సీ క్యాట్ -2022
– జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్
– విభిన్నమైన పీజీ డిప్లొమా కోర్సులు
– బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, ఎమ్మెస్సీ అభ్యర్థులకు అవకాశం
– కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా ప్రవేశాలు
# సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్) కెరీర్ ఓరియంటెడ్ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్యాట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
వివరాలు: సీడాక్‌ను 1988లో కేంద్రం ప్రారంభించింది. అత్యున్నత స్థాయిలో రిసెర్చ్, డెవలప్మెంట్ కోసం దీన్ని ప్రారంభించారు. సీడాక్‌లో కంప్యూటింగ్, గ్రిడ్, క్లౌడ్ కంప్యూటింగ్, మల్టీలింగ్వల్ కంప్యూటింగ్, ప్రొఫెషనల్ ఎలక్టానిక్స్, సాఫ్ట్ వేర్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, హెల్త్ ఇన్ఫర్మాటిక్స్, ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ ప్రధాన కార్యక్రమాలు.
పీజీ డిప్లొమా కోర్సులు
-అడ్వాన్స్డ్ కంప్యూటింగ్
– బిగ్ డేటా అనలిటిక్స్
– ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్
– ఐటీ ఇన్ఫ్రాస్టక్చర్, సిస్టమ్ అండ్ సెక్యూరిటీ
– ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
-ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
– వీఎల్ఎస్ఐ డిజైన్
– మొబైల్ కంప్యూటింగ్
– అడ్వాన్స్డ్ సెక్యూర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్
– జియా ఇన్ఫర్మాటిక్స్
-రోబోటిక్స్&అల్లయిడ్ టెక్నాలజీస్
– హెచ్పీసీ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్
– ఫిన్‌టెక్&బ్లాక్‌చైన్ డెవలప్మెంట్
-సైబర్ సెక్యూరిటీ&ఫోరెన్సిక్స్
ముఖ్యతేదీలు
– దరఖాస్తు: ఆన్లైన్లో
-చివరితేదీ: జూలై 12
-అడ్మిట్ కార్డులు: జూలై 19-23
– సీక్యాట్ పరీక్షతేదీ: జూలై 23, 24
– సీక్యాట్ ఫలితాల వెల్లడి: ఆగస్టు 4
– వెబ్సైట్: https://www.cdac.in
– అర్హతలు: ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్, ఎలక్టానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్/ఎలక్టికల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ (10+2+4 లేదా 10+3+3) లేదా ఎమ్మెస్సీ/ఎంఎస్ (కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్టానిక్స్) ఉత్తీర్ణత.
– ఈ కోర్సుల్లో కొన్నింటిని ఆన్లైన్లో, మరికొన్నింటిని ఆఫ్‌లైన్‌లో అందిస్తున్నారు.
– పీజీ డిప్లొమాలను అందిస్తున్న క్యాంపస్‌లు: బెంగళూరు, చెన్నై, గువాహటి, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, నవీ ముంబై, న్యూఢిల్లీ, నోయిడా, పట్నా, పుణె, సిల్చార్, తిరువనంతపురం. వీటితోపాటు సీడాక్ ఆథరైజ్డ్ ట్రెయినింగ్ సెంటర్లలో కూడా అందిస్తుంది ఆ సెంటర్లు… భువనేశ్వర్, ఇండోర్, జైపూర్, కరాడ్, ముంబై, నాగ్‌పూర్, నాసిక్, న్యూఢిల్లీ, పట్నా, పుణె.
ఎంపిక విధానం
-పీజీ డిప్లొమాల్లో ప్రవేశాల కోసం కంప్యూటరైజ్డ్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (సీక్యాట్) నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
-పరీక్షలో సెక్షన్ ఏ, బీ, సీ ఉంటాయి. సెక్షన్ ఏలో ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్. సెక్షన్ బీలో కంప్యూటర్ ఫండమెంటల్స్, సీ ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్, ఆపరేటింగ్ సిస్టమ్స్. సెక్షన్ సీలో కంప్యూటర్ ఆర్కిటెక్చర్, డిజిటల్ ఎలక్టానిక్స్, మైక్రో ప్రాసెసర్. అయితే కోర్సును బట్టి రెండు లేదా మూడు సెక్షన్లు ఉంటాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు