సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి అంటే ఏమిటి?
భూమి వైవిద్యం
- సూర్యుడి నుంచి నిరంతరాయంగా వెలువడే శక్తిని సౌర వికిరణం అంటారు.
- భూమి ఉపరితలానికి చేరుకునే సౌరవికిరణాన్ని సౌరపుటం (ఇన్సోలేషన్) అంటారు.
- సౌర శక్తిలో మూడవ వంతు భూ వాతావరణం వల్ల పరావర్తనం చెందుతుంది.
- భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణాన్ని పతన కోణం అంటారు.
- వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు శాతం పెరిగితే భూవికిరణం తగ్గి భూగోళంపై ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీనినే భూగోళం వేడెక్కడం (గ్లోబల్ వార్మింగ్) అంటారు.
- భూగోళంపై 1992 జూలైలో లిబియా (ఆఫ్రికా)లోని అజీజియాలో అత్యధికంగా 57.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
- భూగోళంపై 1983 జూలైలో అంటార్కిటికా లోని వోస్టాక్ కేంద్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత మైనస్ (-) 89.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
- 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకి చేరితే నీరు మరుగుతుంది. 0 డిగ్రీల సెల్సియస్‌కు చేరితే నీరు గడ్డకడుతుంది.
- ఉష్ణోగ్రతల్లో (మైనస్) – 273.16 డిగ్రీ సెల్సియస్ అత్యంత అల్పమైనది. ఇంతకంటే తగ్గదు.
సముద్ర తీర ప్రాంత ప్రదేశాల్లో సాధారణంగా సంవత్సరమంతా శీతోష్ణస్థితులు ఒకే రకంగా ఉంటాయి. దీనినే సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి అంటారు. - సాధారణంగా సముద్ర మట్టం నుంచి ప్రతి 1000 మీటర్ల ఎత్తుకు వెళ్లే కొద్ది ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గుతాయి.
- సూర్యకిరణాలు భూమధ్య రేఖ ప్రాంతంలో లంబకోణంలో (90 డిగ్రీలు) పడతాయి.
- సూర్యకిరణాలు ధృవ ప్రాంతాల్లో ఏటవాలుగా పడటం వల్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
- (గ్రీన్ హౌస్ గ్యాసెస్) హరితగృహ వాయువులు మిథేన్, కార్బన్ డై ఆక్సైడ్, భూగోళంపై శక్తికి మూలవనరు సూర్యుడు, కాంతి, వేడి రూపంలో అది నిరంతర శక్తిని విడుదల చేస్తుంది.
భూమి చలనాలు-రుతువులు
భూమధ్య రేఖకు దక్షిణాన ఉన్న ఖండాలలో మనకు వేసవి ఉన్నప్పుడు వాళ్ళకు చలికాలం, మనకు చలికాలం ఉన్నప్పుడు వాళ్ళకు వేసవి కాలం ఉంటుంది.
కాలాలను ప్రభావితం చేసే అంశాలు
- భూమి బంతిలా గోళాకారంలో ఉండటం, ఉపరితలం ఒంపులు తిరిగి ఉండటం
- భూ భ్రమణం- భూమి తన అక్షం మీద రోజుకు ఒకసారి తన చుట్టూ తాను తిరగడం
- భూ పరిభ్రమణం – భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరగడం
- సూర్యుని చుట్టూ భూమి తిరిగే తలంతో పోలిస్తే తన చుట్టూ తాను(భూమి) తిరిగే అక్షం ఒంపు కలిగి ఉంటుంది
- భూమి తన అక్షం మీద ఒకసారి తిరిగి రావడానికి 24 గంటల సమయం పడుతుంది.
- భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతున్నందున, భూ భ్రమణం, సూర్యుడు, చంద్రుడు,
- నక్షత్రాలు తూర్పున ఉదయించి, పశ్చిమాన అస్తమిస్తున్న భ్రమ కలుగుతుంది.
- భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల పగలు, రాత్రులు సంభవిస్తున్నాయి
- భూ భ్రమణానికి పట్టే కాలం – 365 రోజుల 5:56 గంటలు. దీనిని ఒక సంవత్సరంగా పరిగణిస్తారు.
- సూర్యుడి చుట్టూ భూమి ఒకే తలంలో ఒకే దారిలో తిరిగే దానిని కక్ష్య అంటారు. ఈ తలాన్ని కక్ష్య తలం అంటారు.
- భూమి అక్షం ఈ తలం మీద నిటారుగా 90 డిగ్రీల కోణం లో ఉండదు. అది వంగి ఉండి 66.5 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. అంటే కక్ష్యతలం 23.5 డిగ్రీల మేర వంగి ఉంటుంది.
- కొన్ని నెలల్లో ఉత్తరార్థ గోళం సూర్యుడివైపు వంగి ఉంటే, మరికొన్ని నెలల్లో దక్షిణార్థ గోళం సూర్యుడి వైపు వంగి ఉంటుంది.
- మార్చి, సెప్టెంబరు వంటి నెలల్లో సూర్యునికి నేరుగా భూమధ్యరేఖ ఉన్నప్పుడు సూర్యకిరణాలు నేరుగా భూమిపై పడతాయి. ఉత్తర, దక్షిణార్థ గోళాలకు ఒకే మోతాదులో సూర్యుడి నుంచి వేడి, వెలుతురు లభిస్తుంది.
- జూన్ నెలలో ఉత్తరార్థ గోళంలో కర్కటరేఖ మీద సూర్యకిరణాలు నిటారుగా పడతాయి. దక్షిణార్థ గోళం మకరరేఖ మీద డిసెంబర్ నెలలో సూర్యకిరణాలు నిటారుగా పడతాయి
- భూగోళంపై కర్కట రేఖ నుంచి మకర రేఖ ఉన్న ప్రాంతాన్ని ఉష్ణమండలం అంటారు.
- పగలు, రాత్రి సమానంగా ఉండే రోజులను విషవత్తులు అంటారు.
- మార్చి 21, సెప్టెంబరు 23 రోజులలో ప్రపంచవ్యాప్తంగా పగలు, రాత్రి సమానంగా ఉంటాయి.
- భూమధ్యరేఖకు ఉత్తర, దక్షిణాన, ఉష్ణమండలం, సమశీతోష్ణ మండలం ధృవ ప్రాంతాలుగా పిలుస్తారు.
ప్రాక్టీస్ బిట్స్
1. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ఏది? (1)
1) నార్వే 2) స్వీడన్
3) డెన్మార్క్ 4) హాలండ్
2. తెలంగాణ రాష్ట్రంలో మంచు కురవకపోవడానికి కారణమైన అంశాలు? (3)
ఎ) తెలంగాణ ఉష్ణమండలంలో ఉంది
బి) భూ మధ్యరేఖ సమీపంలో లేదు
సి) శీతాకాలంలో తీవ్రమైన చల్లదనం లేదు
డి) తెలంగాణ సమశీతోష్ణ మండలంలో ఉంది
1) ఎ, బి 2) ఎ, బి, డి
3) ఎ, బి, సి 4) డి మాత్రమే
3. సూర్యుడి చుట్టూ భూమి తిరగకపోతే జరిగే ఫలితాలు ఏవి?(2)
ఎ) రాత్రి, పగలు సంభవించవు
బి) కాలాలు ఏర్పడవు
సి) సూర్యుడికి ఎదురుగా ఉన్న భూభాగం పై ఎప్పుడూ వేడి, వెలుతురు ఉంటాయి
డి) భూగోళంపై జీవ జంతు జాలం మనుగడకు ప్రమాదమేదీ ఉండదు
1) ఎ, సి, డి
2) ఎ, బి, సి
3) ఎ, బి, డి
4) ఎ, డి
4. కింది ఖండాలు, అర్థగోళం విస్తరించిన విధానాన్ని జతపరచండి (1)
ఖండం అక్షరగోళం
ఎ) ఆఫ్రికా 1) ఉత్తర, దక్షిణ
బి) దక్షిణ అమెరికా 2) ఉత్తర
సి) ఆస్ట్రేలియా 3) దక్షిణ
డి) యూరప్ 4) పశ్చిమ
5) తూర్పు
1) ఎ-1, బి-4, సి-3, డి-2
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-1, బి-2, సి-3, డి-5
4) ఎ-3, బి-1, సి-4, డి-2
5. భూ భ్రమణానికి సాధారణంగా పట్టే సమయం ఎంత? (1)
1) 24 గంటలు 2) 23 గంటలు
3) 18 గంటలు 4) 20 గంటలు
6. ఉత్తర, దక్షిణ ధృవాలను కలిపే ఒక ఊహాజనిత రేఖను ఏమంటారు? (2)
1) కక్ష్య 2) అక్షం
3) పతన కోణం 4) భ్రమణం
7. భూగోళంపై సూర్యకిరణాలు పడే ప్రాంతాలు – తేదీలతో జతపరచండి (1)
తేదీలు కిరణాలు పడే ప్రాంతం
ఎ) జూన్-21 1)మకర రేఖ
బి) మార్చి-21, సెప్టెంబరు-23 2) కర్కట రేఖ
సి) డిసెంబరు-22 3) భూమధ్య రేఖ
4) ధృవ ప్రాంతాలు
1) ఎ-2, బి-3, సి-1
2) ఎ-2, బి-1, సి-3
3) ఎ-1, బి-2, సి-3
4) ఎ-3, బి-1, సి-4
8. విషవత్తులు సంభవించే రోజులు(1)
1) మార్చి 21, సెప్టెంబరు 23
2) జూన్ 21, డిసెంబరు 22
3) మార్చి 26, మే 12
4) జూన్ 13, జనవరి 16
9. భూ పరిభ్రమణానికి పట్టే రోజులు/ సమయం ఎంత? (2)
1) 365 రోజులు
2) 365 రోజుల 5 గంటల 56 నిమిషాలు
3) 364 రోజుల 5 గంటలు
4) 365 రోజుల 4 గంటల 56 నిమిషాలు
10. భూ భ్రమణం వల్ల కలిగే ఫలితం (3)
1) దిగ్మండలం ఏర్పడటం
2) ఉష్ణోగ్రత మండలం ఏర్పడటం
3) రుతువులు ఏర్పడటం
4) కక్ష్యతలం ఏర్పడటం
11. ధృవ ప్రాంతాల్లో కాలాలకు సంబంధించిన ప్రత్యేకతలు ఏవి? (4)
1) మానవ ఆవాసాలకు అనుకూలం
2) వృక్షాలు పెరుగుతాయి
3) సూర్య కిరణాలు నిలువుగా పడటం
4) 6 నెలలు చీకటి 6 నెలలు పగలు
12. సూర్యుని నుంచి నిరంతరం వెలువడే శక్తిని ఏమని పిలుస్తారు? (1)
1) సౌర వికిరణం 2) వికిరణం
3) సూర్యపుటం 4) పతనకోణం
13. సూర్యుని నుంచి శక్తి కింది వాటిలో ఏ రూపంలో లభించదు? (4)
1) అతి నీలలోహిత కిరణాలు
2) ఎక్స్ కిరణాలు
3) రేడియో తరంగాలు
4) వై కిరణాలు
14. సౌరశక్తిలో ఎన్నవ వంతు భూ వాతావరణం వల్ల పరావర్తనం చెందుతుంది? (1)
1) 1/3 వంతు 2) 1/4 వంతు
3) 1/2 వంతు 4) 1/5 వంతు
15. భూమిపై ఏ ప్రాంతంలో అత్యధిక వేడి లేదా ఉష్ణోగ్రతలు ఉంటాయి?
1) కర్కట రేఖ ప్రాంతం
2) మకర రేఖ ప్రాంతం
3) భూ మధ్యరేఖ
4) ధృవాల వద్ద
16. సూర్య కిరణాలు ఎక్కువ ఏటవాలుగా ఎక్కడ పడతాయి?
1) భూమధ్య రేఖ వద్ద
2) కర్కట రేఖ వద్ద
3) మకర రేఖ
4) ధృవాల వద్ద
17. ఉష్ణోగ్రతలకు సంబంధించి కింది అంశాలను (సరైనవి) పరిశీలించండి (3)
ఎ) భూమిమీద, సముద్రాల మీద ఉష్ణోగ్రతల్లో తేడా ఉండదు
బి) భూమి వేడిని బాగా ప్రసరింపజేస్తుంది
సి) భూమి త్వరగా వేడెక్కి, త్వరగా చల్లబడుతుంది
డి) సముద్రాలు నిదానంగా వేడెక్కి, నిదానంగా చల్లబడతాయి
1) ఎ, బి, డి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) బి, డి
18. భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణాన్ని ఏమంటారు? (1)
1) పతనకోణం 2) సాంద్రత
3) లంబకోణం 4) భూవికిరణం
19. భూమి దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువ వేడిగా ఉండి, వాతావరణంలో పైకి వెళ్తున్నకొద్దీ చల్లగా ఉండటానికి కారణం ?(1)
1) భూవికిరణం
2) మేఘాలు
3) ప్రక్షేపణ
4) హరితగృహాలు
20. భూగోళం వేడెక్కడంతో (గ్లోబల్ వార్మింగ్) సంబంధం లేని అంశం(3)
1) అడవులు నరికివేయడం
2) బొగ్గు పులుసు వాయువు శాతం పెరగడం
3) భూ వికిరణం పెరగడం
4) డీజిల్, పెట్రోలు వినియోగం పెరగడం
21. ఇప్పటివరకు భూగోళంపై అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు ఏవి?(3)
1) మేఘాలయాలోని చిరపుంజీ-వయలిలా
2) ఆఫ్రికాలో సహారా ఎడారి, ఆర్కిటిక్‌లోని అలస్కా
3) లిబియాలోని అజీజియా, అంటార్కిటికాలోని వోస్టాక్
4) కశ్మీర్‌లోని లద్దాక్, హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు లోయ
22. భూమధ్య రేఖ నుంచి ఉత్తరానికి లేదా దక్షిణానికి ప్రయాణం చేస్తుంటే ఉష్ణోగ్రతల్లో కలిగే మార్పు (3)
1) మార్పు ఉండదు
2) ఉష్ణోగ్రతలు పెరుగుతాయి
3) ఉష్ణోగ్రతలు తగ్గుతాయి
4) ఉష్ణోగ్రతలు తగ్గి పెరుగుతాయి
23. ఉష్ణోగ్రతకు సంబంధించి కింది అంశాల్లో సరికానిది ఏది? (4)
1) సముద్రతీరాన ఉండే ప్రదేశాల్లో సాధారణంగా సంవత్సరమంతా శీతోష్ణస్థితులు ఒకే రకంగా ఉంటాయి
2) సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితికి గోవా రాజధాని పనాజి ఉదాహరణ
3) సముద్రాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో గరిష్ఠ , కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో చాలా తేడా ఉండటాన్ని ఖండాంతర్గత శీతోష్ణస్థితి అంటారు
4) ఖండాంతర్గత శీతోష్ణస్థితికి ముంబై మంచి ఉదాహరణ
24. భూమధ్య రేఖ ప్రాంతంలో కింది వాటిలో ఏ కాలం ఉండదు?(2)
1) వేసవి కాలం 2) శీతా కాలం
3) వర్షాకాలం 4) రుతువులు
25. ఢిల్లీ కంటే సిమ్లాలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటానికి కారణం? (1)
1) సముద్ర మట్టం నుంచి ఢిల్లీ కంటే సిమ్లా ఎక్కువ ఎత్తులో ఉండటం
2) సిమ్లా అడవులు, కొండలతో నిండి ఉండటం
3) సముద్ర మట్టం నుంచి ఢిల్లీ కంటే సిమ్లా తక్కువ ఎత్తులో ఉండటం
4) సూర్య కిరణాలు పడే కోణం
26. భారతదేశంలో సాధారణంగా ఏ నెలల్లో సగటు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి?(1)
1) డిసెంబరు-జనవరి
2) జనవరి-ఫిబ్రవరి
3) నవంబరు-డిసెంబరు
4) ఫిబ్రవరి-మార్చి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు