పదవులు.. ప్రమాణస్వీకార పద్ధతులు
రాష్ట్రపతి
రాజ్యాంగంలోని 60వ ప్రకరణలో పేర్కొన్నవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా అతను లేని సమయంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి రాష్ట్రపతిచే పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అది ఇలా ఉంటుంది. అనే నేను దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా రాష్ట్రపతిగా అధికార విధులను విశ్వాసబద్దంగా నిర్వహిస్తానని, నా శక్తిసామర్థ్యాల మేరకు రాజ్యాంగాన్ని, చట్టాన్ని రక్షిస్తానని, ప్రజల సేవ, సంక్షేమం కోసం పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
ఉపరాష్ట్రపతి
రాజ్యాంగంలోని 69వ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి లేదా రాష్ట్రపతిచే నియమించిన వ్యక్తి ఉపరాష్ట్రపతిచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అది.. అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, నమ్మకంగా నా విధులను నిర్వర్తిస్తానని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
గవర్నర్
రాజ్యాంగంలోని 159వ ప్రకరణ ప్రకారం ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా అతడు లేనిసమయంలో హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి గవర్నర్చే ప్రమాణం చేయిస్తారు. అది.. – అనే నేను విధేయతతో రాష్ట్ర గవర్నర్గా నా విధులను నా శక్తిసామర్థ్యాల మేరకు వినియోగించి రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షిస్తానని, ప్రజల సేవ, సంక్షేమానికి అంకితమై నా విధులను సక్రమంగా నిర్వర్తిస్తానని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
కేంద్రమంత్రి:
అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, కేంద్రమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తానని, భయంగాని, పక్షపాతంగాని, రాగద్వేషాలుగాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
అధికార రహస్యాలకు సంబంధించి:
అనే నేను కేంద్రమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగాగాని, పరోక్షంగాగాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపర్చనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ రెండు ప్రమాణాలు ప్రకరణ 75(4)కు సంబంధించినవి.
పార్లమెంటు సభ్యులు :
ప్రకరణ 99 ప్రకారం.. – అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించచబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కాగ్ అధికారి:
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రకరణ 124(6), కాగ్ అధికారి 148(2) ప్రకరణల ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అది.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు/కాగ్ అధికారిగా నియమితులైన – అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఎటువంటి భయంగాని, పక్షపాతంగాని, రాగద్వేషాలుగాని లేకుండా నా శక్తి, విజ్ఞానం మేరకు న్యాయంగా నా విధులను నిర్వర్తిస్తానని, రాజ్యాంగాన్ని, చట్టాన్ని నిలబెడుతానని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
రాష్ట్ర మంత్రి
అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, రాష్ట్రమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగాని, పక్షపాతంగాని, రాగద్వేషాలుగాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
అధికార రహస్యాలకు సంబంధించి: –
అనే నేను రాష్ట్రమంత్రిగా నా పరిశీలకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైనమేరకు తప్ప ప్రత్యక్షంగాగాని, పరోక్షంగాగాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపర్చనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ ప్రమాణ స్వీకారాలు రెండూ ప్రకరణ 164(3)కు సంబంధించినవి.
అసెంబ్లీ సభ్యులు:
ప్రకరణ 188 ప్రకారం శాసనసభ, శాసనమండలికి ఎన్నికైన లేదా నిమినేట్ అయిన – అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో నిర్వహిస్తానని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
హైకోర్టు న్యాయమూర్తులు:
ప్రకరణ 219 ప్రకారం.. హైకోర్టు ప్రధానన్యాయమూర్తి లేదా న్యాయమూర్తిగా నియమితులైన – అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఎటువంటి భయంగాని, పక్షపాతంగాని, రాగద్వేషాలుగాని లేకుండా నా శక్తి, విజ్ఞానం మేరకు న్యాయంగా నా విధులను నిర్వర్తిస్తానని, రాజ్యాంగాన్ని, చట్టాన్ని నిలబెడుతానని దైవసాక్షిగా/ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ప్రతిభకు పరీక్ష
1. తక్కువ ఆదాయం కలిగి కుటుంబాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రగతి అనే జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన సంస్థ?
1) ఎల్ఐసీ 2) హెచ్డీఎఫ్సీ లైఫ్
3) బజాజ్ అలియన్జ్ 4) ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్
2. వైమానిక రంగంలో నైపుణ్యాభివృద్ధికోసం (స్కిల్ డెవలప్మెంట్) కోసం ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎయిర్బస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఎక్కడ ఏర్పాటు చేయనుంది?
1) అహ్మదాబాద్ 2) బెంగళూరు 3) ముంబై 4) హైదరాబాద్
3. స్ట్రాంగర్ పాట్నర్షిప్ ఫర్ ఏ బ్రైటర్ ఫ్యూచర్ దేని నినాదం?
1) బ్రిక్స్ సమ్మిట్- 2017
2) జీ20 సదస్సు- 2017
3) అపెక్ సదస్సు- 2017
4) ఏషియన్ సదస్సు- 2017
4. ప్రధానమంత్రి భారతీయ జనఔషధి కేంద్రాలు పథకంలోని 3 Aలు వేటిని సూచిస్తాయి?
1) Actability, Availability and Affordability
2) Ability, Availability and Affordability
3) Activity, Availability andAffordability
4) Authenticity, Availability and Affordability
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు