ఉపాధ్యాయ సాధికారత అంటే?
- ఉపాధ్యాయుడు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడడంలో, నూతన జ్ఞానాన్ని విద్యావిషయకంగా సముపార్జిస్తూ, మూర్తిమత్వపరంగా సమర్థుడై ఉండాలి.
- ఉపాధ్యాయుడు సమాజంలో తల్లిదండ్రులతో తోటి ఉపాధ్యాయులతో విద్యార్థులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి.
- బోధనా వృత్తి నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడానికి తన సాధికారతను అభివృద్ధి చేసుకోవడానికి నిరంతర కృషిచేయాలి.
- సాధికారత అంటే తన సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం. గుడ్‌మెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం సాధికారత గల ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఆలోచన రేకెత్తించే విషయం విశ్లేషణ, సృజనాత్మక విధానాలు, సమాజానికి దోహదపడే అనుభవాలు కలిగించే సమర్థతను మెరుగుపర్చాలి.
- డీఎస్సీలో ఉపాధ్యాయ సాధికారత చాప్టర్లో 4 నుంచి 5 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో కింది ప్రశ్నలు, ఐచ్ఛికాలపై అవగాహన పెంపొందించుకోండి.
1. కింది వాటిలో ఉపాధ్యాయ సాధికారత వ్యూహం కానిది?
1) పాఠ్యపుస్తకాల తయారీలో ఉపాధ్యాయుడు పాల్గొనడం
2) ఉపాధ్యాయుల పిల్లలకు ఉపకారవేతనాలు ప్రవేశపెట్టడం
3) జిల్లా ఆంగ్ల సంచార బృందం ఏర్పాటు
4) పాఠశాల సముదాయ సమావేశాలు నిర్వహించడం
2. ఉపాధ్యాయుడు శిశు కేంద్రీకృత బోధన ఉపయోగించడమంటే విద్యార్థులకు కింది వాటిలో ప్రాధాన్యం ఇవ్వడం?
1) బుద్ధి 2) శీలం 3) అనుభవాలు 4) పోషణ
3. విద్యార్థుల్లో భాషా సామర్థ్యాలు అభివృద్ధిపర్చడానికి సృజనాత్మకత కలిగిన భాషోపాధ్యాయుడు ఉపయోగించే తరగతి గది వ్యూహం?
1) ప్రాంతీయ భాష 2) మాతృభాష
3) బహుభాషత్వం 4) బోధనా మాధ్యమం
4. ఉపాధ్యాయుడు ఆహ్లాదం, సంతృప్తి లేని భయమూ ఒత్తిడితో కూడిన అభ్యసనం అందిస్తే?
1) దీర్ఘకాలిక స్మృతికి దోహదపడుతుంది
2) అభ్యసనాన్ని పెంచుతుంది
3) అభ్యసనాన్ని ఆటంకపరుస్తుంది
4) మంచి మార్కులు పొందడానికి సహాయపడుతుంది
5. బోధనను తన జీవిత ఐచ్ఛికంగా భావిస్తూ విద్యార్హతలూ ప్రేరణ పొందిన ఉపాధ్యాయులు లభించడం అనేది?
1) ప్రభుత్వ పాఠశాలల నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వవిధి
2) ప్రైవేట్ పాఠశాలల నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వవిధి
3) నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వవిధి కాదు
4) అన్ని రకాల పాఠశాలల నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వవిధి
6. ఉపాధ్యాయ వృత్తిపరత్వం అంటే..
1) వేతనాలు పొందడానికి బోధించడం
2) అప్పగించిన బాధ్యతలు పూర్తిచేయడం
3) ఉపాధ్యాయ నియామకానికి పూర్వం వృత్తిపర కోర్సులు చేయడం
4) వృత్తిపర నియమావళికనుగుణంగా ఉపాధ్యాయుడు నడుచుకోవడం
7. బోధనలో విద్యార్థుల అభిప్రాయాలకు, అనుభవాలకు, బోధన ప్రక్రియలో చురుకుగా పాల్గొనేందుకు ప్రాధాన్యతనివ్వడం అంటే?
1) ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య
2) శిశు కేంద్రీకృత విద్య
3) పాఠశాల కేంద్రీకృత విద్య
4) సమాజ కేంద్రీకృత విద్య
8. ఉపాధ్యాయుడికి విద్యార్థుల మధ్యగల వైయక్తిక భేదాల జ్ఞానం తరగతిలో కింది దేనికి ఉపయోగపడుతుంది?
1) బోధనాభ్యసన కృత్యాల రూపకల్పనకు
2) విద్యార్థుల ఇంటిపనిని మూల్యాంకనం చేయడానికి
3) తరగతి గదిలో క్రమశిక్షణ నిర్వహించడానికి
4) తరగతిలో ఆవశ్యకమైన ఏర్పాట్లు చేసుకోవడానికి
9. కింది వాటిలో ఉపాధ్యాయుడి వృత్తిపరమైన అభివృద్ధి?
1) వృత్యంతర శిక్షణకు హాజరుకావడం
2) విద్యాగోష్టులకు హాజరు కావడం
3) విద్యాసంబంధమైన సెమినార్, వర్క్‌షాప్స్‌కు హాజరుకావడం
4) పైవన్నీ
10. పాఠశాలల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణను అందించే ప్రధాన సంస్థ?
1) ఎస్ఐఈటీ 2) ఎస్సీఈఆర్టీ 3) ఓబీబీ 4) ఏఈఐ
11. ఉపాధ్యాయ వృత్తి పూర్వ విద్యాసంస్థ కానిది?
1) ఐఏఎస్ఈ 2) ఎస్సీఈఆర్టీ
3) డీఐఈటీ 4) సీటీఈ
12. కింది వాటిలో అందరికీ విద్యను అందుబాటులోకి తేవాలనే సూక్ష్మస్థాయి విద్యాప్రణాళిక ప్రాజెక్ట్?
1) ఎన్పీఈజీఈఎల్ 2) ఓబీబీ
3) ఏపీపీఈపీ 4) డీపీఈపీ
13. నల్లబల్ల పథక (Operation Black Board) ప్రధాన ఉద్దేశం?
1) పాఠశాలలకు నల్లబల్లలు అందించడం
2) పాఠశాల కనీస అవసరాలు తీర్చడం
3) పాఠశాలలకు పుస్తకాలు అందించడం
4) పాఠశాలలను పర్యవేక్షించడం
14. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
1) డీపీఈపీ – 1994, నవంబర్ 8
2) ఓబీబీ – 1986, అక్టోబర్ 30
3) ఎస్ఎస్ఏ – 2000, నవంబర్ 16
4) కేజీబీవీ – 2003, జూన్ 12
15. ఎన్పీఈజీఈఎల్ ఏ విద్యాపథకం ద్వారా అమలవుతున్నది?
1) ఎస్ఎస్ఏ 2) ఏపీపీఈపీ 3) డీపీఈపీ 4) ఓబీబీ
16. విద్యార్థి కృత్యాధార అంశాల ఆధారంగా బోధనాభ్యసన ప్రక్రియ కొనసాగించాలనే ప్రధాన ఉద్దేశం ఉన్న పథకం?
1) ఏఈపీపీఈపీ 2) డీపీఈపీ
3) ఎస్ఎస్ఏ 4) ఎస్ఓపీటీ
17. డీపీఈపీ – డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుకు సంబంధించినది?
1) పాఠశాల అందుబాటు
2) విద్యార్థుల నమోదు – నిలుపుదల
3) గుణాత్మక విద్యనందించడం 4) పైవన్నీ
18. ఉపాధ్యాయ విద్యకు సంబంధం లేనిది?
1) ఓబీబీ 2) ఎన్సీటీఈ
3) డీఐఈటీ 4) ఈఎఫ్ఎల్యూ
19. ఉపాధ్యాయు విద్య అనేది ఒక నిరంతర ప్రక్రియ అందులోని వృత్తిపూర్వ, వృత్యంతరను విడదీయ లేనిదని పేర్కొన్నది?
1) సెకండరీ విద్యా నివేదిక 2) విశ్వవిద్యాలయ నివేదిక
3) ఉపాధ్యాయ జాతీయ కమిటీ
4) జాతీయ విద్యావిధానం – 1986
20. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యాపథకం- ఏపీపీఈపీ సూత్రం కానిది?
1) అభ్యసన కృత్యాలు కల్పించడం
2) అనుభవం ద్వారా అభ్యసనం
3) వైయక్తిక భేదాలకు అవకాశమివ్వడం
4) విద్యార్థులను నమోదుచేయడం
21. సర్వశిక్షా అభియాన్ లక్ష్యం?
1) 2010 నాటికి ఎనిమిదేండ్ల ప్రాథమిక విద్య విద్యార్థులందరూ పూర్తిచేసేటట్లు చూడటం
2) ప్రాథమిక హక్కుగా సెకండరీ విద్య
3) 2007 నాటికి తరగతి భవన నిర్మాణాలు చేపట్టడం
4) 2003 నాటికి 6 నుంచి 14 ఏండ్ల పిల్లల జాబితా తయారుచేయడం
22. యూఎన్డీపీ, యునిసెఫ్, యూఎన్ఎఫ్పీఏ, యునెస్కో, ఐఎల్ఓల భాగస్వామ్యంతో బాలికలు, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే పిల్లలకు, బాలకార్మికులకు ప్రాథమిక విద్య అందుబాటులోకి తెచ్చిన పథకం?
1) పాఠశాల 2) జనశాల 3) విద్యాశాల 4) కార్యశాల
23. 1992 సెప్టెంబర్‌లో ఆర్సీఐ (రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) పార్లమెంట్ ఆమోదం పొంది, 1993, జూన్ 22న స్వయం ప్రతిపత్తిగల సంస్థగా ఏర్పడి, కింది రంగంపై అధికార బాధ్యతలు కలిగి ఉన్నది?
1) ప్రత్యేకావసరాలున్న పిల్లల (అంగవైకల్యం) రంగంపై
2) ప్రతిభావంతులైన పిల్లల రంగంపై
3) అనాథ పిల్లల రంగంపై
4) బాలకార్మికుల పిల్లల రంగంపై
24. సాంకేతిక విద్యపై పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు మనటీవీ ద్వారా అందిస్తున్న సంస్థ?
1) ఎన్సీఈఆర్టీ 2) సీసీఆర్టీ
3) ఎస్ఐఈటీ 4) ఆర్ఐఈ
25. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్, అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌యూఈపీఏ) ఏర్పడిన సంవత్సరం?
1) 2004 2) 2006 3) 2008 4) 2002
26. ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించడానికి కనీస అవసరాలపరంగా దోహదపడినది?
1) సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ)
2) నల్లబల్ల పథకం (ఓబీబీ)
3) రాష్ట్ర మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ)
4) జిల్లా ప్రాథమిక విద్యాపథకం (డీపీఈపీ)
27. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ అవగాహనపై ఉపాధ్యాయ సాధికారతకు సహకరించినది?
1) CIFEL 2) CIET 3) CCRT 4) CABE
28. రిసోర్స్‌పర్సన్స్ ద్వారా మండలంలోని ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే మండలస్థాయి కేంద్రం?
1) MRC 2) IERC
3) School Complex 4) SIET
29. ఉపాధ్యాయ ప్రేరణకు దోహదపడని కారకం?
1) ఉద్యోగ భద్రత 2) పాఠశాల వసతులు
3) క్షేత్ర పర్యటన 4) బదిలీ
30. కింది వాటిలో ఉపాధ్యాయునికి మాత్రమే సంబంధించిన రిజిస్టర్?
1) సర్వీస్ రిజిస్టర్ 2) విద్యార్థుల హాజరు రిజిస్టర్
3) ప్రగతిపత్రాల రిజిస్టర్ 4) లాగ్‌బుక్ రిజిస్టర్
31. జ్ఞాన దర్శన్ విద్యాటెలివిజన్ కార్యక్రమాలు, సాంకేతిక నిపుణ సామర్థ్యాలు అందజేసే సంస్థ?
1) CCRT 2) CIET 3) SCERT 4) RIE
32. NUEPA- జాతీయ విద్యాప్రణాళిక, నిర్వహణ విశ్వవిద్యాలయం దేని ఆధ్వర్యంలో పనిచేస్తుంది?
1) NCERT 2) NCTE
3) కేంద్ర మానవ వనరుల శాఖ
4) జాతీయ ప్రణాళిక చట్రం
33. ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసేది?
1) బోధనాపద్ధతి 2) సాంకేతిక పరిజ్ఞానం
3) పాఠ్యపుస్తక సిలబస్ 4) పైవన్నీ
34. కింది వాటిని సరిగా జతపర్చండి?
1. NCERT ఎ. 1963
2. CIET బి. 1961
3. RIE సి. 1993
4. NCTE డి. 1982
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
35. కింది వాటిలో సరికానిది?
1) DIET ఏర్పాటు 1989-90
2) MRC ఏర్పాటు 2003-08
3) School Complex
4) APPEP ఏర్పాటు 1981-83
సమాధానాలు
1-2, 2-3, 3-1, 4-3, 5-4, 6-4, 7-2, 8-1, 9-4, 10-2, 11-2, 12-4, 13-2, 14-4, 15-1, 16-1, 17-4, 18-1, 19-4, 20-4, 21-1, 22-2, 23-1, 24-3, 25-2, 26-2, 27-3, 28-1, 29-4, 30-1, 31-2, 32-3, 33-4, 34-3, 35-4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు