Olympiad Registration 2023 | ప్రతిభకు పదును.. ఒలింపియాడ్స్
| ఒలింపియాడ్స్.. క్రీడల్లో ఒలింపిక్స్లాగా పాఠశాల స్థాయిలో మ్యాథ్స్, సైన్స్లకు ఒలింపియాడ్లు ఉత్తమమైన వేదికలుగా పేర్కొనవచ్చు. ప్రపంచస్థాయిలో సెకండరీ, హయ్యర్ సెకండరీ విద్యార్థులను అత్యున్నత స్థాయి స్నేహపూర్వక పోటీలోకి తీసుకురావడం లక్ష్యంగా నిర్వహించేవే.. ఒలింపియాడ్స్. అంతర్జాతీయ ఒలింపియాడ్‌లకు అనుసంధానించే బేసిక్ సైన్సెస్, మ్యాథ్స్‌లకు ప్రధానమైన ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్‌కు హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ నోడల్ కేంద్రం. ఈ సంస్థ నిర్వహించే ఆయా ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ గురించి సంక్షిప్తంగా….
హెచ్బీసీఎస్ఈ
- హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్. దీన్ని ఏర్పాటు చేయాలని 1960లో నిర్ణయించగా.. 1974, జూలైలో టీఐఎఫ్ఆర్లో ప్రారంభించారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్)లోని కొంతమంది శాస్త్రవేత్తలు దేశంలో సైన్స్ విద్యా నాణ్యతను మెరుగుపర్చేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా తొలుత ముంబై మున్సిపల్ కార్పొరేషన్, మధ్యప్రదేశ్ గ్రామీణ పాఠశాలల్లో పలు కార్యక్రమాలను ప్రారంభించారు. సైన్స్ సంబంధిత ప్రాథమిక పరిశోధనలు చేయడం, ప్రయోగాలకు సంబంధించిన విద్యా సామగ్రిని రూపొందించడం వంటివి చేశారు. టాటా ట్రస్ట్ ఇచ్చిన గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ద్వారా దీన్ని ప్రారంభించారు. మొదట ఏడేండ్లు టాటా ట్రస్ట్ దీన్ని నిర్వహించింది. తదనంతర కాలంలో అటామిక్ ఎనర్జీ శాఖ పరిధిలోనికి దీన్ని తీసుకువచ్చారు. ప్రస్తుతం హెచ్బీసీఎస్ఈ అనేది టీఐఎఫ్ఆర్లోని స్కూల్ ఆఫ్ నేచురల్ సైన్సెస్ పరిధిలో ఉన్నది. ఇది మ్యాథ్స్, సైన్స్ పరిశోధనలకు, అభివృద్ధికి అంకితమయ్యింది.
ఒలింపియాడ్స్ - ఆస్ట్రానమి (జూనియర్, సీనియర్), బయాలజీ, కెమిస్ట్రీ, జూనియర్ సైన్స్ అండ్ ఫిజిక్స్‌ల్లో ఐదు దశల్లో నిర్వహిస్తారు.
- సైన్స్ సబ్జెక్టులో మొదటి స్టేజీని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ (ఐఏపీటీ), ఆయా సబ్జెక్టులకు సంబంధించిన టీచర్ అసోసియేషన్స్‌తో కలిసి నిర్వహిస్తుంది. మిగిలిన అన్ని దశలను హెచ్బీసీఎస్ఈ చేపడుతుంది.
- మ్యాథ్స్ సబ్జెక్టు ఒలింపియాడ్‌ను నేషనల్ బోర్డ్ ఆఫ్ హయ్యర్ మ్యాథమెటిక్స్ (ఎన్బీహెచ్ఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. మ్యాథ్స్‌లో మొదటి స్టేజీని పీఆర్ఎంవోను మ్యాథమెటిక్స్ టీచర్స్ అసోసియేషన్ (ఇండియా) నిర్వహిస్తుంది. మిగిలిన అన్ని స్టేజీలను హెచ్బీసీఎస్ఈ నిర్వహిస్తుంది.
- విద్యార్థులు, ఉపాధ్యాయులే కాకుండా మ్యాథ్స్, సైన్స్‌కు సంబంధించిన అర్హతలు ఉన్న ఎవరైనా ఒలింపియాడ్ రిసోర్సెస్‌ను ఉపయోగించుకునే అవకాశాన్ని హెచ్బీసీఎస్ఈ కల్పిస్తుంది.
సైన్స్ ఒలింపియాడ్ - దీనిలో ఐదు స్టేజ్‌లు ఉంటాయి.
- స్టేజ్-1 నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్. ఇది పాఠశాల స్థాయిలో ఉంటుంది. దీనిలో థియరిటికల్ ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. దీన్ని సాధారణంగా నవంబర్‌లో నిర్వహిస్తారు. 20 వేల నుంచి 60 వేల మంది విద్యార్థులు దీనిలో పాల్గొంటారు.
- స్టేజ్-2 ఇది ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్. దీన్ని సాధారణంగా జనవరిలో, దేశవ్యాప్తంగా 18 కేంద్రాల్లో నిర్వహిస్తారు. 300-500 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. దీనిలో థియరిటికల్ ఆబ్జెక్టివ్, లాంగ్ క్వశ్చన్స్ ఇస్తారు.
- స్టేజ్-3 ఇది ఓరియంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్. దీన్ని ఏప్రిల్, మే, జూన్‌లో హెచ్బీసీఎస్ఈలో నిర్వహిస్తారు. రెండో స్టేజ్ నుంచి 35-50 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు.
- స్టేజ్-4. Pre-Departure Campగా పిలుస్తారు. జూలై/నవంబర్‌లో, హెచ్బీసీఎస్ఈలో నిర్వహిస్తారు. దీనికి 4-6 విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు.
థియరిటికల్, ఎక్స్పరిమెంటల్ సెషన్స్ ఉంటాయి. - స్టేజ్-5లో ఇంటర్నేషనల్ ఒలింపియాడ్. దీన్ని జూలై/ ఆగస్టు/డిసెంబర్-2023లో నిర్వహిస్తారు. ఇది అంతర్జాతీయ వేదికలపై చేపడతారు. దీనికి 4-6 విద్యార్థులను ఎంపికచేస్తారు. థియరీ, ఎక్స్పరిమెంట్ కాంపిటీషన్.
నోట్: మ్యాథ్స్ ఒలింపియాడ్స్ కూడా ఐదు స్టేజ్లలో నిర్వహిస్తారు. - మొదటి స్టేజీ ఎగ్జామ్ (ఇండియన్ ఒలింపియాడ్ క్వాలిఫయర్ ఇన్ మ్యాథమెటిక్స్ (ఐవోక్యూఎం). ఈ పరీక్ష కాలవ్యవధి మూడుగంటలు. 100 ప్రశ్నలు. నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్.
రెండో స్టేజీ ఎగ్జామ్ - రీజినల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ (ఆర్ఎంవో)
- మూడు గంటలు నిర్వహిస్తారు. ఆరు ప్రశ్నలు ఇస్తారు.
మూడో స్టేజీ - ఇండియన్ నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ (ఐఎన్ఎంవో). దీనిలో 6 ప్రశ్నలు ఇస్తారు.
ఎవరు అర్హులు - 8-12వ తరగతులు చదువుతున్న విద్యార్థులు మొదటి స్టేజీ రాయడానికి అర్హులు. మ్యాథ్స్ ఒలింపియాడ్‌కు సంబంధించిన అర్హతల వివరాలను https:// olym piads.hbcse. tifr.res. in/how-to-participate/ eligibility/ mathe matical-olympiad/ చూడవచ్చు.
మ్యాథ్స్ ఒలింపియాడ్ సిలబస్ - Pre-degree college mathematic-arithmetic of integers, geometry, quadratic equations and expressions, trigonometry, coordinate geometry, system of linear equations, permutations and comb ination, factorization of polynomial, inequalities, elementary combinatorics, probability theory and number theory, finite series and complex numbers and elementary graph theory. The syllabus does not include calculus and statistics. The major areas from which problems are given are algebra, combinatorics, geometry and number theory . The syllabus covers a few topics from the curricula of Class X to Class XII, but the problems under each topic involve a high level of difficulty and sophistication. The difficulty level increases from RMO to INMO to IMO.
- సైన్స్ ఒలింపియాడ్స్ సిలబస్ కోసం https:// olympiads. hbcse.tifr.res.in/how-to-prepare/syllabus చూడవచ్చు.
- ఒలింపియాడ్ బుక్స్ కోసం https://olympiads. hbcse. tifr.res.in/how-to-prepare/ olym piad-books వెబ్సైట్ చూడవచ్చు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: వెబ్సైట్లో
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://olympiads.hbcse.tifr.res.in
పూర్తి వివరాల కోసం : Olympiads Homi Bhabha Centre for Science Education Tata Institute of Fundamental Research
V. N. Purav Marg, Mankhurd,
Mumbai-400088, INDIA
Science Olympiads Mathematical Olympiads
022-2507 2322
scioly@hbcse.tifr.res.in
022-2507 2207 / 2208
matholy@hbcse.tifr.res.in
Web: http://www.hbcse.tifr.res.in
కేశవపంతుల వేంకటేశ్వర శర్మ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు