హైదరాబాద్ హితరక్షణ సమితిని ఏర్పాటు చేసినది?
1. హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేయాలని జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన హెచ్ఎస్సీ అధ్యక్షుడు?
1) బూర్గుల రామకృష్ణారావు
2) కె.వి. రంగారెడ్డి
3) స్వామి రామానంద తీర్థ
4) మోతీలాల్ నెహ్రూ
జవాబు: 1947 ఆగస్టు 7న అప్పటి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ (హెచ్ఎస్సీ) అధ్యక్షుడైన స్వామి రామానంద తీర్థ జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించి, హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేద్దాం నిజాం రాచరికపు గోడలు బద్ధలు కొడుదాం అని పిలుపునిచ్చాడు.
2. కింది వాటిలో సరైనది ఏది?
ఎ) 1947 డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి వద్ద నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్‌పై బాంబు దాడి జరిగింది.
బి) ఈ బాంబు దాడిలో పాల్గొని అరెస్టయిన వారు నారాయణ్‌రావు పవార్, జగదీష్, అంజన్న (గంగరాజు/గండయ్య)
సి) నారాయణ్‌రావు పవార్‌కి శిక్షణ
ఇచ్చింది కొండా లక్ష్మణ్‌బాపూజీ
డి) పైవన్నీ సరైనవే
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) సి మాత్రమే
జ: కింగ్‌కోఠి వద్ద మీర్ ఉస్మాన్ అలీఖాన్‌పై దాడి జరిగింది.
3. కింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి?
ఎ) హైదరాబాద్‌పై చేసే సైనిక చర్యకు పోలీస్‌చర్య అని పేరు సూచించిన వ్యక్తి సి. రాజగోపాలచారి (రాజాజీ
బి) సెప్టెంబర్ 17న మహారాష్ట్రలో
మరాఠ్వాడ సంగ్రామ్ ముక్తి దివస్‌గా
నిర్వహిస్తారు
సి) కమ్యూనిస్టులు తెలంగాణలో
సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా
నిర్వహిస్తారు
డి) ది ఎండ్ ఆఫ్ యాన్ ఎరా అనే పుస్తక రచయిత లాయక్ అలీ
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) డి 4) ఎ
జ: ‘ది ఎండ్ ఆఫ్ యాన్ ఎరా’
పుస్తక రచయిత కె.ఎం. మున్షీ
‘ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ పుస్తక రచయిత లాయక్ అలీ
4. హైదరాబాద్ రాష్ట్రంలో 1952లో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఏ పార్టీ పేరుతో ఎన్నికల బరిలో నిలిచారు?
1) పీజెంట్స్, వర్కర్స్ పార్టీ
2) సోషలిస్ట్ పార్టీ
3) షెడ్యూల్డ్ క్యాస్ట్ & ఫెడరేషన్ పార్టీ
4) పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ
జ: కమ్యూనిస్ట్ పార్టీ మీద నిషేధం ఉండటం వల్ల పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ పీడీఎఫ్ పార్టీ గుర్తుపై పోటీ చేశారు.
5. కింది వాక్యాలను గమనించండి?
ఎ) తెలంగాణ ప్రాంతీయ కమిటీ
1958లో ఏర్పడింది
బి) తెలంగాణలో మిగులు నిధుల
వినియోగానికి తెలంగాణ ప్రాంతీయ కమిటీ ప్రణాళిక రూపొందిస్తుంది.
సి) తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి అధ్యక్షుడు కె. అచ్యుతరెడ్డి
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
6. 1952లో హైదరాబాద్ హితరక్షణ సమితిని ఏర్పాటు చేసినది?
1) జి.రామాచారి 2) బుచ్చయ్య
3) రామకృష్ణారావు
4) గోవిందరావు దేశ్‌పాండే
జ: 1952లో వరంగల్‌లో జరిగిన గైర్ ముల్కీ ఉద్యమంలో భాగంగా చించోలి ఎమ్మెల్యే జి.రామాచారి హైదరాబాద్ హితరక్షణి సమితిని స్థాపించాడు
7. 1969 తెలంగాణ ఉద్యమకాలంలో ఓయూ ప్రొఫెసర్ల సదస్సులో డా. ‘కె.ఎల్.రావు నాగార్జునసాగర్’ అనే ఆర్టికల్ ప్రచురించి ప్రసంగించిన వారు?
1) ఆర్.విద్యాసాగర్ రావు
2) ప్రొ. జయశంకర్
3) డి.ఎస్.రెడ్డి
4) కాళోజి నారాయణరావు
జ: 1969లో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ‘నీళ్లు-నిధులు’ అనే సదస్సులో ప్రొ. జయశంకర్ నీళ్ల దోపిడీపై ‘డా.కె.ఎల్.రావ్ నాగార్జున సాగర్’ అనే వ్యాసంపై ప్రసంగించారు.
8. 1966లో ఉర్దూ స్థానంలో తెలుగును అధికార భాషగా ప్రకటించిన సమయంలో ఉన్న ముఖ్యమంత్రి?
1) నీలం సంజీవరెడ్డి
2) కాసు బ్రహ్మానందరెడ్డి
3) పీవీ నరసింహారావు
4) మర్రి చెన్నారెడ్డి
జ: 1966 లో ఉర్దూ స్థానంలో తెలుగు భాషను అధికార భాషగా ప్రకటించిన అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి (1964-1971)
9. కింది వాటిని జతపరచండి?
1) తెలంగాణ మృతవీరుల దినం ఎ) 1969, జూలై 10
2) ఇందిరాగాంధీ అష్టసూత్ర పథకం ప్రకటించిన రోజు
బి) 1969 మార్చి 25
3) తెలంగాణ పరిరక్షణల దినం
సి) 1969 మే 17
4) తెలంగాణ ప్రజా సమితి ఏర్పాటు
డి) 1969 ఏప్రిల్ 11
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
10. తెలంగాణలో మిగులు నిధులు వున్నట్లు తేల్చిన కమిటీలు ఏవి?
1) లలిత్ కుమార్ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ
2) భార్గవ కమిటీ, వాంఛూ కమిటీ,
శ్రీకృష్ణ కమిటీ
3) లలిత్ కుమార్ కమిటీ, భార్గవ కమిటీ
4) శ్రీకృష్ణ కమిటీ, వాంఛూ కమిటీ
జ: 1969 ఉద్యమం వల్ల తెలంగాణ మిగులు నిధులపై లెక్కించేందుకు లలిత్‌కుమార్ కమిటీ, వశిష్ట భార్గవ కమిటీ, వాంఛూ కమిటీలు ఏర్పడ్డాయి.
11. కింది వాటిలో ఏ పథకానికి చట్టబద్ధత కల్పిస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ 31(డి) లో పొందుపరిచారు?
1) అష్టసూత్రాల పథకం
2) జీవో నెం. 36
3) ఆరు సూత్రాల పథకం
4) పంచ సూత్రాల పథకం
జ: జై ఆంధ్ర ఉద్యమాన్ని చల్లబర్చడానికి 6 సూత్రాల ప్రకటన ఇందిరాగాంధీ 1973 సెప్టెంబర్ 21న ప్రకటించారు. దీనికి చట్టబద్ధత కల్పిస్తూ 1974 మే నెలలో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 371 (డి) లో పొందుపరిచారు.
12. కింది వాటిలో ఎన్.టి. రామారావుతో సంబంధం ఉన్న కమిటీ?
ఎ) జయభారత్ రెడ్డి నాయకత్వంలో ఆఫీసర్స్ కమిటీ
బి) సుందరేషన్ ఐఏఎస్ కమిటీ
సి) జీవో నెం. 610
డి) జెటో మంగల్దాస్ గిర్గ్లానీ కమిటీ
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి
3) ఎ, బి, సి 4) పైవేవీకాదు
జ: జయభారత్ రెడ్డి ఆఫీసర్స్ కమిటీ, సుందరేశన్ కమిటీ, జీవో నెం 610, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలోని ఆంధ్ర అధికారుల లెక్కలపై వేసిన కమిటీ. జెటో మంగల్దాస్ గిర్గ్లాని కమిటీ వేసినది నారా చంద్రబాబునాయుడు.
13. కింది వాటిని సరిగా జతపరచండి?
1) గొల్లపల్లి సభ ఎ) 1967
2) జగిత్యాల జైత్రయాత్ర బి) 1981
3) ఇంద్రవెల్లి సంఘటన సి) 1978
4) నక్సల్బరి ఉద్యమం డి) 1977
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
14. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) జై తెలంగాణ పార్టీని స్థాపించినది పట్లోళ్ల ఇంద్రారెడ్డి
2) తెలంగాణ రాష్ట్ర పార్టీని స్థాపించినది గాదె ఇన్నయ్య
3) తెలంగాణ సాధన సమితి పార్టీని స్థాపించినది ఆలె నరేంద్ర
4) తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించినది దేవేందర్ గౌడ్
జ: తెలంగాణ ఇంటిపార్టీని స్థాపించినది చెరుకు సుధాకర్
15. కింది వాటిలో సరైనవి ఏవి?
రచయిత పాట
ఎ) అందెశ్రీ – చూడ చక్కాని తల్లి
బి) జయరాజ్ – వందనాలమ్మా
సి) గూడ అంజయ్య – ఊరు మనదిరా
డి) గోరటి వెంకన్న- పల్లె కన్నీరు
పెడుతుందో
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) పైవన్నీ సరైనవే
- అందెశ్రీ తన తల్లి సూరమ్మ మీద పాడిన పాట చూడ చక్కాని తల్లి
- జయరాజ్ వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా
- గూడ అంజయ్య ఊరు మనదిరా ఈ వాడ మనదిరా (ఎర్రసైన్యం సినిమా)
- గోరటి వెంకన్న పల్లె కన్నీరు పెడుతుందో (కుబుసం సినిమా)
16. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి?
ఎ) సాలార్జంగ్ -2 సంస్కరణల్లో
భాగంగా రాజ్యాన్ని 5 సుబాలుగా 17 జిల్లాలుగా విభజించారు.
బి) సిర్పూర్-తాండూర్కి 1877-78 వరకు ఉప జిల్లాగా ఉంది.
1) ఎ, బి సరైనవి
2) ఎ, బి సరికాదు
3) ఎ సరికాదు , బి సరైంది
4) ఎ సరైంది, బి సరికాదు
17. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి?
ఎ) 1856లో ఆధునిక టంకశాల
ఏర్పాటు చేయబడింది
బి) 1857లో నజీర్ఉద్దౌలా పేరు
మీద నాణేలను ముద్రించారు
సి) వీరి కాలంలో నాణేలను
హొన్నులు అనేవారు
1) ఎ, బి, సి సరైనవి
2) ఎ, బి సరికాదు, సి సరైంది
3) ఎ, సి సరైనవి, బి సరికాదు
డి) ఏదీకాదు
18. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానం గుర్తించండి?
ఎ) 1855లో దారుల్ ఉలూమ్ అనే విద్యా సంస్థను ఏర్పాటు చేశారు
బి) ఇది హైదరాబాద్‌లో తొలి పాఠశాల
సి) ఇందులో ఉర్దూలో బోధన ఉండేది
1) ఎ, బి, సి సరైనవి
2) ఎ సరైంది, బి, సి సరికాదు
3) ఎ, బి సరైనవి, సి సరికాదు
4) ఏ, సి సరైనవి, బి సరికాదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు