ఇవీ.. అధ్యయన సాధనాలు
సాధనాల వల్ల అభ్యసనం మరింత సులభతరం అవుతుంది. సహజంగా కాలేజీ, స్కూళ్లలో కూడా ఎన్నో దృశ్యశ్రవణ ఉపకరణాలను ఉపయోగించి విద్యాబోధనను అందిస్తున్నారు. మీరు స్వయంగా కొన్ని సాధనాలను ఉపయోగించాలి. మీ ఇంద్రియాలే మీ మౌలిక సాధనాలు. వీటితో పాటు మీరు తయారుచేసుకొనే ఫ్లాష్కార్డుల వంటివి అద్భుతమైన సాధనాలుగా ఉపయోగపడతాయి. స్టూడెంట్ కెరీర్లో ఉన్న మీకు ప్రధానమైన విధి నిర్వహణ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం. మనిషి ఎదురుగా ఉన్న సవాళ్లను గమనించి వాటిని సాధించడానికి తగిన పరిష్కారమార్గాలను అన్వేషిస్తూ కొత్త విషయాలను కనిపెడతాడు. ఈ ప్రతిభను కనపర్చడానికి మనిషికి విజ్ఞానం తోడ్పాటు ఎంతో అవసరం. పుట్టినప్పటి నుంచీ మనిషి ఎన్నెన్నో విషయాలను చూసి తెలుసుకుంటూ నేర్చుకొని అలవర్చుకుంటాడు. ఈ అభ్యసన కార్యక్రమాల్లో ప్రధానమైనది విద్యార్థి జీవితం. కాబట్టి విద్యార్థులందరికీ విద్యార్జనే ప్రథమ కర్తవ్యం. ఈ విజ్ఞానాన్ని అధ్యయనం చేయడానికి విద్యార్థులందరికీ సాధనాల ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. వీటినే అధ్యయన సాధనాలు అంటారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
చదవటం-నోట్స్ రాయటం:
అధ్యయన సాధనాల్లో పుస్తకాలు ఒక అంశం. వీటిని మనం పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు అని రెండు రకాలుగా వర్గీకరించుకున్నాం. పాఠ్య పుస్తకాలను మనం ముద్రించబడినవి తీసుకుంటాం. కాగా తెల్లకాగితాలతో ఉన్న నోటు పుస్తకాలను కొనుక్కుంటాం. వీటిని కొనుక్కోవటంతో మన కర్తవ్యం ముగిసిపోదు. తీసుకున్న పాఠ్య పుస్తకాలను పూర్తిగా చదువుకోవాలి. అలాగే చదువుకున్న ప్రతి పాఠ్యాంశానికి సమగ్ర నోట్స్‌ను తయారుచేసుకోవాలి. చదివేటప్పుడు ఏకాగ్రతతో కీలక భావనలన్నీ చక్కగా అర్థమయ్యేలా చదువుకోవాలి. అలా చేసేటప్పుడు ఏదైనా కీలక భావన స్పష్టంగా అర్థంకాకపోవటంకానీ, అసలు తెలియకపోవటం గానీ జరిగినప్పుడు సంబంధిత పాఠ్యాంశాల్లో పూర్వజ్ఞానం లోపించిందని గ్రహించాలి. ఈ మేరకు ఉపాధ్యాయుల సహకారంతో మీరు కోల్పోయిన దాని పునఃశ్చరణ పేరిట తిరిగి పొంది తర్వాత మీ పఠనను కొనసాగించాలి. ఒక పాఠ్యాంశం స్పష్టంగా అర్థమైన తర్వాత మీ అంతట మీరే స్వయంగా సమగ్రమైన నోట్స్‌ని తయారుచేసుకోవాలి.
వినటం – క్లాసులో నోట్స్ :
మీ విద్యాభ్యాసం విజయవంతంగా కొనసాగడానికి ఉపయోగపడే మరో ముఖ్యమైన సాధనం ఇది. క్లాసులకు అటెండ్ కావటం, లెక్చర్ వినటం, తద్వారా తగిన నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం మీకు ప్రయోజనాలను అందిస్తుంది.
నిద్రపోవటం :
నిద్రపోవటం కూడా మీ విద్యాభ్యాసానికి ఉపయోగపడే సాధనం అన్నప్పుడు మీకు ఆశ్చర్యమేస్తుంది. కానీ ఇది నిజం చదువు అంటే నిద్ర మానుకొని, స్లీప్‌లెస్ టాబ్లెట్లు వేసుకొని ఫ్లాస్క్ నిండా టీ రెడీ చేసుకొని చదివేది కాదు. ఫ్యాక్టరీలో కూలీలా మీరు శారీరక శ్రమకులోను కానక్కర్లేదు. తెలివిగా చదవాలి. మీ మైండ్‌కు తగిన విశ్రాంతి ఇస్తూ చదవాలి. మీ మైండ్ ప్రశాంతంగా, ఫ్రెష్‌గా పనిచేయాలంటే అందుకు చక్కని నిద్ర అవసరం. ప్రశాంతమైన నిద్రలో కూడా మీ బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది. మీరు చదువుకొని, స్వల్పకాలిక స్మృతిలో డిపాజిట్ చేసుకున్న సమాచారం అంతా ఈ దశలో దీర్ఘకాలిక స్మృతికి మారుతుంది. అందుచేత ప్రశాంతమైన, రిలాక్స్డ్ నిద్ర విద్యార్థికి చాలా అవసరం. మీ మైండ్ మరింత బలాన్ని సంతరించుకునేది చక్కటి నిద్రలోనే.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు