అతిశీతల వాయువులు భారత్‌పైకి వీయకుండ అడ్డుకునేవి?
- జాగ్రఫీ
- సెప్టెంబర్ 8 తరువాయి
66. ఏంజెల్ అనే పేరుగల సుప్రసిద్ధ జలపాతం ఎక్కడ ఉంది?
1) కెనడా 2) నార్వే
3) ఫిన్లాండ్ 4) డెన్మార్క్
67. వెనిజులా దేశంలో లభించే ముఖ్య ఖనిజం?
1) బంగారం 2) సీసం
3) పెట్రోలియం 4) అభ్రకం
68. ప్లేట్నది మండలం గల దేశం?
1) అర్జెంటీనా 2) బ్రెజిల్
3) కెనడా 4) వెనిజులా
69. ప్రపంచంలో ఉండే బొగ్గు నిల్వలో సుమారు 50శాతం కలిగి ఉన్న ఖండం?
1) ఆసియా 2) ఉత్తర అమెరికా
3) దక్షిణ అమెరికా 4) యూరప్
70. ప్రపంచంలో అతి పొడవైన నది వంతెన ఎక్కడ ఉంది?
1) అమెరికా 2) భారత్
3) స్విట్జర్లాండ్ 4) రష్యా
71. మాంగనీస్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం?
1) జపాన్ 2) రష్యా
3) తూర్పు ఆఫ్రికా 4) జర్మనీ
72. ప్రపంచ భూభాగంలో ఆఫ్రికా ఖండం ఎంత విస్తీర్ణం కలిగిఉంది?
1) 20 శాతం 2) 26 శాతం
3) 24 శాతం 4) 18 శాతం
73. సారా తయారు చేయడంలో ప్రసిద్ధిగాంచిన యూరోపియన్ దేశం?
1) చీలీ 2) ఫ్రాన్స్ 3) ఇటలీ
4) చెకొస్లావేకియా
74. యూరప్‌లో నారింజ తోటలకు పేరుగాంచిన దేశం?
1) ఇటలీ 2) స్పెయిన్
3) ఫ్రాన్స్ 4) చీలీ
75. ఇంగ్లండ్ దేశానికి చెందిన లాంక్షైర్ ఏ పరిశ్రమకు ప్రసిద్ధి?
1) బట్టల పరిశ్రమ 2) ఇనుము
3) బొగ్గు 4) విద్యుచ్ఛక్తి
76. సిసిలీ ఏ తోటలకు ప్రపంచ ప్రసిద్ధి పొందింది?
1) నిమ్మతోటలు 2) ద్రాక్ష
3) అనాస 4) ఖర్జూరం
77. యూరప్‌లో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేస్తున్న దేశం?
1) రష్యా 2) ఇంగ్లండ్
3) ఇటలీ 4) జర్మనీ
78. కాక్‌పిట్ ఆఫ్ యూరప్ అని ఏ దేశానికి మారుపేరు?
1) డెన్మార్క్ 2) బెల్జియం
3) నార్వే 4) స్వీడన్
79. ఉత్తర, దక్షిణ అమెరికా వేరుచేసేది?
1) సూయజ్ కాలువ
2) పనామా కాలువ
3) జీబ్రాల్టర్ జలసంధి
4) పాక్ జలసంధి
80. అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి గుండా వెళుతుంది?
1) బేరింగ్ 2) పాక్
3) పనామా 4) సూయజ్కాలువ
81. సూర్యునికి భూమి అతి దగ్గరగా ఏ రోజు వస్తుంది?
1) జనవరి 3 2) జూలై 4
3) మార్చి 21 4) సెప్టెంబర్ 23
82. అర్ధరాత్రి సూర్యుడు ప్రకాశించే దేశం ( Land of Midnight Sun)?
1) జపాన్ 2) నార్వే
3) ఉత్తర కొరియా 4) భారత్
83. భారత్‌లో రాజమహాల కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) పశ్చిమ బెంగాల్ 2) రాజస్థాన్
3) బీహార్ 4) ఒరిస్సా
84. హిమాలయ నదులు, భారతదేశ నదుల మొత్తం నీరు ఎంత శాతం సముద్రంలోకి కలుసుంది?
1) 70శాతం 2) 60శాతం
3) 50శాతం 4) 40శాతం
85. ఆడమ్స్ బ్రిడ్జి ఎక్కడ ఉంది?
1) భారత్, శ్రీలంక మధ్య
2) భారత్- పాక్ మధ్య
3) భారత్-బంగ్లాదేశ్ మధ్య
4) భారత్-అఫ్గానిస్థాన్
86. భారత్‌లో మొదటి విద్యుత్ ప్రాజెక్ట్?
1) కాక్రపర 2) శివసముద్రం
3) శ్రీశైలం 4) కొయినా
87. రామ్‌ఘర్ సరస్సు ఏ నగరానికి సమీపంలో ఉంది?
1) జైపూర్ 2) చండీఘర్
3) సిమ్లా 4) ఉదయ్‌పూర్
88. భారతదేశంలో అతిపెద్ద జిల్లా?
1) తూర్పుగోదావరి 2) లే
3) లఢక్ 4) ఏదీకాదు
89. తీరరేఖ, అంతర్జాతీయ భూసరిహద్దుగాని లేని రాష్ట్రం?
1) మహారాష్ట్ర 2) గోవా
3) కేరళ 4) మధ్యప్రదేశ్
90. కర్కటరేఖ మనదేశంలోని ఎన్ని రాష్ర్టాల గుండా పోతుంది?
1) 3 2) 5 3) 7 4) 9
91. శ్రీలంక పూర్వపు రాజధాని?
1) కొలంబో 2) జాఫ్నా
3) అనిరుధ్పూర్ 4) కాండి
92. భూమి తిరుగుతున్నప్పుడు ఏ రేఖాంశం సూర్యునికి అభిముఖంగా ఉంటుందో
ఆ రేఖాంశం మీద ఉన్న వారందరికీ ఒకే కాలంలో ఏమవుతుంది?
1) ఉదయం 2) రాత్రి
3) మిట్ట మధ్యాహ్నం 4) సాయంత్రం
93. భూమికి ఎన్ని రకాల చలనాలు ఉన్నాయి?
1) 4 2) 2 3) 6 4) 5
94. భూమి తనచుట్టూ తాను తిరగడానికి ఏమంటారు?
1) భూభ్రమణం
2) భూపరిభ్రమణం
3) భూభ్రమణం, భూపరిభ్రమణం
4) ఏదీకాదు
95. భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని ఏమంటారు?
1) భూభ్రమణం
2) భూపరిభ్రమణం
3) భూభ్రమణ, భూపరిభ్రమణం
4) ఏదీకాదు
96. భూమి అక్షం భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్యతలానికి ఎన్ని డిగ్రీల కోణంలో ఉంది?
1) 23 1/2 డిగ్రీలు
2) 33 1/2 డిగ్రీలు
3) 66 1/2 డిగ్రీలు 4) ఏదీకాదు
97. భూమధ్యరేఖ మీద ఏ తేదీన సూర్య కిరణాలు లంబంగా పడతాయి?
1) ఫిబ్రవరి 21 2) ఏప్రిల్ 21
3) మే 21 4) మార్చి 21
98. ఆకాశంలో అత్యంత వేగవంతమైన నక్షత్రం?
1) మెటీరియోరైట్ 2) కామెట్
3) అస్టరాయిడ్ 4) ప్లానెట్
99. విషవత్తులు అనగా?
1) రాత్రి దీర్ఘంగా ఉండే రోజులు
2) పగలు దీర్ఘంగా ఉండే రోజులు
3) రాత్రింబవళ్లు సమానంగా ఉండే రోజులు
4) ఏదీకాదు
100. ప్రపంచమంతటా రాత్రింబవళ్లు సమానంగా ఉండే రోజులు ఏవి?
1) మార్చి 21, సెప్టెంబర్ 23
2) మార్చి 20, సెప్టెంబర్ 21
3) మార్చి 21, సెప్టెంబర్ 25
4) మార్చి 23, సెప్టెంబర్ 23
101.అంటార్కిటిక్ వలయం మీద పూర్తిగా సూర్యకిరణాలు పడి 24గంటలు పట్టపగలుగానే ఉండే రోజు?
1) డిసెంబర్ 20 2) నవంబర్ 22
3) డిసెంబర్ 23 4) అక్టోబర్ 22
102. ప్రపంచమంతటికి వర్తించే ప్రామాణిక కాలం?
1) గ్రీనిచ్ ప్రామాణిక కాలం
2) స్థానిక కాలం
3) 82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశకాలం
4) ఏదీకాదు
103. భారత ప్రామాణిక కాలపు రేఖాంశం?
1) 82 1/2డిగ్రీల పశ్చిమ రేఖాంశం
2) 82 1/2డిగ్రీల తూర్పు రేఖాంశం
3) 82 1/2డిగ్రీల దక్షిణ రేఖాంశం
4) 82 1/2డిగ్రీల ఉత్తర రేఖాంశం
104. 82 1/2డిగ్రీల తూర్పు రేఖాంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పట్టణం
గుండా పోతుంది?
1) గుంటూరు 2) ఏలూరు
3) కాకినాడ 4) నెల్లూరు
105. భారత ప్రామాణిక కాలం గ్రీనిచ్ ప్రామాణిక కాలం కంటే ఎన్ని గంటలు ముందుంటుంది?
1) 3 1/2 గంటలు
2) 4 1/2 గంటలు
3) 6 1/2 గంటలు
4) 5 1/2 గంటలు
106. అంతర్జాతీయ దినరేఖ ఏది?
1) 180 డిగ్రీల తూర్పురేఖాంశం
2) 82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం
3) 180 డిగ్రీల తూర్పు రేఖాంశం
4) 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం
107. భూగోళం మొత్తం వైశాల్యంలో భూభాగం ఎంత శాతం?
1) 25శాతం 2) 27శాతం
3) 28శాతం 4) 29శాతం
108. భూభాగం హెచ్చుగా ఏ గోళంలో ఉంది?
1) ఉత్తరార్ధగోళం 2) దక్షిణార్థగోళం
3) పశ్చిమార్థగోళం 4) పూర్వార్ధగోళం
109. భూపటలంలో ఎన్ని రకాల శిలలు కలవు?
1) 6 2) 5 3) 3 4) 4
110. మాగ్మా అనే శిలాద్రవం ఘనీభవించడం వల్ల ఏర్పడే శిలలు?
1) రూపాంతర శిలలు
2) అగ్ని శిలలు
3) అవక్షేప శిలలు 4) ఏదీకాదు
111. భూమి ఉపరితలంలో ఏర్పడిన అగ్నిపర్వత శిలలను ఏమంటారు?
1) అంతర్గత శిలలు 2) పాతాళ శిలలు
3) ఉద్గత శిలలు 4) డైక్ శిలలు
112. క్వార్ట్జ్ ఫెల్స్పార్, సిలికా మొదలైన ఖనిజాలు అధికంగా ఉండే శిలలు ఏవి?
1) అంతర్గత శిలలు 2) పాతాళ శిలలు
3) ఉద్గత శిలలు 4) డైక్ శిలలు
113. శిలాద్రవం భూమి అంతర్భాగం నుంచి బయటికి వచ్చే మార్గమధ్యంలో ఏర్పడే శిలలు?
1) అంతర్గత శిలలు 2) పాతాళ శిలలు
3) ఉద్గత శిలలు 4) డైక్ శిలలు
114. శిలాద్రవం భూమి ఉపరితలాన్ని చేరినప్పుడు దాన్ని ఏమంటారు?
1) మాగ్మా 2) లావా
3) ద్రవం 4) ఏదీకాదు
115. గాలి, నీటి ప్రభావం వల్ల ఏర్పడే శిలలు ఏవి?
1) అగ్నిశిలలు
2) అగ్ని పర్వత శిలలు
3) రూపాంతర శిలలు
4) అవక్షేప శిలలు
116. కుండలు, ఇటుకలు మొదలైనవి తయారు చేయడానికి ఉపయోగపడే శిల?
1) షీల్ శిలలు
2) మృత్తిక శిలలు
3) రూపాంతర శిలలు
4) అవక్షేప శిలలు
117. పర్వతాలను వాటి పుట్టుకను బట్టి ఎన్ని రకాలుగా విభజించారు?
1) 3 2) 4 3) 5 4) 6
118. ప్రపంచంలో అతిపెద్ద శిఖరం?
1) మెకెన్లీ
2) గాడ్విన్ ఆస్టిన్ (కె2)
3) ఎవరెస్ట్
4) కాంచనగంగ
119. ఖండ పర్వతాలకు ఉదాహరణ?
1) ఆండీస్ పర్వతాలు
2) హిమాలయాలు
3) బ్లాక్‌ఫారెస్ట్ పర్వతాలు
4) గ్రేట్ డివైడింగ్ రేంజ్
120. రెండు పర్వతశ్రేణుల మధ్య భాగం దిగజారి పెద్దలోయ ఏర్పడటాన్ని ఏమంటారు?
1) పగులు లోయ 2) పీఠభూమి
3) మైదానం 4) ఏదీకాదు
121. అవశిష్ట పర్వతాలకు ఉదాహరణ?
1) హిమాలయాలు 2) ఆరావళి
3) బ్లాక్ ఫారెస్ట్ 4) రాకీపర్వతాలు
122. ఉత్తర- దక్షిణార్ధ్థగోళాల్లో 25-30 డిగ్రీల అక్షాంశాల ప్రాంతంలో ఉన్న అధిక పీడన మండలాల నుంచి భూమధ్యరేఖ అల్పపీడన మండలం వైపు వీచే పవనాలను ఏమంటారు?
1) ధ్రువపవనాలు
2) వ్యాపార పవనాలు
3) రుతుపవనాలు 4) ఏదీకాదు
123. 40డిగ్రీల దక్షిణ అక్షాంశం దిగువ నుంచి వీచే పశ్చిమ పవనాలకు గల పేరు?
1) గర్జించే నలభైలు 2) రుతుపవనాలు
3) వ్యాపారపవనాలు
4) ప్రపంచ పవనాలు
124. ‘మాన్సూన్’ అనే పదం ‘మాసిమ్’
అనే పదం నుంచి పుట్టింది.
ఇది ఏ భాష నుంచి వచ్చింది?
1) లాటిన్ 2) ఫ్రెంచ్
3) అరబిక్ 4) గ్రీక్
125. దేశంలో ఎక్కువగా వర్షపాతం ఏ రుతుపవనాల వల్ల కలుగుతుంది?
1) నైరుతి రుతుపవనాలు
2) ఈశాన్య రుతుపవనాలు
3) 1, 2 4) ఏదీకాదు
126. అతిశీతల వాయువులు మధ్యఆసియా నుంచి భారత్‌పైకి వీ యకుండా అడ్డుకునే ఏవి?
1) ఆరావళి రుతుపవనాలు
2) హిమాలయాలు
3) తూర్పుకనుమలు
4) పశ్చిమ కనుమలు
127. తిరోగమన రుతుపవనాల వల్ల దేశంలో ఏ నెలలో వర్షం కురుస్తుంది?
1) అక్టోబర్-నవంబర్
2) అక్టోబర్-జనవరి
3) అక్టోబర్-డిసెంబర్
4) జూన్- సెప్టెంబర్
128. ఉత్తరార్థగోళంలో, ఖండాంతర ప్రాంతాల్లో వేసవిలో కురిసే వర్షపాతం?
1) సంవాహన వర్షపాతం
2) నిమ్నోన్నత వర్షపాతం
3) తుఫాన్ వర్షపాతం 4) ఏదీకాదు
129. దేశంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం?
1) హోస్ఫేట్ 2) మాసిన్రామ్
3) సేలం 4) జైపూర్
130. తుఫాన్ వల్ల వచ్చే వర్షపాతం ఏ శీతోష్ణ మండలంలో ఎక్కువగా ఉంటుంది?
1) అత్యుష్ణ మండలం
2) అతిశీతల మండలం
3) సమశీతోష్ణ మండలం
4) ఏదీకాదు
సమాధానాలు
66-2, 67-3, 68-1, 69-2,
70-2, 71-2, 72-1, 73-2,
74-2, 75-1, 76-1, 77-2,
78-2, 79-2, 80-1, 81-1,
82-2, 83-3, 84-1, 85-1,
86-2, 87-1, 88-3, 89-4,
90-3, 91-4, 92-3, 93-2,
94-1, 95-2, 96-3, 97-4,
98-1, 99-3, 100-1, 101-3,
102-1, 103-2, 104-3, 105-4,
106-1, 107-4, 108-1, 109-3,
110-2, 111-3, 112-2, 113-4,
114-2, 115-4, 116-1, 117-2,
118-3, 119-3, 120-1, 121-2,
122-2, 123-1, 124-3, 125-1,
126-2, 127-3, 128-1, 129-2,
130-3
తెలుగు అకాడమీ సౌజన్యంతో..
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు