సీపీగెట్-2021
తెలంగాణ రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ సెట్ (సీపీగెట్) నోటిఫికేషన్ విడుదలైంది. 45 పీజీ కోర్సులతో పాటు, మరో నాలుగు పీజీ డిప్లొమా, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో సీపీగెట్ ఎంట్రన్స్ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. జూలై 30 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా, ఇప్పటి వరకు వెయ్యి మంది దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్‌లో కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ (సీబీటీ)లో పరీక్ష ఉంటుంది. పీజీ కోర్సులకు సంబంధిత డిగ్రీలో, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగాంకు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులు సింగిల్ సబ్జెక్టుకు రూ.800, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.600. ఒకటి కంటే అధికంగా దరఖాస్తు చేసేవారు ఒక్కో సబ్జెక్టుకు రూ.450 చొప్పున ఫీజు చెల్లించాలి. ఫీజు టీఎస్, ఏపీ ఆన్లైన్ కేంద్రాలతో పాటు, క్రెడిట్‌కార్డు, డెబిట్‌కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
యూనివర్సిటీలు: ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్టీయూ.
కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంసీజే, ఎంఎల్ఐసీ, ఎంఈడీ, ఎంపీఈడీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్ వెస్ట్ (కూకట్పల్లి, పటాన్చెరువు ఏరియా), హైదరాబాద్ నార్త్ (మేడ్చల్, గండిమైసమ్మ, ఓల్డ్ అల్వాల్ ఏరియా), హైదరాబాద్ ఈస్ట్ (మల్లాపూర్, ఘట్కేసర్ ఏరియా), హైదరాబాద్ సౌత్ (ఎల్బీ నగర్, హయత్‌నగర్, కర్మాన్‌ఘాట్ ఏరియా), ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్, నిజామాబాద్, కోదాడ.
కొత్త కోర్సులు: జేఎన్టీయూలో ఎమ్మెస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ కోర్సులను ప్రవేశపెట్టగా, పాలమూరులో కొత్తగా 5 కోర్సులు, మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఎంపీఈడీ.
అనర్హులు: బీకాం విద్యార్థులు ఎంఏ ఎకనామిక్స్, బీఈ, బీటెక్, బీఫార్మసీ పూర్తిచేసినవారు ఎంఏ భాషల్లో చేరేందుకు అనర్హులు. బీఫార్మసీ, బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ హోంసైన్స్, బీటెక్, బీఈ గ్రాడ్యుయేట్లు ఎమ్మెస్సీ కోర్సులకు అనర్హులు. బీఈ, బీటెక్ చేసినవారు ఎమ్మెస్సీ (జియో ఇన్ఫర్మాటిక్స్)లో చేరవచ్చు. బీఈ, బీటెక్ చేసినవారు ఎమ్మెస్సీ కంప్యూటర్‌సైన్స్, గణితం, ఎలక్ట్రానిక్స్‌కు అనర్హులు. సింగిల్ సబ్జెక్ట్‌తో ఓపెన్, డిస్టెన్స్ మోడ్‌లో డిగ్రీ పూర్తిచేసిన వారు పీజీ కోర్సుల్లో చేరడానికి అనర్హులు.
వెబ్సైట్: www.osmania http://www.osmania.ac.in,
www. cpget.tsche.ac.in,
www.tscpget.com, www.ouadmissions.com http://www.ouadmissions.com
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల సమర్పణకు తుది గడువు:
ఆగస్టు 25
రూ.500 ఫైన్‌తో: ఆగస్టు 30
రూ.2వేల ఫైన్‌తో: సెప్టెంబర్ 3
పరీక్షల ప్రారంభ తేదీ (అంచనా): సెప్టెంబర్ 8
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు