మనం కరెక్ట్ అనుకొని మాట్లాడే చాలా ఇంగ్లిష్ మాటలు చాలా తప్పు అని తెలిసినప్పుడు అరెరె అని నాలిక కర్చుకొంటాం. ఇన్స్టిట్యూట్లో చేరిన కొత్తలో శ్రావణికి కూడా అలాంటి అనుభవమే ఎదురయ్యింది.
Postpone కి వ్యతిరేక పదం Prepone అని అనుకొని వాడుతుంటాం. ఇంగ్లిష్ భాషలో Prepone అనే పదం లేనేలేదు. అలాంటి అర్థంలో Advance అనే పదం వాడాలి. కింది వాక్యం చూస్తే..
-At first they planned to conduct the examination on 10th. Later, they advanced it to 5th.
-ఈ సందర్భంలో చాలామంది Prepone పదాన్ని వాడుతుంటారు. కానీ ఇంగ్లిష్ భాషలో అలాంటి పదమే లేదు .
postpone X Advanced
2. మోసగాడిని చాలామంది CHEATER అని అనేస్తారు. అది సరైన పదం కాదు. అలాంటి పదం ఇంగ్లిష్ భాషలో లేదు.
మోసగాడు – Cheat
Ex: He is a Cheat
మోసగాడిని Cheat అని అనాలి.
3. జేబుదొంగని చాలామంది Pickpoceter అంటారు. అది సరికాదు. ఇంగ్లిష్లో అలాంటి పదం లేదు.
జేబుదొంగ = Pickpocket
Ex: He is a pickpoket
జేబుదొంగని Pickpocket అనే అనాలి.
4. క్రీడాకారులకి శిక్షణ ఇచ్చే వ్యక్తిని Coacher అని అనకూడదు. Coach అనే అనాలి.
5. వ్యక్తిగత వివరాలని తెలిపే పత్రాన్ని ఎక్కువమంది Bio- daa అంటూ ఉంటారు. నిజానికి ఇలాంటి వాటిని CV అనాలి. ఇది లాటిన్ పదం Curriculum Vitae (కరిక్యులం వీటేయ్)కి సంక్షిప్త రూపం.
6. Resume ని చాలామంది రెజ్యూమ్ అని పలుకుతూ ఉంటారు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొనేటప్పుడు మనం పంపే వృత్తిపరమైన, వ్యక్తిగత వివరాలు తెలిపే పత్రాన్ని రెష్యూమే అని పలకాలి.
8 పునఃప్రారంభించటం (క్రియ) అనే అర్థంలో రెష్యూం అని పలకాలి.
Resume (Noun) – రెష్యూమే
Resume (Verb) – రెష్యూం
7. నడిచి వచ్చాను అని చెప్పటానికి చాలామంది By walk అంటారు. అది తప్పు On foot అనాలి.
ఎందుకంటే walk అనే వాహనం లేదు కదా!
Ex: I came on foot
He comes on foot
8. అతను పరీక్ష రాస్తున్నాడు అనడానికి మనలో చాలామంది He is writing the examination (Wrogng) ఇది తప్పు.
He is undergoing the examination (Correct)
8 అదేవిధంగా ఫలానా పరీక్షలు రాశాను అని చెప్పటానికి
I wrote examinations (Wrong)
I worote Degrees (Wrong)
ఇలా చెప్పరాదు.
I appeared for the examinations (Correct)
9. చాలామంది With Best Compliments అంటూ ఉంటారు. ఇది శుద్ధతప్పు.
మంచి అభినందనలతో అని అనకూడదు కదా!
చెడ్డ – మంచి అని రెండు రకాల అభినందనలు ఉంటాయా ఎక్కడైనా. కాబట్టి With Compliments అంటేచాలు.
10. Good name మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అన్న అర్థంలో వాడవచ్చు.
He has good name (Correct)
That doctor has good name (Correct)
May I know your good name (X)
May I know your name (Correct)
మీ పేరు తెలుసుకోవచ్చా? అన్న అర్థంలో Good name సరికాదు.
11. Tuition స్పెల్లింగ్ తప్పుగా Tution (X) అని రాస్తుంటారు. చాలామంది Tuitionని తప్పుగా పలుకుతుంటారు. ట్యూషని అని.
8 సరైన ఉచ్ఛారణ – ట్యూయిషన్ అనాలి. Dias అన్నది తప్పు స్పెల్లింగ్. Dais (Correct). డయాస్ అన్నది తప్పు ఉచ్ఛారణ. డేయ్ఇస్ అన్నది సరైన ఉచ్ఛారణ.
12. స్టార్హోటల్స్లోని గదులను అందరూ సాధారణంగా సూట్ అంటుంటారు. దీనికి సరైన ఉచ్ఛారణ స్వీట్ (Suite)
13. పూడ్చిపెట్టు అనే అర్థంలో వాడే Buryని చాలామంది బరీ అంటుంటారు. ఇది తప్పు. దీన్ని బెరీ అని పలకాలి.
8 సరైన జ్ఞానం మనకు ఆత్మవిశ్వాసాన్ని కలుగజేస్తుంది.
8 ఈ కొత్త జ్ఞానం శ్రావణికి అపరిమితమైన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.
With beautiful language | అందమైన భాషతోనే..
Previous article
చురుకుగా చదవాలంటే ..
Next article
White Revolution | శ్వేత విప్లవం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?