If you want to grow as a winner | విజేతగా ఎదగాలంటే..

-ఎగ్జిబిషన్ గ్రౌండ్ చాలా సందడిగా ఉంది. రంగు రంగుల విద్యుద్దీపాల కాంతిలో అది మయ సభను తలపిస్తుంది. ఇంకా పూర్తిగా చీకటిపడలేదు. రాము బెలూన్లు జోరుగా అమ్ముతున్నాడు. హీలియం నింపిన బెలూన్లు దారం ముడి విప్పగానే ఆకాశంలోకి ఎగిరిపోయి చిన్నపిల్లలందరినీ ఆకట్టుకుంటున్నాయి. పిల్లలందరూ రాము చుట్టూ చేరి బెలూన్లు కొంటున్నారు.
-ఓ కుర్రాడు చాలాసేపు రాముని, అతడు అమ్మే బెలూన్లను గమనిస్తున్నాడు. రాము ఆ కుర్రాడిని గమనిస్తూనే ఉన్నాడు. ఆ కుర్రాడు రాముని ఏదో అడగాలనుకుంటూనే అడగటానికి వెనుకంజ వేస్తున్నాడు. చివరకు ధైర్యం చేసి దగ్గరగా వచ్చి చిన్న గొంతుతో బిడియపడుతూ అంకుల్ నల్లరంగు బెలూన్లు కూడా మిగతా బెలూన్లలాగా గాలిలో పైకి ఎగురుతాయా? అని అడిగాడు. ఆ కుర్రాడి వంక ఒకసారి తేరిపార చూశాడు రాము. పేదరికం కారణంగా మాసిన పాత దుస్తులు వేసుకున్న ఆ చిన్న కుర్రాడు వివక్షకు గురయ్యాడన్నది అర్థమవుతుంది. అందుకే వాడికి అలాంటి సందేహం రావడంలో ఆశ్చర్యంలేదు.
-ఆ కుర్రాడితో రాము బెలూన్ రంగు ఏదైనా ఎగురుతుందని చెప్పాడు. అది ఎగరడానికి అందులోని హీలియం గ్యాస్ కారణం. ఎగరడానికి బెలూన్లో ఉన్న హీలియం ఎలా కారణమో మనిషి ఎదగడానికి అతని దృక్పథం కారణం. అంతర్లీనంగా రాము చెప్పిన పాయింట్లో దాగున్న అసలు అర్థం వివరించాడు నందు సార్. వీడియోలో షార్ట్ఫిలిం చూపించి వివరించసాగాడు సార్.
-మనం పైకి ఎదగడానికి మనలో అంతర్గతంగా ఉండే అంశాలు దోహదపడతాయి. దీన్నే What is inside makes the difference అని చెప్పవచ్చు. ఒక విజేతగా ఎదగడానికి కావాల్సిన ముఖ్య లక్షణాలు
1) Self Esteem 2) Self confidence
3) Patience 4) Empathy
5) Communication Skills
6) Soft Skills 7) Language Skills
పై పట్టికలో అగ్రభాగాన నిలుస్తున్న అంశం Self Esteem. తెలుగులో చెప్పుకోవాలంటే మనపట్ల మనకు ఉండే గౌరవం అని చెప్పుకోవచ్చు. నీ అనుమతి లేకుండా నిన్ను ఎవరూ కించపర్చలేరు అంటారు మహాత్మాగాంధీ. మనతో మనం ఆనందంగా ఉండటం, మన ప్రస్తుత స్థితిపట్ల ఎటువంటి చిన్నతనం లేకుండా ఉండటం Self Esteem తార్కాణంగా చెప్పుకోవచ్చు. నాకొక లక్ష్యం ఉంది. ఆ దిశగా సాగిపోతున్నాను అనే భావనతో మనం ముందుకెళ్తున్నప్పుడు మన Self Esteem మంచి స్థాయిలో ఉంటుంది. లక్ష్యసాధనలో ఏర్పడే చిన్నచిన్న ఒడిదొడుకులను కూడా ఉత్సాహంగా ఎదుర్కొనగలిగిన ఆత్మైస్థెర్యం మనకు కలుగుతుంది. అంటే మన Self Esteem మనకు Self confidenceను అందిస్తుందని అర్థమైంది కదా!. ఒక స్పష్టమైన గోల్ మనకుంటే మనకు తెలియకుండానే మన Self Esteem మంచి స్థాయిలో ఉంటుంది.
-ఏ పనిపాటా లేకుండా ఖాళీగా గోళ్లు గిల్లుకుంటూ కూర్చునే వ్యక్తికి సహజంగానే తనపై తనకు చిన్నచూపు ఉంటుంది. అది ఆత్మన్యూనతగా మారుతుంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మహాత్రియా రంగరాజన్ చెప్పిన ఇండియన్ పంక్చువాలిటీ అని వ్యంగ్యోక్తి ఒకటుంది. వెళ్లాల్సిన సమయం కన్నా ఆలస్యంగా వెళ్లడం, పైగా అదేం పెద్ద పట్టించుకోవాల్సిన అంశం కాదన్న భావనతో ఉండటం, ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తూనే ఉంటాం. ఐదు నిమిషాలే కదా ఆలస్యంగా వచ్చింది, అదేదో పెద్దనేరం అన్నట్లు మాట్లాడతారేం? అంటూ ఉంటారు కొందరు.
Self Esteemని పెంపొందించుకొనే మార్గాలేంటి?
-చాలా సులభమైన మార్గాలు మీ చేతిలోనే ఉన్నాయి. రోజువారీ పనులను స్పష్టమైన ప్రణాళికతో చేయాల్సిన పనులు అని లిస్ట్ రాసుకొని Things to do today అని చేస్తూ వెళ్లండి. ఆరు నూరైనా, నూరు ఆరైనా అవి చేసుకుంటే వెళ్లండి. చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోండి. అలారం సెట్ చేసుకున్నప్పుడు నిజాయితీగా నిద్రలేవండి. చేస్తానని మాట ఇచ్చిన పనులను చేస్తానన్న టైంకి చేసి మాట నిలబెట్టుకోండి.
RELATED ARTICLES
-
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
-
Scholarship 2023 | Scholarships for Students
-
General Studies | అరుదైన వ్యాధులు.. అసాధారణ లక్షణాలు
-
BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
-
Scholarships 2023
-
Current Affairs March 15 | National Women`s Day celebrated on?
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?