శాస్త్ర ప్రయోగంలో ప్రాథమిక నైపుణ్యం ?
విజ్ఞానశాస్త్రం – పరిచయం
-మానవుని ఊహాశక్తి, ఆలోచనాశక్తి ప్రారంభమైన నాటి నుంచి విజ్ఞానశాస్త్రం రూపురేఖలు దిద్దుకోవడం ఆరంభమైంది.
-మానవుని నిత్యజీవితావసరాలైన ఆకలి, దాహం తీర్చుకోవడం కోసం ఆహారాన్వేషణతో తన ఆలోచనను ప్రారంభించాడు.
-అర్థం: సైన్స్ అనే ఆంగ్ల పదం, లాటిన్ పదాలైన సైన్షియా, సిరే నుంచి ఆవిర్భవించింది. సైన్సియా అంటే జ్ఞానం.
-సైన్స్ అంటే తెలుసుకోవడం లేదా జ్ఞానం అని అర్థం.
-మనదేశంలో వేద అంటే జ్ఞానం.
విజ్ఞానశాస్త్ర భావన
-విజ్ఞానశాస్త్రం అంటే క్రమబద్ధమైన జ్ఞానం
-యథార్థ సత్యాలను ఆధారంగా చేసుకొని విపులీకరించే జ్ఞానం
-మానవుని లోకజ్ఞత లేదా జీవనవిధానం
-విజ్ఞానశాస్త్రం అంటే వ్యవస్థీకరించిన జ్ఞానం
విజ్ఞానశాస్త్ర నిర్వచనాలు
-విజ్ఞానశాస్త్రం అనేది సంచిత, అంతులేని, అనుభవాత్మక పరిశీలనల సమూహం, దీనివల్ల భావనలు, సిద్ధాంతాలు రూపొందుతాయి – సైన్స్ మ్యాన్‌పవర్ ప్రాజెక్టు
-విజ్ఞానశాస్త్రమనేది నిరంతర పరిశీలన, ప్రయోగం, అన్వయం, నిరూపణల ద్వారా మనం మన గురించి, విశ్వం గురించి అవగాహన పెంచుకొని సమగ్రంగా సరిదిద్దుకొనే ప్రక్రియ – అమెరికన్ అసొసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్
-భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను, సమాజాన్ని పరిశీలించడం ద్వారా, సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చిన వ్యవస్థీకరించిన జ్ఞానమే విజ్ఞానశాస్త్రం – ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ
-విజ్ఞానశాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం ముడిపదార్థమే. కేవలం విశ్వం ప్రస్తుత స్వరూపమే కాదు. దాని పూర్వ చరిత్రలో జీవప్రపంచం కూడా – కార్ల్ పియర్సన్
-విజ్ఞాన శాస్త్రమంటే ఒక మాపనం. మాపనం వల్ల మనకు నిర్దిష్టమైన గణనలు, ఫలితాలు లభిస్తాయి. మాపనం వల్ల ఒక విషయాన్ని స్పష్టంగా, నిర్దిష్టంగా వివరించడానికి వీలవుతుంది – అర్హీనియస్
-ఇల్లు అనేది ఇసుక, సిమెంట్, రాళ్లతో ఎలా నిర్మిస్తారో, అదేవిధంగా విజ్ఞానశాస్త్రం అనేది సత్యాలతో నిర్మితమై ఉంటుంది. అయితే పోగుపడిన సత్యాలు ఒక క్రమపద్ధతిలో అమర్చకపోతే రాళ్ల కుప్పకు, విజ్ఞానశాస్ర్తానికి పెద్ద తేడా ఉండదు – హెన్రీ పాయింకేర్, ఆర్సీ శర్మ
-ప్రయోగాలు, పరిశీలనల నుంచి వృద్ధి పొంది, తర్వాత ప్రయోగాత్మక పరీక్షల పరిశీలనలకు ఫలితాన్నిస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు గల భావనలు, భావనాపథక శ్రేణులే విజ్ఞానశాస్త్రం – జేమ్స్బీ కోనాంట్
-విజ్ఞానశాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి – ఐన్‌స్టీన్
-విజ్ఞానశాస్త్రం అనేది ఒక పరిశోధన విధానం – ఏడబ్ల్యూ గ్రీస్
విజ్ఞానశాస్త్రం లక్షణాలు
-విజ్ఞానశాస్త్రం ఒక ఉత్పత్తి
-విజ్ఞానశాస్త్రం ఒక ప్రక్రియ
-విజ్ఞానశాస్ర్తానికి పరిశీలనలే పునాది
-విజ్ఞానశాస్త్రం సంచిత జ్ఞానం
-విజ్ఞానశాస్త్రం శాస్త్రీయ వైఖరిని పెంపొందిస్తుంది.
-విజ్ఞానశాస్త్రం మార్పునకు లోనవుతుంది.
-విజ్ఞానశాస్త్రం రుజువు కోరుతుంది.
-విజ్ఞానశాస్త్రం అనుభవాత్మకం
-విజ్ఞానశాస్త్రం విశ్వజనీనమైంది.
విజ్ఞానశాస్త్ర స్వభావం
-విజ్ఞానశాస్త్రం పరిశీలించదగిన దృగ్విషయాలపైనే
ఆధారపడుతుంది.
-సత్యాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే అది సాపేక్ష సత్యం గురించి మాత్రమే మాట్లాడుతుంది.
-సత్యాలను ఆధారం చేసుకొని సంభావ్యతలను వివరించడానికి ప్రయత్నిస్తుంది.
-జ్ఞానేంద్రియాల పరిధిలో ఉన్న దృగ్విషయాలను దృష్టిలో ఉంచుకొని విశ్వానికి అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తుంది.
-విజ్ఞానశాస్త్రం అందించిన జ్ఞానం యథార్థం అనడం కంటే అలా జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్న విషయం.
-విజ్ఞానశాస్త్రం భగవంతుడు, మానవాతీత శక్తులను లేవు/కాదని తృణీకరించదు. కానీ, కేవలం వాటి గురించి మాట్లాడదు.
-విజ్ఞానశాస్త్రం మూర్తదశలో ఉన్న విషయాల ఆధారంగా అమూర్త దశలో ఉన్న భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.
-తత్వశాస్త్రం, అమూర్త విషయాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
-విజ్ఞానశాస్త్రం లక్ష్యాత్మకత, స్వీయాత్మకతలపై ఆధారపడి ధృవీకరణకు ఆధారంగా ఉంటుంది.
-విజ్ఞానశాస్త్రం పూర్తిగా సత్యాన్ని తన పరిధిలోకి తీసుకోవాలి. జీవం పుట్టుక సిద్ధాంతాలు అమూర్త దశలో ఉన్నాయి.
విజ్ఞానశాస్త్రం – పరిధి
-విజ్ఞానశాస్త్ర పరిధి విస్తృతమైంది.
-తత్వశాస్ర్తానికి, విజ్ఞానశాస్ర్తానికి సంబంధం ఉంది.
-విజ్ఞానశాస్త్ర పరిధిని స్థూలంగా భౌతిక, జీవశాస్ర్తాలుగా విభజించారు.
-భౌతికశాస్ర్తాలు ఆవరణ వ్యవస్థలోని దృగ్విషయాల స్వరూప స్వభావాలను వివరిస్తాయి.
-జీవశాస్త్రం జీవం, వాటి లక్షణాల గురించి వివరిస్తుంది.
విజ్ఞానశాస్త్ర నిర్మాణం
-విజ్ఞానశాస్త్ర ఉత్పత్తులైన భావనలు, పరికల్పనలు, సత్యాలు, నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలు. అవి రూపొందించే విధానాలే విజ్ఞానశాస్త్ర నిర్మాణంగా పేర్కొనవచ్చు.
-విజ్ఞానశాస్త్రం వివిధ అంశాలు ఒకదానితో ఒకటి సంబంధాన్ని ఏర్పర్చుకొని స్థిర నిర్మాణం పొందాయి.
-హెన్రీపాయింకెర్, ఆర్సీ శర్మ: మహాశయులు విజ్ఞానశాస్త్ర నిర్మాణాన్ని, నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చి నిర్వచించారు. వీరు భవన నిర్మాణంలోని భాగాలను శాస్త్ర నిర్మాణంతో కింది విధంగా పోల్చారు.
-జేమ్స్ బీ కోనాంట్: విజ్ఞానశాస్త్రం మనం విశ్వంలో పరిశీలించదగిన దృగ్విషయాలను కలిపే భావనల నిచ్చెనగా చెప్పవచ్చు. ఈ భావనల నుంచి అమూర్తీకరణాలను రాబడుతుంది. ఈ భావనలు ప్రాకల్పనలు, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాల రూపంలో ఉంటాయని ఇవన్నీ విజ్ఞానశాస్త్ర ఉత్పత్తులే అని తెలిపారు.
విజ్ఞానశాస్త్ర సమగ్ర నిర్మాణం
-జోసఫ్ జే ష్వాబ్, ఫిలిప్ హెచ్ ఫినిక్స్లు విజ్ఞానశాస్త్ర ప్రక్రియ ఫలితాల కలయికనే విజ్ఞానశాస్త్ర నిర్మాణంగా భావించారు.
-1964లో 1) సంశ్లేషణాత్మక నిర్మాణం 2) ద్రవ్యాత్మక నిర్మాణాలు అనే 2 రకాలుగా వివరించారు.
-సంశ్లేషణాత్మక నిర్మాణం: సత్యాన్వేషణే విజ్ఞానశాస్త్రం
-సత్యాన్వేషణకు, జ్ఞాన సముపార్జనకు శాస్త్రీయ ప్రక్రియలు ఉపయోగపడుతాయి.
-ఆ అన్వేషణా ప్రక్రియ సముదాయమే విజ్ఞానశాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణం
-సంశ్లేషణాత్మక నిర్మాణంలో అంశాల ద్వారా విజ్ఞానశాస్త్ర నియమాలు రాబడుతాయి.
-సంశ్లేషణాత్మక నిర్మాణంలో ప్రక్రియలు అంటే
1. పరిశీలన
2. సమాచార సేకరణ
3. వర్గీకరణ
4. మాపనం
5. కాల పరిస్థితుల సంబంధాన్ని వినియోగించడం
6. సమాచారాన్ని అందించడం
7. అనుమతులను రాబట్టడం
8. ప్రాకల్పనల రూపకల్పన
9. వివిధ చరాల నిర్వహణ, నియంత్రణ
10. ప్రయోగ నిర్వహణ
11. దత్తాంశాలను వ్యాఖ్యానించడం
12. ప్రాగుక్తీకరణ
సంశ్లేషణాత్మక నిర్మాణంలో పద్ధతులు అంటే:
-శాస్త్రీయ పద్ధతి
-ఆగమన పద్ధతి
-నిగమన పద్ధతి
పరిశీలన
-శాస్త్ర ప్రయోగంలో ప్రాథమిక నైపుణ్యం – పరిశీలన
-వస్తువులు, సంఘటనల గురించి సమాచార సేకరణకు పరిశీలన ఉపయోగపడుతుంది.
-సమాచారం సేకరించే మార్గమే పరిశీలన
-ఒక వస్తువు, సంఘటనను నిశితంగా చూడటం పరిశీలన
ఉదా: విద్యార్థి ప్రయోగ పరికరాల అమరికలో, పద్ధతులను చూసి దోషాలను కనుగొనడం.
-విద్యార్థి జీవావరణాన్ని, నమూనాలను దృగ్విషయాలను జాగ్రత్తగా పరిశీలించడం.
-సమాచార సేకరణ: ఒక వస్తువు లేదా సంఘటనను పరిశీలించి దానికి సంబంధించిన సమాచారం సేకరించడాన్ని సమాచార సేకరణ అంటారు.
ఉదా: విద్యార్థి తాను చూసిన ప్రమాదం వివరాలు చెప్పడం
-విద్యార్థి తన పరిసరాల చుట్టూ ఉన్న జంతు సముదాయం గురించి సమాచారం సేకరించడం
వర్గీకరణ
-సంఘటనల విచక్షణను తెలిపేదాన్ని వర్గీకరణ అంటారు.
-వర్గీకరణ పరిశీలన, వర్ణన, ఆలోచన ఆధారంగా జరుగుతుంది.
-భావనలు ఏర్పడటానికి వర్గీకరణ తోడ్పడుతుంది.
ఉదా: విద్యార్థి మొక్కలను, జంతువులను వేరుచేయడం
-విద్యార్థి పుస్తకాలు – నోట్స్ వేరు చేయడం
మాపనం
-ప్రక్రియ/వస్తువుల కచ్చితత్వాన్ని తెలపడాన్ని మాపనం లేదా కొలవడం అంటారు.
-సత్యాన్వేషణలో పరిశీలనలను విలువ కట్టడానికి ఒక మార్గం ఉండేది మాపనం.
ఉదా: ఎత్తు, బరువు, వేగం, ఉష్ణోగ్రత
-కాల పరిస్థితుల సంబంధాన్ని ఉపయోగించడం: ప్రక్రియలను కొనసాగించేటప్పుడు దానికి సంబంధించిన కాల స్థితులను ఉపయోగించుకోవడం
-ప్రాకల్పనల రూపకల్పన: ప్రక్రియలోని సమస్యా పరిష్కారం కోసం ముందుగా ప్రతిపాదించిన పరిష్కారమే ప్రాకల్పన అంటారు. ఇవి 4 రకాలుగా ఉంటాయి.
-ప్రాకల్పన ఆధారంగా సత్యాల నిరూపణ జరుగుతుంది.
-గ్రామంలో వ్యాధి ప్రబలడం (అంటువ్యాధులు)
-కూలీ పనికి (సీజనల్ పనులకు) వెళ్లడం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు