ఇంటికి అందం!
ఇల్లు అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. అందుకే, సరికొత్త అలంకరణల పట్ల ఆసక్తి చూపుతారు. ‘ఏదో అలంకరించాం’ అన్నట్టుగా కాకుండా రొటీన్‌కు భిన్నంగా ఉంటే బావుంటుందని సూచిస్తున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. చూడగానే ముచ్చట కలిగేలా ఇంటిని తీర్చిదిద్దేందుకు కొన్ని చిట్కాలు చెప్తున్నారు.
- ఇంటి లోపల ఎంత అద్భుత అలంకరణ ఉన్నా.. ప్రవేశద్వారం సాదాసీదాగా ఉంటే ప్రయత్నమంతా వృథానే. అందుకే.. పెద్ద దర్వాజా ఆకర్షణీయంగా కనిపించేలా ముదురు రంగు పెయింట్ వేస్తే బాగుంటుంది. మంచి కొటేషన్లు ఉండే ఓ నేమ్ ప్లేట్‌ను అమర్చాలి. అదీ వద్దనుకొంటే.. మీ ఇంటి నంబర్‌నే కాస్తంత క్రియేటివ్‌గా రాయించి పెట్టేయండి. గడపకు ఇరువైపులా రెండు పూల కుండీలు పెట్టేస్తే.. వాకిలి మరింత అందంగా.. ఆహ్లాదకరంగా కనిపిస్తుంది.
- గది చిన్నదిగా ఉందని చింతించవద్దు. చిన్న చిట్కాలతో విశాలంగా కనిపించేలా చేయొచ్చు. బయట ఉన్న గార్డెన్.. నట్టింట్లో ప్రతిబింబించేలా అద్దాలను అమర్చితే సరి. చూసేవాళ్లకు ఇల్లు ఎంతో విశాలంగా ఉన్న భావన కలుగుతుంది.
- వినియోగించే వస్తువుల కన్నా పనికిరానివే ఇంట్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.. ముఖ్యంగా పాత బట్టలు. దీనిని నివారించేందుకు పాత దుస్తులను పెట్టెల్లో పెట్టి సజ్జపైకి ఎక్కించండి. బాక్సుల మీద ‘మార్కర్’తో పేరు రాసుకుంటే అవసరం ఉన్నప్పుడు సులభంగా తీసుకోవచ్చు.
Previous article
యూసీడ్ & సీడ్-2022 ఐఐటీలో ప్రవేశాలు !
Next article
శివార్లకే మొగ్గు!
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు