ట్రకోమా అనేది ఏ భాగానికి సోకుతుంది?
1. Corneal Xerosis అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల
కలుగుతుంది?
1) విటమిన్-ఏ 2) విటమిన్-సీ
3) విటమిన్-డీ 4) విటమిన్-కే
2. కిడ్నీ హార్మోన్ అని ఏ విటమిన్‌ను పిలుస్తారు?
1) విటమిన్-డీ 2) విటమిన్-సీ
3) విటమిన్-కే 4) విటమిన్-ఏ
3. కాల్షియం, పాస్ఫరస్ల శోషణలో కీలకంగా ఉపయోగపడే
విటమిన్?
1) విటమిన్-కే 2) విటమిన్-బీ12
3) విటమిన్-ఏ 4) విటమిన్-డీ
4. విటమిన్-కే2 ఎక్కడ లభిస్తుంది?
1) ఆకుపచ్చ కూరగాయలు
2) పసుపు రంగు ఫలాలు
3) చిన్నపేగులోనే తయారవుతుంది
4) మొలకెత్తిన గింజలు
5. వెర్నిక్ ఎన్సెఫలోపతి అనే వ్యాధి ఏ విటమిన్ లోపంవల్ల వస్తుంది?
1) విటమిన్-బి1 2) విటమిన్-బి6
3) విటమిన్-బి12 4) విటమిన్-డి
6. కింది వాటిని జతపర్చండి.
ఎ. థయమిన్ 1. బి1
బి. రిబోఫ్లావిన్ 2. బి2
సి. నియాసిన్ 3. బి3
డి. పైరిడాక్సిన్ 4. బి6
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-3, బి-4, సి-1, డి-2
7. కింది ఏ ఫలంలో అధికంగా విటమిన్-సీ లభిస్తుంది?
1) ఉసిరి 2) జామ 3) నిమ్మ 4) నారింజ
8. ఫ్లోరోసిస్ వ్యాధిబారిన పడే ప్రాంతాల్లో నివసించే వారికి అత్యంత అవశ్యకమైన సూక్ష్మపోషకం?
1) కాల్షియం 2) ఐరన్
3) పొటాషియం 4) మాలబ్దినం
9. కిందివాటిలో ఏ సూక్ష్మపోషకాన్ని రెండువైపులా పదునున్న కత్తిగా వ్యవహరిస్తారు?
1) క్లోరిన్ 2) ఫ్లోరిన్ 3) కాల్షియం 4) పొటాషియం
10. నల్లగొండ టెక్నిక్ దేనికి సంబంధించినది?
1) నీటిశుద్ధి 2) ఆహార సంరక్షణ
3) సంప్రదాయ పోషణ విధానం 4) పైవన్నీ
11. జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమం పేరును ఏ
సంవత్సరంలో జాతీయ మలేరియా వ్యతిరేక కార్యక్రమంగా మార్చారు?
1) 1998 2) 1999 3) 2000 4) 2001
12. జాతీయ ఫైలేరియా నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు
ప్రారంభించారు?
1) 1953 2) 1954 3) 1955 4) 1956
13. రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్‌ను
పైలట్ పథకంగా ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1992 2) 1993 3) 1994 4) 1995
14. DOTS కార్యక్రమం ఏ వ్యాధికి సంబంధించినది?
1) టీబీ 2) లెప్రసీ
3) ఎయిడ్స్ 4) పోషకాహార లోపాలు
15. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు
ప్రారంభించారు?
1) 1985 2) 1986 3) 1984 4) 1987
16. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ ైబ్లెండ్నెస్ను ఏ
సంవత్సరంలో ప్రారంభించారు?
1) 1973 2) 1974 3) 1975 4) 1976
17. గాయిటర్ నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 1962 2) 1972 3) 1982 4) 1952
18. ఆల్మా-ఆటా డిక్లరేషన్ దేనికి సంబంధించినది?
1) టీకాలు 2) ప్రాథమిక ఆరోగ్యం
3) మానసిక ఆరోగ్యం 4) మాతృత్వ సంరక్షణ
19. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్‌ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 2005, ఏప్రిల్ 5 2) 2005, ఏప్రిల్ 12
3) 2006, ఏప్రిల్ 5 4) 2006, ఏప్రిల్ 12
20. కింది వాటిని సరిగ్గా జతపర్చండి.
ఎ. ASHA 1. NRHM
బి. USHA 2. NUHM
సి. AWW 3. ICDS
డి. ANM 4. Primary Health
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-2, బి-1, సి-4, డి-2
21. జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని ఎప్పుడు
ప్రారంభించారు?
1) 1982 2) 1983 3) 1984 4) 1985
22. ఎపిడమాలజీ అంటే?
1) వ్యాధి వ్యాప్తి అధ్యయనశాస్త్రం
2) వ్యాధి లక్షణాల అధ్యయనం
3) వ్యాధి కారకాల అధ్యయనం
4) వ్యాధి తీవ్రత అధ్యయనం
23. ఒక ప్రాంతంలో తరచూ జనించే వ్యాధులను ఏమని
పిలుస్తారు?
1) ఎపిడెమిక్ 2) ఎండెమిక్
3) పాండెమిక్ 4) పైవన్నీ
24. కింది వాటిలో ఏ రకమైన వ్యాధులు తీవ్ర నష్టం కలిగిస్తాయి?
1) ఎండెమిక్ 2) ఎపిడెమిక్
3) పాండెమిక్ 4) స్పోరాడిక్
25. కంఠసర్పి వ్యాధిని కలిగించేది ఏది?
1) కొరనే బ్యాక్టీరియమ్ 2) పెర్టూసిస్
3) క్లాస్ట్రీడియం 4) కోరకస్
26. ఎంటిరో వైరస్ వల్ల వ్యాప్తి చెందే వ్యాధి?
1) పోలియో 2) క్షయ
3) ధనుర్వాతం 4) పక్షవాతం
27. రూబెల్లా వైరస్ వల్ల కలిగే వ్యాధి?
1) తట్టు 2) పొంగు 3) మెదడువాపు 4) కంఠసర్పి
28. చెడు గాలి అనే పేరుగల వ్యాధి?
1) టైఫాయిడ్ 2) మలేరియా 3) డెంగీ 4) బర్డ్‌ఫ్లూ
29. సార్స్ వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సోకుతుంది?
1) చర్మం 2) శ్వాస అవయవాలు
3) మూత్రపిండాలు 4) మెదడు
30. ట్రకోమా అనేది ఏ భాగానికి సోకుతుంది?
1) కండ్లు 2) చర్మం 3) కాలేయం 4) మెదడు
31. సార్స్ వ్యాధిని కలిగించేది?
1) బ్యాక్టీరియా 2) కరోనా వైరస్
3) శిలీంధ్రం 4) ప్రోటోజోవా పరాన్నజీవి
32. మలేరియా వ్యాధి ఏ జీవుల వల్ల కలుగుతుంది?
1) బ్యాక్టీరియా 2) ఫంగస్
3) ప్రొటోజోవన్లు 4) పైవన్నీ
33. స్టాప్ టీబీ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 2006 2) 2005 3) 2004 4) 2003
34. ICMR సూచనల ప్రకారం 13 నుంచి 15 ఏండ్ల మధ్యనున్న బాలుడు ఒక రోజుకు ఎన్ని కిలో కేలరీల శక్తిని ఇచ్చే ఆహారం తీసుకోవాలి?
1) 2750 2) 3000 3) 2900 4) 3200
35. ICMR సూచనల ప్రకారం 16 నుంచి 17 ఏండ్ల మధ్యనున్న బాలికలు ప్రతిరోజు తీసుకోవాల్సిన ప్రొటీన్?
1) 55.5 గ్రాములు 2) 65.5 గ్రాములు
3) 62.5 గ్రాములు 4) 72.5 గ్రాములు
36. 0-6 నెలల శిశువుతోనున్న పాలిచ్చే తల్లులకు ప్రతిరోజు కనీసం కావాల్సిన ప్రొటీన్ ఎంత?
1) 77.9 గ్రా. 2) 80.2 గ్రా.
3) 92 గ్రా. 4) 91 గ్రా.
37. 0-6 నెలల శిశువుతోనున్న పాలిచ్చే తల్లులకు ప్రతిరోజు
కావల్సిన కాల్షియం ఎంత?
1) 1000 మి.గ్రా. 2) 1200 మి.గ్రా.
3) 900 మి.గ్రా. 4) 1100 మి.గ్రా.
38. లివర్ సిర్రోసిస్‌తో బాధపడే వ్యక్తికి ప్రతిరోజుకు ఎంత శక్తినిచ్చే ఆహారం అవసరం?
1) 3000-3200 k.cal 2) 2000-2500 k.cal 3) 2200-2400 k.cal 4) 1000-1200 k.cal
39. ICMR ప్రకారం అధిక శ్రమ చేసే మహిళకు కావాల్సిన
థయమిన్ ఎంత?
1) 1.4 మి.గ్రా. 2) 1.1 మి.గ్రా.
3) 2.1 మి.గ్రా. 4) 1.8 మి.గ్రా.
40. పాలిచ్చే తల్లులకు ప్రతిరోజు కావల్సిన జింక్ ఎంత?
1) 10 మి.గ్రా. 2) 11 మి.గ్రా.
3) 12 మి.గ్రా. 4) 14 మి.గ్రా.
41. ICMR లెక్కల ప్రకారం పురుషుడు రోజూ తీసుకోవాల్సిన ప్రొటీన్ ఎంత?
1) 50 గ్రాములు 2) 40 గ్రాములు
3) 60 గ్రాములు 4) 70 గ్రాములు
42. ICMR ప్రకారం సాధారణ మహిళకు ప్రతిరోజు కావాల్సిన జింక్ పరిమాణం ఎంత?
1) 10 మి.గ్రా. 2) 12 మి.గ్రా.
3) 13 మి.గ్రా. 4) 14 మి.గ్రా.
43. కిందివాటిలో విటమిన్-డీ అధికంగా లభించే పదార్థం?
1) షార్క్ లివర్ నూనె 2) కాడ్ లివర్ నూనె
3) గుడ్డు 4) వెన్న
44. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. స్థూల పోషకాలు – కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్,
నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం,
మెగ్నీషియం, సల్ఫర్
బి. సూక్ష్మ పోషకాలు – ఇనుము, మాంగనీసు, బోరాన్,
కాపర్, మాలిబ్డినం, క్లోరిన్
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు