చురుకుగా చదవాలంటే ..
మీలో నిద్రాణమైన మీ క్రియేటివిటీని తట్టి లేపండి. మీరు క్రియేటివ్‌గా ఆలోచించే కొద్ది మీ న్యూరాలజికల్ పవర్ మరింత చురుకుగా తయారవుతుంది. ఫలితంగా అభ్యసనా సామర్థ్యం దానంతటదే పెరుగుతుంది. మిమ్మల్ని దారి మళ్లించే విధంగా మీ మైండ్‌పై దుష్ప్రభావాన్ని కలిగించే అంశాలు క్రమంగా వైదొలిగిపోతాయి.
ఆటకు ఉంది టైం.. పాటకు ఉంది టైం అంటూ ఇటీవల ఒక సినీగీతం వినిపించింది. ఆ పాటలో చదువుకోవడానికి కూడా ఒక టైం ఉంటుందని రచయిత చెప్పాడో లేదో కానీ పిల్లలు చదవడానికి మాత్రం కచ్చితంగా ఒక సమయం మాత్రం ఉంటుంది. మెదడులో సెరోటినిన్ అనే ఎంజైమ్ స్రవిస్తుంది. ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. మెదడు ఆరోగ్య పరిరక్షణలో ఇది ప్రముఖపాత్ర పోషిస్తుంది. ఇది తక్కువ కావటం వల్ల మెదడు విధులకు తీవ్రమైన హాని కలుగుతుంది. చురుకుదనం తగ్గిపోవటం, జ్ఞాపకశక్తి క్షీణించటం వంటి అనేక అవలక్షణాలు ఏర్పడుతాయి. చెడు అలవాట్లు, భయం, ఆందోళన, టెన్షన్, అవిశ్రాంతి, అలసట మొదలైన అంశాల వల్ల ఇది తీవ్రంగా దుష్ప్రభావానికి లోనవుతుంది. నిద్రసమయానికి ఈ ఎంజైమ్ ఉత్పత్తికి దగ్గర సంబంధం ఉందని శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. ఆరోగ్యవంతమైన, ప్రశాంతమైన నిద్రతో మెదడుకు చక్కని విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా సైరోటొనైన్ ఎంజైమ్ చురుగ్గా స్రవిస్తుంది. కాబట్టి తగిన విశ్రాంతి, తదనంతరం చదువుకోవటం వల్ల శాశ్వత ప్రయోజనాలు ఏర్పడుతాయి. పైగా మెదడులో ఏర్పడే విద్యుదయస్కాంత పదాలు స్పష్టంగాను, బలంగాను ఉంటాయి.
దీనివల్ల ఒక విషయం అర్థమవుతుంది. ఉదయం 5 – 9 గంటల వరకు మెదడు బాగా చురుకుగా పనిచేస్తుంది. అందుచేత విద్యార్థులు ఉదయం పూట లేచి చదువుకోవడం వల్ల ఎక్కువ విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకోగలుగుతారు. ఎంత తెలివితేటలు అమోఘంగా ఉన్న విద్యార్థి అయినా రెండు గంటల కంటే ఎక్కువసేపు చదువు మీద ఏకాగ్రత నిలపలేడు. కాబట్టి అప్పుడప్పుడు విశ్రాంతి అవసరమని టోనిభుజాన్ అంటారు. ఆయన విద్యార్థులను మూడు రకాలుగా విభజించారు. 1. చురుకైన విద్యార్థి
2. మధ్యమ విద్యార్థి 3. సగటు విద్యార్థి
కాబట్టి విద్యార్థులు ఎడతెరపి లేకుండా కష్టపడి చదవనసరం లేదు. తెలివిగా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ, మైండ్‌ని ఫ్రెష్ చేసుకుంటూ చదవాలి. సాయంత్రం బడి/కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఒక గంటసేపు పడుకొని లేచి తర్వాత హోంవర్క్ చేయటం మంచిది.
ఎఫ్ అంటే ఏమిటి..?
-బల్బును వెలిగించడానికి థామస్ అల్వా ఎడిసిన్ 1000 సార్లు విఫలమయ్యాడు. అయితే వాటిని ఆయన వైఫల్యాలుగా భావించలేదు. ప్రయత్నాలుగా వర్ణించాడు. విద్యార్థులందరికీ తెలుసు ప్రోగ్రెస్కార్డులో ఓ అని ఎర్ర అక్షరంతో మార్కు చేస్తే దాని అర్థం ఏమిటో. కానీ ఎన్ఎల్పీలో దాన్ని ఫెయిల్యూర్ అనరు. ఫీడ్‌బ్యాక్ అంటారు. కాబట్టి ఓ నిర్వచనాన్ని మార్చుకోండి. ఓ స్టాండ్స్ ఫర్ ఫీడ్‌బ్యాక్. మీ ఫెర్ఫార్మెన్స్‌కు మీకు లభించిన ఫీడ్‌బ్యాక్ ఇది. మనం సాధారణంగా నేర్చుకోవటం కన్నా నేర్చుకోకుండా ఉండటానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటామని డయానా బీవర్ అనే శాస్త్రజ్ఞురాలు అంటుంది. మన పంచేద్రియాల పనితనాన్ని నిలిపివేసి, ప్రత్యామ్నాయ కార్యక్రమాల కోసం వెర్రిగా ప్రాకులాడటం, వీలైనప్పుడల్లా లేకపోతే వీలుచేసుకొని మరీ మన అంతర్వాణి దూషణలను వినటం, మనలను మనం నూన్యత పర్చుకునే మనోభావాల కోసం అంతర్మథనం చెందడం. ఇదంతా చాలా శ్రమతో కూడుకున్న పని కదూ? అయినా శ్రమిస్తాం. శ్రమించి అపజయాన్ని సాధిస్తాం.
-ఇకముందు కూడా మీరు ఇలాగే జీవింపదలిచారా? లేదా ఒక్క క్షణంపాటు రిలాక్స్ అయి ఇంతకన్నా తక్కువ శ్రమతో నేర్చుకోవటం పట్ల మొగ్గు చూపిస్తారు? నేర్చుకోవడం ఉండిపోవడానికి శ్రమించటం నిలిపివేయాలని మీరు భావిస్తే కనుక ఫీడ్‌బ్యాక్ వల్ల మీరు ఎన్ని కొత్త అవకాశాలు ద్వారాలు తెరుస్తాయో తెలుస్తుంది. మనం ఇంతవరకూ చేసింది ఫలించలేదని ఒకసారి తేలిపోయిన తర్వాత మనకు అవధులు ఉండవు. నోట్స్‌లు రాయడం, రాత్రిళ్లు టీలు తాగి నైట్‌హాల్ట్ చేయడం వీటన్నింటిని పక్కన పెట్టేస్తాం. ఈ ప్రోగ్రాం ఫలించదని తెలసిపోయాక వీటినెందుకు ఇంకా కొనసాగించాలి? వీటి స్థానంలో మనం క్రియేటివిటీలో నూతన పద్ధతులను ఆవిష్కరిస్తాం. నోట్స్లకు బదులుగా మైండ్మ్యాప్లు చిత్రిస్తాం. విజయం సాధించడానికి అవకాశం ఉందనుకున్న ప్రతి పద్ధతినీ ఆచరిస్తూ చదువుతాం. ఏం.. ఇలా ఎందుకు చేయకూడదు? ప్రశ్నించుకోండి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు