Tri Methods – TET Special | అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ?
1. యదార్థాల విధులకు సంబంధించి కింది వాటిలో ఒకటి సరైనది?
1) యదార్థాలు సిద్ధాంతాలకు నాంది పలుకుతాయి
2) యదార్థాలు సిద్ధాంతాన్ని పునర్ నిర్వచించి స్పష్టతను చేకూరుస్తాయి
3) ప్రస్తుతం ఉన్న సిద్ధాంతాలను యదార్థాలు ప్రభావితం చేయలేవు ఏ సిద్ధాంతానికైనా, నియమానికైనా యదార్థాలే స్థూల మూలాలు
2. సిద్ధాంతం అనేది?
1) క్రియాశీలకమై ఉంటుంది
2) స్థిరంగా ఉంటుంది
3) ఎల్లప్పుడూ వాస్తవమై ఉంటుంది
4) సులభంగా మారుతుంది
3. వైజ్ఞానిక పద్ధతిలో మొదటి సోపానం?
1) పరికల్పనను రూపొందించటం
2) సమస్యను గుర్తించుట
3) విధానాన్ని వివరించి రాయటం
4) దత్తాంశ వ్యాఖ్యానం
4. హైడ్రోక్లోరిక్ ఆమ్లం నీలి లిట్మస్ను ఎరుపు రంగుకు మారుస్తుంది. ఈ వాక్యం ఒక ….?
1) భావన 2) యదార్థం
3) నియమం 4) సూత్రం
5. లోహాలు సుతిమెత్తని, సాగే గుణం కలవి. ఈ ప్రవచనం ఒక …..?
1) పరిశీలన 2) భావన
3) సూత్రం 4) పరికల్పన
6. విజ్ఞాన శాస్త్రం సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించినది?
1) ప్రాయోగిక జ్ఞానం
2) విజ్ఞాన శాస్త్ర ప్రక్రియలు
3) విజ్ఞాన శాస్త్ర వైఖరులు
4) విజ్ఞాన శాస్త్ర పద్ధతులు
7. చీకటి యుగమని పిలిచిన కాలం?
1) ప్రాచీన కాలం 2) గ్రీకుల కాలం
3) అలెగ్జాండ్రియన్ కాలం
4) నవీన కాలం
8. 9వ తరంగతి విద్యార్థులను వారి ఉపాధ్యాయుడు జీవశాస్త్రంలో ఒక సమస్యను సాధించమన్నప్పుడు, దాన్ని చేపట్టడానికి వారు మొదటగా చేయవలసిన ముఖ్యమైన పని?
1) సమస్యను అవగాహన చేసుకోవడం
2) వర్గీకరణ
3) సమస్యను గుర్తించడం
4) మూల్యాంకనం
9. భావనలు సత్యమని గాని, అసత్యమనిగాని నిరూపించలేని పక్షంలో అవి ఏ విధంగా పరిగణించబడతాయి?
1) నియమాలుగా 2) సూత్రాలుగా
3) సాధారణీకరణాలుగా
4) సిద్ధాంతాలుగా
10. అయస్కాంత పదార్థాలన్నీ అయస్కాంతాల చేత ఆకర్షింపబడతాయి అనేది ఒక…?
1) భావన 2) సూత్రం
3) సిద్ధాంతం 4) నియమం
11. చంద్రుని చలనాన్ని వివరించే 24 నక్షత్రాల గురించి వివరించిన గ్రంథం?
1) రుగ్వేదం 2) సామవేదం
3) అధర్వణ వేదం 4) యజుర్వేదం
12. కిందివాటిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం సంశ్లేషణాత్మక నిర్మాణంలో పొందుపరచినది?
1) యదార్థాలు 2) సిద్ధాంతాలు
3) వైఖరులు 4) భావనలు
13. విజ్ఞానశాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని నిర్వచించిన వారు?
1) కార్ల్ పియర్సన్ 2) హెన్రీ పాయింకర్
3) ఐన్స్టీన్ 4) ఎ.డబ్ల్యూ, గ్రీస్
14. ‘ఆది మానవుడు వ్యవసాయ పనిముట్లు అభివృద్ధిపరిచి ఆహార పంటలు పండించడం ప్రారంభించాడు’-ఈ అంశాన్ని జీవశాస్త్రంలో ప్రధానంగా ఏ సబ్జెక్టుతో సంబంధం ఏర్పరచి బోధించవచ్చు?
1) చరిత్ర 2) గణిత శాస్త్రం
3) భాష 4) భూగర్భ శాస్త్రం
15. కింది వాటిలో ఒకటి మౌలిక ప్రక్రియ?
1) ప్రయోగం చేయడం
2) పరికల్పన ప్రతిపాదన
3) దత్తాంశ వ్యాఖ్యానం
4) వర్గీకరించడం
16. విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధనా విధానం అని నిర్వచించిన వారు?
1) జేమ్స్ రాండీ 2) ఎ. డబ్ల్యూ.గ్రీస్
3) అర్హీనియస్ 4) హెన్రీ పాయింకర్
17. కింది వాటిలో ఒకటి విజ్ఞాన శాస్త్రం సంశ్లేషణాత్మక నిర్మాణం?
1) భావనలు 2) సూత్రాలు
3) ప్రక్రియలు 4) సిద్ధాంతాలు
18. ‘ప్రకృతిలోని జీవరాశులను వాటి మధ్య ఉన్న పోలికలు, తేడాలను బట్టి సమూహాలుగా చేయడం’ అనేది ఏ మౌలిక ప్రక్రియ?
1) చరరాశులను నియంత్రించడం
2) దత్తాంశ వ్యాఖ్యానం
3) వర్గీకరణం
4) పరికల్పన ప్రతిపాదన
19. కింది వాటిలో ఏది ప్రకియా నైపుణ్యాల అభ్యసన సూచిక కాదు?
1) వర్గీకరణం 2) మాపనం
3) భావ ప్రసారం 4) నిష్పాదనం
20. కిందివాటిలో ఏ అంశం విజ్ఞాన శాస్త్రంలో మాత్రమే బోధిస్తారు?
1) ఖనిజ వనరులు
2) రాజవంశం కాలంలో ఆవిష్కరణలు
3) విద్యుత్తు 4) వలసలు
21. ‘విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత శక్తులను బయటకి తీయడానికి వారి సామర్థ్యాల ఆధారంగా విద్యాబోధన జరగాలి’ ఈ ప్రవచనాన్ని చెప్పినవారు?
1) డా. డి.ఎస్. కొఠారి
2) బి.ఎస్. బ్లూమ్
3) ఆర్.హెచ్.దవే
4) డి.ఆర్. క్రాత్వెల్
22. నీవు సూర్యుడివలే ప్రకాశించాలంటే మొదట నీవు సూర్యుడి వలే మండాలి?
1) కార్ల్ స్పియర్మన్ 2) ఐన్స్టీన్
3) గాంధీ 4) ఏపీజే అబ్దుల్ కలాం
23. శాస్త్ర ఆవిష్కరణలో నేను పిల్లవాడినే, ఎందరో మహానుభావులు చేసిన కృషిపై నిలబడి విజ్ఞాన శాస్ర్తాన్ని నేను చూస్తున్నాను?
1) అబ్దుల్ కలాం 2) న్యూటన్
3) సోక్రటీస్ 4) సి.వి, రామన్
24. సరిగా జతపరచండి.
ఎ) సైన్స్ 1) ఆంగ్లపదం
బి) సైన్షియా 2) అరబిక్ పదం
సి) విజ్ఞాన్ 3) లాటిన్ పదం
డి) ఇల్మి 4) సంస్కృత పదం
1) ఎ-1, బి-3, సి-4, డి-2
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-1, బి-2, సి-3, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-1
26. షో ఆల్టర్ విజ్ఞాన శాస్త్ర లక్షణాలకు సంబంధించిన దాన్ని గుర్తించండి?
ఎ) శాస్త్రం అనుభవాత్మకం
బి) శాస్త్రీయ జ్ఞానం సాపేక్ష అసత్యమే
సి) శాస్త్రీయ జ్ఞానం మాపనీయమైనది
సి) శాస్త్రీయ జ్ఞానం మేలైనది
1) ఎ, సి సరైంది, బి,డి సరికాదు
2) ఎ, బి, సి, డి సరైనవి
3) ఎ, సి, డి సరైనవి, బి సరికాదు
4) ఎ, బి, సి సరైనవి, డి సరికాదు
27. జతపరచండి?
ఎ) ప్రయోగాలు పరిశీలనల నుంచి వృద్ధి పొంది, ప్రయోగాత్మక పరీక్షలకు ఫలితాన్నిస్తుంది 1) ప్లేటో
బి) భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను, సమాజాన్ని పరిశీలించడం ద్వారా సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చిన
వ్యవస్థీకరించిన జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం
2) ఆక్స్ఫర్డ్ ఏఎల్డీ
సి) శాస్త్రం ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు. మళ్లీ మళ్లీ ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడమే 3) జేమ్స్ బి కొనాంట్
డి) బుద్ధి ద్వారానే సత్యాన్వేషణ కార్యకారణ సంబంధం రాబట్టవచ్చు.
4) రాబర్ట్ హెచ్. మెక్ ఆర్డర్
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-4, బి-3, సి-2, డి-3
28. విజ్ఞాన శాస్త్ర, ఉపాధ్యాయుడిగా విజ్ఞానశాస్త్ర స్వభావాన్ని గుర్తించండి?
ఎ) విజ్ఞానశాస్త్రం నిరంతరం కొనసాగేది
బి) ఎప్పటికప్పుడు స్వీయ మూల్యాంకనానికి లోనవుతూ ఇంకా మారుతూనే ఉంటుంది
సి) ప్రయోగాలు, పరిశీలనలు, అన్వేషణ ప్రాకల్పనలు విజ్ఞాన శాస్ర్తానికి ఆధారాలు
డి) నేటి సత్యం గురించే తెలుపుతుంది. కానీ ఎల్లవేళలా ఉండే సత్యం గురించి తెలపదు
1) ఎ, బి, సి, డి సత్యం
2) ఎ, సి సత్యం, బి, డి అసత్యం
3) బి, డి అసత్యం
4) అన్ని అసత్యాలే
29. విజ్ఞాన శాస్ర్తాన్ని శాస్త్రవేత్తలు స్తబ్ద దృష్టితో చూస్తే కింది లక్షణాలు గుర్తించవచ్చు?
ఎ) యదార్థాలు
బి) సూత్రాలు
సి) నియమాలు, సిద్ధాంతాలు
డి) ఫలితంగా ఉత్పన్నం చూడవచ్చు
1) ఎ, బి సత్యం, సి, డి అసత్యం
2) ఎ, బి, సి సత్యం, డి అసత్యం
3) ఎ, బి, సి, డి సత్యాలు
4) సి, డి, అసత్యం, ఎ, బి సత్యం
25. జతపరచండి?
ఎ) విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధనా విధానం 1. ఐన్స్టీన్
బి) విజ్ఞానశాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి 2) కార్ల్పియర్ సన్
సి) విజ్ఞాన శాస్త్ర ఆన్వేషణకు యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థమే 3) కొలంబియా ఎన్ సైక్లోపీడియా
డి) ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్రమీకరించిన విజ్ఞాన శాస్త్రం 4) ఎ.డబ్ల్యు. గ్రీన్
5. కార్ల్ పియర్సన్
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-4, బి-1, సి-3, డి-2
3) ఎ-4, బి-1, సి-2, డి-3 4) ఎ-4, బి-1, సి-5, డి-3
సమాధానాలు
1-3 2-1 3-2 4-2
5-2 6-1 7-3 8-3
9-4 10-1 11-4 12-3
13-3 14-1 15-4 16-2
17-3 18-3 19-4 20-3
21-3 22-4 23-2 24-1
25-3 26-3 27-2 28-1
29-3
బోధనా ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు
1. ‘శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు’ అనే సృష్టీకరణ కింది లక్ష్యానికి సంబంధించినది?
1) జ్ఞానం 2) అవగాహన
3) వినియోగం 4) అభిరుచి
2. సత్యం ద్వారా ప్రకృతిలోని సమన్వయం తెలుసుకొనబడింది. ఈ ప్రవచనం కింది విజ్ఞాన శాస్త్ర విలువల జతలో ఒకదాన్ని తెలియజేస్తుంది?
1) నైతిక, మనోవైజ్ఞానిక
2) శిక్షణ, సాంస్కృతిక
3) బౌద్దిక, సౌందర్యాత్మక
4) శిక్షణ, మనోవైజ్ఞానిక
3. విద్యార్థులకు శాస్త్రీయపద్ధతుల్లో శిక్షణ నివ్వడం ద్వారా వారిలో ఎక్కువగా పెంపొందే విలువ?
1) సాంస్కృతిక విలువ
2) సృజనాత్మక విలువ
3) క్రమశిక్షణ విలువ
4) ఉపయోగితా విలువ
4. భావావేశ రంగానికి చెందిన స్పష్టీకరణ?
1) జంతువులు, మొక్కల మధ్యగల పరస్పర సంబంధాలను అభినందించడం
2) జీవ అంశాల మధ్య పరస్పర సంబంధాలను పోల్చడం
3) అవరణ వ్యవస్థ వర్గీకరణను తెలిపే ఫ్లో చార్టు గీయడం
4) వివిధ రకాల ఆవరణ వ్యవస్థలను వివరించడం
5. ‘విద్యార్థులు ప్రయోగ పరికరాలను జాగ్రత్తగా అమర్చగలిగారు’ ఇది మానసిక చలనాత్మక రంగంలోని ఏ లక్ష్యం?
1) అనుసరణ 2) ప్రతిస్పందన
3) హస్తలాఘవం 4) విలువ కట్టడం
6. జ్ఞానాత్మక రంగం నందలి ఒక లక్ష్యం?
1) సునిశితత్వం 2) గ్రహించడం
3) ప్రతిస్పందన 4) మూల్యాంకనం
7. అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ?
1) కారణాలు తెల్పడం
2) సాధారణీకరించడం
3) లోపాలను కనిపెట్టడం
4) విశ్లేషణ
8. “ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్, ప్రకృతి అధ్యయనంలో అవ్యక్తమైన ఆనందాన్ని అనుభవిస్తారు’. ఈ మాటలు ఏ విలువకు వర్తిస్తాయి?
1) ప్రయోజనాత్మక విలువ
2) సాంస్కృతిక విలువ
3) సృజనాత్మక విలువ
4) సౌందర్యాత్మక విలువ
9. వేర్వేరు రుతువుల్లో లోలక గడియారం వేగంగాను నిదానంగా తిరగడానికి గల కారణాలను విద్యార్థులు తెలపగలిగితే ఆ స్పష్టీకరణ, ఏ లక్ష్యానికి సంబంధించినది?
1) జ్ఞానం 2) నైపుణ్యం
3) అవగాహన 4) అన్వయం
10. భావావేశ రంగం ఒక లక్ష్యం?
1) అన్వయం 2) సమన్వయం
3) హస్తలాఘవం 4) వ్యవస్థాపనం
11. విద్యార్థి ‘గ్రహం వ్యాపన నియమాన్ని రుజువు చేయడం’ అనే ప్రయోగానికి పరికరాలు అమర్చారు. ఈ ప్రవర్తనా మార్పు కింది ఏ లక్ష్యానికి సంబంధించినది?
1) అవగాహన 2) జ్ఞానం
3) వినియోగం 4) నైపుణ్యం
12. విద్యార్థి ‘నిరోధాలను సమాంతరంగా కలిపిన సర్క్యూట్ డయాగ్రమ్లో దోషాలు కనిపెట్టుట’ అనే ప్రవర్తనా మార్పు ఏ లక్ష్యానికి సంబంధించినది?
1) జ్ఞానం 2) అవగాహన
3) వినియోగం 4) అభిరుచి
13. విజ్ఞాన శాస్త్రం పరిశీలన, కొలవడం, ప్రయోగాలు చేయడం వంటి ప్రక్రియా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. ఇది ఏ విలువకు సంబంధించినది?
1) క్రమశిక్షణా విలువ
2) వ్యవహారిక విలువ
3) నైతిక విలువ 4) వృత్తి విలువ
ANS
1-3 2-3 3-3 4-1
5-3 6-4 7-3 8-4
9-4 10-4 11-4 12-2
13-1
రవి కుమార్
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?