పరీక్షకు రెండ్రోజుల ముందు ఫీజు చెల్లించొచ్చు
– రెగ్యులర్‌లో ఫెయిలైనవారికి ఎస్సెస్సీ బోర్డు అవకాశం
ఈ ఏడాది పదో తరగతి రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిలై, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు కట్టలేకపోయిన విద్యార్థులకు ఎస్సెస్సీ బోర్డు వినూత్న అవకాశం ఇస్తున్నది. విద్యార్థి ఫెయిలైన సబ్జక్టుకు సంబంధించిన సప్లమెంటరీ పరీక్షకు కనీసం రెండు రోజుల ముందుగా కూడా ఫీజు కట్టే అవకాశం కల్పించింది. ఉదాహరణకు గణితం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఆగస్టు 4న ఉన్నదనుకొంటే.. ఆగస్టు 2 సాయంత్రం లోగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫీజు చెల్లించి, పరీక్షకు హాజరు కానొచ్చు. ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షలకు 5.03 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా 4.5 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. ఫెయిలైన వారికి ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఫీజు కట్టనివారి హాల్‌టికెట్లను కూడా తయారుచేసిన ఎస్సెస్సీ బోర్డు వారికి పరీక్షా కేంద్రాలు కూడా కేటాయించింది. దీంతో పరీక్షకు రెండు రోజుల ముందుగా ఫీజు చెల్లించినా హాల్‌టికెట్లను జారీ చేస్తారు. పరీక్షలు ముగిసిన తరువాత ప్రధానోపాధ్యాయులు ఆయా విద్యార్థుల పరీక్ష ఫీజును ఎస్సెస్సీ బోర్డుకు జమ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సొమ్ము ఎస్సెస్సీ బోర్డుకు చేరకపోతే ఆ విద్యార్థి ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెడతారు. పరీక్ష ఫీజు కట్టలేకపోయిన విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతోనే ఈ అవకాశం కల్పిస్తున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ కృష్ణారావు తెలిపారు. ఈ ఏడాది రెగ్యులర్ పరీక్షలకు ఫీజు కట్టి, ఫెయిలైన వారికే ఇది వర్తిస్తుందని, గతంలో ఎప్పుడో ఫెయిలైనవారికి వర్తించదని స్పష్టంచేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు