పీజీ కోర్సులకు గేట్వే సీపీ గెట్
ఆఫర్ చేస్తున్న కోర్సులు
ఎంఏ (ఇంగ్లిష్, అరబిక్, హిందీ, కన్నడ, సంస్కృతం, తెలుగు, ఉర్దూ, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, థియేటర్ ఆర్ట్), ఎంఏ (ఎకనామిక్స్, హిస్టరీ, జర్నలిజం, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, పొలిటికల్ సైన్స్) ఎంఎల్ఐఎస్సీ, ఎంఎస్డబ్ల్యూ, ఎంకాం, ఎంఈడీ, ఎమ్మెస్సీ (బోటనీ, కెమిస్ట్రీ, ఎలక్టానిక్స్, జియాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్), పీజీడీ ఇన్ సెరికల్చర్, ఎమ్మెస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యూట్రిషన్ అండ్ డైటిక్స్ తదితరాలు.
ఎవరు అర్హులు ?
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు లేదా డిగ్రీ ఫైనల్ పరీక్షలు రాస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ కోర్సులకు ఇంటర్ ఉత్తీర్ణులు లేదా సెకండియర్ పరీక్షలు రాస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ఎలా ?
ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు. సబ్జెక్టులను బట్టి సిలబస్ మారుతుంది.
పరీక్ష విధానంలో ఎటువంటి మార్పులు లేవు. ఉమ్మడి పది జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూలై 4
ఆలస్య రుసుం రూ.500తో జూలై 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష తేదీలు: జూలై 20 నుంచి
వెబ్సైట్: https://cpget.tsche.ac.in
ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు: బయో టెక్నాలజీ, కెమిస్ట్రీ/ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, అప్లయిడ్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ.
నోట్: సుమారు వందకు పైగా కోర్సులు ఉన్నాయి. విశ్వవిద్యాలయాలు ఏయే కోర్సులు ఆఫర్ చేస్తున్నాయనే వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.
ప్రవేశాలు కల్పించే విశ్వవిద్యాలయాలు
ఉస్మానియా యూనివర్సిటీ -హైదరాబాద్
కాకతీయ యూనివర్సిటీ – వరంగల్
తెలంగాణ యూనివర్సిటీ – నిజామాబాద్
మహాత్మాగాంధీ యూనివర్సిటీ -నల్లగొండ
పాలమూరు యూనివర్సిటీ -మహబూబ్నగర్
శాతవాహన యూనివర్సిటీ -కరీంనగర్
జేఎన్టీయూ -హైదరాబాద్
తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం -హైదరాబాద్
నోట్: కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా విశ్వవిద్యాలయంగా మార్చారు. ఈ ఏడాది సీపీగెట్ ద్వారా ఈ యూనివర్సిటీలో 18 కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
నోట్ –ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనిటిక్స్, మైక్రోబయాలజీ సబ్జెక్టుల పరీక్ష విధానం మిగిలిన సబ్జెక్టులకు భిన్నంగా ఉంటుంది. ఈ సబ్జెక్టులకు పార్ట్ ఏలో 40 మార్కులు, పార్ట్ బీలో డిగ్రీ స్థాయిలో చదివిన ఒక ఆప్షనల్ సబ్జెక్టు నుంచి 60 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. అదేవిధంగా ఎమ్మెస్సీ బయోటెక్నాలజీకి పార్ట్ ఏలో కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు, బయోటెక్నాలజీ నుంచి 60 ప్రశ్నలు ఇస్తారు.
బీఈ/బీటెక్ విద్యార్థులకు కొన్ని కోర్సులకు మాత్రమే అర్హత ఉంది. అదేవిధంగా మరికొన్ని కోర్సులకు ప్రత్యేక అర్హతలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు