నిజాం కళాశాల ప్రథమ ప్రిన్సిపల్‌గా పనిచేసింది ఎవరు?
- 1933లో రవీంద్రనాథ్ ఠాగూర్ ‘విశ్వ భారతి’కి హైదరాబాద్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎంత విరాళం ఇచ్చాడు? – రూ.1 లక్ష
- హైదరాబాద్‌లో తొలిసారి యునానీ ఆస్పత్రి ఏ నిజాం రాజు కాలంలో ఏర్పడింది? – 7వ నిజాం, మీర్ ఉస్మాన్ అలీఖాన్
- నిజాం రాజ్యంలో హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ పాఠశాల స్థాపన జరిగింది. ఈ ప్రప్రథమ పాఠశాలను స్థాపించిందెవరు? -1904లో మహారాష్ట్రీయుడైన రంగారావు కాళోజీ రెసిడెన్సీ బజార్లో నెలకొల్పాడు
- నిజాం ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలివేసి గ్రంథాలయోద్యమానికి అంకితం అయింది ఎవరు? – మాడపాటి హనుమంతరావు
- 1895లో బాలగంగాధర్ తిలక్‌ను ఆదర్శంగా తీసుకొని హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాన్ని బహిరంగంగా నిర్వహించినదెవరు? – ఆర్య సమాజీకులు
- 16వ దశాబ్దంలో హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన రాజులు ఎవరు? ఏ సంవత్సరంలో నిర్మించారు? – కుతుబ్‌షాహీలు 1591-1592 లో నిర్మించారు.
- 6వ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్‌కు అత్యంత సన్నిహితుడు, అధిక పలుకుబడి కలిగిన‘ఆర్మినియా’ దేశ యూదుడెవరు? – ఆబిద్ ఇవాన్స్ విదర్, హైదరాబాద్ రచయిత
- క్రీ.శ.1687లో నల్లగొండ ముట్టడిలో ఔరంగజేబు సైన్యానికి అధ్యక్షత వహించిన ఘియాజుద్దీన్ ఫిరోజ్జంగ్ కుమారుడెవరు? – మీర్ ఖమ్రుద్దీన్ చిన్ ఖిలిచ్‌ఖాన్-1వ నిజాం
- సంస్థానంపై పోలీస్ చర్య జరగక ముందు నిజాం రాజుకు ఆస్ట్రేలియా నుంచి చిన్న ఆయుధాలు సరఫరా చేసిన వ్యక్తి ఎవరు? – సిడ్నీకాటన్
- కేంబ్రిడ్జి విద్యార్థి ‘రహమత్ అలీ’ హైదరా బాద్ నిజాం రాజ్యానికి ఏ పేరు పెట్టాలని సూచించాడు? – ఉస్మానిస్థాన్
- క్రీ.శ.1687లో తానీషా కూచిపూడి నృత్యకళాకారులకు కూచిపూడి గ్రామాన్ని దానమిచ్చినట్లు తెలిపే చారిత్రక ఆధారం ఏది? – చుపల్లి కైఫీయత్
- నిజాం రాజ్యంలో నిజాం వ్యవహార భాష ఉర్దూ కాగా పరిపాలనా భాష ఏది?- పర్షియన్
- ఒద్దిరాజు సీతారామచంద్రరావు ‘రుద్రమదేవి’ నవల ఏ సంవత్సరంలో ఎక్కడ ముద్రించారు? – బెజవాడ ‘మారుతీ’ ప్రెస్ 1918లో
- అచల సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన రామడుగు శివ రామదీక్షితులు ‘బృహద్వాశిష్టం’ గ్రంథాన్ని ఏ సంవవత్సరంలో రాశారు? -క్రీ.శ.1712లో
- 1985లో వచ్చిన జీవో 610 ప్రకారం స్థానికేతరులు ఏ తేదీలోగా వెనక్కి వెళ్ళాలి? – 1986 మార్చి 31లోగా
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ కాలంలో ‘ధూమ్‌ధామ్’ అనే సాంస్కృతిక కార్యక్రమ రూపకర్త ఎవరు? -రసమయి బాలకిషన్
- హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అన్నపూర్ణ సినీ స్టూడియో కోసం 22 ఎకరాలు కేటాయించిన
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? – జలగం వెంగళరావు
- తెలంగాణ ఉద్యమ కాలంలో శ్రీకృష్ణ కమిటీ ఏ సంవత్సరంలో మొదటిసారిగా తెలంగాణలో పర్యటించింది? – 2010 ఫిబ్రవరి 12న
- హైదరాబాద్‌లో రాజ్యాంగ సంస్కరణలు అనే పుస్తక రచయిత ఎవరు? – కోదాటి నారాయణ రావు
- వరంగల్ దగ్గర కొండపర్తిలోని చౌడేశ్వరాలయం నిర్మించింది ఎవరు? – క్రీ.శ. 1203లో గణపతిదేవుని సేనాని మాల్యాల. (చౌండ సేనాని వేయించిన కొండపర్తి శాసనం ఆధారం ఇది తెలుస్తుంది)
- వీరశైవ మత ప్రచారకుడైన బసవేశ్వరుని వివాహ ఘట్టంలో ‘కోలాటం’ నృత్య ప్రదర్శన కూడా చేసినట్టు రాసిన కవి ఎవరు? ఏ గ్రంథంలో? – పాల్కురికి సోమనాథుడు ‘బసవ పురాణం’
- ప్రపంచ ప్రఖ్యాతి చెందిన చరిత్రకారుడు, మహాతాత్వికుడు ఖలీల్ జిబ్రాన్ రచించిన ‘ది ప్రొఫెట్’ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించిన తెలంగాణీయుడెవరు? – శ్రీ కాళోజి నారాయణరావు ‘జీవనగీత’
- కాకతీయుల కాలంలో గొప్ప విప్లవ కవి, వీరశైవ మత ప్రచారకుడెవరు?-పాల్కురికి సోమనాథుడు
- కాకతీయ ‘మైలాంబ’ నర్తకీ మణులకు గృహదానాలు చేసినట్లుగా ఉన్న ఆధారం ఏది? – పానగల్లు శాసనం
- కాకతీయుల కాలంలో మాచల్దేవి రచించిన వీధినాటకం ఏది? – క్రీడాభిరామం
- కులీకుతుబ్‌షా భాగ్యనగర్ పేరును హైదరాబాద్‌గా ఎవరి జ్ఞాపకార్థం మార్చాడు? – ఇస్లాం నాల్గో ఖలీఫా హజ్రత్ అలీహైదర్
- తెలుగు సాహిత్యంలో భక్తి భావనను సాహితీ సాంప్రదాయంలోకి తీసుకొచ్చిన తొలికవి ఎవరు? – మల్లికార్జున పండితారాధ్యుడు
- హైదరాబాద్ నిజాం కళాశాల ప్రథమ ప్రిన్సిపల్‌గా పనిచేసింది ఎవరు? – అఘోరనాథ చటోపాధ్యాయ
- జీవన చిత్రాలు ‘మనుషులు మారినవేళ’ అనే నవలను రాసిన తెలంగాణ ఆడబిడ్డ ఎవరు? – కె. సూర్యముఖి (మహీధర రామ్మోహనరావు సోదరి. వీరిది బాలసముద్రం)
- మహాకవి క్షేత్రయ్య ఏ కుతుబ్షాహి వంశ రాజ దర్బార్‌ను దర్శించాడు – అబ్దుల్లా కుతుబ్‌షా దర్బార్
- క్రీ.శ. 1832లో హైదరాబాద్ సంస్థాన దివాన్ చందూలాల్‌కు తాను రామదాసు వారసుడినని విన్నపం చేసుకున్నది ఎవరు? – వరదరామదాసు
- తెలంగాణ పాత తరం నటుడు డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన సినిమా ఏది? – చివరకు మిగిలేది
- నిజాం రాజు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌ను నిషేధించిన వెంటనే ‘స్వామి రామానంద తీర్థ’ను ఎక్కడ అరెస్టు చేశారు? -1938 సెప్టెంబర్ 9న సుల్తాన్ బజార్ క్లాక్ టవర్ దగ్గర
- భారత స్వాతంత్రోద్యమ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో వందేమాతరం గీతాన్ని ఏ రోజున నిజాం ప్రభుత్వం రద్దు చేసింది? -1938 నవంబర్ 28న
- చిత్రకళకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన తెలంగాణకు చెందిన కొండపల్లి శేషగిరిరావు ఎక్కడ జన్మించారు? -1924, మరిపెడ గ్రామం
- కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల వద్ద ఉన్న బాదన్కుర్తికి ఆ పేరెలా వచ్చింది? -‘బారి’ అనే బుద్ధుని శిష్యుని పేరుతో (ఆధారం బుద్ధఘోషుడు రాసిన ‘పరమార్ధ జ్యోతిక’
- చరిత్ర కారుడు వి.వి. కృష్ణశాస్త్రి ప్రకారం ఆచార్య ‘ద్విజ్నాగు’ని సొంతగ్రామం తెలంగాణలో ఎక్కడ కలదు? – కోటిలింగాల పక్కనేగల ‘పాశాయిగాం’
- తెలంగాణలోని కోటిలింగాలలో ప్రథమ రాజ్యం శాతవాహన రాజ్యం. ప్రథమ రాజు శ్రీముఖుడు కాగా అంతకుముందే రాజులు పరిపాలించినట్టు వారి నాణేలు లభించాయి. వారి పేర్లేమిటి? -సామగోపుడు, గోబద్రుడు
- కన్నడ కవిత్రయంలో ఒకరు పంపకవి తెలంగాణీయుడు. ఇతని గురువు పేరేమిటి? – దేవేంద్రముని
- కౌసలీయ చరిత్ర అనే ఐదు అశ్వాసాలు(చాప్టర్స్) మహాకావ్యాన్ని రచించిన ‘లయగ్రాహి గరుడాచల’ కవి ఏ సంస్థానంలో పనిచేశాడు? – బోరవెల్లి సంస్థానం (గద్వాల సోమ భూపాలునికి సమకాలికుడు)
- తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన అనేక సంస్థల్లో తెలంగాణ హిస్టరీ సొసైటీ కన్వీనర్ ఎవరు? – ప్రొఫెసర్ టి. వివేక్
- కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు స్మారక చిహ్నంగా వట్టికోట ఆళ్వారు స్వామి స్థాపించినది? -1938లో దేశోద్ధారక గ్రంథమాల
- సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గర కందిబండలో గ్రంథలయాన్ని నిర్వహించినదెవరు? -1930లో వట్టికోట ఆళ్వారుస్వామి
- ఆసియాలోనే అతిపెద్ద జాతర సమ్మక్క- సారక్క జాతరలో ‘ఎదురుకోళ్ళు’ ఉత్సవం ఉంటుంది. ఎదురుకోళ్లు అంటే? – కోళ్లను గాలిలోకి ఎగురవేయడం
- తెలంగాణలో ఏ రచయితకు అభినవ వ్యాసుడు అనే బిరుదు కలదు? – దాశరథి రంగాచార్యులు
- రాజుల కాలంలో దివాన్‌గా పనిచేసిన 1వ సాలార్జంగ్ క్రీ.శ. 1864లో ‘జిలాబందీ’ విధానం ప్రవేశ పెట్టాడు
- జిలా బందీ అంటే ఏమిటి? – రాష్ర్టాన్ని జిల్లాలుగా విభజించడం
- తెలంగాణలోని బంజారాలు శ్రీశ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతిని ఏ రోజున జరుపుకొంటారు? – ఫిబ్రవరి 15న
- ఫిబ్రవరి 22న ఢిల్లీలోని ‘జంతర్ మంతర్’ దగ్గర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ధర్నా నిర్వహించింది ఎవరు? – తెలంగాణా న్యాయవాదులు
- తిరుగుబాటు కాలంలో రెసిడెన్సీ పై దాడి చేసిన తుర్రేబాజ్‌ఖాన్ 1859లో మెదక్ జిల్లా తుఫ్రాన్ గ్రామంలో పట్టుబడ టానికి కారణమైన వ్యక్తి ఎవరు? – కుర్బాన్ అలీ
- ద్వాత్రింశిక’ రాసిన కొరివి గోపరాజు తెలంగాణలో ఏ ప్రాంతం వాడు? – నిజామాబాద్ జిల్లా (వేముగల్లు) భీమగల్లు
- తెలంగాణ తొలి ఉద్యమ కాలంలో 1969లో తెలంగాణ మహిళా దినం ఏ రోజున జరుపుకుంటారు? – జూన్ 17న
- ప్యాలెస్‌లోని రాయి, కట్టె ఏయే దేశాల నుంచి తెప్పించి కట్టించారు? – ఇటలీ నుంచి చలువరాయి ఇంగ్లండ్ నుంచి కట్టె (దీనిలో ప్రపంచంలో పెద్దదైన డైనింగ్ టేబుల్ కలదు)
- తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణచడానికి నిజాం వేసిన కమిషన్ అధ్యక్షుడెవరు? – మీర్జా అలీ హైదర్
- తెలంగాణలో గరగ నృత్యాన్ని ఏ సందర్భంలో చేస్తారు? – బోనాల పండుగ సందర్భంలో
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ 16న బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బతుకమ్మ పండుగ, పాటలపై పరిశోధన చేసిన వారు ఎవరు? – బండారు సుజాతా శేఖర్
- (అష్టమ) నిజామాంద్ర మహాసభ 1941లో చిలుకూరులో జరిగింది. దాని ఆహ్వాన సంఘ అధ్యక్షులు ఎవరు? -వెదిరె గోపాలరెడ్డి
- నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని 1969లో సుప్రీంకోర్టులో తీర్పునిచ్చిన ప్రధాన న్యాయమూర్తి ఎవరు? – జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా
- తెలంగాణ సాయుధ పోరాటాన్ని భారత దేశంలో ప్రజల ప్రజాస్వామ్య స్థాపనకు ప్రథమ ప్రయత్నంగా పేర్కొన్నది ఎవరు? – మావో- చైనా
- హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ” హుడాని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? – 1975
తెలంగాణలో ఏ పట్టణాన్ని దేవాలయాల పట్టణం అంటారు? – అలంపూర్ - జిల్లాలో గల దేవరకొండ గిరి దుర్గం ఏయె నదుల మధ్య నిర్మాణం జరిగింది? – ఉప్పువాగు-స్వర్ణముఖి
- తెలంగాణ గవర్నర్ అధికార భవనం హైద్రాబాద్‌లోని రాజ్‌భవన్ ఏ సంవత్సరంలో నిర్మించారు? – 1936లో
- తెలంగాణ ఉద్యమ కాలంలో అప్పటి ఉపముఖ్యమంత్రి కె.వి. రంగారెడ్డి చొరవతో కె. అచ్యుత రెడ్డి అధ్యక్షతన ఏర్పడిన సంఘం ఏది? – తెలంగాణ ఉద్యమ సమన్వయ సంఘం 1969 ఏప్రిల్ 7
- ప్రత్యేక తెలంగాణ నినాదం మొదటిసారిగా ఇచ్చినది ఎక్కడ, ఎప్పుడు? 1968 డిసెంబర్ 30న కొత్తగూడెంలో జే చొక్కరావు ఇచ్చారు
- తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రజాసమితి విద్యార్థి కార్యచరణ సంఘం, తెలంగాణ మహాసభ, సంయుక్త సోషలిస్టు పక్షాల, రాష్ర్టాల శాఖలు కలిసి ఏ రోజున తెలంగాణ కోర్కెల దినం జరపాలని నిశ్చయించారు? – మే1న 1969 తెలంగాణ కోర్కెల దినం
- తెలంగాణ మృత వీరుల దినం ఏరోజున జరపాలని ప్రకటించారు. -1969 మే 14న
- ధూల-మేలా’ సభ ఎక్కడ, ఎప్పుడు జరిగింది. ఈ సభను ఎవరు ప్రారంభించారు? – తెలంగాణ మహాసభ కన్వీనర్ డా. చెరుకు సుధాకర్ అధ్యక్షతన కేశవరావ్ జాదవ్. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో 2001 డిసెంబర్ 31న జరిగింది
- తెలంగాణ సాయుధ పోరాటం గురించి రక్త సారం అనే నవల రాసింది ఎవరు? – అంపశయ్య నవీన్
- ఆంధ్రోద్యమం’ పుస్తక రచయిత ఎవరు? -మాడపాటి హన్మంతరావు
- ఫొటోగ్రఫిక్ సొసైటీ ఆఫ్ బ్రిటన్ నుండి ఫెలోషిప్ పొందిన మొదటి తెలుగువాడు మన తెలంగాణీయుడే, ఎవరతను? – అల్లాడి రాజన్ బాబు, కోరుట్ల, జగిత్యాల జిల్లా
- తెలంగాణలో పుల్లూరు జాతర ఎక్కడ జరుగుతుంది? ఆలయ నిర్మాత లెవరు? – సిద్దిపేట జిల్లాలోని పుల్లూరు గ్రామంలో. ఇది కాకతీయుల కాలంలో నిర్మించారు
- భాషకు లిపిని కనుగొన్న తెలంగాణ రచయిత ఎవరు? -వానమామలై వరదాచార్యులు
Previous article
సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి అంటే ఏమిటి?
Next article
అభ్యసన నిర్వహణ విధానాలు ఎలా ఉంటాయి?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు