నిలబడి గుడ్డుపెట్టే పెంగ్విన్.. సముద్రానికి డ్యాం కట్టే బీవర్!
విషరహిత సర్పాలు
- టిప్లాప్స్: టిప్లాప్స్ను గుడ్డిపాము అంటారు. ఇది బొరియలు చేసుకుని జీవించే చిన్న సర్పం. కళ్లు అవశేషంగా, పొలుసులతో కప్పబడి ఉంటాయి.
- ట్యాస్: దీన్నే రాట్ స్నేక్ అంటారు. ఇది ఎలుకలను ఆహారంగా తీసుకుంటుంది. కాబట్టి దీన్ని ‘వ్యవసాయదారుల స్నేహితుడి’గా పరిగణిస్తారు. ఇది శిశూత్పాదక జీవి.
- నేట్రిక్స్ (ట్రాపిడోనోటస్): ఇది మంచినీటి సర్పం. దీన్ని గ్రాస్ స్నేక్ లేదా పాండ్ స్నేక్ అంటారు.
- గ్రీన్ అనకొండ (యూనెక్టస్ మరైనస్): ఇది ఉష్ణమండల దక్షిణ అమెరికాలోని దట్టమైన అడవుల్లో ఉండే చిత్తడి నేలలు, నదుల్లో నివసించే జీవి. ప్రపంచంలో అతిపెద్ద సర్పం. దీని గరిష్ఠ పరిమాణం 9.5 మీటర్లు, 250 కిలోలు.
- కొండచిలువ (పైథాన్): దీనిలో అవశేష చరమాంగాలు, శ్రోణిమేఖల ఉంటాయి. చిన్న తోక ఉంటుంది. ఇది భోజ్య జీవిని చుట్టి చంపేస్తుంది.
- సాండ్ బోవా (ఎరిక్స్ జానై): తోక పొట్టిగా, మొద్దుగా, తలను పోలి ఉంటుంది. ఇది పైథాన్ మాదిరిగానే భోజ్యజీవిని చుట్టి చంపుతుంది. చరమాంగాలు అశేషాలు. శంకు ఆకారపు బుడిపెలుగా కనిపిస్తాయి.
- పాముల్లో విషగ్రంథులు డువెర్నాయ్ గ్రంథులకు సమజాతం.
- పాము విషం టాక్సాన్లు, ఎంజైమ్‌ల మిశ్రమం.
- నాగుపాము విషం నాడీ వ్యవస్థపైన, రక్తపింజర విషం రక్తప్రసరణ వ్యవస్థపైన పనిచేస్తాయి.
- పాము కాటుకు చికిత్స చేయడానికి యాంటీ వీనమ్‌ను వాడతారు.
సర్పాన్ని గుర్తిస్తే మోనోవాలెంట్ యాంటీ వీనమ్ ఇంజిక్షన్‌ను, సర్పాన్ని గుర్తించకుంటే - పాలివాలెంట్ యాంటీ వీనమ్ ఇంజిక్షన్‌ను వేయాలి.
- భారతదేశంలో యాంటీ వీనమ్ ఇంజిక్షన్లను హఫ్కిన్ బయో ఫార్మసూటికల్ కార్పొరేషన్-ముంబై వారు తయారు చేస్తున్నారు.
- విష ప్రసరణను నివారించడానికి పాము కాటు వేసిన ప్రాంతం నుంచి హృదయం వైపు గట్టిగా గుడ్డతో కట్టాలి. ఈ ప్రక్రియను టార్నికెట్ అంటారు.
పక్షులు
- విభాగం ఏవ్స్లో ఈకలు గల ద్విపాదులైన పక్షులను చేర్చారు. పక్షుల్లో జీవక్రియారేటు, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అంతరోష్ణ జీవులవడం వల్ల పక్షులు రాత్రివేళల్లో చల్లని వాతావరణంలో చురుకుగా ఉంటాయి. పక్షులు దూర ప్రాంతాలకు వలస వెళ్లగలుగుతాయి.
- పక్షులు థెరాపోడ్, డైనోసార్ల నుంచి జురాసిక్ యుగంలో ఉద్భవించి క్రెటేషియన్ యుగంలో ఆధునీకరణ చెందాయి. టీహెచ్. హక్స్లే పక్షులను ‘దివ్యమైన సరీసృపాలు’గా అభివర్ణించాడు. జేజడ్.యంగ్ ‘మాస్టర్ ఆఫ్ ఎయిర్’గా పేర్కొన్నాడు.
పక్షుల సాధారణ లక్షణాలు
- ఇవి ఉష్ణ రక్త జీవులు. దేహం పడవ ఆకారంలో కుదించినట్లు ఉంటుంది.
- ఇవి ద్విపాదులు. పూర్వాంగాలు రెక్కలుగా రూపాంతరం చెంది ఉంటాయి.
- చర్మం పొడిగా ఉంటుంది. చర్మం లో ఒకేఒక పెద్ద గ్రంథి తోక ఆధారంలో ఉండే యూరోపైజియల్ లేదా ప్రీన్ గ్రంథి. పక్షి దీని నుంచి ముక్కుతో తైలాన్ని గ్రహించి ఈకలను బాగుచేసుకుంటుంది.
- చాలా ఎముకలు వాతిలాస్థులు. ఇవి వాయుకోశాల విస్తరణను కలిగి ఉంటాయి.
- మహారసి కండరాల వల్ల రెక్క కిందికి కొట్టుకుంటుంది. సూప్రాకోరకాయిడిస్ వల్ల రెక్క పైకి కొట్టుకుంటుంది.
- జీవించి ఉన్న పక్షుల్లో దంతాలుండవు. ఆహారవాహిక తరచూ ఆహారాన్ని నిల్వచేసే అన్నాశయంగా విస్తరించి ఉంటుంది.
- ఊపిరితిత్తులు స్పంజికలుగా ఉంటాయి. వాయుగోణులు ఊపిరితిత్తులతో సంబంధాన్ని కలిగి ఉంటాయి.
- రెండు కర్ణికలు, రెండు జఠరికలతో కూడిన నాలుగు గదుల హృదయం ఉంటుంది.
- క్రియాత్మక మూత్రపిండాలు అంత్యవృక్క రకానికి చెందినవి. మూత్రాశయం ఉండదు. (ఆస్ట్రిచ్లో తప్ప)
- పక్షులు యూరికోటెలిక్ జంతువులు.
- మెదడును ఆవరించి వరాశిక, మృద్వి, లౌతికళ మూడు మెనింజెస్ ఉంటాయి.
- 12 జతల కపాల నాడులు ఉంటాయి.
- పక్షుల కళ్లు పెద్దవిగా, నిమేషక పటలంతో ఆవరించి ఉంటాయి. కంటిలో దువ్వెన వంటి పెక్టిన్ ఉంటుంది.
- అంతర ఫలదీకరణం జరుగుతుంది. పక్షులన్నీ అండోత్పాదకాలు. గుడ్లు క్లీడాయిక్ రకానికి చెందినవి.
- బవేరియా (జర్మనీ)లోని ఉన్నత జురాసిక్ శిలల్లో ఆర్కియోప్టరిక్స్ లిథోగ్రాఫికా శిలాజాలను కనుగొన్నారు. ఇది సరీసృపాలు, పక్షుల లక్షణాలను ప్రదర్శిస్తుంది. కాబట్టి దీన్ని సరీసృపాలకు, పక్షులకు మధ్య సంధాన సేతువుగా పరిగణిస్తారు.
- పక్షుల అధ్యయనాన్ని ఆర్నిథాలజీ అంటారు.
- ప్రముఖ భారతీయ పక్షి శాస్త్రవేత్త సలీం అలీని ‘ఇండియన్ బర్డ్ మ్యాన్’ అంటారు.
- అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవాన్ని ఏటా మే 4న నిర్వహిస్తారు.
క్షీరదాలు
- అధిక ఉష్ణోగ్రతను స్థిరంగా నియంత్రించడం క్షీరదాల లక్షణం. బాహ్యంగా రోమాలు కలిగి ఉండటం వీటి ప్రత్యేక లక్షణం. రోమాలు, క్షీరగ్రంథులు, స్వేద గ్రంథులు, చర్మావస గ్రంథులు క్షీరదాల్లో మాత్రమే ఉంటాయి. సీనోజాయిక్ యుగాన్ని క్షీరదాల స్వర్ణయుగంగా పేర్కొంటారు. క్షీరదాల అధ్యయనాన్ని మమ్మాలజీ అంటారు.
- సజీవ క్షీరదాలను మూడు ప్రధానమైన క్రమాలుగా గుర్తించారు. అవి మోనోట్రిమ్లు, మార్సుపియల్లు, యూథీరియన్లు.
- నీలి తిమింగలం (బెలనోప్టిరా మస్కులస్)- అతిపెద్ద క్షీరదం
- పిగ్మీ ఘ్రా- అతిచిన్న క్షీరదం
క్షీరదాల సాధారణ లక్షణాలు
- ఇవి ఉష్ణ రక్త జీవులు. బాహ్య చర్మం నుంచి ఏర్పడే రోమాలుంటాయి. తిమింగలాలు, ఆర్మాడిల్లోలో రోమాలు క్షీణించి ఉంటాయి.
- చర్మంలోని స్వేద గ్రంథులు విసర్జనకు, ఉష్ణోగ్రతా క్రమతకు సహాయపడతాయి. క్షీరగ్రంథలు రూపాంతరం చెందిన స్వేద గ్రంథులు.
- థీకోడాంట్ దంత విన్యాసం, ద్వివార, విషమ దంతి దంతాలు ఉంటాయి.
- రెండు కర్ణికలు, రెండు జఠరికలతో నాలుగు గదులు గల హృదయం ఉంటుంది. పుపుస శ్వాసక్రియ జరుగుతుంది.
- క్రియాత్మక మూత్రపిండాలు అంత్య వృక్క రకానికి చెందినవి.
- వరాశిక, లౌతికళ, మృద్వి అనే మూడు మెనింజస్ ఉంటాయి.
- ఆస్ట్రేలియా దేశపు జాతీయ జంతువు కంగారూ. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి.
- కాబట్టి ఆస్ట్రేలియాను శిశుకోశ క్షీరదాల భూమి అంటారు.
- మానవుల్లో కుంతకాలు, రదనికలు, అగ్ర చర్వణకాలు, చర్వణకాలు అనే నాలుగు రకాల దంతాలు ఉంటాయి.
మానవుడి దంత సూత్రం= 2123/2123
- జలచర క్షీరదాల అధ్యయనాన్ని సీటాలజీ అంటారు.
- గుడ్లు పెట్టే క్షీరదం ఎకిడ్నా దీన్నే ‘స్పైన్ ఆంట్ ఈటర్’ అంటారు.
- ఆడ, మగ జీవులు పాలిచ్చే క్షీరదం డక్‌బిల్డ్ ప్లాటిపస్.
- ఎక్కువ దంతాలు కలిగి, తక్కువ గర్భావధి కాలం గల క్షీరదం- అపోజం
- సముద్రానికి ఆనకట్టలు కట్టే క్షీరదం- బీవర్
- అతిపెద్ద భూచర జంతువు – ఏనుగు
- అతివేగంగా పరిగెత్తే జంతువు-చిరుతపులి
- ఎగిరే క్షీరదం- గబ్బిలం
ప్రాక్టీస్ బిట్స్
1. న్యూజిలాండ్ దేశానికి పరిమితమైన సజీవ శిలాజ సరీసృపం
1) టిప్లాప్స్ 2) స్పీనోడాన్
3) రాట్ స్నేక్ 4) స్ఫీరో డాైక్టెలస్
2. కింది వాటిని జతపరచండి.
1. ఉభయజీవులు ఎ. మమ్మాలజీ
2. సరీసృపాలు బి. ఆర్నిథాలజీ
3. పక్షులు సి. బాట్రకాలజీ
4. క్షీరదాలు డి. హెర్పటాలజీ
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
4) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
3. పక్షులను దివ్యమైన సరీసృపాలుగా వర్ణించింది?
1) జేజెడ్ యంగ్ 2) టీహెచ్ హక్స్లే
3) టీహెచ్ మోర్గాన్ 4) సలీం అలీ
4. కింది వాటిని జతపరచండి.
1. చేపలు ఎ. డివోనియన్ కాలం
2. ఉభయజీవులు బి. కార్బోనిఫెరస్ కాలం
3. సరీసృపాలు సి. మీసోజాయిక్ యుగం
4. క్షీరదాలు డి. సీనోజాయిక్ యుగం
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
5. కింది వాటిలో అసత్య వాక్యాలను గుర్తించండి.
1. ఉభయజీవులు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలను కలిపి చతుష్పాదులు అంటారు
2. సరీసృపాలు, పక్షులను కలిపి ఇక్తియోప్సిడాగా వ్యవహరిస్తారు
3. డిప్నాయ్ చేపలు విచ్ఛిన్న విస్తరణను ప్రదర్శిస్తాయి
4. సరీసృపాలు శీతల రక్త జంతువులు, ఫిమోరల్ గ్రంథులు కలిగిఉంటాయి
1) 1, 2 అసత్యం 2) 1, 4 అసత్యం
3) 2 మాత్రమే అసత్యం
4) 4 మాత్రమే అసత్యం
6. కింది వాటిని జతపరచండి.
1. విద్యుత్ చేప ఎ. ఎక్సోసీటస్
2. ఎగిరే చేప బి. టార్పిడో
3. సుత్తితల చేప సి. కైమేరా
4. ఎలుక చేప డి. స్వర్నా
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
7. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి.
1. ప్లాకోడర్మి విభాగంలో విలుప్త చేపలను చేర్చారు
2. బల్లుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం- సారాలజీ
3. పక్షుల కంటిలోదువ్వెన వంటి పెక్టిన్ ఉంటుంది
4. ఆస్ట్రేలియాను శిశుకోశ క్షీరదాల భూమి అంటారు
1) 1, 2 సరైనవి 2) 1, 4 సరైనవి
3) 2, 4 సరైనవి 4) అన్నీ సరైనవి
8. తిమింగలం ఏ విభాగానికి చెందినది?
1) చేప 2) సరీసృపం
3) క్షీరదం 4) ఉభయజీవి
9. హర్డేరియన్, లాక్రిమల్ గ్రంథులు మొదటిసారి వేటిలో ఏర్పడ్డాయి?
1) చేపలు 2) ఉభయజీవులు
3) సరీసృపాలు 4) పక్షులు
10. యూరోడిలా జీవుల రాజధానిగా దేన్ని పిలుస్తారు?
1) దక్షిణ అమెరికా 2) ఆస్ట్రేలియా
3) న్యూజిలాండ్ 4) ఉత్తర అమెరికా
సమాధానాలు
1. 2 2. 3 3. 2 4. 4
5. 3 6. 1 7. 4 8. 3
9. 2 10. 4
-ఏవీ సుధాకర్ స్కూల్ అసిస్టెంట్
జడ్పీహెచ్ఎస్ లింగంపల్లి రంగారెడ్డి జిల్లా
9000674747
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు