ప్రాక్టీస్ మేక్స్ అర్థమెటిక్ పర్ఫెక్ట్
ఇది పరీక్షల కాలం. బ్యాంకు, ఎస్సెస్సీ, ఆర్ఆర్బీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 2021 బ్యాంకు పీవో/క్లర్క్, గ్రామీణ బ్యాంకు క్లర్క్/ స్కేల్-1 ఆఫీసర్, ఎస్బీఐ పీవో కొలువులకు సన్నద్ధమయ్యేవారు సెక్షన్లవారీగా ప్రిపేరవుతుంటారు. ఐబీపీఎస్ నుంచి వెలువడిన అన్ని రకాల బ్యాంకు పరీక్షలు, ఎస్బీఐ పీవో స్థాయి పరీక్షలకు ఎలా చదవాలి, ఎంత సమయం కేటాయించాలి, పరీక్ష-పరీక్షకు మధ్య కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ప్రిలిమ్స్-మెయిన్స్‌కు బ్యాలన్స్ ఎలా చేయాలి, ముఖ్యమైన టాపిక్స్ వంటి వాటి గురించి నిపుణ అందిస్తున్న ప్రిపరేషన్ ప్లాన్….
అర్థమెటిక్, న్యూమరికల్ ఎబిలిటీస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అని వివిధ రకాల పేర్లతో ఈ విభాగం ఉంటుంది. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్‌లో వచ్చే కామన్ సెక్షన్. క్లరికల్ లెవల్ నుంచి పీవో లెవల్ వరకు వివిధ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. కాబట్టి దరఖాస్తు చేసుకున్న పరీక్షను బట్టి ప్రిపరేషన్ కొనసాగించాలి. ముందుగా IBPS క్లరికల్ పరీక్షలో అర్థమెటిక్ విభాగంలో ముఖ్యమైన టాపిక్స్, ప్రశ్నలసరళి తెలుసుకుందాం..
IBPS-క్లర్క్, గ్రామీణ బ్యాంక్ ఆఫీస్ అసిస్టెంట్, ఎస్బీఐ క్లరికల్ పోస్టులకు వేర్వేరుగా పరీక్షలు ఉంటాయి. దీంతో పాటు ప్రశ్నల స్థాయి కూడా వ్యత్యాసం ఉంటుంది. గ్రామీణ బ్యాంకు పరీక్షలకు కాస్త తేలికపాటి ప్రశ్నలు కాగా, IBPS-క్లరికల్ లెవల్ కొద్దిగా మధ్యస్థస్థాయి, ఎస్బీఐ క్లరికల్ హెచ్చుస్థాయి ప్రశ్నలు వస్తుంటాయి. క్లరికల్ లెవల్లో 80% టాపిక్స్ కామన్ చాప్టర్స్ నుంచి ఉంటాయి.
ముందుగా అర్థమెటిక్‌కు సంబంధించి అన్ని చాప్టర్స్‌పై అవగాహన పెంచుకోవాలి. బ్యాంకు సిలబస్ ప్రకారం 10-12 చాప్టర్లు క్షుణ్ణంగా చదివితే సరిపోతుంది. ఇవి గత ప్రశ్నపత్రాల ఆధారంగా తెలుసుకోవచ్చు.
ప్రిలిమ్స్‌లో ఎక్కువ శాతం క్యాలిక్యులేషన్స్ ప్రశ్నలే. ఇందులో టైమ్ అండ్ రూల్ పద్ధతి అవలంబించాలి. అంటే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించే టాపిక్స్ ఎంచుకొని సాల్వ్ చేయడం ఉంటుంది. ప్రిలిమ్స్‌లో న్యూమరికల్ ఎబిలిటీస్ నంబర్ సిస్టమ్ వంటి వాటిపై ఫోకస్ చేయాలి.
ఎస్బీఐ క్లర్క్ కోసం డాటా ఇంటర్‌ప్రిటేషన్స్ 15-20 ప్రశ్నలు వస్తాయి. ఇవి 3, 4 సెట్స్‌లో అడుగుతుంటారు. వీటితో పాటు నంబర్ సిరీస్, మిస్సింగ్ సిరీస్, రాంగ్ సిరీస్ వంటి టాపిక్స్‌ను బాగా అవపోసన పట్టాలి. ఎస్బీఐలో హెచ్చుస్థాయి ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ప్రతి టాపిక్‌లో హైలెవల్ మోడల్స్ ఈ పరీక్షకు సన్నద్ధం కావాలి.
క్లరికల్ మెయిన్స్ కోసం
ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి అంశాలు వస్తాయి.
IBPS మెయిన్స్
క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 4-5 ప్రశ్నలు
సింప్లిఫికేషన్స్ 5-8 ప్రశ్నలు
టాటా ఇంటర్‌ప్రిటేషన్స్ 20-25 ప్రశ్నలు
ఇంకా 5-10 ప్రశ్నలు అర్థమెటిక్ అంశాల నుంచి వస్తాయి. పార్ట్నర్షిప్, లాభనష్టాలు, సాధారణ వడ్డీ, చక్రవడ్డీ వంటి ప్రశ్నలు ప్రాబబిలిటీ వంటి హెచ్చుస్థాయిలో చదవాలి.
ఎస్బీఐ క్లరికల్ మెయిన్స్‌లో కూడా ఈ టాపిక్స్ నుంచే ప్రశ్నలు వస్తాయి. అయితే ఇందులో డాటా ఇంటర్‌ప్రిటేషన్స్ అండ్ డాటా సఫిషియన్సీ నుంచి 25-30 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 80% మెయిన్స్, డీఐ మోడల్స్‌పై ఆధారపడితే సరిపోతుంది. ఎస్బీఐలో జాబ్స్ కోసం నిరుద్యోగులతో పాటు ఇతర బ్యాంకు ఉద్యోగులు కూడా ప్రిపేరవుతారు. కాబట్టి పోటీతో పాటు హెచ్చుస్థాయి ప్రశ్నలను అంచనావేసి సాధన చేయాలి.
IBPS గ్రామీణ బ్యాంకు స్కేల్-1, వాణిజ్యబ్యాంకు పీవో, ఎస్బీఐ పీవో పరీక్షలు వేర్వేరుగా నిర్వహిస్తుంటారు.
IBPS పీవో ప్రిలిమ్స్, మెయిన్స్‌లలో కూడా కామన్ టాపిక్స్‌తో కూడిన ప్రశ్నలు ఉన్నప్పటికీ ప్రశ్నల సరళిలో తేడాను గమనించగలగాలి. పీవో ఆఫీసర్ కేడర్ కాబట్టి స్టాండర్డ్ టాపిక్స్ క్వశ్చన్స్ వస్తాయి.
60 శాతం ప్రశ్నలు డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్స్ నుంచి వస్తాయి.
ఎస్బీఐ పీవో పరీక్ష ఐటీ వంటి విభాగంలో డెసిమల్ పాయింట్ మోడల్ క్యాలిక్యులేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి హెచ్చుస్థాయిలో ప్రశ్నలు వస్తాయి. ఇందులో 80శాతం డాటా ఇంటర్‌ప్రిటేషన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి.
- డాటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్స్ నుంచి 25-30 ప్రశ్నలు, డీఐ సెట్స్ నుంచి 4 వస్తాయి. అవి టాబులర్గ్రాఫ్, లైన్గ్రాఫ్, బార్గ్రాఫ్, డీఐ చార్టులు, టేబుల్స్ ఎస్బీఐలో రాడార్గ్రాఫ్, డీఐ ప్రశ్నలు వస్తాయి.
- డాటా సఫిషియన్సీ
- ఫ్లో చార్టులు
- ప్రాబబిలిటీస్
- పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్
వీటితో పాటు మిశ్రమాలు, కాలం-పని-దూరం, యావరేజెస్-ఏజెస్, సర్డ్స్-ఇండిసస్, మెన్సురేషన్స్ వంటి అంశాలు కూడా చదవాలి.
బ్యాంకు పరీక్షలకు సిలబస్ భిన్నంగా ఉంటుంది. ఇతర పోటీ పరీక్షలతో పోల్చితే బ్యాంకు పరీక్షలో చాలా వరకు సిలబస్ నిర్దేశితంగా ఉంటుంది. అంటే 10, 12 టాపిక్స్ 100 శాతం కచ్చితత్వంతో ప్రిపేరయితే బ్యాంకు జాబ్ సాధించవచ్చు. 10, 12 టాపిక్స్ నుంచి హెచ్చుస్థాయి ప్రశ్నలు, నిర్దేశిత సమయంలో సాల్వ్ చేసేలా మాదిరి ప్రశ్నలు ఉండటం వల్ల బ్యాంకు పరీక్షలు కఠినంగా ఉంటాయి.
అర్థమెటిక్ అంశం నిర్ణయాత్మక శక్తిని అంచనా వేస్తుంది. కాబట్టి ఇందులో సమయ పాలన అనుగుణంగా ప్రతి ప్రశ్నను 20, 25 సెకండ్లలో సాల్వ్ చేయగలగాలి.
ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉండే కామన్ టాపిక్స్‌ను ఉమ్మడిగానే చదవాలి. IBPS/SBI పరీక్షను బట్టి ప్రశ్నల సరళి మారుతుంటుంది. వాటిని ముందుగా అంచనా వేసి ప్రాక్టీస్ చేయాలి. ఇందుకు గత ప్రశ్నపత్రాలు లేదా మోడల్ ప్రశ్నపత్రాలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
అర్థమెటిక్, న్యూమరికల్ ఎబిలిటీస్, క్వాంట్స్ విభాగం బ్యాంకుతో పాటు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. కాబట్టి అభ్యర్థి తాను ప్రిపేరయ్యే పరీక్ష సిలబస్, పరీక్ష స్వరూపం, ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్ బాగా పరిశీలించాలి.
అర్థమెటిక్ అంశాలు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి.
పోటీ పరీక్షలకు కచ్చితత్వం చాలా కీలకం. రోజువారీ ప్రాక్టీస్‌లో అక్యురసీ శాతం అంచనా వేయగలగాలి.
శక్తి సామర్థ్యాల ఆధారంగా సాల్వ్ చేయగల అంశాలే ముందుగా ప్రయత్నించాలి.
గత పరీక్షల్లో కటాఫ్ మార్కుల ఆధారంగా 10-20 శాతం అధికంగా మార్కులు సాధించేలా సాధన చేయాలి.
రోజు 4, 5 గంటలు అర్థమెటిక్ అంశాలు ప్రాక్టీస్ చేయడం వల్ల నిర్దేశిత సమయంలో క్వశ్చన్స్ సాల్వ్ చేసే సామర్థ్యం ఏర్పడుతుంది.
ఆన్లైన్ పరీక్షలకు ఆన్లైన్లోనే ప్రాక్టీస్ చేయాలి.
సెక్షన్ వైజ్, గ్రాండ్ టెస్టులు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి.
మొదటిసారి పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేవారు బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవల్ ప్రశ్నలు బాగా సాధన చేయాలి.
బోడ్మాస్ రూల్స్, షార్ట్‌కట్ రూల్స్, స్పీడ్ మ్యాథ్స్ చిట్కాలు ప్రతి రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
తక్కువ సమయం, ఎక్కువ మార్కులు వచ్చే ప్రశ్నలు గుర్తించి చదవాలి
రిఫరెన్స్ బుక్స్
ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఆశిష్ అగర్వాల్ క్విక్ అర్థమెటిక్
రాజేశ్ వర్మ ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్
ఎం. టైరా క్వికర్ మ్యాథ్స్
రాకేష్ యాదవ్ అర్థమెటిక్ అండ్ మ్యాథ్స్ క్లాస్ నోట్స్
ధవల్ భదియా వేదిక్ మ్యాథ్స్
కిరణ్ ప్రీవియస్ పేపర్స్ లేదా అరిహంత్ ప్రీవియస్ పేపర్స్
మధుకిరణ్
డైరెక్టర్, ఫోకస్ అకాడమీ ,హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు