బీఈఎల్‌లో ట్రైనీ ఇంజినీర్, ఆఫీసర్లు


హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనుంది. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను వచ్చేనెల 19వతేదీలో పంపించాలని కోరింది.
మొత్తం పోస్టులు: 23
ఇందులో ట్రైనీ ఇంజినీర్ 20, ప్రాజెక్ట్ ఆఫీసర్ 1, ట్రైనీ ఆఫీసర్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్‌లో బీఈ, బీటెక్, బీఎస్సీ (ఇంజినీరింగ్) కోర్సుల్లో ఏదో ఒకటి చేసి ఉండాలి. ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏలో ఏదో ఒకటి చేసి ఉండాలి. ట్రైనీ ఆఫీసర్‌కు ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీడీఎంలో ఏదో ఒకటి ఉత్తీర్ణులవ్వాలి.
దరఖాస్తు విధానం: నిర్ణీత నమూనాలో ఉన్న అప్లికేషన్‌ను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్: Sr. Dy. Gen. Manager (CS, FTD, HR&A) Bharat Electronics Limited, Plot No. L-1, MIDC Industrial Area, Taloja, Navi Mumbai: 410208, Maharashtra.
దరఖాస్తులకు చివరితేదీ: మే 19
వెబ్సైట్: https://www.bel-india.in/
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు