ప్రసరణను ఏక వలయ రక్త ప్రసరణ అంటారు. ఉదా: చేప
- గుండె నుంచి రక్తం రెండు సార్లు ప్రయాణిస్తే ఈ ప్రసరణను ద్వివలయ రక్త ప్రసరణ అంటారు. ఉదా: మానవుడు
- ఘన పదార్థాలు లేని రక్తమే శోషరసం. రక్తాన్ని కణాలకు జోడించే ప్రధానమైన పదార్థం శోషరసం.
- రక్తం రక్తనాళాల గోడలపై కలుగజేసే పీడనాన్ని రక్త పీడనం అంటారు.
- రక్త పీడనాన్ని స్పిగ్మోమానో మీటర్ అనే పరికరం ద్వారా కొలుస్తారు.
- సామాన్య రక్తపీడనం 120/80. ఇందులో 120ని సిస్టోలిక్ పీడనం అని, 80ని డయాస్టోలిక్ పీడనం అంటారు.
- రక్త నాళాలు లేని ప్రసరణ వ్యవస్థను వివృత రక్త ప్రసరణ అంటారు. ఉదా: ఆర్థ్రోపొడా, మొలస్కా
- రక్త రక్తనాళాల్లో ప్రవహించే వ్యవస్థను సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. ఉదా: అనెలిడా, ఇఖైనోడర్మెటా, ఆక్టోపస్
- రక్తం గడ్డకట్టడంలో తోడ్పడే రక్తకణాలు రక్త ఫలకికలు.
- రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా తోడ్పడే రసాయనం హెపారిన్.
- రక్తం గడ్డకట్టిన తర్వాత మిగిలిన గడ్డి పసుపు వర్ణంలోని ద్రవాన్ని సీరం అంటారు.
- రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హిమటాలజీ అంటారు.
- ఆరోగ్యవంతమైన మానవుడిలో సుమారు 5 లీటర్ల రక్తం ఉంటుంది.
- రక్తనాళాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎంజియాలజీ అంటారు.
- రక్తంలో మూడు రకాల కణాలుంటాయి. అవి. 1. ఎర్ర రక్తకణాలు 2. తెల్ల రక్తకణాలు 3 రక్త ఫలకికలు
ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ఎరిత్రోపాయిసిస్ అంటారు. - కాలేయాన్ని ఎర్ర రక్తకణాల ఊయల అని, ప్లీహాన్ని ఎర్రరక్త కణాల శ్మశాన వాటిక అంటారు.
- ఒక మిల్లీలీటర్ రక్తం లో దాదాపు 5 మిలియన్ల ఎర్ర రక్తకణాలు ఉంటాయి. ఎర్ర రక్తకణాల జీవిత కాలం 120 రోజులు.
- క్షీరదాల ఎర్ర రక్తకణాల్లో కేంద్రకం ఉండదు కానీ ఒంటె, లామా వంటి క్షీరదాల్లోని ఎర్ర రక్తకణాల్లో కేంద్రకం ఉంటుంది.
- ఎర్ర రక్తకణాల పరిపక్వతకు ఫోలిక్ ఆమ్లం సయానోకోబాలమిన్ విటమిన్లు అవసరం.
తెల్ల రక్తకణాలను ల్యూకోసైట్స్ అని కూడా అంటారు. - రక్తంలో తెల్ల, ఎర్ర రక్తకణాల నిష్పత్తి 1:500.
- తెల్ల రక్తకణాల జీవితకాలం 12-13 రోజులు.
- తెల్ల రక్తకణాల ఉత్పత్తిని ల్యూకోపాయిసిస్ అంటారు.
- వీటిని గ్రాన్యులోసైట్లు (ఇసినోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్), ఎగ్రాన్యులోసైట్లు (లింఫోసైట్లు, మోనోసైట్లు) అనే భాగాలుగా విభజించారు.
- రక్త ఫలకికలను త్రాంబోసైట్లు అంటారు. రక్తం గడ్డకట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
- ఇవి సాధారణంగా ఒక క్యుబిక్ మిల్లీలీటర్ రక్తంలో 2.5-4.5 లక్షలు ఉంటాయి.
- రక్త వర్గాలను కారల్ లాండ్ స్టీనర్ అనే శాస్త్రవేత్త 1900లో A, B, O అనే గ్రూపులుగా విభజించారు.
- కారల్ లాండ్ స్టీనర్ జన్మదినమైన జూన్ 14ను ప్రపంచ రక్త దాతల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
- కారల్ లాండ్ స్టీనర్ను రక్త వర్గాల పితామహుడిగా పిలుస్తారు.
- O రక్త వర్గం గల వ్యక్తులను విశ్వ దాతలు అంటారు. AB రక్త వర్గపు వ్యక్తులను విశ్వ గ్రహీతలు అంటారు.
- ప్రపంచంలో అధికంగా ఉండే రక్త వర్గం B+, ప్రపంచంలో తక్కువగా ఉండే రక్తవర్గం AB-.
- మానవుడు, రీసస్ కోతుల్లో Rh కారకాన్ని కారల్ లాండ్ స్టీనర్, అలెగ్జాండర్ వీనర్ అనే శాస్త్రవేత్తలు గుర్తించారు.
- రక్తం గడ్డకట్టడానికి సాధారణంగా 3 నుంచి 6 నిమిషాల సమయం పడుతుంది.
- విటమిన్-కె లోపం వల్ల రక్తం గడ్డకట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది.
- జన్యులోపం వల్ల సంభవించే రక్త సంబంధ వ్యాధిని హీమోఫీలియా అంటారు.
- ఏప్రిల్ 17న ప్రపంచ హీమోఫీలియా నివారణ దినోత్సవం నిర్వహిస్తారు.
- వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే వ్యాధిని తలసేమియా అంటారు. ఈ వ్యాధి వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది.
- మే 8న ప్రపంచ తలసేమియా నివారణ దినోత్సవం నిర్వహిస్తారు.
శ్వాస వ్యవస్థ
- Respiration అనే పదం Respire అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది. Respire అంటే పీల్చడం అని అర్థం.
- గాలిలోని ఆక్సిజన్‌ను లోపలికి తీసుకుని కార్బన్ డై ఆక్సైడ్‌ను బయటకు వదిలే ప్రక్రియను శ్వాసక్రియ అంటారు.
- ఆక్సిజన్‌ను లోపలికి పీల్చడాన్ని ఉచ్ఛాసం అని కార్బన్ డై ఆక్సైడ్‌ను బయటకు వదిలే ప్రక్రియను నిశ్వాసం అంటారు.
- ఒక జత ఊపిరితిత్తులు శ్వాసక్రియలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
- ఊపిరితిత్తుల గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని పల్మనాలజీ అంటారు.
- ఊపిరితిత్తులను కప్పుతూ ఫ్లూరా అనే రెండు పొరలుంటాయి.
- ఉచ్ఛాసించే వాయువులో 21శాతం ఆక్సిజన్ 0.03 శాతం కార్బన్ డై ఆక్సైడ్ ఉంటాయి.
- నిశ్వాసించే వాయువులో 16 శాతం ఆక్సిజన్, 4.4 శాతం కార్బన్ డై ఆక్సైడ్ ఉంటాయి.
- మానవుడి ఊపిరితిత్తుల సామర్థ్యం 5600 మిల్లీ లీటర్లు.
- హిమోగ్లోబిన్ ఆక్సిజన్‌తో కలిసి ఆక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. హిమోగ్లోబిన్ మధ్యలో ఇనుము (Fe) ఉంటుంది.
- ఊరిపితిత్తుల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం వాయుగోణులు.
- జీవు ల్లో శ్వాసక్రియ మైటోకాండ్రియాలో జరుగుతుంది.
- మైటోకాండ్రియాలను కణశక్త్యాగారాలు అంటారు.
- మైటోకాండ్రియాలో శక్తి ATP రూపంలో నిల్వ ఉంటుంది. అందువల్ల ATPని ఎనర్జీ కరెన్సీ అంటారు. ఒక ATPలో 7200 కాలరీల శక్తి నిల్వ ఉంటుంది.
- ఆక్సిజన్ లభ్యంకాని పక్షంలో పైరూవికామ్లం ఇథనాల్‌గా మారుతుంది. ఈ ప్రక్రియను కిణ్వనం అంటారు. బేకరీల్లో కేక్‌లు తయారవడానికి, ఇడ్లీ, దోస పిండి పులియడానికి, ఆల్కహాల్ తయారీ పరిశ్రమల్లో ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు.
- కండరాల్లో లాక్టికామ్లం నిల్వ ఉండటం కండరాల నొప్పికి కారణమవుతుంది.
- చేపల్లో జలశ్వాసక్రియ.. వానపాములో చర్మీయ శ్వాసక్రియ.. కప్పల్లో చర్మీయ, ఆస్యకుహర, పుపుస శ్వాసక్రియ.. బొద్దింక, మిడతల్లో వాయునాళ శ్వాసక్రియ జరుగుతుంది.
- ప్రాచీన భారతీయ ఆయుర్వేద వైద్యుడు పతంజలి మహర్షి శాస్త్రీయ పద్ధతిలో శ్వాసక్రియ విధానంపై యోగాభ్యాసం అనే ప్రక్రియను కనుగొన్నాడు.
- ఆక్సిజన్‌ను జోసెఫ్ ప్రీస్ట్లీ, కార్బన్ డై ఆక్సైడ్‌ను లేవోయిజర్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
జీర్ణ వ్యవస్థ
- మనం నిత్యం తీసుకునే ఆహారంలోని సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చే ప్రక్రియనే జీర్ణక్రియ అంటారు.
- జీర్ణవ్యవస్థ నోటితో ప్రారంభమై పాయువుతో అంతమవుతుంది.
- నోటిలోకి ప్రవేశించిన ఆహారం లాలాజలంతో కలిసి ముద్దగా మారుతుంది. దీన్నే బోలస్ అంటారు.
- మానవుడి నోటిలో రోజుకు 1.5 లీటర్ల లాలాజలం ఉత్పత్తి అవుతుంది.
- మూడు జతల లాలాజల గ్రంథులు లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయి. అవి. 1. పెరోటిడ్ గ్రంథులు 2. అధోజంబికా గ్రంథులు 3. అధో జిహ్వకా గ్రంథులు.
- లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఎమైలేజ్ (టయలిన్).
- ఆహార వాహికలో అలలు లేదా తరంగాల మాదిరిగా ఉండే చలనాలను పెరిస్టాలిటిక్ చలనాలు అంటారు.
- జీర్ణాశయపు గోడల్లో జఠర రసం ఉత్పత్తి అవుతుంది. జఠర రసంలో పెప్సిన్ అనే ఎంజైమ్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటాయి.
- ఆహారంలో ఉండే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు చిన్న ముక్కలుగా విడగొట్టబడి మెత్తగా చిలకబడి చిక్కటి రూపంలోకి మారుతాయి. ఈ మిశ్రమాన్ని కైమ్ అంటారు.
- అతిపెద్ద జీర్ణగ్రంథి కాలేయం.
- జీర్ణవ్యవస్థలో భాగమైన చిన్నపేగు సుమారు 4-7 మీటర్ల పొడవుండి 3 భాగాలుగా విభజితమై ఉంటుంది. అవి 1. ఆంత్రమూలం 2. జెజునం 3. ఇలియం
- చిన్నపేగు గోడలు ఆంత్ర రసాన్ని స్రవిస్తాయి.
- కాలేయం నుంచి పైత్యరసం ఉత్పత్తి అవుతుంది. దీనిలో ఏవిధమైన ఎంజైమ్ ఉండదు. ఇది కొవ్వుల ఎమల్సీకరణకు తోడ్పడుతుంది.
- గోడల్లో వేళ్ల మాదిరిగా ఉండే నిర్మాణాలను చూషకాలు అంటారు. ఇవి ఉపరితల వైశాల్యాన్ని పెంచి జీర్ణమైన ఆహార పదార్థాల శోషణలో తోడ్పడతాయి.
- పెద్దపేగులో ఎటువంటి జీర్ణక్రియ జరగదు. జీర్ణమైన ఆహారంలోని నీరు, ఖనిజ లవణాలను పీల్చుకుంటుంది.
ఏవీ సుధాకర్
స్కూల్ అసిస్టెంట్
జడ్పీహెచ్ఎస్
లింగంపల్లి(మంచాల)
రంగారెడ్డి జిల్లా
Previous article
శూన్యంలో విద్యుదయస్కాంత తరంగాల వేగం?
Next article
It has been raining for four hours…
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు