బూజును పెంచే శిలీంధ్రాలు.. ఫ్లూను పంచే వైరస్లు!
సూక్ష్మజీవుల ప్రపంచం
సూక్ష్మజీవశాస్త్రం 1674లో ఆవిర్భవించింది.
సూక్ష్మజీవశాస్త్రానికి నాంది పలికిన శాస్త్రవేత్త- ఆంటోనివాన్ ల్యూవెన్ హుక్
ల్యూవెన్ హుక్ ఒక నూలు వర్తకుడు ఈయన ఒకే కటకం గల మైక్రోస్కోప్ (1674)ను కనుగొన్నాడు.
బ్యాక్టీరియాను కొనుగొన్న శాస్త్రవేత్త- ఆంటోనివాన్ ల్యూవెన్ హుక్
బ్యాక్టీరియాకు మరోపేరు- ఎనిమల్ క్యూల్స్
మన కంటికి కనిపించని జీవులనే సూక్ష్మజీవులు అంటారు. ఇవి అనేక రకాలుగా ఉంటాయి.
పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా- లాక్టోబాసిల్లస్
మానవుడి శరీరంలో ఉండే బ్యాక్టీరియా- ఈ-కోలై
ఈ-కోలై బ్యాక్టీరియా సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చి జీర్ణం చేయడంలో సహాయపడుతుంది.
మనం కంటితో నేరుగా చూసే బ్యాక్టీరియా- థియో మార్గరేటా నమీబియాసిస్
ఈ బ్యాక్టీరియాను నమీబియా తీర ప్రాంతంలో డాక్టర్ హెచ్.ఎన్. షుల్జ్ అనే శాస్త్రవేత్త 1999లో కనుగొన్నాడు. దీని పొడవు 0.75 మిల్లీమీటర్లు.
ఇవి కుళ్లిన పదార్థాలపై పెరుగుతాయి. కుళ్లిన పదార్థాలపై పెరిగే అతిపెద్ద శిలీంధ్రాలను పుట్టగొడుగులు అంటారు.
బ్రెడ్డుపై బూజు రావడానికి కారణమైన శిలీంధ్రం- రైజోపస్
జిలేబీ, బ్రెడ్డు తయారీలో ఉపయోగించే శిలీంధ్రం- ఈస్ట్
బ్రెడ్డు తయారీలో మైదాపిండికి ఈస్ట్‌ను కలిపినప్పుడు అది కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తుంది. దీని వల్ల మైదాపిండి పులిసిపోయి పొంగుతుంది. ఈ పద్ధతినే కిణ్వనం అంటారు.
చక్కెరను ఆల్కహాల్‌గా మార్చే ప్రక్రియను కిణ్వనం అంటారు. ఈ పద్ధతిలో ఈస్ట్‌ను ఉపయోగిస్తారు.
శైవలాలు నీటిపై ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి.
ఉదా: ఖారా, స్పైరోగైరా, స్పైరులినా, క్లామిడోమోనాస్, ఈడగోనియం, సెరాటియం, డయాటమ్స్
ఉదా:ఖారా, స్పైరోగైరా కంటికి కనిపిస్తాయి.
ప్రొటోజోవాలు
ప్రొటోజోవాలు నేలపైన, నీటిలోనూ నివసిస్తాయి.
ఉదా: మలేరియా వ్యాధిని కలుగజేసే ప్లాస్మోడియం వైవాక్స్
అమీబియాసిస్‌ను కలుగజేసే ఎంటామీబా హిస్టోలిటికా
సూక్ష్మ ఆర్థ్రోపొడా
సూక్ష్మమైన ఆర్థ్రోపొడా జీవులు దుప్పట్లు, పరుపుల్లో నివసిస్తాయి.
ఉదా: గజ్జిని కలుగజేసే స్కాబిస్, కనురెప్ప క్రిమి, డాష్కియా, ైస్లెక్లాప్స్
మానవుడి రోగనిరోధక శక్తిని తగ్గించే దాన్ని వ్యాధి అంటారు. వ్యాధుల గురించి చదివే శాస్ర్తాన్ని పాథాలజీ అంటారు. వ్యాధులు అనేక సూక్ష్మజీవుల వల్ల కలుగుతాయి.
సూక్ష్మజీవులు నాలుగు రకాలు అవి
1. బ్యాక్టీరియాలు 2. వైరస్లు
3. శిలీంధ్రాలు 4. ప్రొటోజోవా
వ్యాప్తిచెందే విధానాన్ని బట్టి వ్యాధులను మూడు రకాలుగా విభజించవచ్చు.
1. ఎండోమిక్ వ్యాధి: ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యే వ్యాధిని లేదా ఒక దేశానికి మాత్రమే పరిమితం అయ్యే వ్యాధిని ఎండోమిక్ వ్యాధి అంటారు.
ఉదా: ఎబోలా
2. ఎపిడమిక్ వ్యాధి: అన్ని ప్రాంతాలకు విస్తరించే వ్యాధిని లేదా అన్ని దేశాలకు విస్తరించే వ్యాధిని ఎపిడమిక్ వ్యాధి అంటారు.
ఉదా: కలరా
3. పాండమిక్ వ్యాధి: ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వ్యాప్తిచెందే వ్యాధిని లేదా ఒక దేశం నుంచి మరొక దేశానికి వ్యాప్తిచెందే వ్యాధిని పాండమిక్ వ్యాధి అంటారు.
ఉదా: స్వైన్‌ఫ్లూ
వైరస్ అంటే విషం అని అర్థం.
వైరస్‌ను కనుగొన్న శాస్త్రవేత్త- ఐవాన్ స్కీ
వైరస్‌లో ఉండే జన్యు పదార్థాలు- డీఎన్ఏ, ఆర్ఎన్ఏ
వైరస్ల గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ‘వైరాలజీ’ అంటారు.
ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిసియన్సీ సిండ్రోమ్.
ఎయిడ్స్ వ్యాధిని కలుగజేసే వైరస్- హెచ్ఐవీ
హెచ్ఐవీ అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిసియన్సీ వైరస్.
హైచ్ఐవీ వైరస్‌ను కనుగొన్న శాస్త్రవేత్త మాంటెగ్నర్. 1983వ సంవత్సరంలో కనుగొన్నాడు.
మొట్టమొదటిసారి ఎయిడ్స్ వ్యాధిని ఆఫ్రికా ఖండానికి చెందిన చింపాంజీలో గుర్తించారు.
మొట్టమొదట ఎయిడ్స్ వ్యాధిగ్రస్తున్ని 1981లో లాస్ఏంజెల్స్ నగరంలో గుర్తించారు.
భారతదేశంలో మొదటిసారి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తున్ని 1986లో చెన్నైలో గుర్తించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తున్ని 1987లో హైదరాబాద్‌లో గుర్తించారు.
ప్రపంచంలోనే అత్యధికంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను కలిగి ఉన్న దేశాలు- సౌతాఫ్రికా, నైజీరియా, భారత్
ఇండియాలో అత్యధికంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను కలిగి ఉన్న రాష్ర్టాలు- మణిపూర్, ఆంధ్రప్రదేశ్
తెలంగాణలో అత్యధికంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులున్న జిల్లాలు- హైదరాబాద్, రంగారెడ్డి
తెలంగాణలో అతితక్కువ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులున్న జిల్లా- మహబూబ్‌నగర్
ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులున్న జిల్లాలు- గుంటూరు, తూర్పుగోదావరి
ఎయిడ్స్ వ్యాధి సోకడానికి ప్రధాన కారణాలు
అక్రమ లైంగిక సంబంధాలు
అరక్షిత రక్త మార్పిడి
ఒకరికి వాడిన సిరంజీలు మరొకరికి వాడటం
తల్లి నుంచి బిడ్డకు పాలద్వారా ఎయిడ్స్ వ్యాధి
ముఖ్య లక్షణాలు
రాత్రి వేళల్లో చెమటలు రావడం
జ్వరం
శరీర బరువును కోల్పోవడం
తల వెంట్రుకలు రాలిపోవడం
వ్యాధి నిర్ధారణకు చేసే పరీక్షలు
ELISA, Westran-blat, PCR, Troidot
ఎయిడ్స్ వ్యాధి నివారణకు ప్రవేశపెట్టిన పథకాలు
NACO (National Aids Control Organ isation-1992)
AASHA(AIDS Awarnes Sustainable Holistic Action-2005)
Red-Ribbon-2007
హెచ్ఐవీ వైరస్‌ను గుర్తించడానికి రెండు వారాల సమయం పడుతుంది.
హెచ్ఐవీ వైరస్ శరీరం మొత్తం వ్యాపించడానికి ఆరు నెలల నుంచి ఐదేళ్లు పడుతుంది.
హెచ్ఐవీలో ఉండే జన్యుపదార్థం- ఆర్ఎన్ఏ
హెచ్ఐవీలో ఉండే ఎంజైమ్- రివర్స్ ట్రాన్స్ క్రిప్టేజ్
రివర్స్ ట్రాన్స్ క్రిప్టేజ్ ఎంజైమ్ హెచ్ఐవీ వైరస్ తన రూపాలను మార్చుకోవడానికి సహాయపడుతుంది.
హెచ్ఐవీ వైరస్ తెల్లరక్త కణాల్లో ఉండే లింఫోసైట్స్పై దాడి చేస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి, శరీర బరువును కోల్పోతుంది.
భారత ప్రభుత్వం ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కోసం ART ద్వారా చికిత్స అందిస్తుంది.
ART- Anti Retro Theoropy
హెచ్ఐవీ వైరస్ మానవుడి శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత 15-30 సెకన్లు మాత్రమే బతకగలుగుతుంది. కానీ వాతావరణం చల్లగా ఉంటే 15-50 సెకన్లు బతుకుతుంది.
జలుబు
ఈ వ్యాధి రైనో వైరస్ వల్ల వస్తుంది.
జలుబు ముఖ్య లక్షణాలు- తుమ్మడం, ముక్కు కారడం
ఈ వ్యాధి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది.
కండ్లకలక ఎడినో అనే వైరస్ వల్ల వ్యాప్తిచెందుతుంది.
కండ్లకలక ముఖ్యలక్షణం- పసుపు పచ్చని ఊసులు ఏర్పడి కండ్లు ఎర్రబడి నీరు కారడం
ఈ వ్యాధి గాలి ద్వారా వ్యాప్తిచెందుతుంది.
కండ్లకలక నివారణకు వాడే మందు- జెంటామైసిన్
చికున్ గున్యా ఆల్ఫా వైరస్ వల్ల వస్తుంది.
ఆల్ఫా వైరస్‌కు ఆడ ఏడిస్ దోమ వాహకంగా పనిచేస్తుంది.
చికున్ గున్యా లక్షణం- కీళ్ల నొప్పులు ఉండటం
ప్లావీ అనే వైరస్ వల్ల వస్తుంది.
డెంగీకి ఆడ ఏడిస్ దోమ వాహకంగా ఉంటుంది. ఇది కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది.
డెంగీ వ్యాధి లక్షణం- కండరాల నొప్పులు, తీవ్రమైన జ్వరం
ఈ వ్యాధి రావడం వల్ల రక్త ఫలకికల సంఖ్య తగ్గుతుంది.
శరీర ఉష్ణోగ్రత 1080Fగా నమోదవుతుంది.
ఈ వ్యాధి ఆర్భో వైరస్ వల్ల వస్తుంది.
ఆడ క్యూలెక్స్ దోమ పందులను కుట్టడం ద్వారా వ్యాపిచెందుతుంది.
మెదడువాపు వ్యాధి పందుల ద్వారా మానవులకు వస్తుంది.
మెదడువాపు వ్యాధి లక్షణాలు తీవ్రమైన తలనొప్పి, జ్వరం ఉండటం.
నివారణకు వాడే మందు- బెల్లడోనా-200
ఈ వ్యాధిని మొదటిసారి జపాన్‌లో గుర్తించారు. కాబట్టి దీన్ని జపాన్-ఎన్సెఫలైటిస్ అంటారు.
స్వైన్ ఫ్లూ H1N1 అనే వైరస్ వల్ల సంభవిస్తుంది.
స్వైన్ ఫ్లూ ముఖ్య లక్షణాలు- తుమ్మడం, దగ్గడం, జ్వరం
ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి ప్రభావం ఊరిపితిత్తులపై ఉంటుంది.
స్వైన్ ఫ్లూ నివారణకు వాడే మందు- టామీ ఫ్లూ
బర్డ్ ఫ్లూ H5N1 అనే వైరస్ వల్ల వస్తుంది.
ఇది కోళ్లలో సంభవిస్తుంది. గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది.
బర్డ్‌ఫ్లూ వ్యాధికారక కోడిని 700C ఉష్ణోగ్రత వద్ద ఉడకబెడితే ఆ వైరస్ చనిపోతుంది.
రేబిస్ వ్యాధి రాబ్ఢో అనే వైరస్ వల్ల సంభవిస్తుంది.
కుక్క, కోతి కరిచిన వ్యక్తులకు వస్తుంది.
రేబిస్ ముఖ్య లక్షణం- హైడ్రో ఫోబియా (నీటిని చూసి భయపడటం)
దీని ప్రభావం మెదడుపై చూపిస్తుంది.
రేబిస్ వ్యాధికి మందు కనుగొన్న శాస్త్రవేత్త- లూయీ పాశ్చర్
లూయీ పాశ్చర్ రేబిస్‌కు కనుగొన్న మందు పేరు- యాంటీ రేబిస్
-కృష్ణ, ఏకేఆర్ స్టడీ సర్కిల్, వికారాబాద్
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు