1. తమిళనాడు 2. కర్ణాటక 3. కేరళ 4. మహారాష్ట్ర
2. దేశ అకౌంట్స్, ఆడిట్స్ విభాగానికి సంరక్షకుడిగా పేర్కోనబడే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)ను నిబంధన 148 ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు. అయితే మొదటి కాగ్ వీ నరహరిరావు కాగ, ప్రస్తుత కాగ్ ఎవరు ?
1. నిల్కాంత్ శర్మ 2. శశికాంత్ శర్మ
3. అనురాగ్ శర్మ 4. దీపక్ పరేఖ్
3. భారత ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన, రాజ్యాంగ బద్ధమైన సంస్థ. దీనిని ఏ నిబంధన ప్రకారం జనవరి 25, 1950న ఏర్పాటు చేశారు?
1. 324 2. 325 3. 153 4. 167
4. ప్రజా ప్రయోజనాల వాజ్యాలను అంగీకరించిన తొలి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు?
1. వీకే ఖరే, బీఎన్ కిర్పార్
2 .కేజీ బాలకృష్ణ, ఆర్సీ లహోటీ
3. సీఎన్ భగవతి, ఎస్ఎస్ కపాడియా
4. పీఎన్ భగవతి, వీఆర్ కృష్ణ అయ్యర్
5. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్‌ను నిబంధన 338(ఏ) ప్రకారం ఏర్పాటు చేశారు. మొదటి చైర్మన్ కున్వర్ సింగ్ కాగా, ప్రస్తుత చైర్మన్ రామేశ్వర్ ఓరాన్, అయితే ఈ కమిషన్‌లో ఎంతమంది సభ్యులుంటారు?
1. 5 2. 6 3. 8 4. 4
6. పంచాయతీరాజ్‌కు సంబంధించి దిగువవాటిలో అశోక్‌మెహతా కమిటీ సిఫార్సు కానిది?
1. పంచాయతీరాజ్‌లో రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొనడం
2. రెండంచెల పంచాయతీరాజ్ ఉంటే మంచిది
3. రాజ్యాంగపరమైన రక్షణ
4. జిల్లా పరిషత్‌కు పరిమిత అభివృద్ధి కార్యక్రమం విధులు
7. పంచాయతీరాజ్‌పై అశోక్ మెహతా కమిటీని నియమించినపుడు భారత ప్రధానమంత్రి ఎవరు?
1. వీ పీ సింగ్ 2. మొరార్జీదేశాయ్
3. ఇందిరాగాంధీ 4. అటల్ బిహరీ వాజ్‌పేయ్
8. కిందివారిలో ఎవరిని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు?
1. జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు 2. గ్రామసర్పంచ్
3. మండల అధ్యక్షులు 4. జిల్లా పరిషత్ చైర్మన్
9. జిల్లా ప్రణాళికా అభివృద్ధి సమీక్ష చేయడానికి కార్యదర్శిగా ఎవరు వ్యవహరిస్తారు?
1. జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు 2. జిల్లా కలెక్టర్
3. జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రమంత్రి
4. జిల్లా పరిషత్ చైర్మన్
10. గ్రామ పంచాయతీల వల్ల దేశప్రగతి దెబ్బతింటుందన్న భావనను వ్యక్తం చేసినవారు?
1. రాజేంద్ర ప్రసాద్ 2. అనంతశయనం అయ్యంగార్ 3. బీఆర్ అంబేద్కర్ 4. జవహర్ లాల్ నెహ్రూ
11. 1918లో ఏర్పాటైన నేషనల్ లిబరేషన్ ఫెడరేషన్ నాయకులు ఎవరు?
1. సురేంద్రనాథ్ బెనర్జీ 2. బాల గంగాధర్‌తిలక్
3. అంబేద్కర్ 4. ఉమేష్ చంద్ర బెనర్జీ
12. 1923లో జరిగిన ఎన్నికల్లో మదన్ మెహన్ మాలవ్య ప్రాతినిధ్యం వహించిన పార్టీ?
1. ముస్లింలీగ్ 2. నేషనలిస్ట్ పార్టీ
3. స్వరాజ్ పార్టీ 4. నేషనల్ లిబరేషన్ ఫెడరేషన్
13. 1954లో జరిగిన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ శాసన సభాపక్ష నాయకునిగా పనిచేసింది ఎవరు?
1. సీ రాజగోపాల చారి 2. జీవీ మౌలాంకర్
3. జవహర్ లాల్ నెహ్రూ 4. శరత్ చంద్ర బోస్
14. రాజ్యాంగంలోని మూడో భాగానికి వ్యతిరేకంగా చట్టాలు చేయకూడదని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది?
1. 14 2. 13 3. 12 4. 11
15. లోక్‌సభలో ప్రతిపక్షపార్టీగా గుర్తింపు పొందాలంటే మొత్తం స్థానాల్లో ఎన్నోవంతు స్థానాలను పొందాలి?
1. 1/10 2. 1/20 3. 1/12 4. 1/15
16. రాజ్యాంగంలో గ్రామ పంచాయతీల గురించి పేర్కొనే ప్రకరణ?
1) 35 2) 21 3) 25 4)40
17. దేశంలో పంచాయతీరాజ్ వ్వవస్థ పితామహుడు?
1) బల్వంత్ రాయ్ మెహతా 2) అశోక్ మెహతా
3) ఎల్ఎం సింఘ్వీ 4) నరసింహన్
18. దేశంలో తొలి పంచాయతీ సమితి ఎక్కడ మొదలైంది?
1. ఆంధ్రప్రదేశ్ 2. ఉత్తరప్రదేశ్
3. రాజస్థాన్ 4. ఒరిస్సా
19. మహిళలకు ఓటు హక్కు కలిపించిన తొలి దేశం ఏది?
1. ఆస్ట్రేలియా 2. న్యూజిల్యాండ్
3. బ్రిటన్ 4. చైనా
20. రాజ్యాంగంలోని ఏ అధికరణను రాజ్యాగంపు గుండె, ఆత్మగా బీఆర్ అంబేద్కర్ వర్ణించారు?
1. 32 2. 17 3. 19 4. 15
21. దేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్‌ను ఎక్కడ స్థాపించారు?
1. ఢిల్లీ 2. బొంబాయి 3. మద్రాస్ 4. కోల్‌కతా
22. దేశంలో మొదటి పట్టణాభివృద్ధి సంస్థను ఎక్కడ స్థాపించారు?
1. ఢిల్లీ 2. బొంబాయి 3. మద్రాస్ 4. కోల్‌కతా
జవాబులు
1-1, 2-2, 3-1, 4-4, 5-1, 6-4, 7-2, 8-1,
9-2, 10-3, 11-1,12-2, 13-4, 14-2, 15-1, 16-4, 17-1, 18-3, 19-2, 20-1, 21-3, 22-1