Maths would not survive without it | మ్యాథ్స్ లేకుంటే మనుగడే లేదు
మ్యాథ్స్ ఏ రంగంలోనైనా దూసుకు పోగల సబ్జెక్ట్ ఇది. టెట్, డీఎస్సీ, కానిస్టేబుల్, ఎస్ఐ, బ్యాంక్ పీవో తదితర పోటీ పరీక్షల్లో అత్యంత కీలకమైన పాత్ర మ్యాథమెటిక్స్ది. కాబట్టి మ్యాథమెటిక్స్ను రోజువారి సమస్యల రూపంలో చూస్తేనే సులభం అవుతుంది. గణితం అంటే విషయాలకు సంబంధించిన వివిధ సూక్ష్మ పద్ధతులను నేర్చుకునే కళ.
సంఖ్య, రాశుల, మాపణాల విజ్ఞానమే గణితం అని బెల్ అనే శాస్త్రవేత్త అభివూపాయపడగా, ‘సామాన్య విజ్ఞాన శాస్త్రమంతా గణిత పూరితమేనని’ కాంట్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నాడు. భౌతిక పరిశోధన నుంచి విడగొట్టలేని పరికరం గణితం అని బెర్త్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నాడు. అనాది నుంచి మానవ జీవితావసరాలను తీర్చడానికి సహకరించేదిగా గణితం రూపొందుతూ వచ్చింది.
ఏ పోటీపరీక్ష తీసుకున్న మూడో తరగతి నుంచి పదోతరగతి వరకు గల గణిత పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుని ప్రశ్నలను అడగుతున్నారు. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు గణిత సబ్జెక్ట్ కష్టం అని పూర్తిగా వదిలేస్తుంటారు. ప్రశ్నపత్రంలోని సమస్యలన్నీ దాదాపు నిజజీవితంలో తారసపడేవే. కొద్దిపాటి మెళకువల సహాయంతో నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా వంద శాతం మార్కులను సాధించవచ్చు.
ప్రతి పోటీపరీక్షలో అర్థమెటిక్ అంశాలన్ని దాదాపుగా 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గణితపుస్తకాల్లో కనిపిస్తాయి. గత ప్రశ్నపవూతాలను పరిశీలిస్తే అర్థమెటిక్ విభాగంలో క్షేత్ర గణితం, నిష్పత్తి, కాలం-పని, కాలం-దూరం, భాగస్వామ్యం, చక్రవడ్డీ-బారువడ్డీ, సరాసరి, లాభ-నష్టాలు, దత్తాంశాల వివరణ, గడియారం, క్యాలెండర్, సంఖ్యా వ్యవస్థ, సూక్ష్మీకరణలు, వయస్సు లు, వర్గమూలాలు, ఘనమూలాలు అనే అంశాలపై ప్రశ్నలను అడగడం జరిగింది.
రీజనింగ్ విషయంలో కొత్తగా ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఈ అంశం పాఠ్యపుస్తకాల్లో ఎక్కడ కనిపించదు. కాబట్టి కొంత వరకు కొత్తగా అనిపించినా…. గణితంలో ఒక భాగం కానప్పటికి… గణితంతో సంబంధాన్ని కలిగి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు.
నాన్‌మ్యాథ్స్ అభ్యర్థులు అర్థమెటిక్ పై మంచి పట్టు సాధించాలంటే కింది విషయాలపై పూర్తి అవగాహన ఉండాలి.
1. ప్రాథమిక పరిక్షికియలైన సంకలనం, వ్యవకలనం, గుణాకారం, భాగాహారం.
2. 20 వరకు ఎక్కాలు
3. 1 నుంచి 30 వరకు గల అంకెల వర్గాలు
4. 20లోపు సంఖ్యల ఘనాలు
5. 100లోపు ప్రధాన సంఖ్యలు
6. క్షేత్ర గణితం, వ్యాపార గణితం సంఖ్యావాదంలోని కొన్ని ముఖ్య సూత్రాలు
మెళకువలు
1. అకడమిక్ పరీక్షలకు, పోటీపరీక్షలకు చాలా తేడా ఉంది. అకడమిక్ పరీక్షల్లో 35 శాతం మార్కులు సాధిస్తే పాస్ అయినట్లే. కానీ పోటీపరీక్షల్లో 0.02 మార్కు తేడాతో కూడా ఉద్యోగ అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ముఖ్యంగా నాన్‌మ్యాథ్స్ అభ్యర్థులు ప్రణాళికా బద్ధంగా కాలం వృథా చేయకుండా రోజుకు కనీసం నాలుగు గంటలు ప్రాక్టీస్ చేయాలి.
2. అర్థమయితే గణితం చాలా సులువు. ఈ విభాగంలో అభ్యర్థులు సులభంగా పూర్తి మార్కులు సాధించవచ్చు. ప్రతీ చాప్టర్ మీద అవగాహన కలిగి ఉండి వీలైనన్ని తక్కువ సూత్రాలు గుర్తుపెట్టుకోవాలి.
3. ముందుగా గత సంవత్సరాల ప్రశ్నాపవూతాలను పరిశీలించి ప్రశ్నల స్థాయిని, ఏ చాప్టర్ ఎక్కువ వెయి ఇస్తున్నారో ఆ చాప్టర్లను గుర్తించి ప్రిపరేషన్‌ను ప్రారంభించాలి.
4. రివిజన్ చాలా ముఖ్యం. ప్రాక్టీస్ చేయడం అనువర్తిత ప్రశ్నలు ఊహించుకుంటూ చదవడం వల్ల ప్రశ్నలను ఏ విధంగా అడిగిన జవాబులు సులుభంగా గుర్తించవచ్చు.
5. ప్రతీ పోటీపరీక్షకు పోటీ తీవ్రంగా ఉండడం వల్ల ఎక్కువ మంది అభ్యర్థులను ఫిల్టర్ చేయడానికి ప్రశ పత్రాన్ని రూపొందించేవారు. సులభమైన ప్రశ్నలను కూడా రకరకాల కోణాల్లో అడిగే అవకాశం ఉంది.
6. తరగతుల వారీగా సిలబస్‌ను చదవకుండా చాప్టర్స్ వారీగా ప్రిపేర్ అయితే మంచిది. అనగా సర్పిలాకార పద్ధతిలో అన్నమాట. ఉదాహరణకు సంఖ్యలు అనే అధ్యయనాన్ని ఆరోతరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న అంశాలను ఒకేసారి ప్రిపేర్ కావడం.
7. సిలబస్‌లో పేర్కొన్న అన్ని అధ్యాయాలను అందులోని ప్రతీ భావనను బట్టీ పట్టకుండా నేర్చుకోవాలి. ముఖ్యమైన సూత్రాలను ఒక చోట రాసుకోవాలి.
8. ముఖ్యంగా నాన్‌మ్యాథ్స్ అభ్యర్థులు ఏ పోటీపరీక్షకు ప్రీపేర్ అవుతున్నారో ఆ పోటీపరీక్షకు సంబంధించిన మోడల్ పేపర్లలోని గణిత ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం వల్ల నేర్చుకున్న విషయాలు బాగా గుర్తుండటంతో పాటు తప్పుగా గుర్తించిన సమాధానాలను వెంటనే నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పరీక్ష రాసేవారు అకుంఠిత దీక్షతో ప్రిపరేషన్ కొనసాగించాలి.
9. కొన్ని ప్రశ్నలకు సమాధానాలను జవాబు నుంచి కూడా కనుక్కొనే విధానాన్ని ప్రాక్టీస్ చేయడం వలన సమయం వృథా కాదు.
10. వివిధ పద్ధతులను ఉపయోగించి జవాబులు సాధించడం వేరు, షార్ట్‌కట్స్‌లో చేయడం వేరు. కాబట్టి ప్రతీ ప్రశ్నను సులభంగా ఎలా సాధించాలో ప్రాక్టీస్ చేయాలి.
చివరగా నాన్‌మ్యాథ్స్ అభ్యర్థులు మ్యాథ్స్ అభ్యర్థులం కాము అనే భావనను తీసివేసి ఒత్తిడికి లోను కాకుండా ప్రిపరేషన్ కొనసాగిస్తే ప్రతీ పోటీ పరీక్షలో కూడా ముందంజలో ఉండవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?