ఐఐఎస్ఆర్ తిరుపతిలో పీహెచ్డీ ప్రవేశాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఆర్) వచ్చే విద్యాసంవత్సరానికిగాను వివిధ కోర్సుల్లో పీహెచ్డీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలయింది. అర్హులైన అభ్యర్థుల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులు వచ్చేనెల 23 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనుంది. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, మ్యాథ్స్, ఎర్త్‌సైన్సెస్‌లో పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనుంది.
అర్హత: డిగ్రీ 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. అందేవిధంగా సీఎస్ఐఆర్ లేదా యూజీసీ నెట్, ఇన్స్పైర్ పీహెచ్డీ ఫెలోషిప్స్లో అర్హత సాధించాలి. అభ్యర్థులు 28 ఏండ్లలోపువారై ఉండాలి.
ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ
సబ్జెక్టులు: బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్
అర్హత: డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత జేజీఈఈఐఎల్ఎస్/జామ్-2021 లేదా జస్ట్ అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ: మే 23
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 11 నుంచి 25 మధ్య
ఫలితాలు: జూన్ 26-జూలై 5 మధ్య
పీహెచ్‌డీలో ప్రవేశాలు: ఆగస్టు 2
వెబ్సైట్: http://www.iisertirupati.ac.in/admissions/phd
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు