యూసీడ్ & సీడ్-2022 ఐఐటీలో ప్రవేశాలు !
ఇంటర్ ఏగ్రూప్ అయినా
సాంకేతికత వేగంగా అ భివృద్ధి చెందుతుంది. కాలం మారుతుంది. ఏం చదివాం అనేది ముఖ్యం కాదు ఏ రంగంలో ఆసక్తి ఉంది, దానిలో ప్రతిభ ఎంత అనేది ప్రధానంగా మారింది. ఇంటర్, డిగ్రీలో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఏ గ్రూప్ అయితేనేమి డిజైనింగ్‌లో ఆసక్తి ఉంటే చాలు దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎస్సీల్లో ప్రవేశాలు పొందవచ్చు. డిజైనింగ్ రంగంలో నిష్ణాతులు కావచ్చు. దీనికోసం దేశవ్యాప్తంగా నిర్వహించే యూసీడ్, సీడ్ ఎగ్జామ్‌లో మంచి స్కోర్ సాధిస్తే చాలు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు నిపుణ పాఠకుల కోసం..

యూసీడ్: అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్ (యూసీడ్). దీన్ని ఐఐటీ బాంబే నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా ద్వారా ఐఐటీ బాంబే, ఐఐటీ గువాహటి, ఐఐటీ హైదరాబాద్, ఐఐఐటీడీఎం జబల్పూర్లలో బీ.డిజైన్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
బీ.డిజైన్ కోర్సుచేస్తే ఉపాధి అవకాశాలు
డిజైన్ అనేది ప్రస్తుత కాలంలో అన్నింటా తప్పనిసరిగా మారింది. వ్యాపారం, పరిపాలన, టెక్నాలజీ, నిర్వహణ, తయారీ, రిటైల్, ఐటీ సేవలు, ప్రణాళిక విధానం, వినోదం, కమ్యూనికేషన్, వినియోగదారు కేంద్రీకృత పరిశోధన, జీవనశైలితో పనిచేసే సంస్థల్లో డిజైనర్లకు విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ డిగ్రీతో యూపీఎస్సీ, ఎస్ఎస్సీ వంటి కేంద్ర నియామక సంస్థలు నిర్వహించే పరీక్షలు రాయవచ్చు. ఇది పూర్తిగా ప్రభుత్వం ఆమోదించిన కోర్సు. అధునాతన సాంకేతిక అభివృద్ధిలో డిజైనింగ్ పాత్ర కీలకంగా మారింది. అంతేకాకుండా స్వయంగా కెరీర్‌ను ప్రారంభించుకోవచ్చు.
ఎవరు అర్హులు?
- ఇంటర్లో (ఆర్ట్స్, మ్యాథ్స్, సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్) 2021లో ఉత్తీర్ణులు. 2022 మార్చిలో పరీక్ష రాయనున్నవారు కూడా అర్హులే.
- హెచ్ఎస్సీ వొకేషనల్ ఎగ్జామ్ లేదా మూడేండ్ల డిప్లొమా (పాలిటెక్నిక్) చేసినవారు కూడా అర్హులే.
- 1997, అక్టోబర్ 1 తర్వాత జన్మించిన జనరల్/ఓబీసీ (ఎన్సీఎల్) అభ్యర్థులు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులు అయితే 1992, అక్టోబర్ 1 తర్వాత జన్మించి ఉండాలి.
పరీక్ష ఎన్నిసార్లు రాయవచ్చు
- ఈ పరీక్షను గరిష్ఠంగా రెండుసార్లు రాయవచ్చు. ఏ సంవత్సరం స్కోర్ ఆ ఏడాదికి మాత్రమే పరిమితం. యూసీడ్-2022 స్కోర్ 2022-23 అకడమిక్ ఇయర్‌కు మాత్రమే వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.
సీట్ల వివరాలు: మొత్తం సీట్లు -179
వీటిలో ఐఐటీ బాంబే- 37, ఐఐటీ గువాహటి- 56, ఐఐటీ హైదరాబాద్-20, ఐఐఐటీడీఎం జబల్పూర్- 66 సీట్లు ఉన్నాయి.
నోట్: యూసీడ్లో అర్హత సాధించివారికి పై సంస్థల్లో కామన్ అప్లికేషన్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష విధానం: ఇది కంప్యూటర్‌బేస్డ్ టెస్ట్. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి 3 గంటలు. 300 మార్కులు. మూడు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏలో న్యూమరికల్ ఆన్సర్ టైప్. మల్టి సెలక్ట్ క్వశ్చన్స్, ఎంసీక్యూలు ఇస్తారు. పార్ట్ బీ స్కెచింగ్పై ఉంటుంది.
ముఖ్యతేదీలు:
దరఖాస్తు: ఆన్లైన్లో…. చివరితేదీ: అక్టోబర్ 10
అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్: 2022, జనవరి 8 నుంచి
పరీక్షతేదీ: 2022, జనవరి 23 (ఉదయం 9 నుంచి 12 గంటల వరకు)
ఫలితాల వెల్లడి: 2022, మార్చి 10
వెబ్సైట్: http://www.uceed.iitb.ac.in/2022
సీడ్-2022
(డిగ్రీలో అన్ని గ్రూప్‌ల వారికీ)మాస్టర్ ఆఫ్ డిజైన్ (ఎం.డిజైన్), పీహెచ్డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం దీన్ని ఐఐటీ బాంబే నిర్వహిస్తుంది.
- ఈ కోర్సును బెంగళూరులోని ఐఐఎస్సీ, బాంబే, ఢిల్లీ, గువాహటి, హైదరాబాద్, కాన్పూర్, రూర్కీ ఐఐటీలు, జబల్పూర్లోని ఐఐఐటీడీఎం ఆఫర్ చేస్తున్నాయి. దీనితోపాలు పలు ఐఐటీల్లోని డిజైన్ స్కూల్స్‌లో పీహెచ్డీ ప్రవేశాలు కల్పిస్తారు.
- సీడ్ స్కోర్‌తో ప్రవేశాలు కల్పించే ఇతర సంస్థలు: హర్యానాలోని వరల్డ్ యూనివర్సిటీ ఆఫ్ డిజైన్. డెహ్రాడూన్‌లోని యూపీఈఎస్, శివ నాడార్ యూనివర్సిటీ, జైపూర్‌లోని జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ, తేజ్‌పూర్ యూనివర్సిటీ, వీఐటీ, డీటీయూ, సృష్టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ డిజైన్ అండ్ టెక్నాలజీ, డీజే అకాడమీ ఆఫ్ డిజైన్, ఎల్పీయూ, సీఐటీ తదితరాలు.
ఐఐటీల్లో కోర్సుల వివరాలు
- ఐఐఎస్సీలో ఎం.డిజైన్ (ప్రొడక్ట్ డిజైన్ అండ్ ఇంజినీరింగ్), పీహెచ్డీ (డిజైన్)
- ఐఐటీ బాంబేలో ఎం.డిజైన్ (ఇండస్ట్రియల్ డిజైన్,కమ్యూనికేషన్ డిజైన్, యానిమేషన్, ఇంటరాక్షన్ డిజైన్, మొబిలిటీ అండ్ వెహికిల్ డిజైన్), పీహెచ్డీ (డిజైన్)
- ఐఐటీ ఢిల్లీలో ఎం డిజైన్ (ఇండస్ట్రియల్ డిజైన్), పీహెచ్డీ (డిజైన్)
- ఐఐటీ గువాహటిలో ఎం.డిజైన్ (డిజైన్), పీహెచ్డీ (డిజైన్)
- ఐఐటీ హైదరాబాద్‌లో ఎం.డిజైన్ (విజువల్ డిజైన్), పీహెచ్డీ డిజైన్
- ఐఐఐటీడీఎం జబల్పూర్లో ఎం.డిజైన్ (ప్రొడక్ట్ డిజైన్, విజువల్ డిజైన్)
- ఐఐటీ కాన్పూర్‌లో ఎం.డిజైన్ (డిజైన్), పీహెచ్డీ (డిజైన్)
- ఐఐటీ రూర్కీలో ఎం.డిజైన్ (ఇండస్ట్రియల్ డిజైన్)
- అర్హతలు: నాలుగేండ్లు లేదా 3+2 ఇయర్స్(10+2 తర్వాత)లో డిగ్రీ/ డిప్లొమా లేదా పీజీ ఉత్తీర్ణులు లేదా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయబోతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఈ పరీక్ష రాయడానికి ఎటువంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.
- సీడ్‌ను ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: అక్టోబర్ 10
పరీక్షతేదీ: 2022, జనవరి 23 పరీక్ష కేంద్రం: హైదరాబాద్
ఫలితాల వెల్లడి: 2022, మార్చి 8
వెబ్సైట్: http://www.ceed.iitb.ac.in
కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
- Tags
- Admissions
- IIT
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






