స్వయం సమృద్ధ తెలంగాణ
స్వచ్ఛ సరేక్షణ్-2021 ర్యాంకుల్లో తెలంగాణ మెరిసింది. 40 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో స్వయం సమృద్ధ (సెల్ఫ్ సస్టెయిన్‌బుల్) మెగా నగరంగా గ్రేటర్ హైదరాబాద్ నిలిచింది. ‘సఫాయీ మిత్ర సురక్ష ఛాలెంజ్’ ర్యాంకుల్లో తెలంగాణకు రెండో ర్యాంకు దక్కగా ఇదే విభాగంలో 3 లక్షల్లోపు జనాభా ఉన్న నగరాల్లో కరీంనగర్ జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం దక్కించుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ రాష్ట్రాల ర్యాంకుల్లో గతేడాది 18వ స్థానంలో ఉన్న తెలంగాణకు ఈసారి 11వ ర్యాంకు దక్కింది. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల విభాగంలో హైదరాబాద్ 13వ స్థానంలో నిలిచింది.
లక్ష నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో కరీంనగర్ 74, రామగుండం 92 స్థానాల్లో నిలిచాయి. జిల్లా ర్యాంకుల్లో హైదరాబాద్ జిల్లా 6, సిరిసిల్ల 80, పెద్దపల్లి 117, కరీంనగర్ 139వ ర్యాంకు సాధించాయి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 2021 నవంబర్ 20న ఈ ర్యాంకులను విడుదల చేసింది. కంటోన్మెంట్ల ర్యాంకింగ్‌లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏడో ర్యాంకు సాధించింది. 100కు పైగా పట్టణ పాలక సంస్థలున్న రాష్ర్టాల్లో తెలంగాణకు పదో స్థానం దక్కింది.
ప్రేరక్ దౌర్ సమ్మాన్ అవార్డులు
- వ్యర్థాల్లో తడి, పొడి, ప్రమాదకరమైనవి విభజించడం, వేర్వేరుగా శుద్ధి చేసి రీసైక్లింగ్చేయడం, నిర్మాణ కూల్చివేత వ్యర్థాలను వేరు చేయడం, నగరాల్లో పారిశుద్ధ్య పరిస్థితుల ఆధారంగా ప్రేరక్ దౌర్ సమ్మాన్ పేరిట ఈ దఫా అవార్డులు ఇచ్చారు. ఇందులో ప్లాటినం, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, కాపర్ విభాగాల్లో రాష్ట్రంలోని పలు పురపాలికలు అవార్డులు సాధించాయి.
- గోల్డ్ విభాగం: 151 నగరాల్లో గ్రేటర్ హైదరాబాద్, సిద్దిపేటకు చోటు దక్కింది.
- సిల్వర్: 67 నగరాల్లో బడంగ్‌పేట, నిజాంపేట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్
నిలిచాయి. - బ్రాంజ్: 143 పట్టణాల్లో భూపాలపల్లి, నాగారం పురపాలక సంఘాలకు చోటు దక్కింది.
- కాపర్: 63 పట్టణాల్లో అమీన్‌పూర్‌కు చోటు దక్కింది.
దక్షిణాది జోన్లో.. - 50 వేల నుంచి లక్షలోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో పరిశుభ్రమైనది- సిరిసిల్ల
- ఉత్తమ సుస్థిర పట్టణం- సిద్దిపేట
- 25 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్- నిజాంపేట
- ఫాస్టెస్ట్ మూవర్ సిటీ- ఇబ్రహీంపట్నం
- 25 వేల లోపు జనాభా ఉన్న మున్సిపాలిటిల్లో పరిశుభ్రమైనది- ఘట్కేసర్
- ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్- కోస్గి
- ఫాస్టెస్ట్ మూవర్ సిటీ- హుస్నాబాద్
- దక్షిణాదిలో అన్ని విభాగాల్లో (ఓవరాల్) ర్యాంకింగ్‌లు- సిరిసిల్ల 1, సిద్దిపేట 2, బడంగ్‌పేట 5
- 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న పట్టణాల్లో ర్యాంకింగ్‌లు- సిరిసిల్ల 1, సిద్దిపేట 2, బడంగ్‌పేట 4
- 25 వేల నుంచి 50 వేల జనాభా పట్టణాల్లో ర్యాంకింగ్‌లు- నిజాంపేట 2, మేడ్చల్ 4
- 25 వేల లోపు జనాభా పట్టణాల్లో- ఘట్కేసర్ 1, దమ్మాయిగూడ 3,హుస్నాబాద్ 5
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు