‘కలాడి నూనల్’ అని ఏ ద్వీపాన్ని పిలుస్తారు?ఉత్తర అమెరికా
- ఇది ప్రపంచంలో 3వ అతిపెద్ద ఖండం.
- ఉత్తర అమెరికా ఉత్తరార్ధగోళంలో ఉంది.
- దేశాల సంఖ్య- 23
- విస్తీర్ణం- 24.2 మిలియన్ చ.కి.మీ.
- అక్షాంశాలు- 7O.12| – 83O.28| ఉత్తర అక్షాంశాల మధ్య
- రేఖాంశాలు- 12O.8| – 172O.30| పశ్చిమ రేఖాంశాల మధ్య.
సరిహద్దులు
- ఉత్తరం ఆర్కిటిక్
- తూర్పు- అట్లాంటిక్
- పశ్చిమం- పసిఫిక్
- దక్షిణం- మెక్సికో సింధుశాఖ
- 40O ఉత్తర అక్షాంశం కెనడా, యూఎస్ఏల సరిహద్దుగా ఉంది.
- 100O పశ్చిమ రేఖాంశం ఉత్తర అమెరికాను దాదాపు రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది.
- ఈ ఖండం నుంచి 66 1/2O ఆర్కిటిక్ వలయం,23 1/2O కర్కటరేఖ పోతున్నాయి.
- ప్రపంచంలో పొడవైన తీరరేఖ గల దేశం- కెనడా
- ప్రపంచంలో ‘సిలికాన్ వ్యాలీ’గా పిలిచే ప్రాంతం-శాన్ఫ్రాన్సిస్కో (యూఎస్ఏ)
- హాలీవుడ్‌గా పిలిచే ప్రాంతం-లాస్ ఏంజెల్స్
- ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్‌క్రాఫ్ట్ అసెంబ్లింగ్ కేంద్రం-సియాటెల్ (వాషింగ్టన్)
- అమెరికా సంయుక్త రాష్ర్టాల్లోని పిట్స్బర్గ్ ప్రాంతాన్ని ప్రపంచ ఇనుము, ఉక్కు రాజధానిగా పిలుస్తారు.
- ప్రపంచంలో అతిపెద్ద సింథటిక్ రబ్బరు, టైర్ల తయారీ కేంద్రం- ఆక్రాన్
- ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం-చికాగో
- ప్రపంచంలో ఆటోమొబైల్స్ తయారీకి ప్రసిద్ధిచెందిన ప్రాంతం- డెట్రాయిట్
- సిటీ ఆఫ్ స్కై స్క్రాపర్స్గా పిలిచే ప్రాంతం-న్యూయార్క్
- ఐరన్ అండ్ స్టీల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్- పిట్స్బర్గ్
- అమెరికా సంయుక్త రాష్ర్టాల్లో 50 రాష్ర్టాలుండగా అందులో 49వ రాష్ట్రం అలస్కా, 50వ రాష్ట్రం హవాయి దీవులు.
- ఉత్తర అమెరికా ఖండాన్ని కనుగొన్నది ఇటలీకి చెందిన ‘అమెరిగో వెస్పూచి’.
- ఉత్తర అమెరికా ఖండంలోని ప్రసిద్ధిచెందిన హోవర్గ్ ఆనకట్ట- కొలరాడో నదిపై ఉంది
ముఖ్యమైన జలసంధులు
- డేవిడ్ జలసంధి: ఇది ప్రపంచంలో వెడల్పైనది. ఇది గ్రీన్‌ల్యాండ్, బఫిన్ల్యాండ్లను వేరుచేస్తుంది. బఫిన్ అఖాతం, లాబ్రడార్ సముద్రాలను కలుపుతుంది.
- బెల్ ఐల్ జలసంధి: లాబ్రడార్, న్యూఫౌండ్ ల్యాండ్లను వేరుచేస్తుంది. సెయింట్ లారెన్స్ సింధుశాఖ, అట్లాంటిక్లను కలుపుతుంది.
- జువాన్ డే ఫుకా జలసంధి: వాషింగ్టన్, వాంకోవర్ దీవులను వేరుచేస్తుంది. ఆర్కిటిక్, బేరింగ్ సముద్రాలను కలుపుతుంది.
- బేరింగ్ జలసంధి: ఆసియాను, ఉత్తర అమెరికా నుంచి వేరుచేస్తుంది. తూర్పు సైబీరియాను బేరింగ్ సముద్రంతో కలుపుతుంది.
ముఖ్యమైన సరస్సులు
- గ్రేట్ బేర్ లేక్- కెనడా వాయవ్య ప్రాంతంలో ఉంది. దీనిగుండా ఆర్కిటిక్ వలయం పోతుంది. పిచ్‌బ్లెండ్ ఖనిజానికి ప్రసిద్ధి.
- గ్రేట్ స్లేవ్ లేక్- కెనడా వాయవ్య ప్రాంతంలో ఉంది.
- అథబస్కా సరస్సు- గ్రేట్ స్లేవ్ లేక్‌కు దక్షిణంగా ఉంది.
- రెయిన్ డీర్ సరస్సు- అథబస్కాకు దక్షిణంగా ఉంది. దీనిలోని నీరు చర్చి నది ద్వారా హడ్సన్ అఖాతంలోకి ప్రవహిస్తుంది.
- విన్నెపాగో సరస్సు- రెయిన్ డీర్‌కు దక్షిణంగా ఉంది. సస్కాచ్యువాన్ నది దీనిలో కలుస్తుంది.
- గ్రేట్ లేక్స్- ఇది 5 సరస్సుల కలయిక. అవి..
ఎ. ఎల్ సుపీరియన్- ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. ప్రపంచంలో రెండో అతిపెద్ద సరస్సు. కెనడా, యూఎస్ఏ భూభాగాల్లో విస్తరించింది.
బి. ఎల్ హ్యురాస్- గ్రేట్ లేక్స్‌లో రెండో అతిపెద్దది. కెనడా, యూఎస్ఏల్లో విస్తరించింది. ‘సూ’ కాలువ, హ్యురాస్, సుపీరియర్లను కలుపుతుంది.
సి. ఎల్ మిచిగాన్ సరస్సు- గ్రేట్ లేక్స్‌లో మూడో అతిపెద్దది. యూఎస్ఏ భూభాగంలో మాత్రమే ఉన్న ఏకైక గ్రేట్ లేక్స్ సరస్సు.
డి. ఎల్ ఈరి- గ్రేట్ లేక్స్‌లో నాలుగో అతిపెద్దది. కెనడా, యూఎస్ఏలో విస్తరించింది.
ఇ. ఎల్ ఒంటారియో- గ్రేట్ లేక్స్‌లో అతి చిన్నది. కెనడా, యూఎస్ఏలో విస్తరించింది. సెయింట్ లారెన్స్ నది జన్మస్థలం. - గ్రేట్ లేక్స్ సెయింట్ లారెన్స్ జలమార్గం ద్వారా అట్లాంటిక్‌కు అనుసంధానించారు.
- మిసిసిపి, ఇలియాన్స్ నదీమార్గాల ద్వారా మెక్సికో సింధుశాఖతో అనుసంధానించారు.
- హడ్సన్ నది ద్వారా న్యూయార్క్‌తో అనుసంధానించారు.
- గ్రేట్ సాల్ట్ లేక్- యూఎస్ఏలోని ఉటావా రాష్ట్రంలో ఉంది. ఇది బొన్నివిల్లే మంచినీటి సరస్సు అవశేషం.
- ఎల్ మీడ్- యూఎస్ఏలోని నెవడాలో ఉంది. కొలరాడో నదిపై నిర్మించిన హోవర్, బౌల్టర్ ఆనకట్టల వల్ల ఏర్పడిన కృత్రిమ సరస్సు.
ముఖ్యమైన నదులు
ఎ. కెనడాలోని నదులు
- మెకంజీ (4241 కి.మీ.)- కెనడాలో పొడవైనది. దీని జన్మస్థలం బ్రిటిష్ కొలంబియా. బీఫోర్ట్ సముద్రంలో కలుస్తుంది.
- నెల్సన్ నది- బౌ నదీ జలాల వద్ద జన్మిస్తుంది. హడ్సన్ బేలో కలుస్తుంది.
- యుకాన్- లెనిన్, వెల్లీ నదుల సంగమ స్థానం వద్ద జన్మిస్తుంది. బేరింగ్ సముద్రంలో కలుస్తుంది.
- సస్కాచ్యువాన్- రాకీ పర్వతాల వద్ద జన్మిస్తుంది. విన్నెపోగో సరస్సులో కలుస్తుంది.
బి. అమెరికాలోని నదులు - మిసిసిపి (5,971 కి.మీ.)- రాకీ పర్వతాల్లోని మౌంటానా వద్ద జన్మిస్తుంది. పక్షిపాద డెల్టాను ఏర్పరిచింది. మిస్సోరి, ఆర్కానాసా ఉపనదులు. మెక్సికో సింధు శాఖలో కలుస్తుంది.
- కొలరాడో- గ్రాండ్ కంట్ర వద్ద జన్మిస్తుంది. కాలిఫోర్నియా సింధు శాఖలో కలుస్తుంది.
- కొలంబియా (యూఎస్ఏలో పొడవైనది)- స్నేక్ నదీ లోయ ప్రాంతం వద్ద జన్మిస్తుంది. పసిఫిక్‌లో కలుస్తుంది.
- సక్రామెంట్- కాస్కేడ్, సియొర్రానెవడా పర్వతాల వద్ద జన్మిస్తుంది. పసిఫిక్‌లో కలుస్తుంది.
- రియోగ్రాండ్ (యూఎస్ఏ, మెక్సికో సరిహద్దుల గుండా ప్రవహిస్తుంది)- సియొర్రానెవడాల వద్ద జన్మిస్తుంది. మెక్సికో సింధు శాఖలో కలుస్తుంది.
- ఉత్తర అమెరికాలో (3,780 కి.మీ.) అత్యంత రద్దీగా ఉండే సెయింట్ లారెన్స్ జలమార్గం.
- ప్రపంచంలో అతిపెద్దదైన ‘నయాగరా’ జలపాతం ఈరి, ఒంటారియో సరస్సుల మధ్య ప్రవహించే సెయింట్ లారెన్స్ నదిపై ఉంది.
ఉత్తర అమెరికాలోని ముఖ్య పర్వతాలు
- రాఖీ పర్వతాలు- యూఎస్ఏ, కెనడా, మెక్సికోలో విస్తరించి ఉన్నాయి.
- అపలేచియన్- పురాతన ముడుత పర్వతాలు
(కెనడా, అమెరికాలో). బొగ్గు నిల్వలు ఎక్కువ. - బ్రూక్స్ రేంజ్- ఉత్తర అలస్కాలో విస్తరించాయి.
- రాఖీ పర్వతాల రూపాంతరం.
- అలస్కా ఎటూషియన్ పర్వతాలు- మెకన్లీ శిఖరం (6194 మీ.)
- కాస్కేడ్ రేంజ్- కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్ వరకు విస్తరించాయి.
- సియొర్రానెవడా- కాలిఫోర్నియా
- మధ్య అమెరికా- యూఎస్ఏ దక్షిణ సరిహద్దు నుంచి ‘దక్షిణ అమెకా కొలంబియా వరకు విస్తరించి ఉన్న దేశాలను మధ్య అమెరికా అని పిలుస్తారు.
- మెక్సికో- విస్తీర్ణపరంగా, జనాభా పరంగా అతిపెద్ద మధ్య అమెరికా దేశం.
- కేంద్ర అమెరికా దేశాలు- 1) గ్వాటెమాల, 2) కోస్టారికా, 3) నికరాగ్వా, 4) పనామా, 5) హోండురస్ (ఇవి అట్లాంటిక్, పసిఫిక్ తీర రేఖను కలిగి ఉన్నాయి), 6) ఎల్‌సాల్వెడార్, 7) బెలిజె.
- కరీబియన్ దీవుల్లోని అనేక చిన్న దీవులు (వెస్టిండిస్ దీవులతో కలుపుకొని)
- లాటిన్ అమెరికా- మెక్సికో, మధ్యఅమెరికా, వెస్టిండిస్ దీవులు. దక్షిణ అమెరికాలను కలిపి లాటిన్ అమెరికా అంటారు.
- గ్రీన్‌ల్యాండ్: అమెరికా ఈశాన్య భాగానగల ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. దీన్ని ‘కలాడి నూనల్’ అని పిలుస్తారు.
- భౌగోళికంగా ఉత్తర అమెరికాలో భాగమైనప్పటికీ ఇది డెన్మార్క్ దేశ ఆధీనంలో ఉంది.
- బఫిన్ ద్వీపాలు: హడ్సన్, బఫిన్ అఖాతాలకు మధ్యగల ద్వీపాలు.
- న్యూఫౌండ్ ల్యాండ్: సెయింట్ లారెన్స్ సింధు శాఖ వద్దగల ద్వీపం. దీన్ని ‘ది రాక్’ అని కూడా పిలుస్తారు.
- గ్రాండ్ బ్యాంక్ అనే చేపల దిబ్బ ఇక్కడ ఉంది.
- అల్యూషన్ ద్వీపాలు: అలస్కా ద్వీపకల్పం నుంచి తోరణం లాగా పసిఫిక్ మహాసముద్రంలో విస్తరించిన ద్వీపాలు.
- హవాలి ద్వీపాలు: పసిఫిక్ మహాసముద్రంలోని అగ్ని పర్వత ద్వీప సముదాయాలు.
- సౌతాంప్టన్ ద్వీపం: హడ్సన్ అఖాతం ఉత్తర భాగాన ఉంది.
ద్వీపకల్పాలు
- అలస్కా (ఉత్తర అమెరికా వాయవ్య భాగం)
- ఉంగావ (కెనడా ఉత్తరభాగం)
- సెవార్డ్ (అలస్కా పశ్చిమం)
- జ్యోతి (కెనడా ఉత్తర భాగాన, ఆర్కిటిక్ అంచువద్ద)
- ఫ్లోరిడా (కెనడా ఈశాన్యం)
డెత్ వ్యాలీ: గ్రేట్ బేసిన్ ప్రాంతంలోని లోయ అమెరికాలోని అత్యంత పల్లపు ప్రాంతం (-85.9 msl) - అమెరికాలో అత్యంత ఉష్ణోగ్రత నమోదయ్యేది ఇక్కడే.
- ఈ డెత్ వ్యాలీ కాలిఫోర్నియా, నెవడా రాష్ర్టాల్లో ఉంది.
ఉత్తర అమెరికాలోని శీతోష్ణస్థితులు - ఉష్ణమండల ఎడారుల శీతోష్ణస్థితి అమెరికా నైరుతి భాగంలో ఉంది.
ఎ) రాఖీ పర్వతాలకు, సియొర్రానెవడా పర్వతాలకు మధ్య గ్రేట్ బేసిన్ ఎడారి ఉంది. - గ్రేట్ బేసిన్ దక్షిణాన ‘మొజావి ఎడారి’ ఉంది.
- సియొర్రా మాడ్రే యాక్సిడెంటల్ పర్వతాల వర్షాచ్ఛాయ ప్రాంతంలో ‘సోనారన్, చువాహన్’ ఎడారులు ఉన్నాయి.
బి) కాలిఫోర్నియా, నెవడా, ఉతాహ్, అరిజోనా రాష్ర్టాల్లో ఈ రకమైన శీతోష్ణస్థితి ఉంది. - ఉష్ణమండల ఎడారి ప్రాంతానికి ఉత్తరాన కాలిఫోర్నియా ప్రాంతంలో మధ్యధరా శీతోష్ణస్థితి ఉంది.
- ఖండ మధ్యభాగంలోని బృహత్తర మైదానాల్లో స్టెప్పీ గడ్డిభూముల శీతోష్ణస్థితి ఉంది.
- ఉత్తర అమెరికా వాయవ్య సముద్ర తీర ప్రాంతంలో సంవత్సరం మొత్తం చిరుజల్లులు పడే సముద్ర ప్రభావిత పశ్చిమ పవన ప్రాంత శీతోష్ణస్థితి ఉంది.
- సెయింట్ లారెన్స్ నదీ ముఖద్వారం నుంచి కెనడా దక్షిణ భాగం గుండా రాఖీ పర్వతాల వరకు టైగా మండలం ఉంది.
- టైగా మండలానికి ఎగువన టండ్రా శీతోష్ణస్థితి ఉంది. ఈ ప్రాంతం అంతా కెనడియన్ షీల్డ్‌లో భాగంగా ఉంది.
- అలస్కా నుంచి గ్రీన్‌ల్యాండ్ తీర ప్రాంతం వరకు చాపాకారంలో గల ప్రాంతం.
- కెనడా ఉత్తరాన ఆర్కిటిక్ సముద్రంలోని ద్వీపాల్లో, గ్రీన్‌ల్యాండ్‌లో ధృవ హిమాచ్ఛాదిత ప్రాంతాలు ఉన్నాయి.
- న్యూఫౌండ్‌ల్యాండ్ ద్వీపాలు, లాబ్రడార్ పశ్చిమ భాగాలు లారెన్సియా శీతోష్ణస్థితికి చెంది ఉన్నాయి.
- అమెరికా తూర్పుతీరం అట్లాంటిక్‌లో ఏర్పడే టోర్నడోల వల్ల తరచూ నష్టపోతూ ఉంటుంది.
- అమెరికా ఆగ్నేయ భాగాన అట్లాంటిక్ మహా సముద్రంలో దాదాపు 7,000లకు పైగా ద్వీపాల సముదాయం ఉంది. అయితే దీనిలో ఉన్న అతిపెద్దది?
- గ్రీన్‌ల్యాండ్ దీవి 2) హవాలి దీవి
- హవాయి దీవి 4) క్యూబా దీవి
- కింది వాటిలో కెనడాలో లేని దీవిని గుర్తించండి?
1) గ్రేట్ బేర్ సరస్సు 2) విన్నిపెగ్ సరస్సు - ఈరి సరస్సు 4) గ్రేట్ స్లేవ్ సరస్సు
3. గ్రాండ్ బ్యాంక్ అనే చేపల దిబ్బ ఎక్కడ ఉంది?
1) న్యూఫౌండ్ ల్యాండ్ 2) సౌతాంప్టన్ ద్వీపం - హవాలి ద్వీపాలు 4) ఆల్యూషన్ ద్వీపాలు
- కింది ఏ జలసంధి మెక్సికో సింధు శాఖను అట్లాంటిక్ ను కలుపుతుంది. అలాగే ఫ్లోరిడా, క్యూబాను కలుపుతుంది?
1) డేవిస్ 2) హడ్సన్
3) ఫ్లోరిడా 4) యుకాటన్ - పూర్తిగా అమెరికా దేశంలోని సరస్సును గుర్తించండి?
1) మిచిగాన్ 2) హురాన్
3) ఒంటారియో 4) ఈరి
సమాధానాలు
1-4, 2-3, 3-1, 4-3, 5-1
జీ గిరిధర్
సీనియర్ ఫ్యాకల్టీ
ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్ అశోక్‌నగర్
9966330068
- Tags
- nipuna news
Previous article
కరెంట్ అఫైర్స్
Next article
Moisture content in dried vegetable is…
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు