ఏ అంశం పాఠ్యప్రణాళికను ప్రభావితం చేయదు?
లక్ష్యాలు-స్పష్టీకరణలు-ప్రణాళికలు
- ‘తెలంగాణ-నేలలు’ అనే పాఠం అభ్యసించిన తరువాత ఎర్రనేలల్లో పండించే పంటలకు ఉదాహరణలిచ్చిన విద్యార్థిలో పెంపొందిన లక్ష్యం?
1) జ్ఞానం 2) అవగాహన
3) వినియోగం 4) నైపుణ్యం - గణిత బోధన ముఖ్య ఉద్దేశం?
1) లెక్కించడం 2) సరిచూడటం
3) చిత్రనైపుణ్యం
4) హేతువాదం, తార్కికత - కింది వాటిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినది?
1) శాస్త్ర జ్ఞానాన్ని వినియోగించడం
2) అంశాల మధ్య తేడాలు తెలపడం
3) పటాలు గీయడంలో ప్రతిభ చూపడం
4) పరిసరాల్లో ఉన్నవాటిపై ఆసక్తి చూపడం - కింది వాటిలో వైఖరికి చెందిన స్పష్టీకరణ?
1) స్వదేశీ రాజుల అనైక్యతను విద్యార్థి
విమర్శించాడు
2) శివాజీ ధైర్యసాహసాలను విద్యార్థి
కొనియాడాడు
3) అక్బర్ పాలనను విద్యార్థి వర్ణించాడు
4) విద్యార్థి చార్మినార్ను సందర్శించాడు - రాజు అనే విద్యార్థి స్టాంపులను సేకరించాడు. గోపి అనే విద్యార్థి సర్వే చేసి సమాచారం సేకరించాడు. అయితే ఆ ఇద్దరు విద్యార్థుల లక్ష్యసాధనలు వరుసగా?
1) నైపుణ్యం, అభిరుచి
2) అభిరుచి, నైపుణ్యం
3) నైపుణ్యం, నైపుణ్యం
4) అభిరుచి, అభిరుచి - గత నాలుగు దశాబ్దాల్లోని తెలంగాణ జనాభా గణాంక వివరాలను విద్యార్థి అధ్యయనం చేసి 2021లో జనాభా పెరుగుదలను ప్రాగుక్తీకరించాడు. అయితే ఆ విద్యార్థిలో సాధించే లక్ష్యం?
1) జ్ఞానం 2) అవగాహన
3) వినియోగం 4) నైపుణ్యం - అభ్యసన అనే నిచ్చెనలో తొలిమెట్టు?
1) జ్ఞానం 2) అవగాహన
3) వినియోగం 4) నైపుణ్యం - సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సప్లయ్, డిమాండ్ పాఠాన్ని బోధించిన తరువాత M అనే విద్యార్థి వాటి అంశాలను తు.చ. తప్పకుండా అప్పజెప్పితే, N అనే విద్యార్థి వాటి మధ్య తేడాలు స్వయంగా తెలియజేశాడు. అయితే M, N విద్యార్థుల సాధన ఉన్న లక్ష్యస్థాయి?
1) M జ్ఞానం, N అవగాహన
2) M అవగాహన, N జ్ఞానం
3) M జ్ఞానం, N వినియోగం
4) M వినియోగం, N అవగాహన - తరగతి గదిలో విద్యార్థి పరికరాలను ఉపయోగించి గ్రహణాలు ఏర్పడే విధానాన్ని
ప్రదర్శించడం అనేది?
1) అనుకరణ 2) హస్తలాఘవం
3) సునిశితత్వం 4) సమన్వయం - కింది వాటిలో బోధనా లక్ష్యాలకు సంబం ధించి ఫ్రాస్ట్ నియమం కానిది?
1) లక్ష్యాలు ముందుగా నిర్ణయించబడాలి
2) కచ్చితంగా, స్పష్టంగా చెప్పబడాలి
3) అసందర్భంగా, అసందిగ్ధంగా
ఉండకూడదు
4) సాధింపదగినవై, కొలవదగినవై ఉండాలి - ‘అభ్యాసకుడు త్రిభుజ వైశాల్యాన్ని గణించడంలో వేగాన్ని, కచ్చితత్వాన్ని పెంపొందించుకుంటాడు’ అనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ?
1) జ్ఞానం 2) అవగాహన
3) వినియోగం 4) నైపుణ్యం - వేర్వేరు రుతువుల్లో లోలక గడియారం వేగంగానూ, నిదానంగానూ తిరగడానికి కారణాలను విద్యార్థులు తెలుపగలిగితే ఆ స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందినది?
1) జ్ఞానం 2) అవగాహన
3) వినియోగం 4) నైపుణ్యం - ‘Learning by Doing’ అనేది విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాల్లో దేనిని అనుసరిస్తుంది?
1) ప్రయోజన సూత్రం
2) క్రమశిక్షణ సూత్రం
3) పరిరక్షణ సూత్రం 4) వ్యాసక్తి సూత్రం - ‘పరిశోధనల ఆధారంగా విద్యాప్రణాళికను కాలానుగుణంగా సమీక్షించాలి’ ఈ సూచన చేసింది?
1) కొఠారి కమిషన్
2) NPE-86
3) ఈశ్వరీబాయి పటేల్
4) సెకండరీ విద్యాకమిషన్ - తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పీరియడ్ పథకం అని పేర్కొన్నవారు?
1) స్టీవెన్సన్ 2) బోసింగ్
3) ఎల్బీ స్టాండ్
4) బైనింగ్ అండ్ బైనింగ్ - బోధన ముఖ్యంగా లక్ష్యాల కేంద్రంగా ఉండాలనేది ఏ నమూనా ప్రధాన ఉద్దేశం?
1) హెర్బర్ట్ నమూనా
2) మోరిసన్ నమూనా
3) మూల్యాంకన ధార నమూనా
4) RCEM నమూనా - భావ విస్తరణ జరిగి, భావనలు పునరావృతం కావడం ఏ విధాన లక్షణం?
1) శీర్షిక 2) ఏకకేంద్ర
3) సర్పిల 4) కాలక్రమ - వాస్తవ సంఖ్యల గురించి పూర్తిగా 7వ తరగతిలోనే బోధించి 8, 9, 10 తరగతుల్లో వీటి గురించి ఎటువంటి బోధన చేయకపోయినా ఆ విద్యాప్రణాళిక ఏర్పాటు పద్ధతి?
1) శీర్షిక 2) ఏకకేంద్ర
3) సర్పిల 4) కాలక్రమ - సైన్స్ పాఠ్య ప్రణాళికకు సంబంధించి కింది వాటిలో మార్గదర్శక సూత్రం కానిది?
1) బడి బయట జ్ఞానాన్ని మన బోధనతో అనుసంధానించాలి
2) కంఠస్థం చేసే పద్ధతుల నుంచి మన బోధనను దూరం చేయాలి
3) పరీక్షల్ని సరళీకరించి తరగతి జీవితంతో వాటిని సమైక్యం చేయాలి
4) సూత్రాలను జ్ఞప్తికి తెచ్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి - ఏ అంశం పాఠ్యప్రణాళికను ప్రభావితం చేయదు?
1) నిర్వహణ-పర్యవేక్షణ
2) తల్లిదండ్రుల నిర్ణయాలు
3) పరీక్షలు-మూల్యాంకనం
4) మార్గదర్శకత్వం
పూసల చట్రం ఉపయోగం?
బోధనా పద్ధతులు – TLM
- ఆధునిక బోధనా పద్ధతులకు మూలపురుషుడు?
1) జాన్ డ్యూయీ 2) బెంజిమన్ బ్లూమ్
3) కొమినియస్ 4) కిల్ పాట్రిక్ - బోధనా పద్ధతికి వ్యతిరేక భావన?
1) ఆశించిన లక్ష్యాలు సాధిస్తుంది
2) దీర్ఘకాలిక స్మృతికి దారితీస్తుంది
3) అభ్యసనలో విసుగు తొలగిస్తుంది
4) అభ్యసనాన్ని అసంపూర్ణం చేస్తుంది - వృత్త పరిధి సూత్రాన్నిస్తే దాని నుంచి వృత్త వైశాల్య సూత్రం కనుగొనే పద్ధతి?
1) ఆగమన పద్ధతి 2) నిగమన పద్ధతి
3) సంశ్లేషణ పద్ధతి 4) విశ్లేషణ పద్ధతి - ‘పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కొవిడ్ నిబంధనలు అడ్డుపడుతాయా?’ అనే అంశంపై విద్యార్థి సమగ్ర విషయ పరిజ్ఞానం పొందడానికి అనువైన బోధనా పద్ధతి?
1) ఉపన్యాస పద్ధతి 2) ప్రాజెక్ట్ పద్ధతి
3) చర్చాపద్ధతి
4) సమస్యా పరిష్కార పద్ధతి - కింది వాటిలో నిర్మాణాత్మక ప్రకల్పన?
1) బంకమట్టితో నమూనాలు
2) పజిల్స్ పూరించడం
3) క్షేత్రపర్యటనలు 4) సర్వే చేయడం - సాధారణ సమస్యలు వేగంగా సాధించడానికి, ప్రవచనాలు-సిద్ధాంతాలు రుజువు చేసే మార్గాన్ని తెలుసుకోవడానికి, బోధనా విధానం దత్తాంశం నుంచి సారాంశం దిశలో సాగే పద్ధతి?
1) విశ్లేషణ 2) సంశ్లేషణ
3) అన్వేషణ 4) ప్రయోగశీల పద్ధతి - రాము అనే ఉపాధ్యాయుడు 7వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిగమన పద్ధతి ద్వారా బోధన చేస్తూ ఉన్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఆయా విద్యార్థుల్లో ఏ లక్ష్యం సాధించాడు?
1) జ్ఞానం 2) అవగాహన
3) వినియోగం 4) నైపుణ్యం - కింది వాటిలో అన్వేషణ పద్ధతి ద్వారా బోధించడానికి అవకాశం లేని అంశం?
1) త్రిభుజ ధర్మాలు
2) లీపు సంవత్సర ధర్మాలు
3) గది నాలుగ్గోడల వైశాల్యం
4) రామానుజన్ జీవితచరిత్ర - బోధన అంటే?
1) తెలియని విషయాలను తెలిసిన వ్యక్తుల నుంచి తెలుసుకోవడం
2) తెలిసిన విషయాలను తెలిసిన వ్యక్తులకు తెలియజేయడం
3) తెలియని విషయాలను తెలుసుకోకుండా ఉండటం
4) తెలిసిన విషయాలను తెలియని వ్యక్తులకు తెలియజేయడం - జ్యామితిలోని సిద్ధాంతాలు, సమస్యలు, నిర్మాణాలు, క్షేత్ర గణితంలోని సమస్యలు మొదలైనవి సులువుగా పరిష్కరించడానికి ఉపయోగపడే పద్ధతి?
1) పునఃప్రవచన పద్ధతి 2) విశ్లేషణ పద్ధతి
3) చిత్రీకరణ పద్ధతి 4) సాదృశ్యాల పద్ధతి - భూగోళంపై వివిధ ప్రాంతాల పర్వతాలు, సముద్ర ప్రవాహాలు ఉష్ణోగ్రత విస్తృతి, వర్షపాతం, అడవులు మొదలైన సమాచారాన్ని అందించే మ్యాపులు?
1) భౌగోళిక మ్యాపులు
2) ప్రత్యేక మ్యాపులు
3) రాజకీయ మ్యాపులు
4) రిలీఫ్ మ్యాపులు - ‘స్వాతంత్య్రోద్యమం’ అనే పాఠ్యాంశ బోధనకు ఉపాధ్యాయుడు వినియోగించిన ‘తోలుబొమ్మలు’ అనేవి ఏ రకమైన బోధనోపకరణాలు?
1) త్రిమితీయ ఉపకరణాలు
2) ప్రక్షేపక ఉపకరణాలు
3) శ్రవణ ఉపకరణాలు
4) గ్రాఫిక్ ఉపకరణాలు - హెర్బేరియం విధానంలో మొక్క భాగాలకు బూజు పట్టకుండా ఉండటానికి మెర్క్యురిక్ క్లోరైడ్ ఎంత పరిమాణం వాడాలి?
1) 100 ml 2) 1/2 gr
3) 100 gr 4) 1/2 ml - సమాజాన్ని పాఠశాలలోకి కింది ఏ సందర్భంలో తీసుకురావచ్చు?
1) సహజ వనరులు వినియోగించడం
2) స్థానిక వనరులు వినియోగించడం
3) తల్లిదండ్రుల సమావేశం
4) ర్యాలీలు చేయడం - పూసల చట్రం ఉపయోగం?
1) భిన్నాలు చూపించవచ్చు
2) స్థాన విలువలు గణించవచ్చు
3) వైశాల్యాలు లెక్కించవచ్చు
4) గుణకారాలు నేర్పించవచ్చు - OBBలోని మౌలికాంశం?
1) భౌతిక వసతుల కల్పన
2) అత్యవసర బోధనా సామగ్రి అందించడం
3) ఏకోపాధ్యాయ పాఠశాలలకు రెండో ఉపాధ్యాయుడిని నియమించడం
4) విద్యార్థులకు క్షేత్రపర్యటనలు తరచుగా నిర్వహించడం - నల్లబల్లను ఉపయోగించేటప్పుడు ఉపాధ్యాయుడు తీసుకునే జాగ్రత్త కానిది?
1) తుడిచేటప్పుడు కింద నుంచి పైకి తుడవాలి
2) కుడివైపు మొదలు పెట్టి ఎడమవైపునకు రాయాలి
3) తేదీ, తరగతి కుడివైపు పై భాగంలో రాసి ఉండాలి
4) రాసిన అంశం స్పష్టంగా, దోష రహితంగా ఉండాలి - ఎడ్గార్ డేల్ ప్రతిపాదించిన అనుభవ శంఖువులో ‘కలుపుతీయడం, పంట కోతలు’ అనే భావన వివరించడానికి ఎన్నుకోదగ్గ ఉత్తమ అభ్యసన అనుభవ రకం?
1) ప్రదర్శనలు 2) నాటకీకరణ
3) క్షేత్రపర్యటనలు 4) నమూనాలు - కింది వాటిలో ఏ జ్ఞానేంద్రియం ద్వారా జరిగే అభ్యసన అతి తక్కువ శాతం?
1) కన్ను 2) ముక్కు
3) చెవి 4) నాలుక - హంటర్ స్కోర్ కార్డు ప్రకారం?
ఎ. మనోవైజ్ఞానికం 1. 100 పాయింట్లు
బి. విషయం 2. 300 పాయింట్లు
సి. అభ్యాసాలు 3. 250 పాయింట్లు
డి. భౌతికరూపం 4. 140 పాయింట్లు
1) ఎ-3, బి-4, సి-2, డి-1
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-2, బి-1, సి-4, డి-3
- Tags
- School education
- Teachers
Previous article
ఐకార్ ఏఐఈఈఏ 2021
Next article
సీపీగెట్-2021
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు