ఐకార్ ఏఐఈఈఏ 2021
అగ్రికల్చర్ రంగం.. దేశంలో అత్యధిక శాతం ప్రజల జీవనాధారం వ్యవసాయం. ప్రపంచ మనుగడ అంతా వ్యవసాయంమీదనే ఆధారపడి ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. మానవాళి మనుగడ ఉన్నంత వరకు అగ్రికోర్సులకు డిమాండ్ ఉంటుంది. అగ్రికల్చర్, దీని అనుబంధ రంగాల్లో ఏటేటా కొత్త కొత్త అవకాశాలు వస్తున్నాయి.
ఆకర్షణీయమైన జీతభత్యాలతోపాటు సంతృప్తినిచ్చే రంగం ఇది. నిత్యం చాలెంజింగ్‌గా ఉండే
అగ్రికల్చర్ రంగంలో ప్రవేశించాలనుకునేవారికి జాతీయస్థాయిలో నిర్వహించే ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్‌ను ఎన్టీఏ
విడుదల చేసింది. ఈ నేపథ్యంలో డిగ్రీ, పీజీ కోర్సుల గురించి సంక్షిప్తంగా..
ఐకార్
- ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐకార్) కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలో ఉంటుంది. ఈ సంస్థ పరిధిలో దేశవ్యాప్తంగా 74 అగ్రికల్చరల్ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో 64 రాష్ట్ర అగ్రికల్చరల్, వెటర్నరీ, హార్టికల్చరల్, ఫిషరీస్ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటితోపాటు నాలుగు ఐకార్-డీయూలు, మూడు సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలు, నాలుగు సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి.
- నేషనల్ అగ్రికల్చరల్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్టెన్షన్ సిస్టమ్ (ఎన్ఏఆర్ఈఈఎస్) ప్రపంచంలోని అతిపెద్ద అగ్రికల్చరల్ రిసెర్చ్ సిస్టమ్స్‌లో ఒకటి. ఏటా యూజీ స్థాయిలో 28 వేలు, పీజీ, డాక్టోరల్ స్థాయిలో పదిహేడున్నర వేలమంది అగ్రికల్చరల్, అలైడ్ సైన్సెస్‌లో ప్రవేశాలు పొందుతున్నారు.
- యూజీ, పీజీ, పీహెచ్డీ ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో ఐకార్ ఒప్పందం చేసుకుంది.
ఐకార్ ఏఐఈఈఏ (యూజీ/పీజీ)
ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్
డిగ్రీ, పీజీ స్థాయిల్లో ప్రవేశాల కోసం వేర్వేరుగా ఎంట్రన్స్ టెస్ట్‌లను నిర్వహిస్తారు.
ఐకార్ ఏఐసీఈ-జేఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ) ఎంట్రన్స్‌తో పీహెచ్డీ ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హతలు
యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇంటర్ ఉత్తీర్ణత.
2021, ఆగస్ట్ 31 నాటికి 16 ఏండ్లు నిండి ఉండాలి.
యూజీ కోర్సులు
- బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్
- బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్
- బీఎఫ్ఎస్సీ
- బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ
- బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్
- ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటిక్స్
- బీఎస్సీ (ఆనర్స్) సెరికల్చర్
- బీటెక్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్
- బీటెక్ డెయిరీ టెక్నాలజీ
- బీటెక్ ఫుడ్ టెక్నాలజీ
- బీటెక్ బయో టెక్నాలజీ
ఐకార్- ఏఐఈఈఏ పీజీ కోర్సులు
పీజీ స్థాయిలో ప్లాంట్ బయెటెక్నాలజీ, ప్లాంట్ సైన్సెస్, ఎంటమాలజీ, ఫిజికల్ సైన్స్, ఆగ్రోనమీ, సోషల్ సైన్సెస్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ తదితరాలు ఉన్నాయి.
అర్హతలు
పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత
పీహెచ్డీ
సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం
యూజీ, పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష కాలవ్యవధి 150 నిమిషాలు (యూజీ పరీక్ష)
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు
హైదరాబాద్/సికింద్రాబాద్/ రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: ఆగస్ట్ 20
దరఖాస్తు ఫీజు: జనరల్ రూ.770/-,
ఓబీసీ, ఎన్‌సీఎల్‌కు రూ.750/-,
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, ట్రాన్స్జెండర్లకు రూ.375/-
పరీక్ష తేదీలు: 2021, సెప్టెంబర్ 7, 8, 13
వెబ్సైట్: https://icar.nta.ac.in
- Tags
- AIEEA
- Icar AIEEA
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు