96వ రాజ్యాంగ సవరణ @ ‘ఒడియా’
1. భారత జాతీయ గీతానికి (National Anthem of India – జనగణమన) సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిశీలించండి.
1. జనగణమన గీతం, వాస్తవానికి
రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో
రచించారు
2. ఇది పాడిన మొదటి రాజకీయ సందర్భం 1896 భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు
పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది/
సరైనవి?
A) 1 B) 2
C) 1, 2 సరైనవే D) 1, 2 సరికావు
సమాధానం: A
వివరణ: రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో రచించిన జనగణమన గీతం హిందీ వెర్షన్లో జనవరి 24, 1950న రాజ్యాంగ సభ ద్వారా భారత జాతీయ గీతంగా స్వీకరించబడింది. ఈ గీతానికి సంగీత బాణీ కూడా ఠాగూరే సృష్టించాడు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది.
డిసెంబర్ 27, 1911న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా పాడారు.
బంకించంద్ర ఛటర్జీ సంస్కృతంలో స్వరపరచిన జాతీయ గేయం (National Song of India – వందేమాతరం) స్వాతంత్య్ర పోరాటంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. జనవరి 24, 1950న రాజ్యాంగ సభ ద్వారా భారత జాతీయ గేయంగా స్వీకరించబడింది. దీనికి జనగణమనతో సమాన హోదా ఉంటుంది. ఇది పాడిన మొదటి రాజకీయ సందర్భం 1896 భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు. ఈ వందేమాతర గీతాన్ని మొదటగా ఆలపించింది రవీంద్రనాథ్ ఠాగూరే కావడం విశేషంగా చెప్పవచ్చు. ఆయన ఈ గేయాన్ని 1896లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో పాడారు.
2. కింది ప్రణాళికలను, వాటిని రూపొందించిన వారితో సరిపోల్చండి.
1. పీపుల్స్ ప్లాన్ – నారాయణ్ అగర్వాల్
2. సర్వోదయ ప్రణాళిక –
జయప్రకాష్ నారాయణ్
3. గాంధేయ ప్రణాళిక – వినోబాభావే
పైన ఇచ్చిన వాటిలో ఎన్ని జతలు సరిగా సరిపోలాయి?
A) ఏదీ కాదు B) ఒకే ఒక జత
C) కేవలం రెండు జతలు
D) మొత్తం మూడు జతలు
సమాధానం: B
వివరణ: భారతదేశంలో ప్రణాళికల పితామహుడు- మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ప్రణాళికలకు సంబంధించిన వివిధ అంశాలను తెలుపుతూ ఇతడు 1934లో Planned Economy for India అనే గ్రంథం రాశారు. బాంబే ప్రణాళిక (Bombay Plan) (1943-44). బొంబాయికి చెందిన ఎనిమిది మంది పారిశ్రామికవేత్తలు A Plan of Econo my development for India అనే పేరుతో Bombay Plan ను రూపొందించారు. బాంబే ప్రణాళికకు పెట్టుబడిదారీ లక్షణాలు ఉన్నాయి. బాంబే ప్లాన్‌ను ‘టాటా బిర్లా ప్లాన్’, ‘పారిశ్రామిక ప్రణాళిక’ అని కూడా అంటారు. ఇది భారీ, మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యాన్నిచ్చింది. ఈ ప్రణాళిక పెట్టుబడి రూ.10,000 కోట్లు. కాల వ్యవధి 15 సంవత్సరాలు. దీని లక్ష్యం తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం. ఈ ప్రణాళిక ద్వారా జాతీయ ఆదాయం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేశారు.
- 1950, జనవరి 1న జయప్రకాశ్ నారాయణ సర్వోదయ ప్రణాళికను ఆచార్య వినోబాభావే ఆశయాలకు అనుగుణంగా, గాంధీజీ సిద్ధాంతాలతో ప్రేరణ పొంది రూపొందించారు.
- గాంధీ ప్రణాళిక (1944): 1944లో గాంధీజీ సిద్ధాంతాలను (సామ్యవాద భావాలు) దృష్టిలో పెట్టుకుని శ్రీమన్నారాయణ అగర్వాల్ రూ.3,500 కోట్ల వ్యయంతో ‘గాంధీ ప్రణాళిక’ను రూపొందించారు. ఈ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి, కుటీర, చేనేత, హస్త కళలకు ప్రాధాన్యం ఇచ్చారు.
- ప్రజా ప్రణాళిక (పీపుల్స్ ప్లాన్- 1945): 1945లో ఇండియన్ లేబర్ ఫెడరేషన్‌కు చెందిన ఎం.ఎన్.రాయ్ ఈ ప్రణాళికను రూపొందించారు. 10 సంవత్సరాల కాలానికి రూ.15,000 కోట్ల వ్యయంతో వ్యవసాయ, వినియోగ వస్తువుల పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యాన్ని ఇచ్చారు. ఈ ప్రణాళిక సామ్యవాద లక్షణాలను కలిగి ఉంది. పరిశ్రమలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. ప్రైవేట్ రంగ పరిశ్రమలను జాతీయీకరణం చేయాలని, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలని ఎం.ఎన్.రాయ్ పేర్కొన్నారు.
పేపర్ ప్లాన్: స్వాతంత్య్రానికి ముందు రూపొందించిన ప్రణాళికలను పేపర్ ప్లాన్ (Paper Plan) అంటారు. వీటిని ప్రభుత్వం అమలు పరచలేదు.
3. కింది వాటిని కాలక్రమానుసారం అమర్చండి.
1. ఆగస్టు ఆఫర్ 2. సిమ్లా సమావేశం
3. క్రిప్స్ మిషన్ 4. క్యాబినెట్ మిషన్ ప్లాన్
కింద ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
A) 1, 2, 3, 4 B) 2, 4, 3, 1
C) 1, 3, 2, 4 D) 4, 2, 3, 1
సమాధానం: C
వివరణ: a) సైమన్ కమిషన్-1927, b) లార్డ్ బిర్కెన్ హెడ్ సవాల్ నెహ్రూ రిపోర్టు-1928, c) ఆగస్టు ఆఫర్/ఆగస్టు ప్రతిపాదనలు-1940 (లార్డ్ లిన్లిత్గో), d) క్రిప్స్ మిషన్/క్రిప్స్ రాయబారం-1942, e) సీఆర్ ఫార్ములా-1944, f) వేవెల్ ప్రణాళిక-1945, g) సిమ్లా సమావేశం-1945, h) క్యాబినెట్ మిషన్ ప్లాన్-1946 (సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏవీ అలెగ్జాండర్, లార్డ్ పెథిక్ లారెన్స్), i) అట్లీ
ప్రకటన-1947, j)
మౌంట్ బాటన్ ప్లాన్-1947.
4. కింది వాటిని సరిపోల్చండి.
1. నాలుగో షెడ్యూల్: రాజ్యసభలో సీట్ల కేటాయింపు
2. ఐదో షెడ్యూల్: అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ర్టాల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన నిబంధనలు
3. ఏడో షెడ్యూల్: కేంద్ర, రాష్ర్టాల మధ్య అధికారాల విభజన
4. తొమ్మిదో షెడ్యూల్: ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కారణంగా న్యాయపరమైన పరిశీలన నుంచి చట్టాలు, నిబంధనల రక్షణ
పైన ఇచ్చిన ఎన్ని జతలు సరిగా సరిపోలాయి?
A) ఒక జత మాత్రమే B) రెండు జతలు
C) మూడు జతలు
D) మొత్తం నాలుగు జతలు
సమాధానం: C
- వివరణ: షెడ్యూల్స్ వివరాలు
- షెడ్యూల్-1: భారత భూభాగం, రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, వాటి పేర్ల విస్తరణ
- షెడ్యూల్-2: రాష్ట్రపతి, రాష్ర్టాల గవర్నర్లు, లోక్‌సభ, విధాన సభల స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, రాజ్యసభ-విధాన పరిషత్‌ల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌ల వేతనాలు
- షెడ్యూల్-3: కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర శాసన సభల సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కాగ్, పార్లమెంట్, రాష్ట్ర శాసన సభలకు పోటీ చేసే అభ్యర్థులు చేయాల్సిన ప్రమాణ స్వీకార విషయాలు
- షెడ్యూల్-4: రాజ్యసభలో వివిధ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించిన సీట్ల వివరాలు
- షెడ్యూల్-5: గిరిజన ప్రాంతాల పాలన
- షెడ్యూల్-6: అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ర్టాలకు చెందిన గిరిజన ప్రాంతాల పాలన
- అసోం షెడ్యూల్ ప్రాంతం: ఉత్తర కచార్ జిల్లా కొండ ప్రాంతం, కర్బి అన్గ్లాంగ్ జిల్లా, బోడోలాండ్ జిల్లాలోని కొంత ప్రాంతం
- మేఘాలయ షెడ్యూల్ ప్రాంతం : కాశీ జిల్లా కొండ ప్రాంతాలు, జయంతియా జిల్లా కొండ ప్రాంతాలు, గారో జిల్లా కొండ ప్రాంతాలు
- త్రిపుర షెడ్యూల్ ప్రాంతం: త్రిపుర గిరిజన ప్రాంత జిల్లా
- మిజోరం షెడ్యూల్ ప్రాంతం: చక్మా జిల్లా, మురా జిల్లా, లాయ్ జిల్లా
- షెడ్యూల్-7: కేంద్ర, రాష్ర్టాల మధ్య అధికార విభజన జాబితాలు 1950లో కేంద్రంలో 97 జాబితాలు, రాష్ట్రంలో 66 జాబితాలు, ఉమ్మడిగా 47 జాబితాలు ఉన్నాయి.
- షెడ్యూల్-8: రాజ్యాంగం గుర్తించిన భాషల వివరాలు ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అందులో తెలుగు, కన్నడం, హిందీ, సంస్కృతం, అస్సామీ, గుజరాతీ, పంజాబీ, ఒరియా, తమిళం, మలయాళం, ఉర్దూ, బెంగాలీ, కశ్మీరి, మరాఠీ భాషలు ఉన్నాయి. ప్రస్తుతం 22 భాషలు గుర్తించారు. 2011లో 96వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒరియాను ‘ఒడియా’గా మార్చారు. 1967లో 21వ రాజ్యాంగ సవరణ ద్వారా సింధీ భాషను, 1992లో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి, మణిపురీ, నేపాలీ భాషలను, 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోంగ్రి, మైథిలి, సంతాలీ భాషలను చేర్చారు. ఎనిమిదో షెడ్యూల్లో ఇంగ్లీష్ భాషను గుర్తించలేదు.
- ఇంగ్లీష్ అధికార భాషగా ఉన్న రాష్ట్రం నాగాలాండ్
- భారత్‌లో మాట్లాడే విదేశీ భాష నేపాలీ
- ప్రాచీన హోదా పొందిన భాషలు: తమిళం-2004, సంస్కృతం-2005, తెలుగు -2008, కన్నడం-2008, మలయాళం-2013, ఒడియా-2014.
- షెడ్యూల్-9: ఇందులో భూసంస్కరణలను వివరించారు. ప్రారంభంలో 13 భూసంస్కరణల చట్టాలు ఉండగా ప్రస్తుతం 284 ఉన్నాయి. తొమ్మిదో షెడ్యూల్‌ను 1951 మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో పొందుపరిచారు.
- షెడ్యూల్-10: ఇందులో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పొందుపరిచారు. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో దీన్ని చేర్చారు. దీన్ని అవకాశవాద రాజకీయాలను అడ్డుకొనేందుకు రూపొందించారు.
- షెడ్యూల్-11: ఇందులో గ్రామ పంచాయతీల వివరాలను చేర్చారు. 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలు నిర్వర్తించాల్సిన 29 విధులను 11వ షెడ్యూల్లో పేర్కొన్నారు.
- షెడ్యూల్-12: ఇందులో మున్సిపాలిటీల వివరాలు చేర్చారు. 1992లో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీలు
నిర్వర్తించాల్సిన 18 విధులను 12వషెడ్యూల్లో పేర్కొన్నారు.
5. కింది స్టేట్మెంట్లను పరిగణించండి.
1. చంద్రయాన్-3 ల్యాండర్ ‘విక్రమ్’ సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రదేశానికి ‘శివశక్తి పాయింట్’ అని పేరు పెట్టారు
2. చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవుతుండగా చంద్రయాన్-2 ల్యాండర్ కూలిన ప్రదేశానికి ‘తిరంగా పాయింట్’ అని పేరు పెట్టారు
3. ఆగస్టు 23న చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యింది. ఈ రోజును ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా జరుపుకొంటారుపైన పేర్కొన్న స్టేట్మెంట్లలో సరైనవి ఏవి?
A) 1 మాత్రమే B) 2 మాత్రమే
C) 1, 3 మాత్రమే D) 1, 2, 3
సమాధానం: (డి)
వివరణ: చంద్రయాన్ -3 ల్యాండర్ ‘విక్రమ్’ సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రదేశానికి ‘శివశక్తి పాయింట్’ అని పేరు పెట్టారు. చంద్రయాన్-2 ల్యాండర్ 2019లో చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవుతుండగా కూలిపోయిన ప్రదేశానికి ‘తిరంగా పాయింట్’ అని పేరు పెట్టారు. చంద్రయాన్-3 ల్యాండర్ ఆగస్టు 23న చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అయ్యింది. ఈ రోజును ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా జరుపుకొంటారు. అందువల్ల మూడు స్టేట్మెంట్లూ సరైనవే.
కె.భాస్కర్ గుప్తా
బీసీ స్టడీసర్కిల్,
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు