ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రముఖ ఎన్జీవోలతో కలిసి ఫెలోషిప్ అందిస్తున్నది. దీనికోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 30 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. 2021-22 విద్యాసంవత్సరానికిగాను ఈ ఫెలోషిప్‌ను అందిస్తున్నది.
ఇందులో ది యాంట్, ది ఉర్ముల్ రూరల్ హెల్త్, చిరాగ్, సేవా భారత్, రాష్ట్రీయ గ్రామీణ్ వికాస్ నిధి (ఆర్జీవీఎన్), ద ఎమ్మెస్ స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్), సీవా మందిర్, గ్రామ్ వికాస్, డీహెచ్ఏఎన్ ఫౌండేషన్, బేర్‌ఫుట్ కాలేజీ, బీఏఐఎఫ్ డెవలప్మెంట్ రిసెర్చ్ ఫౌండేషన్, ఆగా ఖాన్ రూరల్ సపోర్ట్ ప్రోగ్రామ్ (ఇండియా), ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా వంటి ఎన్జీవోలు పాలుపంచుకుంటున్నాయి. ఫెలోషిప్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
అర్హతలు: డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
ఫెలోషిప్: ప్రతి నెల రూ.15,000, అలవెన్స్ కింద రూ. 1000లు 13 నెలలపాటు ఇస్తారు. ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 30 వెబ్సైట్: https://youthforindia.org
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఇండియాకు అండగా 40 టాప్ అమెరికన్ కంపెనీల సీఈవోల టాస్క్‌ఫోర్స్
పడకగదిలో దూరిన కోడె నాగు..వీడియో
ఆస్పత్రిలో గొడవ.. డాక్టర్‌ను చెంపదెబ్బ కొట్టిన నర్సు, నర్సుపై డాక్టర్ దాడి.. వీడియో
ఊపిరులూదినా.. ప్రాణం నిలువలే!
భారత్‌కు మే 1న ‘స్పుత్నిక్-వీ’ మొదటి బ్యాచ్ : ఆర్డీఐఎఫ్
ఇంటికి ఎవర్నీ రానివ్వొద్దు!
ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం
- Tags
- Fellowship
- India
- sbi
- youth
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు