అవకాశాలకు కొదవలేని జావా స్క్రిప్ట్
జావా స్క్రిప్ట్ అనేది ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని ఒక వెబ్‌సైట్‌ని ఇంటరాక్టివ్‌గా తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకి మనం వాడే ఐఆర్సీటీసీ, రెడ్‌బస్, బుక్ మై షో వంటి వెబ్సైట్లలో సీట్లు సెలెక్ట్ చేస్తూ ఇంటరాక్ట్ అవుతుంటాం కదా! వాటిని జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని వాడి తయారు చేస్తారు.
వెబ్ పేజీలో జావా స్క్రిప్ట్‌తో చేయగలిగే పనులకు దాదాపు పరిమితులు లేవు. ఉదాహరణకి ఒక ఇమేజ్‌ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడం, ఒక టైమర్‌ని డిస్ప్లే చేయడం, ఆడియో లేదా వీడియోను ప్లే చేయడం, యానిమేషన్ డిస్ప్లే చేయడం, ఒక బటన్ రంగు మార్చడం వంటి మరెన్నో పనులు చేయవచ్చు. సాధారణంగా ఈ వెబ్సైట్లను గూగుల్ క్రోమ్, సఫారీ, మోజిల్లా ఫైర్ఫాక్స్ వంటి బ్రౌజర్లను వాడి ఓపెన్ చేస్తారు. అంటే జావా స్క్రిప్ట్ అనేది బ్రౌజర్లో పనిచేస్తుంది. దీనిని బ్రౌజర్ ఎన్విరాన్మెంట్ అని అంటారు. చాలా బ్రౌజర్లు జావా స్క్రిప్ట్‌ను ఉపయోగిస్తూ ఉన్నందున జావా స్క్రిప్ట్ HTML, CSSలతో పాటు అవసరమైన వెబ్ టెక్నాలజీగా మారింది.
వివిధ డొమైన్లలో జావా స్క్రిప్ట్
ఫ్రంట్ ఎండ్‌లో ఉండే రియాక్ట్ JS, యాంగులర్ JSలో కూడా జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ని ఉపయోగిస్తాం.
జావా స్క్రిప్ట్ కేవలం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్కే పరిమితం కాకుండా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో చాలా ముఖ్యమైన నోడ్ JSలో కూడా జావా స్క్రిప్ట్‌ని వాడుతున్నారు. ఈ నోడ్ JS వినియోగించి బ్యాక్ ఎండ్‌ని కూడా డెవలప్ చేయవచ్చు. కాబట్టి వెబ్ డెవలప్మెంట్లోకి వెళ్లాలంటే జావా స్క్రిప్ట్‌ని తప్పనిసరిగా నేర్చుకోవాలి. అంతే కాకుండా మొబైల్ యాప్ డెవలప్మెంట్, వెబ్ యాప్ డెవలప్మెంట్, గేమ్ డెవలప్మెంట్ ఇలా చాలా డొమైన్లలో జావా స్క్రిప్ట్‌ని ఉపయోగిస్తారు.
పెద్ద కమ్యూనిటీ
ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎంచుకునేముందు ఆ లాంగ్వేజ్ వాడే డెవలపర్ల సంఖ్య అంటే డెవలపర్ల కమ్యూనిటీ చాలా ముఖ్యం. ఒకవేళ ఏదైనా టెక్నికల్ సమస్య వచ్చినా ఏదైనా అర్థం కాకపోయినా కమ్యూనిటీలో చాలా త్వరగా సహాయం దొరుకుతుంది. అంతేకాకుండా ఎక్కువ మంది డెవలపర్లు ఉంటే వారు ఎక్కువ టూల్స్ తయారు చేస్తూ డెవలప్మెంట్ ప్రాసెస్‌ని సులభతరం చేస్తారు. అందుకే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి ఎంత పెద్ద కమ్యూనిటీ ఉంటే అంత త్వరగా సపోర్ట్ దొరుకుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ జావా స్క్రిప్ట్ ఉపయోగిస్తున్న వారి సంఖ్య చాలా పెద్దది. అంతేకాకుండా జావా స్క్రిప్ట్‌కి అతిపెద్ద స్టాక్ ఓవర్‌ఫ్లో కమ్యూనిటీ ఉంది. స్టాక్ ఓవర్‌ఫ్లో అనేది ప్రోగ్రామింగ్‌కి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం దొరికే వెబ్సైట్. ప్రోగ్రామింగ్‌లో కొద్దిగా అవగాహన ఉన్న వారందరికీ, బిగినర్స్‌కు ఇది సుపరిచితమే. అలాగే గిట్ హబ్ ప్లాట్‌ఫాంలో రెండు లక్షలకు పైగా రిపోసిటరీస్ (సాఫ్ట్వేర్స్, ప్యాకేజీ) ఐదు వందలకు పైగా స్టార్స్‌తో జావా స్క్రిప్ట్ మోస్ట్ ట్యాగ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌గా కూడా ఉంది.
జావా స్క్రిప్ట్‌కు భలే డిమాండ్
జావా స్క్రిప్ట్‌కి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది. 2020లో స్టాక్ ఓవర్‌ఫ్లో సర్వే ప్రకారం అత్యంత పాపులర్ అయిన ప్రోగ్రామింగ్, స్క్రిప్టింగ్, మార్కప్ లాంగ్వేజెస్ కేటగిరీలో జావా స్క్రిప్ట్ వరుసగా ఎనిమిదో సంవత్సరం మొదటి స్థానంలో నిలిచింది.2018లో హకెర్ ర్యాంక్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 48% మంది కంపెనీలకు జావా స్క్రిప్ట్ నైపుణ్యాలు ఉన్న డెవలపర్లు అవసరం. కానీ 42% విద్యార్థులు మాత్రమే జావా స్క్రిప్ట్‌లో నైపుణ్యం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయి.
పే స్కేల్ సంస్థ ప్రకారం ఇండియాలో జావా స్క్రిప్ట్ డెవలపర్ల సగటు వార్షిక వేతనం సుమారు ఆరు లక్షల రూపాయలు. అమెరికాలో జావా స్క్రిప్ట్ డెవలపర్ల వార్షిక వేతనం సుమారు అరవై లక్షల రూపాయలు ఉంటుంది.
ఒక వెబ్ డెవలపర్‌గా ఉన్నప్పుడు చాలాసార్లు ఒక అప్లికేషన్ని బిల్డ్ చేయాలంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంటే ఎక్కువ నేర్చుకోవాల్సి వస్తుంది. ఫ్రంట్ ఎండ్‌లో ఒక లాంగ్వేజ్, బ్యాక్ ఎండ్‌లో ఒక లాంగ్వేజ్, మొబైల్ అప్లికేషన్స్‌కి ఒక లాంగ్వేజ్, గేమ్ డెవలప్మెంట్కి ఒక లాంగ్వేజ్ ఇలా ప్రతిసారి కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే డెవలపర్స్‌కి చాలా గందరగోళంగా ఉంటుంది. అలా కాకుండా ఫ్రంట్ ఎండ్‌లోనూ, బ్యాక్ ఎండ్‌లోనూ ఎందులోనైనా పనిచేసేలా కేవలం ఒక లాంగ్వేజ్ ఉంటే బాగుంటుంది. డెవలపర్ల పని కూడా చాలా సులభం అయిపోతుంది. సరిగ్గా అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ జావా స్క్రిప్ట్.జావా స్క్రిప్ట్‌ని చిన్న స్టార్టప్ నుంచి మల్టీ నేషనల్ కంపెనీ వరకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రతి కంపెనీ వివిధ రకాల అప్లికేషన్లు బిల్డ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. మార్కెట్లో ఉన్న ఇతర ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌కి జావా స్క్రిప్ట్ చాలా గట్టి పోటీ ఇస్తుంది.
నేర్చుకోవడం సులభం
ఇతర ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో పోలిస్తే జావా స్క్రిప్ట్ నేర్చుకోవడం చాలా సులభం. దీనిలో సింటాక్స్ అంటే కంప్యూటర్‌కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఆంగ్ల భాషని పోలి సులభంగా ఉంటాయి.
ఇది హయ్యర్ లెవల్ లాంగ్వేజ్ అంటే కోడ్‌లోని చాలా సంక్లిష్టతలతో వ్యవహరించాల్సిన అవసరం లేదు. మెషీన్ వాటిని చూసుకుంటుంది. కాబట్టి కొత్తగా కోడింగ్ మొదలుపెట్టే వారు దీనిని త్వరగా అర్థం చేసుకోగలరు. కోడింగ్‌లో సాధారణంగా ప్రారంభకులు ప్రోగ్రాం రన్ చేయాలంటే ఒక కోడ్ ఎడిటర్ లేదా ఏదైనా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ని సెటప్ చేయడమనేది కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. కానీ జావా స్క్రిప్ట్ డైరెక్ట్‌గా బ్రౌజర్లో పనిచేస్తుంది. అందువల్ల ముందు కోడింగ్ అనుభవం లేకపోయినా సులభంగా తక్కువ సమయంలోనే జావా స్క్రిప్ట్‌ని నేర్చుకోవచ్చు.
నేర్చుకోవడం ఎలా
జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో నైపుణ్యం ఉన్న వారికి కంపెనీలు లక్షల్లో వేతనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అంత డిమాండ్ ఉన్న ఈ జావా స్క్రిప్ట్‌ని నేర్చుకుంటే చక్కటి అవకాశాలు సొంతమవుతాయి. ఉడెమి, w3 స్కూల్స్ వంటి వాటిలో జావా స్క్రిప్ట్‌ని నేర్చుకోవచ్చు. నెక్ట్స్‌వేవ్ సీసీబీపీ టెక్ 4.0 ఇంటెన్సివ్ ప్రోగ్రాంలో సీసీబీపీ ద్వారా జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్‌లో ప్రాథమిక స్థాయి నుంచి శిక్షణ ఇస్తుంది. ఈ ప్రోగ్రాంతో కేవలం 4.5 నెలల్లోనే సంవత్సరానికి 4.5 నుంచి 9 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ ప్రోగ్రాం గురించి ccbp.in/intensive వెబ్సైట్లో చూడవచ్చు. మరిన్ని వివరాల కోసం 9390111765 నంబర్‌ను వాట్సాప్ ద్వారా సంప్రదించండి లేదా support@nxtwave.tech కి మెయిల్ పంపంది.
-రాహుల్ అత్తులూరి ,సీఈఓ నెక్ట్స్‌వేవ్
- Tags
- Education News
- JavaScript
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు