Natural resources-geography | ప్రకృతి సోయగాలు-భౌగోళిక విశేషాలు
ఆధునిక ప్రపంచానికి నాగరికత నేర్పిన నేల, భూమధ్యరేఖను రెండుసార్లు దాటుతున్న, ప్రపంచంలోనే అతిపెద్ద, పొడవైన నదులు, పిరమిడ్లు, జలపాతాలు, ఆదిమ తెగలు, ప్రకృతి అందాలకు, బంగారు గనులకు నెలవు ఆఫ్రికా… ద్వీపాల సముదాయం, తమకే ప్రత్యేకమైన జంతువులు, గడ్డిభూములకు ప్రసిద్ధి ఆస్ట్రేలియా… 98 శాతం మంచుపొరతో కప్పబడి, మానవ సంచారమే లేకుండా ఉన్న శుష్కప్రాంతం అంటార్కిటికా… ఈ మూడు ఖండాల విశేషాల సమాహారం నిపుణ పాఠకుల కోసం..
ప్రధాన దేశాలు:
-నైజీరియా, దక్షిణాఫ్రికా, ఈజిప్టు, అల్జీరియా, అంగోలా, మొరాకో, టాంజానియా, ఇథియోపియా
ఆఫ్రికా
-విస్తీర్ణం, జనాభాపరంగా ఆఫ్రికా రెండో పెద్ద ఖండం. ఇది 3,03,31,000 చ.కి.మీ. విస్తరించి ఉంది. ప్రపంచ భూ విస్తీర్ణంలో 20 శాతం.
-ఇది ఉత్తర, దక్షిణాలుగా 8 వేల కి.మీ., తూర్పు పడమరలుగా 740 కి.మీ. ఉంది. వైశాల్యం 30.2 మి.చ.కి.మీ., తీరరేఖ పొడవు 30 వేల కి.మీ.
-ఇది నాలుగు అర్ధగోళాల్లో విస్తరించి ఉంది. దీనిగుండా భూమధ్యరేఖ, కర్కటరేఖ, మకరరేఖలు వెళ్తున్నాయి.
-ఈ ఖండం సూయజ్ భూసంధి ద్వారా ఆసియాతో కలుస్తుండగా, జిబ్రాల్టర్, సూయజ్ కాలువ, బాబ్ ఎల్ మాండెబ్ జలసంధి ద్వారా యురేషియా (ఆసియా, ఐరోపా) నుంచి వేరుచేయబడుతుంది.
మొత్తం దేశాలు- 54
-అతిపెద్ద దేశం- అల్జీరియా (23,81,741 చ.కి.మీ.)
-చిన్న దేశం- సీషెల్స్ (459 చ.కి.మీ.)
-అతిపెద్ద పట్టణం- లాగోస్ (నైజీరియా)
శీతోష్ణస్థితి
-ఈ ఖండం ఉత్తర, దక్షిణార్ధ గోళాల్లో విస్తరించి ఉంది. దీంతో వైవిధ్యమైన శీతోష్ణస్థితి పరిస్థితులు ఉంటాయి. ప్రధానంగా ఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత- 580C (లిబియాలోని అజీజియాలో)
-సరాసరి ఉష్ణోగ్రత- 200C
-అత్యధిక వర్షపాతం- కామెరూన్ శిఖరం (ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానం)
-అత్యల్ప వర్షపాతం- కలహారి ఎడారి ప్రాంతం (ఉత్తర ఆఫ్రికా మొత్తం)
నదులు
-నైలు నది, కాంగో నది, ఆరెంజ్ నది, జాంబేజీ/బిసి నది, నైగర్, లింపోపో నదులు ప్రవహిస్తున్నాయి.
-పొడవైన నది- నైలు (6,853 కి.మీ., ప్రపంచంలో కూడా)
-అతిపెద్ద, రెండో అతిపొడవైన నది- కాంగో లేదా జైర్ (4,700 కి.మీ.)
-ఎత్తయిన జలపాతం- విక్టోరియా (ఎత్తు- 108 మీ., వెడల్పు- 1.7 కి.మీ.)
-కాంగో నది భూమధ్యరేఖను రెండుసార్లు ఖండిస్తుంది.
-విక్టోరియా జలపాతం జాంబేజీ నదిపై ఉంది.
సరస్సులు
-విక్టోరియా సరస్సు: ఆఫ్రికాలో అతిపెద్ద మంచినీటి సరస్సు, ప్రపంచంలో రెండోది. ఇది మొత్తం 26,828 చ.మైళ్లు విస్తరించి ఉంది.
-టాంజానికా సరస్సు: ఇది ప్రపంచంలో రెండో అతిలోతైన సరస్సు. 1,470 మీటర్ల లోతున్న ఈ సరస్సు టాంజానియా, కాంగో, బురుండీ, జాంబియా దేశాల్లో మొత్తం 12,700 చ.మైళ్లు విస్తరించి ఉంది.
-న్యాసా, చాద్, ఆల్బర్ట్ వంటి సరస్సులు ఉన్నాయి.
-ఉప్పునీటి సరస్సులు- చాద్, గామి
పర్వతాలు
-అట్లాస్ పర్వతాలు, డ్రాకెన్స్బర్గ్.
-ఎత్తయినవి- కిలిమంజారో (5895 మీ.- టాంజానియా), కెన్యా శిఖరం (5119 మీ.), రువెంజరో శిఖరం (5119 మీ.)
-లోతైనవి- అస్సల్ సరస్సు (-156 మీ. – జిబౌటి)
-అతిపెద్ద పగులు లోయ- తూర్పు ఆఫ్రికా పగులు లోయ (500 కి.మీ.)
అగ్నిపర్వతాలు
-కామెరూన్ అగ్నిపర్వతాలు: ఇవి ఆఫ్రికాలో అత్యంత క్రియాశీలంగా ఉన్నాయి. 4095 మీ. ఎత్తున్న ఈ అగ్నిపర్వతాలు 2012లో బద్దలయ్యాయి.
-న్యామురగిర, నార్బో, ఎర్టా అలే వంటి అగ్నిపర్వతాలు ఉన్నాయి.
ఖనిజాలు
-బంగారం, ప్లాటినం, వజ్రాలు, యురేనియం, మాంగనీసు, సీసం, రాగి ప్రధాన ఖనిజాలు
-బంగారం- జొహాన్నెస్‌బర్గ్, ఘనా, విట్వాటర్స్లాండ్, మాలి
-వజ్రాలు- కింబర్లీ, అంగోలా, టాంజానియా
-ప్లాటినం- దక్షిణాఫ్రికా, జైర్
-ఇనుప ఖనిజం- ఐవరీకోస్ట్, లైబీరియా,
నైజీరియా
వ్యవసాయం-పంటలు
-పత్తి- ఈజిప్టు (మేలురకపు పత్తికి ప్రసిద్ధి), సూడాన్, నైజీరియా
-సిసిల్ నార- టాంజానియా
-గోధుమ- దక్షిణాఫ్రికా, ఈజిప్టు, బోట్సువానా
-వరి- ఈజిప్టు, కలహారి ఎడారిలోని ఒయాసిస్లలో
-ఖర్జూరం- కామెరూన్, నైజీరియా
-కాఫీ- ఇథియోపియా, కెన్యా, జైర్
-కోకో- నైజీరియా, ఐవరీకోస్ట్
-ప్రపంచంలో లవంగాలు పండే ప్రాంతాల్లో జింజిబార్ ముఖ్యమైనది. దీన్ని లవంగాల దీవి అని పిలుస్తారు.
అడవులు
-కాంగో అడవి: ఇది ప్రపంచంలోనే రెండో ఉష్ణమండల అటవీ ప్రాంతం. ఇది కాంగో నదీతీరంలోని దేశాల్లో మొత్తం 6,95,000 చ.కి.మీ. విస్తరించి ఉంది.
-మవూ ఫారెస్ట్: కెన్యాలోని రిఫ్ట్ వ్యాలీలో ఉంది. ఇది మొత్తం 6,75,000 ఎకరాల్లో విస్తరించి ఉంది.
-న్యూలాండ్స్ ఫారెస్ట్: టేబుల్ పర్వతాల్లో మొత్తం 400 హెక్టార్లలో విస్తరించి ఉంది.
ప్రధాన జంతువులు
-ఆఫ్రికన్ ఓక్, గొరిల్లా, చింపాంజీ, పిగ్మీ హిప్పోపొటమస్, ఏనుగులు, సింహాలు, జింకలు, అడవి దున్నలు ప్రధానమైనవి.
జనాభా
-మొత్తం జనాభా 122,50,80,510. ఇది ప్రపంచ జనాభాలో 16 శాతం (2016 లెక్కల ప్రకారం).
-అత్యధిక జనాభా ఉన్న దేశం- నైజీరియా (16,66,29,000 మంది)
-తక్కువ జనాభా ఉన్న దేశం- సీషెల్స్ (92,000 మంది)
-ఆటవిక జాతులు: పిగ్మీలు (కాంగో నది), బుష్మెన్లు, హట్టెన్టాట్లు (కలహారి ఎడారి), మసాయ్ (తూర్పు ఆఫ్రికాలో), హమైట్లు (ఆఫ్రికా పశ్చిమ ప్రాంతం)
-సహారా ఎడారిలో నివసించే శ్వేతవర్ణం వారు- సెమైట్లు
-సహారా ఎడారిలోని దేశదిమ్మరి తెగ- బిడౌన్లు
-సహారా ఉత్తర భాగంలో- సెమైట్లు
-మధ్య, దక్షిణ ఆఫ్రికాలోని నీగ్రో జాతి- బంటూలు
ప్రాచీన నాగరికత
-క్రీ.పూ. 3200 ఏండ్ల క్రితం నైలు నది పరీవాహక ప్రాంతంలో ఈజిప్షియన్ నాగరికత వర్థిల్లింది. వీరు పిరమిడ్లు, గుడుల వంటి గొప్ప కట్టడాలను సృష్టించారు. మ్యాథమెటిక్స్, వ్యవసాయసాగులో కొత్త విధానాలను అవలంబించారు.
పర్యాటక ప్రాంతాలు
-దక్షిణాఫ్రికా- క్రూగర్ నేషనల్ పార్క్, టేబుల్ పర్వతం, కేప్ వైన్లాండ్స్
-సీషెల్స్- అన్సీ ఇంటెండెన్స్, మోర్నీ సీషెల్స్ నేషనల్ పార్క్, మెరైన్ నేషనల్ పార్క్
-మారిషస్- బ్లాక్రివర్ గోర్జెస్ నేషనల్ పార్క్, గాబ్రియెల్ ఐలాండ్
-మొరాకో- ఎస్సౌరియా, చెచౌయెన్, సహారా డూన్స్
-ఈజిప్ట్- గిజా పిరమిడ్, వ్యాలీ ఆఫ్ ద కింగ్స్, ఫీనిక్స్
-నమీబియా- సొసుస్లెయ్ (Sossusvlei) డూన్స్, ఫిష్ రివర్ కాన్యోన్
-జాంబియా, జింబాబ్వే- విక్టోరియా జలపాతం
చారిత్రక ప్రాంతాలు
-ఈజిప్ట్- కర్నాక్ టెంపుల్ కాంప్లెక్స్, థేబ్స్, అబూ సింబెల్
-లిబియా- లెప్టిస్ మాగ్నా
-సూడాన్- మెరోయ్ (నైలునది పరిసరాల్లో)
-కెన్యా- ఫోర్ట్ జీసస్
-బోట్స్వానా- మమునో మాన్యుమెంట్
-మొరాకో- టెలొవెట్ కాస్బా
-టాంజానియా- ఇసిమిలా స్టోన్ ఏజ్ సైట్
ప్రముఖ యూనివర్సిటీలు
-యూనివర్సిటీ ఆఫ్ కేప్‌టౌన్- దక్షిణాఫ్రికా,
-యూనివర్సిటీ ఆఫ్ ద విట్‌వాటర్స్‌ర్యాండ్ – జొహాన్నెస్‌బర్గ్, దక్షిణాఫ్రికా
-స్టెలెన్బాస్చ్ యూనివర్సిటీ- స్టెలెన్బాస్చ్, దక్షిణాఫ్రికా
-మకెరెరె యూనివర్సిటీ- కంపాలా, ఉగాండా
-అమెరికన్ యూనివర్సిటీ ఇన్ కైరో- ఈజిప్టు
-కైరో యూనివర్సిటీ- ఈజిప్టు
ఎడారులు
-సహారా, కలహారి, నమీబియా, అరేబియా ఎడారి
-అతిపెద్ద ఉష్ణమండల ఎడారి- సహారా (90,65,000 చ.కి.మీ.).
-కలహారి ఎడారి (2,59,000 చ.కి.మీ.) నమీబియా, బోట్సువానా, అంగోలా, దక్షిణాఫ్రికా దేశాల్లో విస్తరించి ఉంది.
-ఎడారుల్లో ప్రవహించే నదులను ఎక్సోటిక్ లేదా జీవనదులు అంటారు.
-సహారా ఎడారి మీదుగా నైలు నది, కలహారి ఎడారి మీదుగా ఆరెంజ్ నది ప్రవహిస్తున్నాయి.
అంటార్కిటికా
-ఇది ప్రపంచంలో ఐదో పెద్ద ఖండం. మొత్తం 1,40,00,000 చ.కి.మీ. విస్తరించి ఉంది.
-ఈ ఖండం సముద్ర మట్టం నుంచి 2,250 మీ. ఎత్తులో ఉంది.
-మానవ సంచారం, వృక్షాలు లేని ఈ ఖండంలో మంచినీరు అధిక పరిమాణంలో లభిస్తుంది.
-ఇక్కడి సుమారు 98 శాతం ప్రాంతాన్ని ప్రపంచంలోకెల్లా అత్యంత దళసరి, అతిపెద్ద మంచుపొర కప్పి ఉంటుంది.
-ఇది ప్రపంచంలోకెల్లా అత్యంత శుష్క ప్రాంతం.
పర్వతాలు
-అతి ఎత్తయిన శిఖరం- విల్సన్ మాసిఫ్ (5,140 మీ.)
-లోతైన ప్రాంతం- బెన్ట్లీ ట్రెంచ్
-పొడవైన పర్వత శ్రేణి- క్వీన్మౌడ్ రేంజ్
-క్రియాశీల అగ్నిపర్వతం- మౌంట్ ఎరిబస్
-అతిపెద్ద హిమానీనదం- లాంబార్డ్ (సుమారు 3000 మీ. మందం)
-ఈ ఖండాన్ని ట్రాన్స్ అంటార్కిటికా పర్వతాలు రెండుగా విభజిస్తున్నాయి. ఇవి 3050 కి.మీ. పొడవు ఉన్నాయి.
శీతోష్ణస్థితి
-ప్రపంచంలోకెల్లా అత్యల్ప ఉష్ణోగ్రత, వర్షపాతం నమోదవుతుంది.
-అతి తక్కువ ఉష్ణోగ్రత- -88.30C (జవోస్టోక్)
-అత్యధిక ఉష్ణోగ్రత- 350C (ఖండాతర్గత ప్రాంతాల్లో)
జంతువులు
-సీల్ చేపలు, క్రిల్ (రొయ్య), పెంగ్విన్ పక్షులు, తిమింగళాలు ప్రధానమైనవి.
ఖనిజాలు
-పూర్తిగా మంచుతో కప్పబడిన ఈ ఖండంలో నేలబొగ్గు, రాక్ పాస్ఫేట్, క్రోమియం, యాంటిమోనీ, రాగి, సీసం, బంగారం లభిస్తాయి.
ఆస్ట్రేలియా
-ప్రపంచంలో అతి చిన్న ఖండమైన ఆస్ట్రేలియా 86,00,000 చ.కి.మీ. విస్తరించి ఉంది. ఇది ద్వీపాల సముదాయం.
-దేశాల సంఖ్య- 3 (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా న్యూగినియా)
-పెద్ద దేశం- ఆస్ట్రేలియా
-పెద్ద పట్టణం- సిడ్నీ
-అతిపెద్ద ద్వీపం- ఆస్ట్రేలియా (7.6 మి. చ.కి.మీ.)
జనాభా
-ఈ ఖండంలో మొత్తం 3,63,04,997 మంది ఉన్నారు.
-అత్యధిక జనాభా- ఆస్ట్రేలియా (2,42,55,949 మంది). అధిక జనాభా కలిగిన నగరం- సిడ్నీ (5,029,768)
పర్వతాలు
-గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలు, మెక్‌డోనెల్ రేంజ్ పర్వతాలు
-ఎత్తయినవి- కోషియాస్కో శిఖరం (2,229 మీ.)
-లోతైనవి- ఐర్ (15 మీ.)
-ప్రపంచంలో అతిపెద్ద పగడపు దిబ్బ- గ్రేట్ బారియర్ రీఫ్ (1,32,974 చ.మైళ్లు)
ఎడారులు
-విక్టోరియా, గిబ్సన్, సిమ్సన్
-మధ్యమైదాన ప్రాంతంలో తక్కువ వర్షపాతం నమోదవుతుంది.
ఖనిజాలు
-బంగారు గనులు- కూల్గార్లి, కాల్గూర్డి, దక్షిణ క్రాస్
-లెడ్, జింక్ గనులు- మౌంట్ ఈసా, బ్రోకెన్ హిల్స్
-ప్రపంచంలో సీసం అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న, యురేనియం నిక్షేపాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి.
ప్రముఖ వర్సిటీలు
-యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్- మెల్బోర్న్
-ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ- కాన్బెర్రా
-యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ- సిడ్నీ
-యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్- సిడ్నీ
పర్యాటక ప్రాంతాలు
-సిడ్నీ ఒపెరా హౌస్, గ్రేట్ బారియర్ రీఫ్, ఉలు రూ లేదా అయ్యర్స్ రాక్ (ఉలురూ-కటజుట నేషనల్ పార్క్), సిడ్నీ, విట్సండే దీవులు, గ్రేట్ ఓషన్ రోడ్ (విక్టోరియా), కేబుల్ బీచ్ (బ్రూమ్).
నదులు
-పొడవైన నది- ముర్రే (2500 కి.మీ.)
-సరస్సులు- ఐర్, టోరస్
-ఆస్ట్రేలియా, న్యూగినియాను వేరుచేస్తున్నది- టోరస్ జలసంధి
-ఆస్ట్రేలియా, టాస్మేనియాను వేరుచేస్తున్నది- బాస్ జలసంధి
వ్యవసాయం
-గోధుమ, బార్లీ, మక్కజొన్న, అనాస, ఆపిల్, వరి ముఖ్యమైన పంటలు.
-గోధుమ- ముర్రే, డార్లింగ్ నదీ హరివాణ ప్రాంతం
-అనాస పండ్లు- క్వీన్స్లాండ్
-నారింజ పండ్లు- ఉత్తర న్యూసౌత్‌వేల్స్, దక్షిణ క్వీన్స్లాండ్
-ఆపిల్స్- టాస్మేనియా
-గోధుమను ఎగుమతి చేసే దేశాల్లో ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉంది.
-న్యూజిలాండ్‌లో వ్యవసాయ క్షేత్రాలు- కాంటర్బరి
-ప్రపంచంలో అతిపెద్ద గడ్డి భూములు- అన్నా క్రీక్ స్టేషన్ (8,000 చ.కి.మీ.)
అడవులు
-ఆస్ట్రేలియా తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో సతతహరిత అరణ్యాలు ఉన్నాయి.
-ఉష్ణమండలపు తృణభూములు- సవన్నాలు (ఉత్తర ఆస్ట్రేలియా)
-ఉప ఉష్ణమండలపు తృణభూములు- డౌనులు (ముర్రే-డార్లింగ్ హరివాణం)
-యూకలిప్టస్, జర్రా, కర్రి, వాటిల్ వంటి వృక్షాలు ఉంటాయి.
-ప్రధాన జంతువులు: కంగారు, ప్లాటిపస్, ఒంటె, లైర్‌బర్డ్, ఈమూ, కివీ పక్షి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?