క్షార భూమి మీద పెరిగే చెట్లను ఏమంటారు?
వివిధ రకాలు పెంపకాలు (కల్చర్స్)
టిష్యూ కల్చర్- మొక్కల కణజాలాలను సంవర్ధనం చేసి నూతన మొక్కలను సృష్టించడం
ఎపి కల్చర్ – తేనెటీగల పెంపకం
పిసి కల్చర్ – చేపల పెంపకం
ఆక్వా కల్చర్- చేపలు, రొయ్యలు కృత్రిమంగా పెంచడం
మారీ కల్చర్- సముద్రంలో/ఉప్పునీటిలో చేపలు పెంచడం
ఫ్లోరి కల్చర్ – పూల మొక్కలను పెంచడం
వర్మి కల్చర్ – వానపాముల సహాయంతో ఎరువుల పెంపకం
సెరికల్చర్ – పట్టుపురుగుల పెంపకం
అర్బోరి కల్చర్- కూరగాయలు పెంచడం
విటి కల్చర్ – ద్రాక్ష తోటల పెంపకం
సెల్వి కల్చర్ – కలపనిచ్చే చెట్లను పెంచడం
హార్టికల్చర్ – పండ్ల తోటల పెంపకం
రెవల్యూషన్స్
హరిత విప్లవం- వ్యవసాయ, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచడం (గ్రీన్ రెవల్యూషన్)
వైట్ రెవల్యూషన్- (శ్వేత విప్లవం) పాల ఉత్పత్తిని పెంచడం (ఆపరేషన్ ఫ్లడ్)
యెల్లో రెవల్యూషన్- నూనె గింజలు, పప్పు ధాన్యాల దిగుబడి పెంచడం
బ్లూ రెవల్యూషన్- చేపల ఉత్పత్తి పెంచడం
రెడ్ రెవల్యూషన్- మాంసం ఉత్పత్తి పెంచడం
బ్రౌన్ రెవల్యూషన్- మసాలా దినుసుల ఉత్పత్తిని అభివృద్ధి పరచడం, తోళ్ల ఉత్పత్తులను పెంచడం
గోల్డెన్ రెవల్యూషన్- పండ్ల ఉత్పత్తి పెంచడం
గ్రే రెవల్యూషన్- ఎరువుల ఉత్పత్తి వృద్ధి చేయడం
సిల్వర్ రెవల్యూషన్- కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచడం
పింక్ రెవల్యూషన్- ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, రొయ్యల ఉత్పత్తిని పెంచడం
ఈ రెవల్యూషన్స్ అన్నింటిని కలిపి ‘రెయిన్ బో రెవల్యూషన్’ అంటారు.
మోడల్ ప్రశ్నలు
1. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే పదార్థం?
1) సోడియం కార్బోనేట్ 2) లాక్టరిక్ ఆమ్లం
3) ఎసిటిక్ ఆమ్లం 4) బెంజోయిక్ ఆమ్లం
2. కింది దేనిలో చర్మం శ్వాసక్రియకు ఉపయోగపడుతుంది?
1) బొద్దింక 2) కప్ప
3) సొరచేప 4) తిమింగలం
3. క్లోరోఫిల్‌లో ఉన్న మెటాలిక్ అయాన్ ఏది?
1) మెగ్నీషియం 2) ఇనుము
3) జింక్ 4) కోబాల్ట్
4. కణాల ఆత్మహత్య అని కింది వాటిలో దేనిని అంటారు?
1) లైజోజోమ్స్ 2) రైబోజోమ్స్
3) న్యూక్లియోజోమ్స్ 4) గోల్గీ బాడీ
5. కుళ్లిన సేంద్రియ పదార్థం కోనిఫెరస్ అడవి నేలలో ఉండేది?
1) ఎ హారిజాన్ 2) బి హారిజాన్
3) సి హారిజాన్ 4) డి హారిజాన్
6. నీటి ఉపరితలం మీద ఏర్పడిన అలలు దేనికి ఉదాహరణ?
1) తిర్యక్ అలలు 2) దీర్ఘ అలలు
3) స్థిర అలలు 4) పురోగామి అలలు
7. టైఫాయిడ్ వల్ల శరీరంలో ఏ భాగం ప్రభావితమవుతుంది?
1) గుండె 2) గొంతు
3) పేగు 4) ఊపిరితిత్తులు
8. కింది వాటిలో వంటగదిలో బేకింగ్ పౌడర్‌గా వాడేది?
1) సోడియం బైకార్బొనేట్
2) పొటాషియం నైట్రేట్
3) సోడియం క్లోరైడ్
4) సోడియం కార్బోనేట్
9. ఓజోన్ పొర తగ్గుదలకు కారణమైన వాయువు?
1) క్లోరోఫ్లోరో కార్బన్
2) కార్బన్ మోనాక్సైడ్
3) కార్బన్ డై ఆక్సైడ్
4) నైట్రస్ ఆక్సైడ్
10. వైమానికుడు నడిపే మొట్టమొదటి హెలికాప్టర్‌ను కనుగొన్నది?
1) ఎడిసన్ 2) హిల్లర్
3) లారెన్స్ 4) కోర్న్
11. బాయిల్స్ సూత్రం వేటి మధ్య సంబంధానికి చెందినది?
1) పరిమాణం, సాంద్రత
2) పీడనం, పరిమాణం
3) పీడనం, ఉష్ణోగ్రత
4) పరిమాణం, ఉష్ణోగ్రత
12. గంధకాన్ని రబ్బర్‌తో కలిపి వేడిచేయడాన్ని ఏమంటారు?
1) గాల్వనైజేషన్ 2) సల్ఫోనైజేషన్
3) వల్కనైజేషన్ 4) బేసెమిరైజేషన్
13. ఎయిడ్స్‌ను ఏ సంవత్సరంలో కనుగొన్నారు?
1) 1980 2) 1981
3) 1982 4) 1983
14. పాలు దేని కొల్లాయిడ్ ద్రావణం?
1) కొవ్వులో నీరు విక్షేపణ చెందగా ఏర్పడినది
2) నీటిలో కొవ్వు విక్షేపణ చెందడం వల్ల ఏర్పడినది
3) కొవ్వులో మాంసకృత్తులు విక్షేపణ చెందగా ఏర్పడినది
4) మాంసకృత్తుల్లో కొవ్వు విక్షేపణ చెందగా ఏర్పడినది
15. ఆడియో టేపులు దేనితో పూతపూసి ఉంటాయి?
1) అల్యూమినియం ఆక్సైడ్
2) సిల్వర్ అయోడైడ్
3) ఫెర్రిక్ ఆక్సైడ్
4) పొటాషియం నైట్రేట్
16. జతపర్చండి?
ఎ. అనిమోమీటర్ 1. అధిక ఉష్ణోగ్రత
బి. టాకోమీటర్ 2. యంత్ర సామర్థ్యం
సి. ఫైరోమీటర్ 3. భ్రమణవేగం
డి. డైనమోమీటర్ 4. ద్రవ వేగం
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-4, బి-3, సి-2, డి-1
17. మనం జీవించడానికి దోహదపడే ఆక్సిజన్ కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఏర్పడుతుంది. ఇది దేని నుంచి వస్తుంది?
1) కార్బన్ డై ఆక్సైడ్
2) భూమి నుంచి గ్రహించిన కార్బోనేట్
3) ఖనిజ కారకాల ఆక్సైడ్స్ 4) నీరు
18. సముద్రపు మట్టానికి పైన ఉన్న ఎత్తును కొలిచే సాధనం?
1) హిస్పోమీటర్ 2) లాక్టోమీటర్
3) హైగ్రోమీటర్ 4) హైడ్రోమీటర్
19. శిలల మీద పెరిగే మొక్కలను ఏమంటారు?
1) లితోఫైట్స్ 2) ఎరిమోఫైట్స్
3) చారోఫైట్స్ 4) ఆక్సిలోఫైట్స్
20. హైడ్రోజన్ బాంబులో ఉండే సూత్రం?
1) అణు సంళీనం 2) అణు విచ్ఛిత్తి
3) 1, 2 4) ఏదీకాదు
21. నీటిలోపలి ధ్వని తరంగాలను కొలిచే సాధనం?
1) హైడ్రోఫోన్ 2) జైరోస్కోప్
3) ఎపిటియూస్కోప్ 4) ఫొటో మీటర్
22. మిశ్రమగ్రంథి కింది వాటిలో ఏది?
1) పీయూష గ్రంథి 2) అడ్రినల్ గ్రంథి
3) పాంక్రియాస్ 4) ఓవరీ
23. కంటిలో ఏ కణాల రంగులు వ్యత్యాసాన్ని గుర్తించగలవు?
1) రాడ్స్ 2) కోన్స్
3) కార్నియా 4) ఏదీకాదు
24. శిశువు లింగ నిర్ధారణ ఎప్పుడు తెలుసుకోవచ్చు?
1) స్పెర్మ్ ప్రవేశ సమయం
2) ఓవమ్ ఫలదీకరణ
3) గర్భధారణ జరిగిన ఆరు నుంచి ఏడు వారాల సమయం
4) మూడవ నెల గర్భధారణ సమయం
25. మనిషి కిడ్నీలో ఏర్పడే రాళ్లలో అధికంగా ఉండేది?
1) కాల్షియం ఆక్సలేట్
2) సోడియం ఎసిటేట్
3) మెగ్నీషియం సల్ఫేట్ 4) కాల్షియం
26. మానవ శరీరంలోని ఏ అంగంలో లింఫోసైట్ కణాలు ఏర్పడుతాయి?
1) కాలేయం 2) పొడవైన ఎముక
3) క్లోమం 4) ప్లీహం
27. శిలలు, ఖనిజాల్లో ఎక్కువ భాగం ఉండే మూలకం?
1) ఇనుము
2) కార్బన్
3) సిలికాన్
4) సోడియం
28. విద్యుత్ ఫ్యూజ్ తీగలో వాడే పదార్థంలో ఉండవలసిన గుణం?
1) అధిక నిరోధకత
2) అల్ప నిరోధకత
3) అల్ప ద్రవీభవన స్థానం
4) అధిక ద్రవీభవన స్థానం
29. దగ్గరి వస్తువును చూడలేపోవటాన్ని వేటి ద్వారా సరిచేయవచ్చు?
1) పుటాకార కటకం ద్వారా
2) కుంభాకార కటకం ద్వారా
3) పుటాకార-కుంభాకార కటకం ద్వారా
4) కుంభాకార-పుటాకార కటకం ద్వారా
30. లేజర్ ఆధార శాస్త్రీయ సూత్రాలను మొదట వెల్లడించింది?
1) చార్లెస్ డార్విన్
2) చార్లెస్ టావెన్స్
3) చార్లెస్ బాబేజ్
4) క్రిస్టియన్ హైజిన్స్
31. డాప్లర్ ఎఫెక్ట్‌కు దేనితో సంబంధం?
1) ధ్వని 2) కాంతి
3) అయస్కాంత శక్తి
4) ఎలక్ట్రోమేగ్నటిక్ ఇండక్షన్
32. ఆవర్తన పట్టిక స్థాపకుడైన డీఐ మెండలీప్ ఏ ఏ దేశానికి చెందిన వారు?
1) రష్యన్ రసాయన శాస్త్రవేత్త
2) బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త
3) అమెరికన్ జీవశాస్త్రవేత్త
4) జర్మన్ పర్యావరణ శాస్త్రవేత్త
33. మానవ శరీరంలోని ఏ భాగాన్ని క్షయ వ్యాధి హాని కలిగిస్తుంది?
1) ఊపిరితిత్తులు 2) మూత్రపిండాలు
3) కళ్లు 4) చెవులు
34. పొట్టలోని లోపల భాగాన్ని పరీక్షించడానికి డాక్టర్లు ఎండోస్కోప్‌ను వాడుతారు. ఇది ఏ సూత్రం మీద పనిచేస్తుంది?
1) కాంతి పరివర్తన
2) కాంతి విస్తరణ
3) కాంతి వక్రీభవనం
4) పూర్తిగా అంతర్గత కాంతి పరివర్తన
35. క్రోనో మీటర్‌ను కనుగొన్నది?
1) జాన్ హరిసన్ 2) పాకాల్డ్
3) మాలెట్ 4) పాల్సన్
సమాధానాలు
1-4, 2-2, 3-1, 4-1, 5-4, 6-1, 7-3, 8-1, 9-1, 10-4, 11-2, 12-3, 13-2, 14-2, 15-3, 16-3, 17-4, 18-1, 19-1, 20-3, 21-1, 22-3, 23-2, 24-3, 25-1, 26-4 , 27-3, 28-3, 29-2, 30-4, 31-1, 32-1, 33-1, 34-4, 35-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు