TET GRAND TEST PAPER-I ( పోటీ పరీక్షల ప్రత్యేకం-1)
సమయం: 2 గం: 30 ని. గరిష్ఠ మార్కులు : 150
సైకాలజీ
1. థార్న్ డైక్ CAVD ప్రజ్ఞా పరీక్షలో C అనే అక్షరం సూచించే సామర్థ్యం?
1) వాక్య పూరణం 2) అవగాహన
3) పదజాలం 4) పద ధారాళత
2. వ్యక్తి తన అనుభవాలను, అంతర్గత భావాలను, ఆలోచనలను విశ్లేషించుకుని నివేదించే పద్ధతి?
1) పరిశీలనా పద్ధతి
2) వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి
3) ప్రయోగాత్మక పద్ధతి
4) అంతఃపరిశీలనా పద్ధతి
3. ఒక 9 ఏండ్ల బాలుడు.. 8 ఏండ్ల బాలుడికి నిర్దేశించిన అంశాలను మాత్రమే పూర్తిచేయగలిగినట్లయితే అతని ప్రజ్ఞాలబ్ధి?
1) 112.5 2) 88.8
3) 102.5 4) 98.8
4. కింది వాటిలో వికాస లక్షణం కానిది?
1) గుణాత్మకమైనది 2) సమగ్రమైనది
3) అంతర్గతమైన చర్య
4) ఒక ప్రత్యేకాంశానికి పరిమితం
5. ఏ రకమైన బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు సంరక్షకుల అవసరంగల వికలాంగులుగా పరిగణించబడుతారు?
1) స్వల్ప బుద్ధిమాంద్యులు
2) మిత బుద్ధిమాంద్యులు
3) తీవ్ర బుద్ధిమాంద్యులు
4) అభ్యసన వైకల్యంగలవారు
6. పిల్లల వ్యక్తిగత భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం ద్వారానే ఒక దేశం అభివృద్ధి సాధిస్తుందని చెప్పినవారు?
1) జాన్ డ్యూయీ 2) టెర్మన్
3) థార్న్డైక్ 4) జీన్ పియాజె
7. వ్యక్తిని చతురునిగా, సాత్విక స్వభావునిగా, మానసిక స్థిరత్వం కలిగినవాడిగా తయారుచేసే హార్మోన్లను స్రవించే గ్రంథి?
1) అవటు గ్రంథి
2) పార్శ అవటు గ్రంథి
3) పిట్యూటరీ గ్రంథి
4) అడ్రినల్ గ్రంథి
8. వ్యక్తి శారీరక ఆత్మప్రతిమ, మానసిక ఆత్మప్రతిమ పరిపక్వత చెందే దశ?
1) బాల్యదశ 2) కౌమార దశ
3) మధ్య వయస్సు 4) వయోజన దశ
9. ఒక అబ్బాయికి చదవడం ఇష్టం లేదు, అలాగని పరీక్షలో ఫెయిల్ అవడమూ ఇష్టం లేదు – ఇక్కడి సంఘర్షణ?
1) ఉపగమ – ఉపగమ
2) ద్వి ఉపగమ – పరిహార
3) పరిహార – పరిహార
4) ఉపగమ – పరిహార
10. ఎరిక్సన్ ప్రకారం సమాజానికి ఉపయోగపడే సృజనాత్మక, ఉత్పాదక కృత్యాల్లో పాల్గొనే వ్యక్తుల మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి?
1) ఉత్పాదకత Vs స్తబ్దత
2) సన్నిహితత్వం Vs ఏకాంతం
3) శ్రమించడం Vs న్యూనత
4) చిత్తశుద్ధి Vs స్తబ్దత
11. ఐస్క్రీమ్ ఇస్తానంటే చదువుకుంటాననే పిల్లవాడి నైతిక దశ?
1) 3వ దశ – సాంప్రదాయ స్థాయి
2) 2వ దశ – పూర్వసాంప్రదాయ స్థాయి
3) 1వ దశ – పూర్వసాంప్రదాయ స్థాయి
4) 4వ దశ – సాంప్రదాయ స్థాయి
12. ఉన్నట్లుండి ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తి చిన్నపిల్లవాడిలా ఏడవటంలో రక్షకతంత్రం?
1) ప్రక్షేపణం 2) ప్రతిగమనం
3) పరిహారం 4) దమనం
13. వైగోట్స్కీ ప్రకారం పిల్లలు..
1) పునర్బలనం ఇచ్చినప్పుడే నేర్చుకుంటారు
2) పెద్దలు, సమవయస్కులతో ప్రతిచర్యలు
జరపడం ద్వారా నేర్చుకుంటారు
3) అనుకరణ ద్వారా నేర్చుకుంటారు
4) అంతర్దృష్టి ద్వారా నేర్చుకుంటారు
14. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతోపాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది. దీన్ని కింది విధంగా చూపవచ్చు.
1) CR+CS – UCR
2) UCS+CS – CR
3) UCS+UCR – CR
4) CS+UCS – UCR
15. 25 అర్థరహిత పదాలుగల జాబితాను శ్రీధర్ 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. రెండు నెలల తర్వాత మళ్లీ అదే జాబితాను తిరిగి నేర్చుకొమ్మనగా అతను 16 ప్రయత్నాలు తీసుకున్నాడు. శ్రీధర్ పొదుపు గణన?
1) 16 శాతం 2) 4 శాతం
3) 20 శాతం 4) 40 శాతం
16. మాస్లోవ్ ప్రకారం.. దాదాపు అందరు వ్యక్తులు మొదట సంతృప్తిపర్చుకోవడానికి ప్రయత్నించే అవసరం?
1) శారీరక అవసరం 2) రక్షణ అవసరం
3) ప్రేమ, సంబంధిత అవసరం
4) గుర్తింపు అవసరం
17. అభ్యసనం గురించి సరైన ప్రవచనం?
1) అభ్యసన అభ్యాసకుని ఉద్వేగాలతో ప్రభావితం కాదు
2) అభ్యసనకు పరిపక్వతతో సంబంధం లేదు
3) అభ్యసనం పరిపక్వత, ఉద్వేగాలచే ప్రభావితమవుతూ ఉంటుంది
4) అభ్యసన మన ప్రవర్తనలో కొన్ని అంశాలను మాత్రమే ప్రభావితం చేస్తుంది
18. సంస్కృతం నేర్చుకున్న వ్యక్తి హిందీ నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు?
1) ద్విపార్శ బదలాయింపు
2) శూన్య బదలాయింపు
3) ప్రతికూల బదలాయింపు
4) అనుకూల బదలాయింపు
19. తిరోగమన అవరోధంలో..
1) గతంలో నేర్చుకున్న విషయం ప్రస్తుతం అభ్యసన ధారణపై ప్రభావం చూపుతుంది
2) ప్రస్తుత అభ్యసన, గత అభ్యసనమును పునఃస్మరణ చేయడంలో ఆటంకం కలిగిస్తుంది
3) ప్రస్తుత అభ్యసన, గత అభ్యసన పునఃస్మరణకు సాయపడుతుంది
4) ప్రస్తుత అభ్యసన పునఃస్మరణపై గత అభ్యసన ప్రభావం ఉండదు
20. ఫలిత సూత్రాన్ని ప్రతిపాదించినవారు?
1) వాట్సన్ 2) థార్న్డైక్
3) పావ్లోవ్ 4) బండూరా
21. అభ్యాసకుడు స్థిరమైన జీవిత తత్వాన్ని దేని ద్వారా అభివృద్ధిపర్చుకుంటాడు?
1) హస్తలాఘవం 2) స్వభావీకరణ
3) భావన నిర్మాణం 4) శీలస్థాపన
22. ఆకృతీకరణ భావన దేనికి సంబంధించినది?
1) శాస్త్రీయ నిబంధన
2) కార్యసాధక నిబంధన
3) అంతర్దృష్టి అభ్యసన
4) యత్నదోష సిద్ధాంతం
23. బుద్ధిమాంద్యుల విద్యలో పునర్బలనంతో సంబంధం లేనిది?
1) క్రమీణ ఆస్తిత్వం 2) ఆకృతీకరణ
3) గొలుసు విధానం 4) త్వరణం
24. సహభాగి, సహకార అభ్యసనానికి సంబంధించి సరైన ప్రవచనం?
1) విద్యార్థులు నేర్చుకునే విషయానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది
2) ఉపాధ్యాయుల విషయజ్ఞానానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది
3) ఉపాధ్యాయుల మధ్య పరస్పర చర్యలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది
4) విద్యార్థుల మధ్య పరస్పర చర్యలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది
25. ఆవిష్కరణ అభ్యసనంగా ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం?
1) బ్రూనర్ బోధనా సిద్ధాంతం
2) థార్న్డైక్ యత్న-దోష సిద్ధాంతం
3) బండూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం
4) స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం
26. బోధనా విషయం విద్యార్థులకు అందించే హెర్బర్ట్ సోపానం?
1) సన్నాహం 2) సంసర్గం
3) సమర్పణ 4) అన్వయం
27. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం 6 నుంచి 8 తరగతులకు నిర్ధారించిన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి?
1) 1:25 2) 1:30
3) 1:35 4) 1:40
28. నిర్మాణాత్మక మదింపులో ప్రాజెక్టు పనులకు ఇచ్చిన భారత్వం?
1) 10 శాతం 2) 20 శాతం
3) 30 శాతం 4) 40 శాతం
29. కింది వాటిలో జాతీయ విద్యాప్రణాళికా చట్రం – 2005లో పనివిద్యకు సంబంధించిన భావన కానిది?
1) పనివిద్య సంస్థాగతం చేయబడాలి
2) పనివిద్య ద్వారా నైపుణ్యంగల పనివారిని తయారు చేయడం
3) ఉత్పత్తిదాయక పనిని జ్ఞాన సంపాదనకు బోధనా మాధ్యమంగా మలచాలి
4) పనివిద్య బళ నైపుణ్యాల సాధనకు సాయపడాలి
30. మార్గదర్శనం గురించి తప్పు ప్రవచనం?
1) సర్దుబాటు సమస్యలుగల విద్యార్థులకు మార్గదర్శనం అవసరం
2) చదువుపట్ల అనాసక్తిగల విద్యార్థులకు మార్గదర్శనం అవసరం
3) కుటుంబ సమస్యలుగల విద్యార్థులకు మార్గదర్శనం అవసరం
4) పాఠశాలపట్ల ప్రతికూల వైఖరిగల విద్యార్థులకు మార్గదర్శనం అవసరం
తెలుగు
31. కామారి అనే పదానికి వ్యుత్పత్యార్థం?
1) చేతులు జోడించి చేయునది
2) వయస్సుకు నిధి వంటిది
3) తీవ్రంగా పోవునది
4) మన్మధునికి శత్రువు
32. తెలుగు సంవత్సరాలు 60. అయితే అంగీరస సంవత్సరం తర్వాత వచ్చే తెలుగు సంవత్సరం ఏది?
1) శ్రీముఖ 2) ప్రజోత్పత్తి
3) తారణ 4) ఈశ్వర
33. నిజమూహింప అనే పదాన్ని విడదీసి, ఏ సంధి కార్యమో పేర్కొనండి?
1) నిజము+ఊహింప – సవర్ణదీర్ఘసంధి
2) నిజము+ఊహింప – అత్వసంధి
3) నిజము+ఉహింప – అత్వసంధి
4) నిజము+ఉహింప – సవర్ణదీర్ఘసంధి
34. బతుకమ్మ సిగలోన తంగేడు పువ్వు. బతుకంతా బంగారమైన నవ్వు – అనే వాక్యంలో ఉన్న అలంకారం?
1) ముక్తపదగ్రస్థాలంకారం
2) మరుకాలంకారం
3) అంత్యానుప్రాసాలంకారం
4) ఛేకానుప్రాసాలంకారం
35. సామ్యత అనే పదం తొలిసారిగా ఏ పురాణంలో ప్రయోగించబడింది?
1) మత్స్యపురాణం 2) బసవపురాణం
3) అగ్నిపురాణం 4) వరాహపురాణం
36. ఏ భాషా సామెతలను సేకరించిన అరిస్టాటిల్ ప్రపంచంలోనే మొట్టమొదటి సంకలనకారుడు?
1) పోర్చుగీసు 2) గ్రీకు
3) లాటిన్ 4) ఆంగ్లం
37. సామెతకు పర్యాయపదాలుగా చెప్పబడనివి?
1) నానుడి, నుడికారం, జనశ్రుతి
2) నానుడి, పదజాలం, శాస్త్రం
3) నానుడి, శాస్త్రం, జనశ్రుతి
4) నానుడి, లోకోక్తి, నుడికారం
38. సామెతకు లక్షణంగా చెప్పబడినది?
1) వాచ్యార్థం కంటే వ్యంగ్యార్థానికి ప్రాధాన్యత
2) పుస్తకాల్లో నుంచి పుట్టి జనవ్యవహారంలోకి రావడం
3) అనుభవ రూపంలో ఉండటం
4) వాక్యరూపంలో ఉండి సార్వజనీనత కలిగి ఉండటం
అపరిచిత గద్యం
అల్పాక్షరాల్లో అనల్పార్థ రచన అన్న వాక్యానికి సామెతలు ఉదాహరణగా నిలిచాయి. సామెత అనే పదానికి సమానమైన పదం కన్నడంలో సామతి. ఈ సామతి సామ్యెత నుంచి ఉద్భవించినట్లయితే తెలుగులో సామ్యము నుంచి సామెత ఆవిర్భవించింది. సామ్యశబ్దానికి సామ్యత అనే అసాధారణ రూపమేర్పడి సామెతగా మారి ప్రచారంలో ఉందని చిలుకూరి నారాయణరావుగారి అభిప్రాయం. సామ్యత అనే పదం 15వ శతాబ్దంలోని వరాహపురాణంలో తొలిసారిగా ప్రయోగించబడింది. సామెతకు పర్యాయపదాల నానుడి, లోకోక్తి, శాస్త్రం, జనశ్రుతి, గ్రేశు సామెతలను సేకరించిన అరిస్టాటిల్ ప్రపంచంలోనే మొట్టమొదటి శాస్త్రీయ సంకలనకారుడు. మార్పక్ వంగ సామెతల పుస్తకం భారతీయ భాషల్లో మొట్టమొదటి సంకలనం సామెతను అరబ్బీలో మతేత అని, సంస్కృతంలో సూక్తి, సుభాషితం అని, తమిళంలో పళమొళి అని, కన్నడంలో గాదె అని, హిందీలో కహవల్ అని, మలయాళంలో పళించార్ అని పిలుస్తారు. సామెత అనుభవ రూపంలో ఉండాలి. సార్వజనీనత క్లుప్తత, వాక్యరూపంలో ఉండుట, సంక్షిప్తత, వాచ్చార్థంకంటే వ్యంగ్యార్థానికే ప్రాధాన్యత సామెత లక్షణాలు.
39. సామ్య శబ్దానికి ఏ అసాధారణ రూపమేర్పడి సామెతగా మారిందని ప్రచారంలో ఉంది?
1) సామ్యత 2) సౌమ్యత
3) సమ్యత 4) సాయ్యెత
40. ఈ పద్యకర్త ఎవరు?
1) పండిత రామసింహకవి
2) కాకుత్థం శేషప్పకవి
3) వేంకటరావు పంతులు
4) సూరోజు బాలనరసింహకవి
41. పట్టెడన్నమో అనేది?
1) పట్టెడ+ అన్నమో
2) పట్టెడు + అన్నమో
3) పట్టెడు + అన్నము
4) పట్టె + అన్నమో
42. ఈ పద్యంలో బాకవడంలో వెలసిన వారు ఎవరు?
1) అంజనేయుడు 2) శివుడు
3) విష్ణుమూర్తి 4) శ్రీరాముడు
43. ఆకలి దప్పులతో అలమటించేవారికి ఏమిచ్చి శాంతపరిస్తే సమస్త పుణ్యాలు లభిస్తాయి?
1) విద్యా, సంపద, వర్షం
2) సిరులు, నగలు, అన్నం
3) నీళ్ళు, విద్యా, శాకం
4) అన్నం, శాకం, నీళ్ళు
44. ఖలం- అనే పదానికి అర్థం
1) పాపం 2) పుణ్యం
3) శ్రేయం 4) ప్రేమ
45. ‘హంస’ అనే పదమునకు పర్యాయపదాలను గుర్తించండి?
1) ముక్తి, నిర్వాణం, కడగండ్లు
2) మరాళము, చక్రాంగం, మౌనసౌకము
3) కైవల్యం, ముక్తి, నిర్వాణం
4) ఇక్కట్టు, శ్రమ, ఇడుము
46. మంజీరనాదాలు, వివేకవిజయం అనే రచనలు ఎవరివి?
1) సుద్ధాల హనుమంతు
2) కాళోజీ నారాయణరావు
3) వట్టికోట ఆళ్వారుస్వామి
4) ఏదీకాదు
47. వర్ణం అనే పదానికి వికృతి పదం?
1) వన్నె 2) వరం
3) వరణం 4) వన్న
48. అమంగళం, తిలన్ధరుడు – అనేవి
1) నఞ్ + తత్పురుష, తృతీయతత్పురుష
2) ద్వితీయ తత్పురుష. నఞ్ + తత్పురుష
3) నఞ్+తత్పురుష, ద్వితీయాతత్పురుష
4) తృతీయ తత్పురుష, షష్ఠీతత్పురుష
49. అశ్విత్ అరగంటలో అరవై పద్యాలు రాయగలడు. ఏ వాక్యం?
1) విధ్యర్థక వాక్యం
2) నిశ్చయార్థక వాక్యం
3) ప్రార్థనార్థక వాక్యం
4) సామర్థ్యాక వాక్యం
50. తే, ఇతే, ఐతే అనే ఛేదర్థక ప్రత్యయాలు ఈ సంబంధాన్ని తెలుపుతాయి?
1) భూతకాల వ్యాపారార్థం
2) ఏకకాల కలార్థం
3) కార్యకారణం
4) అవృంతకార్యకారణం
51. వైతాళికుడు-ముష్టి అనేవి వరుసగా ఈ అర్థవిపరిణామానికి చెందుతాయి?
1) అర్ధోత్కర్ధ – అర్ధాపకర్ష
2) అర్ధాపకర్ష – అర్ధాపకర్ష
3) అర్ధోత్కర్థ – లక్ష్యార్థసిద్ధి
4) అర్ధాపకర్ష- లక్ష్యార్థసిద్ధి
52. వీటిని ఉచ్ఛరించినపుడు నాదతంత్రులు మిక్కిలి దగ్గరగా ఉంటాయి.
1) ఘోషాలు , కఠినవ్యండనాలు
2) అఘోషాలు, మహాప్రాణులు
3) ఘోషాలు, అల్ప ప్రాణులు
4) అఘోషాలు, అల్ప ప్రాణులు
53. పొట్లపల్లి రామారావు రచించిన ‘చీమలబారు’ అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది?
ఎ) ద్విపద బి) ఖండకావ్యం
సి) జానపదకథ డి) వచన కవిత
54. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ ఆడవారి అతిపెద్ద పండుగలో భాగంగా నాలుగోరోజు జరుపుకొనే పండుగ?
1) ముద్దపప్పు బతుకమ్మ
2) వెన్నెముద్దల బతుకమ్మ
3) నానబియ్యం బతుకమ్మ
4) అట్ల బతుకమ్మ
Continue to Grand Test Part-2(Q.No.55-90)
- Tags
- competitive exams
- TET
- tstet
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?