బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో 459 పోస్టులు
హైదరాబాద్: అంతర్జాతీయ సరిహద్దుల్లో హైవేలను నిర్మించే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందులో డ్రాట్స్‌మ్యాన్, స్టోర్ సూపర్వైజర్, రేడియో మెకానిక్, ల్యాబ్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు పురుష అభ్యర్థులకు మాత్రమేనని స్పష్టం చేసింది. మహిళలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదని తెలిపింది. ట్రేడ్‌టెస్ట్, రాతపరీక్ష అభ్యర్థులను ఎంపికచేయనుంది.
మొత్తం పోస్టులు: 459
ఇందులో డ్రాట్స్‌మ్యాన్ 43, సూపర్వైజర్ స్టోర్ 11, రేడియో మెకానిక్ 4, ల్యాబ్ అసిస్టెంట్ 1, మల్టీ స్కిల్డ్ వర్కర్ 250, స్టోర్ కీపర్ టెక్నికల్ 150 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: డ్రాట్స్‌మ్యాన్ పోస్టుకు సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులవ్వాలి. స్టోర్ సూపర్వైజర్ పోస్టులకు డిగ్రీ పూర్తిచేయాలి. ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు ఇంటర్ పాసై ల్యాబ్ అసిస్టెంట్ సర్టిఫికెట్ ఉండాలి. రేడియో మెకానిక్, మల్టీస్కిల్డ్ వర్కర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో సర్టిఫికెట్ ఉండాలి. మల్టీస్కిల్డ్ వర్కర్ పోస్టుకు అభ్యర్థులు 18 నుంచి 25 ఏండ్లు, ఇతర పోస్టులకు 18 నుంచి 27 ఏండ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిసియెన్సీ టెస్ట్, ప్రాక్టికల్ (ట్రేడ్) టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో.. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్: Commandant, GREF CENTRE, Dighi Camp, Pune – 411
అప్లికేషన్ ఫీజు: రూ.50, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 10
వెబ్సైట్: bro.gov.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
భార్యను అదుపులో పెట్టడం ఎలా?
ఎన్హెచ్ఏఐలో డిప్యూటీ మేనేజర్ పోస్టులు
ఐఐటీ బాంబేలో పీహెచ్‌పీ, MySQL ఫ్రీ ఆన్లైన్ కోర్సు
కరోనాతో ప్రముఖ చిత్రకారుడు చంద్ర కన్నుమూత
దేశంలో 30 లక్షలు దాటిన యాక్టివ్ కేసుల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు