స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కోచ్, అసిస్టెంట్ కోచ్ పోస్టులు
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడాశాఖ ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కోచ్, అసిస్టెంట్ కోచ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచిందింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 20 ప్రారంభమవుతాయని, వచ్చే నెల 20 వరకు అప్లయ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 పోస్టులను భర్తీ చేసింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే అభ్యర్థులను ఎంపికచేస్తుంది.
మొత్తం పోస్టులు: 300
ఇందులో కోచ్‌లు 100, అసిస్టెంట్ కోచ్‌లు 200 చొప్పున ఉన్నాయి.
అర్హత: కోచ్ పోస్టుల కోసం కోచింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి లేదా వరల్డ్ చాంపియన్‌షిప్, ఒలింపిక్స్‌లో ఏదోఒక దాంట్లో పథకం గెలవాలి లేదా ఒలింపిక్స్‌లో రెండుసార్లు పాల్గొనాలి లేదా ద్రోణాచార్య అవార్డు అందుకొని 45 ఏండ్ల లోపు ఉండాలి.
అసిస్టెంట్ కోచ్‌కోసం కోచింగ్‌లో డిప్లొమా చేసి ఒలింపిక్స్ లేదా అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనాలి, ద్రోణాచార్య అవార్డుల్లో ఏదోఒకటి అందుకొని 40 ఏండ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 20
దరఖాస్తులకు చివరితేదీ: మే 20
వెబ్సైట్: https://sportsauthorityofindia.nic.in/
- Tags
- Assistant Coach
- coach
- Olympic
- SAI
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు