పీజీడీఎం @ ఎన్టీపీసీ


డిగ్రీ తర్వాత ఎవర్గ్రీన్ కెరీర్ కోసం విద్యార్థులు అన్వేషిస్తారు. పలు రంగాల్లో ఉన్నత విద్యతో జీవితంలో స్థిరపడాలనుకొనే వారికి పలు కెరీర్లు ఉన్నాయి. వీటిలో మేనేజ్మెంట్ రంగం ఒకటి. కష్టపడితే మంచి హోదాతోపాటు ఆకర్షణీయమైన జీతభత్యాలతో గౌరవప్రదమైన జీవితాన్నిచ్చే రంగం మేనేజ్మెంట్ రంగం. ఈ రంగానికి సంబంధించిన కోర్సులను విద్యార్థులు చదివే సంస్థను బట్టి ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. మంచి సంస్థల్లో చదివితే మంచి ప్లేస్‌మెంట్స్ వస్తాయనడంలో సందేహం లేదు. మహారత్న కంపెనీ పరిధిలో నిర్వహించే ఎన్టీపీసీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పీజీడీఎం ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా…
ఎన్ఎస్బీ
ఎన్టీపీసీ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఎన్ఎస్బీ). మహారత్న కంపెనీ అయిన ఎన్టీపీసీ పరిధిలో ఈ సంస్థ నడుస్తుంది. దీన్ని 2014లో ప్రారంభించారు.
ఎన్‌ఎస్‌బీకి ఏఐసీటీఈ అనుమతితో పీజీడీఎం కోర్సులను అందిస్తుంది.
ఆఫర్ చేస్తున్న కోర్సులు
పీజీడీఎం (ఎనర్జీ మేనేజ్మెంట్)
పీజీడీఎం (ఎగ్జిక్యూటివ్)
కోర్సుల వివరాలు
పీజీడీఎం (ఎనర్జీ మేనేజ్మెంట్)
ఈ కోర్సుకు రెండేండ్ల కాలవ్యవధి
పీజీడీఎం (ఎగ్జిక్యూటివ్)
ఈ కోర్సు కాలవ్యవధి పదిహేను నెలలు
నోట్: విద్యార్థులకు హాస్టల్ వసతి సౌకర్యం కూడా ఉంది.
అర్హతలు
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
డిగ్రీతోపాటు క్యాట్/ఎక్స్‌ఏటీ లేదా జీమ్యాట్/ఎన్‌ఎస్‌బీలో వ్యాలిడిటీ స్కోర్ కలిగి ఉండాలి. లేదా ఎన్ఎస్బీ నిర్వహించే టెస్ట్‌ను రాయాలి.
ఎంపిక విధానం
దరఖాస్తు చేసుకొన్న వారిని పర్సనల్ అసెస్మెంట్ చేసి షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత రెండో దశలో ఫైనల్ కాంపోజిట్ స్కోర్స్ ద్వారా తుది ఎంపిక చేస్తారు.
స్కాలర్షిప్స్
ప్రతిభావంతులైన విద్యార్థులకు
స్కాలర్షిప్స్ ఇస్తారు.
ప్లేస్‌మెంట్స్
ఎన్టీపీసీ, అప్‌గ్రాడ్, టాటా టెలీ, జీఎంఆర్,పీఎఫ్సీ, సంగం, ఎన్‌హెచ్‌పీసీ, డెలాయిట్,ఎస్బీ ఎనర్జీ, బైజూస్ వంటి ప్రముఖ కంపెనీల్లోప్లేస్మెంట్స్ లభిస్తాయి.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: 2022, జనవరి 10
వెబ్సైట్:
https://nsb.ac.in
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
- Tags
- Education News
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు
Ace questions on environment
అల్ప జాతీయాదాయం నమోదవుతున్న దేశం ఏది? (Groups Special)
మానవ శరీరం బరువులో మెదడు బరువు శాతం ఎంత?
పదార్థం పంచ స్థితి రూపం
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు