ఒకే నోటిఫికేషన్తో ‘ఇంజినీరింగ్’ కొలువుల భర్తీ
#అన్ని శాఖల ఇండెంట్లు వచ్చాక ప్రకటన
# టీఎస్పీఎస్సీ ప్రాథమికంగా నిర్ణయం
ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఇంజినీరింగ్ ఉద్యోగ ఖాళీలన్నింటినీ ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ విభాగాల్లో 1,433 ఇంజినీర్లు సహా సాంకేతిక పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ మంగళవారం జీవోలు జారీచేసిన విషయం తెలిసిందే. ఆయా పోస్టులన్నింటినీ టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీచేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. వీటిలో ఇంజినీర్ పోస్టులే అధికంగా ఉన్నాయి. వీటితోపాటు నీటి పారుదలశాఖ, ఆర్అండ్బీ, టీఎస్ఈడబ్ల్యూసీడీ తదితర విభాగాల్లోని పోస్టులను కూడా కలిపి ఉమ్మడి నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ఆయా పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలపగానే ఇండెంట్లు సేకరించి నోటిఫికేషన్ జారీచేయాలని యోచిస్తున్నారు. అయితే పరీక్షలు మాత్రం విభాగాలవారీగా ఉంటాయని అధికారులు తెలిపారు.
నోటిఫికేషన్లు ఇలా..
– అన్ని ఇంజినీరింగ్ విభాగాల్లోని సివిల్ పోస్టులన్నింటినీ కలిపి ఒకే నోటిఫికేషన్ జారీచేస్తారు. వీరికి ఒకే ప్రశ్నపత్రం ఇస్తారు. ఫలితాలను ప్రకటించి విభాగాలవారీగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
– ఎలక్టికల్, మెకానికల్ పోస్టులన్నింటి పైన చెప్పుకొన్న ఫార్ములానే పాటిస్తారు.
- Tags
- engineering
- Notification
- TSPSC
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు